పార్టీకి మద్యం ఎవరు సరఫరా చేశారు..?
చేవెళ్ల ఎకై ్సజ్ కార్యాలయంలో రాజ్ పాకాల, నాగేశ్వర్‌రెడ్డిల విచారణ
చేవెళ్ల: రాయల్టీ చెల్లించకుండా విదేశీ మద్యం ఎలా తీసు కొచ్చారు..స్టాంప్ డ్యూటీ చెల్లించారా ? పార్టీకి మద్యం సరఫరా ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి తీసు కొచ్చారు? పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పార్టీలో మద్యం పంపిణీ చేసినా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అంటూ పలు అంశాలపై కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను ప్రశ్నించినట్టు తెలిసింది.
అనుమతి లేకుండా పార్టీ నిర్వహించాడనే కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల శుక్రవారం విచారణ నిమిత్తం చేవెళ్లలోని ఎకై ్సజ్ కార్యాలయానికి హాజరయ్యారు. జన్వాడలోని ఆయన ఇంటి పక్కనే ఉండే నాగేశ్వర్‌రెడ్డి విల్లాలోనూ విదేశీ మద్యం దొరకడంతో ఆయనకూ నోటీసులు అందజేయగా, ఆయన కూడా చేవెళ్లకు వచ్చారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్‌కుమార్, చేవెళ్ల సీఐ శ్రీలత తదితరులు రాజ్‌పాకాల, నాగేశ్వర్‌రెడ్డిలను విచారించారు. అడ్వకేట్ల ఎదుట నిర్వహించిన విచారణకు సంబంధించిన వీడియోలు తీసుకున్నట్టు సమాచారం.
మధ్యాహ్నం 1:40 నుంచి రాత్రి 8:10 వరకు విచారణ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు రాజ్‌పాకాలను, ఆ తర్వాత నాగేశ్వర్‌రెడ్డిని విచారించారు. అనంతరం రాజ్ పాకాల, నాగేశ్వర్‌రెడ్డి ఒకేసారి న్యాయవాదులతో కలిసి బయటకు వచ్చారు. అయితే ఇంట్లో నిర్వహించే చిన్నపాటి దావత్ అయినందున.. తమ మేనేజర్ ఈ విషయాలు చూసుకున్నారని రాజ్ పాకాల చెప్పినట్టు సమాచారం. విచారణ జరిగినంత సేపు మీడియాతోపాటు ఇతరులెవరినీ లోనికి అనుమతించలేదు. బయటకు వచ్చిన అనంతరం రాజ్ పాకాల మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాం. ఇంట్లో నిర్వహించిన చిన్నపాటి దావత్‌ను మా మేనేజర్ చూసుకున్నారు. పార్టీలో లోకల్ మద్యం సర్వ్ చేశామన్నారు.
కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఉంది
ఈ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్‌లో ఉంది. రాజ్ పాకాల, నాగేశ్వర్‌రెడ్డి విచారణకు సహకరించారు. కేసు కంటిన్యూ అవుతోంది. కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి వివరాలేవీ చెప్పలేం. –దశరథ్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment