నిజామాబాద్ : ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరికీ మెరుగైన జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో మంగళవారం బీడీ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ మేరకు కార్మికులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మండల పరిషత్ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించారు.