తిరుపతి రూరల్: ప్రజావిజ్ఞప్తుల దినం సందర్భంగా సోమవారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి రూరల్ ఎమ్‌పీడీవో కార్యాలయాన్నిఆకస్మికంగా సందర్శించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ప్రజలు కార్యాలయానికి వస్తే అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.