విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి | farmer dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Published Thu, Sep 21 2017 10:14 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

విద్యుత్‌ షాక్‌కు గురై ఓ రైతు దుర్మరణం చెందాడు.

కణేకల్లు: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ రైతు దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని దిగువ వీధికి చెందిన గంగవరం ఖలీల్‌ (55), గురువారం ఉదయం వరి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకెళ్లాడు. అక్కడ స్టార్టర్‌ బటన్‌ నొక్కే సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పక్క పొలంలో పనిచేస్తున్న కూలీలు ఈ విషయాన్ని గమనించి, వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఖలీల్‌ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఖలీల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement