నర్వా : మహబూబ్‌నగర్ జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన సుమారు 200 మంది బీడీ కార్మికులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. ఆసరా ద్వారా తమకు జీవనభృతి కల్పించాలని ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బీడీలు చుట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి లంకాల బాబుమియా ఆధ్వర్యంలో వీరు ఈ ధర్నా నిర్వహించారు. నర్వా ఎంపీడీవో రాఘవ ఈ నెల 25వ తేదీన గ్రామానికి వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.