ముకరంపుర: బీడీ కార్మికులకు ఆంక్షలు లేని జీవనభృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు సర్కస్‌గ్రౌండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ధర్నాకు హాజరైన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు జేవీ చలపతిరావు మాట్లాడుతూ ఆంక్షలు పెట్టి జీవనభృతి చెల్లిస్తుండడంతో బీడీ కార్మికులందరికీ పింఛను అందడం లేదన్నారు. బీడీ యాజ మాన్యాలు కార్మికులకు చేతినిండా పని కల్పించ డం లేదని అన్నారు. కార్ఖానాలను వారానికి 2 లేదా 3 రోజులు బంద్ పెడుతున్నారని అన్నా రు.
ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్ర మే జీవనభృతి చెల్లిస్తామనడం అన్యాయమన్నా రు. కార్మికులందరికీ పీఎఫ్ వర్తింపజేసి రూ. 1000 జీవనభృతి చెల్లించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు బి.సంపత్‌కుమార్, జిల్లా నాయకులు నరే ష్, చింత భూమేశ్వర్, వెంకన్న, ఆకుల రాము లు, పాముల కిషన్, రమేశ్, శ్రీనివాస్, మణె క్క, నల్ల శ్రీనివాస్, బాలలక్ష్మి, జగదీశ్వరి, రేవ తి, గంగాధర్, నరేందర్ పాల్గొన్నారు.
బీడీ కార్మికుల పోరుబాట
Published Thu, Jul 2 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement