రాష్ట్రంలో ఏటేటా పెరిగిపోతున్న గృహ హింస కేసులు
అనుమానపు పెనుభూతంతోనూ పెరుగుతున్న కేసులు
2023లో మొత్తం 9,447 కేసులు నమోదు..
ఈ ఏడాది ఇప్పటికే 5,474కు చేరిన సంఖ్య
సీడీఈడబ్ల్యూ కౌన్సెలింగ్ సెంటర్ల సహకారంతో తిరిగి కలుస్తున్న జంటలు
40% పెళ్లయిన ఐదేళ్లలోపే కలహాలతో పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతున్న జంటలు
వీటిలో 63% వరకు ‘మద్యమే’ కారణం
సాక్షి, హైదరాబాద్: పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. ‘çమద్యం మత్తు’ కారణంగా కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయి. గృహ హింసకు దారితీస్తున్నాయి. పోలీసు కేసులు, కోర్టు మెట్లెక్కే వరకు వెళ్తున్నాయి. గత కొన్నేళ్లుగా నమోదవుతున్న కేసులకు కారణాలను పరిశీలిస్తే.. మద్యం అలవాటు తీవ్రత స్పష్టమవుతోంది. ఇక మరికొందరు తమ జీవిత భాగస్వామి ప్రవర్తనపై అనుమానం పెంచుకుంటున్నారు. దీనితో మనస్పర్థలు ఏర్పడి సంసారం గందరగోళంలో పడిపోతోంది.
అయితే గృహ హింస కేసులలో బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన ‘సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్)’ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు ఈ సమస్యను కొంత దారిలోకి తెస్తున్నాయి. 2023 ఫిబ్రవరి నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అందుబాటులోకి తెచ్చిన 27 సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో ఇప్పటివరకు 34,090 కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన 40 శాతం జంటలను తిరిగి కలిపారు.
మూడు నుంచి నాలుగు సిట్టింగ్‌లు
గృహ హింసకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లకు అటాచ్ చేస్తున్నారు. ఈ సెంటర్లలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సిబ్బంది.. జంటలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కలహాలకు ప్రధాన కారణాలను తెలుసుకుంటారు. భార్య, భర్త ఇద్దరినీ కలిపి, విడివిడిగా మాట్లాడటంతోపాటు అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. ఇలా మూడు, నాలుగు సార్లు కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తారు. భార్యాభర్తలకు కలిపి, అవసరమైతే కుటుంబంతోనూ కలిపి కౌన్సెలింగ్ చేస్తారు. కలహాలకు కారణమవుతున్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రోత్సహిస్తారు.
పెళ్లయిన ఐదేళ్లలోపే..
కుటుంబ కలహాల సమస్య యు వ జంటల్లోనే ఎక్కువగా ఉంటు న్నట్టు కేసులను బట్టి స్పష్టమవు తోంది. పోలీసు కేసులు, విడాకు ల వరకు వెళ్తున్న జంటల్లో.. పెళ్ల యి ఐదేళ్లు కూడా కానివారే 40% నికిపైగా ఉంటున్నారు. ఈ తర హా కేసులలో భార్యాభర్తల వయ సు 23 నుంచి 30 ఏళ్లలోపే ఉంటుండటం గమనార్హం.
⇒ విడాకుల వరకు వెళ్లేందుకు దారితీస్తున్న అంశాలు
⇒భాగస్వామి మద్యానికి బానిస కావడం 63%
⇒డబ్బులు, కట్నం కోసం డిమాండ్ చేయడం 49%
⇒భాగస్వామి ప్రవర్తనపై అనుమానం 47%
గృహ హింసకు కారణమవుతున్న అంశాలివీ..
⇒ వరకట్నం కోసం వేధింపులు ూ మద్యానికి బానిసకావడం
⇒ వివాహేతర సంబంధాలు ూ అత్తమామల వేధింపులు
⇒ జీవిత భాగస్వామిపై అనుమానం
⇒ కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు కావడం
Comments
Please login to add a commentAdd a comment