ముస్తాబాద్/మేడిపెల్లి: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ , మేడిపెల్లి మండల కేం ద్రాల్లో బీడీ కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తును ముద్రించాలని జారీ చేసిన జీవో 727 (ఇ)ని రద్దు చేయాలని గురువారం బీడీ టేకెదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. తెలంగాణలో ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసి సిగార్ కంపెనీల కొమ్ముకాసేందుకే ఈ జీవో తీసుకొచ్చిందన్నారు. బీడీ కార్మికుల పొట్టగొట్టే చర్యలను వెం టనే నిలిపివేయాలనే డిమాండ్‌తో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.
‘పుర్రె’పై పోరు ఉధృతం
Published Fri, Feb 20 2015 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement