
సాక్షి, తిరుపతి: పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపు\నిచ్చారు. తుమ్మలగుంటలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి వేదాంతపురం వరకు స్థానిక యువత బుధవారం చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆధ్యర్యంలో తిరుపతి రూరల్ టీడీపీ అధ్యక్షుడు చెరుకుల జనార్థన్ యాదవ్, అతని అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జనార్థన్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెవిరెడ్డి పోరాట పటిమ తనను ఆకర్షించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
కృష్ణా జిల్లా: మోపిదేవి మండల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అవనిగడ్డ రమేష్ బాబు అధ్వర్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. 70 కుటుంబాలకు చెందిన కార్యకర్తలను ఎమ్మెల్యే రమేష్‌బాబు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గుంటూరు: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన 100 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment