ధర్మవరం అర్బన్ : విద్యుదాఘాతంతో జూనియర్ లైన్‌మెన్ మృతి చెందిన ఘటన పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలో జూనియర్ లైన్‌మెన్‌గా వెంకటరమణ (35) కాయగూరల మార్కెట్ వీధిలో ఉన్న భక్త మార్కెండేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విద్యు™Œ స్తంభం ఎక్కి విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నట్టుండి స్తంభంపైన విద్యుత్ తీగల నుంచి విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురై కిందపడ్డాడు.
తోటి ఉద్యోగులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మెయిన్‌లైన్‌పై విద్యుత్ ప్రసార ం నిలిపి వేసిన ఇళ్లలో ఉండే ఇన్వర్టర్‌ల కారణంగా విద్యుత్ షాకు తగిలి ఉంటుందని విద్యుత్ ఉద్యోగులు చెప్తున్నారు. మృతుడికి భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడీ వెంకట రమేష్ మృతుడి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని తెలిపారు.
విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతి
Published Fri, Sep 2 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
Advertisement
Advertisement