సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారికి పెద్ద ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ ట్యాక్స్ చెల్లింపునకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ జీవో జారీ చేసింది. కరోనా నేపథ్యంలో రోడ్ ట్యాక్స్ చెల్లించేందుకు గడువును జూలై వరకు పొడిగిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతుండటంతో రవాణా వాహనాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ కారణంగా వారిని ఆదుకునేలా సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యా క్సీ క్యాబ్‌ల డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకునేందు కు గడువు కంటే నాలుగు నెలల ముందుగానే రూ.10 వేల సాయం అందించడం తెలిసిందే.
► రవాణా వాహనాలు త్రైమాసిక పన్నుగా రోడ్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
► ప్రతి క్వార్టర్ ప్రారంభ నెలలోనే రోడ్ ట్యాక్స్ చెల్లించాలి. అయితే రెండు, మూడు క్వార్టర్లకు సంబంధించి రోడ్ ట్యాక్స్‌ను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్ 30 వరకూ చెల్లించే వెసులు బాటు ఇప్పుడు వారికి లభించింది.
► రాష్ట్రంలో దాదాపు ప్రైవేటు బస్సులు, లారీ లు, ఆటోలు, ట్యాక్సీలు, ఇతర రవాణా వాహనాలు 17 లక్షల వరకూ ఉన్నాయి.
రోడ్ ట్యాక్స్ చెల్లింపు గడువు సెప్టెంబర్ 30
Published Sat, Aug 1 2020 4:14 AM | Last Updated on Sat, Aug 1 2020 4:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment