విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి | man dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Published Thu, Sep 7 2017 9:25 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

man dies of vidyut shock

చెన్నేకొత్తపల్లి: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్‌చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ముత్యాలప్ప (36) దారిలో తెగిపడిన విద్యుత్‌ తీగను పక్కకు తొలగించే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే దారి మధ్యలోనే ముత్యాలప్ప చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సరస్వతి , ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement