bidi workers
-
బీడీ కార్మికుల పోరుబాట
ముకరంపుర: బీడీ కార్మికులకు ఆంక్షలు లేని జీవనభృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు సర్కస్‌గ్రౌండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ధర్నాకు హాజరైన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు జేవీ చలపతిరావు మాట్లాడుతూ ఆంక్షలు పెట్టి జీవనభృతి చెల్లిస్తుండడంతో బీడీ కార్మికులందరికీ పింఛను అందడం లేదన్నారు. బీడీ యాజ మాన్యాలు కార్మికులకు చేతినిండా పని కల్పించ డం లేదని అన్నారు. కార్ఖానాలను వారానికి 2 లేదా 3 రోజులు బంద్ పెడుతున్నారని అన్నా రు. ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్ర మే జీవనభృతి చెల్లిస్తామనడం అన్యాయమన్నా రు. కార్మికులందరికీ పీఎఫ్ వర్తింపజేసి రూ. 1000 జీవనభృతి చెల్లించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు బి.సంపత్‌కుమార్, జిల్లా నాయకులు నరే ష్, చింత భూమేశ్వర్, వెంకన్న, ఆకుల రాము లు, పాముల కిషన్, రమేశ్, శ్రీనివాస్, మణె క్క, నల్ల శ్రీనివాస్, బాలలక్ష్మి, జగదీశ్వరి, రేవ తి, గంగాధర్, నరేందర్ పాల్గొన్నారు. -
'షరతులు లేకుండా బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి'
మెదక్ (మిరుదొడ్డి) : ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా పరిధిలోని భూపాలపల్లి చౌరస్తాలో మిరుదొడ్డి, దుబ్బాక మండలాలకు చెందిన బీడీ కార్మికులు శనివారం రోడ్డు పై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. పీఎఫ్ నంబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి జీవనభృతి చెల్లించాల్సిందేనంటూ బీడీ కార్మికులు రోడ్డెక్కారు. అన్ని అర్హతలు ఉండి కూడా జీవన భృతికి తాము అర్హులము కాదా అంటూ కన్నెర్ర జేశారు. విషయం తెలుసుకున్న భూంపల్లి పోలీసులు ఆందోళన స్థలానికి చేరుకుని కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. కొద్ది సేపు బీడీ కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎన్నో సార్లు దరఖాస్తులు చేసుకున్నా తమకు న్యాయం జరగడంలేదని మండిపడ్డారు. అర్హులైన తమకు జీవన భృతి చెల్లించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని భీష్మించారు. భూంపల్లి ఎస్ఐ పి ప్రసాద్ కలగజేసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి చర్చిస్తానని నచ్చజెప్పడంతో బీడీ కార్మికులు శాంతించి ఆందోళనను విరమించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఆందోళనతో సిద్దిపేట-రామాయంపేట రహదారి ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి పోయింది. భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
బీడీ కార్మికుల ఆందోళన
కోనరావుపేట (కరీంనగర్ జిల్లా) : తమ సమస్యలను తీర్చాలని కోరుతూ బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా బీడీ కార్మికులు మండలంలోని పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. -
ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న బీడీ కార్మికులు
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను బీడీ కార్మికులు శనివారం అడ్డుకున్నారు. మెదక్ జిల్లా కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీడీ కార్మికులు.. ముఖ్యమంత్రి కాన్వాయ్ తమ గ్రామం మీదుగా వెళ్తుందని తెలుసుకుని అక్కడే బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ వారి వద్దకు వెళ్లగా..తమకు పింఛన్లు రావటంలేదని కార్మికులు మొరపెట్టుకున్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. వారికెలాగైనా పింఛన్ వచ్చే విధంగా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. -
ఖానాపూర్ లో బీడీ కార్మికుల ధర్నా
ఆదిలాబాద్(ఖానాపూర్): జీవన భృతి చెల్లాంచాలని కోరుతూ బీడీ కార్మికులు శనివారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం కార్మికులందరికీ భృతి చెల్లించాలని సీఐటీయూసీ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని దిగ్భందించి ఆందోళనకు దిగారు. -
కోటగిరిలో బీడీ కార్మికుల ఆందోళన
కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సోమవారం బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. అర్హులైన బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల ప్రోద్బలంతో అనర్హులకు కూడా పింఛన్ వస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదన్నారు. నిజామాబాద్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సిద్ధార్ధ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్ గురించి వైఎస్సార్సీపీ నాయకులు డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే అర్హులకు పింఛన్లు ఇప్పించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సిద్ధార్ధ రెడ్డి చెప్పారు. -
ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీడీ కార్మికుల ధర్నా
నర్వా : మహబూబ్‌నగర్ జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన సుమారు 200 మంది బీడీ కార్మికులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. ఆసరా ద్వారా తమకు జీవనభృతి కల్పించాలని ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బీడీలు చుట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి లంకాల బాబుమియా ఆధ్వర్యంలో వీరు ఈ ధర్నా నిర్వహించారు. నర్వా ఎంపీడీవో రాఘవ ఈ నెల 25వ తేదీన గ్రామానికి వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలి
మహబూబ్‌నగర్ : బీడీ కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున వెంటనే జీవనభృతిని చెల్లించాలని టీపీబీడబ్ల్యుయూ (తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్) జిల్లా అధ్యక్షుడు దేవదానం డిమాండ్ చేశారు. దేవరకద్ర తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, ఇఫ్టూ సంయుక్త ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికై బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని గతంలో హామీ ఇచ్చిందిగానీ ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదని... చాలా మంది బీడీ కార్మికులు చాలీ చాలని ఆదాయంతో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారని అన్నారు. -
భృతి కోసం బీడీ కార్మికుల ధర్నా
నిజామాబాద్ : ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరికీ మెరుగైన జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో మంగళవారం బీడీ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ మేరకు కార్మికులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మండల పరిషత్ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
భృతి కోసం బీడీ కార్మికుల ధర్నా
నిజామాబాద్ : ఎటువంటి ఆంక్షల్లేకుండా అందరికీ జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులు ధర్నాకు దిగారు. ఆసరా పథకం కింద లబ్ధి పొందుతున్న కార్మికులు అందరికీ జీవన భృతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కార్మికులు మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం ఆందోళన చేపట్టారు. కార్మికుల వివరాలను కార్మికశాఖతో కానీ బీడీ కమిషన్ ఏజెంట్ల నుంచి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. (కమ్మర్పల్లి) -
‘పుర్రె’పై పోరు ఉధృతం
ముస్తాబాద్/మేడిపెల్లి: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ , మేడిపెల్లి మండల కేం ద్రాల్లో బీడీ కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తును ముద్రించాలని జారీ చేసిన జీవో 727 (ఇ)ని రద్దు చేయాలని గురువారం బీడీ టేకెదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. తెలంగాణలో ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసి సిగార్ కంపెనీల కొమ్ముకాసేందుకే ఈ జీవో తీసుకొచ్చిందన్నారు. బీడీ కార్మికుల పొట్టగొట్టే చర్యలను వెం టనే నిలిపివేయాలనే డిమాండ్‌తో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. -
ఆర్మూర్ లో బీడీ కార్మికుల భారీ ర్యాలీ
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం బీడీ కార్మికులు ఆందోళన చేశారు. బీడీ కట్టలపై పుర్రె, వ్యాధి గ్రస్తుల ఫోటోలను ముద్రించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వారు నిరసించారు. యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు హజరయ్యారు. స్తానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కు దిగారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. (ఆర్మూర్) -
కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికుల ఆందోళన
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులు ఆందోళన చేశారు. బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్ బొమ్మను ముద్రించాలనే కేంద్ర ప్రభుత్వ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చిన కార్మికులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. (కమ్మర్పల్లి) -
సిరికొండలో బీడీ కార్మికుల ర్యాలీ
నిజామాబాద్: బీడీ కట్టలపై 85శాతం గొంతు కేన్సర్ బొమ్మను ముద్రించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ బీడీ కార్మికుల నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (సిరికొండ)