- విదేశీ ప్రతినిధుల కితాబు
- జిల్లా అధికారులతో కలిసి వెల్టూర్ గ్రామ సందర్శన
సదాశివపేట: వివిధ దేశాల ప్రతినిధులతో పాటు సెర్ప్, డీఆర్డీఏ, ఐకేపీ జిల్లా అధికారులు గురువారం మండల పరిధిలోని వెల్టూర్ గ్రామాన్ని సందర్శించారు. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు సంఘాల సభ్యులతో మాట్లాడి సంఘం రికార్డులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో 54 సంఘాలు ఉన్నాయని, ప్రతి సంఘం ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లింపుల వివరాలను స్థానిక సిబ్బంది, సమాఖ్య లీడర్లు వీరికి వివరించారు.
బ్యాంకుల ద్వార 47 సంఘాలకుగాను రూ.1,78,5500 బ్యాంకు రుణాలతోపాటు, శ్రీనిధి బ్యాంకు ద్వారా 29 స్వయం సంఘాల గ్రూపుల్లోని 135 మందికి రూ.15,65,440 బ్యాంకు రుణాలు ఇచ్చారని తెలిపారు. వీటితో తాము పాడిగేదెలు, మేకలు, గొర్రెల పెంపకం, కూరగాయలను పండించడం, అమ్మడం, కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం తదితరాలకు వినియోగించామన్నారు.
అనంతరం ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఐకేపీ మండల సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అస్ట్రేలియా నుంచి స్నేహాల్‌సోహేల్, ఇరాన్ ప్రతినిధి ఫతేమహ అబ్‌కారి, కేన్యా నుంచి వెన్నా మొకారి ఓంవారి, మాడగాస్కర్ నుంచి రకోటమాలాల మిరియా రబియారిసో, షేశేల్లీస్ నుంచి బెట్టి మరియాసోపా, టంజానియా నుంచి ప్రోన్సికో ఎలాయాస్, తైలాండ్ నుంచి డమరోగో జయంతోలతో పాటు రాషఫకేశ్వర్‌లతో మండల ఐకేపీ ఎపీఎం వెంకట్ పాల్గొన్నారు.
మహిళా సంఘాల పనితీరు భేష్
Published Fri, Sep 19 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Advertisement