బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలి | bidi workers agitation in mahabubnagar | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలి

Published Mon, May 18 2015 8:13 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

bidi workers agitation in mahabubnagar

మహబూబ్‌నగర్ : బీడీ కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున వెంటనే జీవనభృతిని చెల్లించాలని టీపీబీడబ్ల్యుయూ (తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్) జిల్లా అధ్యక్షుడు దేవదానం డిమాండ్‌ చేశారు. దేవరకద్ర తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, ఇఫ్టూ సంయుక్త ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికై బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని గతంలో హామీ ఇచ్చిందిగానీ ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదని... చాలా మంది బీడీ కార్మికులు చాలీ చాలని ఆదాయంతో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement