drda
-
నకిలీ నోట్ల వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు
-
సేద్యానికి ఆర్థిక దన్ను
మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పొదుపు సంఘాల్లోని మహిళా రైతులను గుర్తించి, ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేలా వారిని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ, వ్యవసాయానికి కావాల్సిన యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సామాజిక పెట్టుబడి, సీఐఎఫ్, గ్రూపు అంతర్గత అప్పులు, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తోంది. ఆయా రుణాలను మహిళలు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళల కోసం వ్యవసాయ ఆధారిత యూనిట్లను నెలకొల్పి వారి ఆర్థికాభివృద్ధికి చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. కొడవలూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): సన్న, చిన్న కారు మహిళా రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహిళా రైతులతో ‘రైతు ఉత్పత్తి దారుల సమాఖ్య’ గ్రూపులను ఏర్పాటు చేసి, వివిధ శాఖల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. బ్యాంక్‌లు, ప్రభుత్వ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు మెరుగైన ధరలు వారే కల్పించుకునేలా వసతులు సమకూరుస్తోంది. ఇప్పటికే మూడు విడతల్లో 24 మండలాల్లో 27,412 మంది సభ్యులతో 2,492 గ్రూపులు ఏర్పాటయ్యాయి. తొలివిడతలోని గ్రూపులు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. మహిళా రైతులు సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. డీఆర్డీఏ ద్వారా అమలు ఈ సంఘాల ఏర్పాటు బాధ్యతను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. మండలానికి 150 గ్రూపులు లక్ష్యంగా నిర్దేశించింది. సంఘాలు ఎలా ఏర్పాటు చేయాలి, వారికి ప్రభుత్వ శాఖల సహకారం ఏ విధంగా అందించాలి. వారి ఉత్పత్తులకు ధర పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధుల లభ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. దీంతో డీఆర్డీఏ అధికారులు అంచలంచెలుగా జిల్లా అంతటా సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే తొలిదశలో సైదాపురం, రాపూరు, చేజర్ల, కలువాయి, కొండాపురం, దుత్తలూరు, మర్రిపాడు, రెండో దశలో మనుబోలు, వెంకటాచలం, ఇందుకూరుపేట, అల్లూరు, విడవలూరు, సంగం, అనంతసాగరం, ఏఎస్‌పేట, వింజమూరు, మూడో దశలో కావలి, జలదంకి, సీతారామపురం, కొడవలూరు, కోవూరు, నెల్లూరు, ముత్తుకూరు, బోగోలు మండలాల్లో సంఘాలు ఏర్పాటయ్యాయి. సత్ఫలితాల దిశగా తొలిదశ సంఘాలు తొలి దశలో ఏర్పాటైన సంఘాలు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. చేజర్ల, రాపూరు, కలువాయి తదితర మండలాల్లో రుణం పొంది మినీ రైస్ మిల్లు, పిండి మిల్లు, పొట్టేళ్ల పెంపకం, సేంద్రియ ఎరువులతో పెరటి తోటల పెంపకం చేస్తున్నారు. తద్వారా వచ్చే నాణ్యమైన ఉత్పత్తులను ‘కాలుగుడి’ యాప్‌లో పొందు పరచి ఆన్లైన్ మార్కెట్ చేసి లాభపడుతున్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల సహకారం వ్యవసాయశాఖ సంఘాలకు సాంకేతిక సహకారం అందిస్తోంది. మౌలిక వసతులను కల్పిస్తోంది. భూసార పరీక్షలు చేయించడం. సమగ్ర వ్యవసాయ విధానంపై శిక్షణ ఇవ్వడం చేస్తోంది. సెర్ఫ్: బ్యాంక్ ఖాతాలను తెరిపించడంతో పాటు రుణాలు పొందే విధంగా ప్రోత్సహిస్తుంది. పుస్తక నిర్వహణపై శిక్షణ ఇస్తుంది. ఉద్యానశాఖ: ప్రభుత్వ, ఇతర సంస్థల సబ్సిడీ పథకాలను సంఘాలకు అందిస్తుంది. సాంకేతిక సహకారమందిస్తుంది. సమీకృత వ్యవసాయంపై శిక్షణ ఇస్తుంది. రైతు సాధికార సంస్థ: సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన పనిముట్లు, ఎరువులు, పురుగు మందులు అందేలా చూడడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం చేస్తుంది. పశుసంవర్థశాఖ: పాడి పశువులు, సన్న జీవాల కొనుగోలుకు సహకారమందిస్తుంది. వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేయిస్తుంది. డెయిరీ కార్యక్రమాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఎన్ఆర్ఈజీఎస్: గొర్రెలు, మేకలు, కోళ్లు, పశువుల షెడ్స్, ఫార్మ్ పాండ్స్ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది. రుణ పరపతి: ఒక్కో సంఘ సభ్యురాలికి రూ.25 వేల రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. సభ్యులంతా కలిపి తీసుకోవాలంటే రూ.1.50 లక్ష వరకు రుణం పొందవచ్చు. సభ్యులు పొదుపులోని నగదును రుణంగా పొందవచ్చు. వీటితోపాటు ఉద్యానశాఖ 75 శాతం రాయితీతో ఇస్తున్న పథకాలు పొందవచ్చు. సంఘాలు ఏర్పాటు చేశాం ఒకే రకం పంట సాగు చేసే మహిళా రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు కూడా ఆరంభించాం. అధికారుల సూచనలు, సలహాలతో ఎలాంటి పంటలు వేస్తే లాభ దాయకంగా ఉంటుంది. ఆ సాగు పద్ధతులను గురించి అవగాహన చేసుకుంటున్నాం. మార్కెట్ మెళకువలు తెలుసుకుని త్వరలోనే ప్రక్రియ ప్రారంభిస్తాం. – జి.లక్ష్మిరాణి, అన్నదాత రైతు ఉత్పత్తి దారుల సంఘం, కొడవలూరు లాభదాయక సంఘాల స్ఫూర్తితో సాధికారత తొలి దశలో ఏర్పాటైన మా సంఘాలు ఇప్పటికే వివిధ రకాల పంటలు, రైస్ మిల్లు, ఆన్లైన్ మార్కెట్లు చేస్తూ లాభ పడుతున్నాయి. ఆ సంఘాల స్ఫూర్తితోనే ముందుకు సాగుతాం. వివిధ శాఖలు సహకారమందిస్తున్నందున తప్పక లాభాల బాట పడుతామన్న ధీమా ఉంది. ఉద్యాన శాఖ ద్వారా 75 శాతం రాయితీ రావడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం మెరుగ్గా ఉంది. – కె.సుభాషిణి, వాసు రైతు ఉత్పత్తిదారుల సంఘం త్వరలో రూ.1.20 కోట్లతో సేకరణ కేంద్రాల ఏర్పాటు సంఘాలు పండించిన ఉత్పత్తులను ఒక చోటకు సమీకరించి గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేయడానికి మండలానికో షెడ్డు నిర్మించనున్నాం. ఒక్కో షెడ్డుకు ప్రభుత్వం రూ.20 లక్షల వంతున మంజూరు చేస్తోంది. రూ.15 లక్షలు షెడ్డుకు, రూ.5 లక్షలు కోల్డ్ రూమ్‌కు మంజూరు చేస్తోంది. తొలివిడతలో కలువాయి, రాపూరు, చేజర్ల, గుడ్లూరు, సైదాపురం, ఓలేటివారిపాళెంలో షెడ్ నిర్మాణాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. రైతులు పండించిన పండ్లు, నిమ్మకాయలు, కూరగాయల్లాంటివి రెండు లేదా మూడు రోజులు నిల్వ ఉండాల్సి వస్తే చెడిపోకుండా కోల్డ్ రూమ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఉత్పత్తిదారుల సంఘాలను కూడా దశల వారీగా 37 మండలాల్లో ఏర్పాటు చేయనున్నాం. – కేవీ సాంబశివారెడ్డి, డీఆర్డీఏ పీడీ నెల్లూరు -
‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్.. సదరం స్కాంపై ఏసీబీ కేసు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాల ఆధారంగా స్పందించిన హైదరాబాద్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లోతుగా ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ‘దివ్యంగా దోచేస్తున్నారు’శీర్షికన తొలిసారిగా ఈ కుంభకోణాన్ని ‘సాక్షి’వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సదరం సర్టిఫికెట్లు తీసుకున్న పలువురు అనర్హులు ప్రతినెలా దివ్యాంగ పింఛన్లు, బస్, రైలు పాసుల్లో రాయితీలు, ఏటా ఆదాయపు పన్ను రాయితీ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానాకు అంతులేని నష్టాన్ని చేకూరుస్తున్నారు. జిల్లా సివిల్ ఆసుపత్రికి నోటీసులు! రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని చేకూరుస్తున్న ఈ కుంభకోణంపై ఏసీబీ అధికారులు ఇప్పటికే డీఆర్డీఏ అధికారులకు కొన్ని ప్రశ్నలతో కూడిన నోట్‌ను పంపారు. దానికి వారి నుంచి సమాధానం రాగా తాజాగా కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం నోటీసులు పంపించారు. ఇక్కడనుంచి వచ్చే సమాధానాల ఆధారంగా ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో జారీ అయిన పలు అనుమానాస్పద సర్టిఫికెట్లపై ఏసీబీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. అసలేం జరిగింది..? కరీంనగర్‌లోని జిల్లా సివిల్ ఆస్పత్రి– కలెక్టరేట్లో డీఆర్డీఏలోని కొందరు అధికారులు కలిసి అనర్హులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే తతంగానికి తెరలేపారు. వీరంతా పలు మండలాల్లో ఏజెంట్లను, తమకు అనుకూలమైన వైద్యులతో ముందే మాట్లాడుకుని వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారు అడిగినంత వైకల్య శాతాన్ని వేసి పంపేవారు. ఇందుకోసం సదరం వ్య వహారాలు చూసే ఇద్దరు డీఆర్డీఏ ఉద్యోగుల (శ్రీనివా స్, కిశోర్)ను పెట్టుకున్నారు. వాస్తవానికి వీరిని 2019 లోనే డీఆర్డీఏ తొలగించగా..ఈ వ్యవహారంలో ఉన్న పూర్వానుభవంతో ఎలాంటి నియామక పత్రాలు లేకున్నా..26 నెలలపాటు శ్రీనివాస్, కిశోర్‌తో సివిల్ ఆసుపత్రిలో దందా చేయించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
పండుగైనా, సెలవైనా పింఛన్ పంపిణీ
సాక్షి, అమరావతి: ఈ నెల మొదటి తేదీ మహాశివరాత్రి పర్వదినం. అదీగాక మంగళవారం ప్రభుత్వ సెలవు దినం. అయినా అవ్వా తాతలకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్‌ను మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,25,228 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.1,557.06 కోట్లు విడుదల చేసింది. సోమవారం సాయంత్రానికే అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో పింఛన్ నిధులను జమ చేసే కార్యక్రమం పూర్తయినట్టు సెర్ప్ అధికారులు చెప్పారు. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులిస్తారు. ఐదు రోజుల పాటు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులకు పింఛన్ అందించే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పింఛన్ల పంపిణీ పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. -
డీఆర్డీఏలకు కేంద్రం మంగళం!
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు ఉద్దేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డీఆర్‌డీఏల నిర్వహణకు నిధులు నిలిపివేస్తున్నట్లు రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో వీటిలో పనిచేస్తున్న సిబ్బంది సంకట స్థితిలో పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, వేర్వేరుగా అమలు చేసే పలు సంక్షేమ పథకాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకుంటూ అవి క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చూడటం వీటి బాధ్యత. 1999లో ఏర్పాటైన డీఆర్డీఏలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఉన్నాయి. వీటిలో 230 మందికి పైగా సిబ్బంది కాంట్రాక్టు, తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల గ్రామీణ మహిళల పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పింఛన్ల పంపిణీ వంటి పథకాలను ఈ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేసే డీఆర్‌డీఏల నిర్వహణ, సిబ్బంది జీతాల నిధులను కేంద్రమే ఇస్తోంది. ఈ నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ సంజయ్ అన్ని రాష్ట్రాలకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఈ ఉద్యోగులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే వివిధ విభాగాల్లో వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించడంతో పాటు అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరుతూ ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. -
సచివాలయ వ్యవస్థ అద్భుతం
చోడవరం: గ్రామ సచివాలయ వ్యవస్థపై విదేశీ ప్రతినిధుల అధ్యయన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. గ్రామీణ ప్రజల అభివృద్ధి, అవసరాలు తీర్చడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాలన చాలా బాగుందని అభినందించింది. జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ సౌజన్యంతో 19 దేశాలకు చెందిన 23 మంది ప్రతినిధులు సోమవారం విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ప్రతినిధి బృందంలో శ్రీలంక, బంగ్లాదేశ్, బోట్సువానా, బురుండీ, కెమెరూన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా, ఇరాక్, కెన్యా, మారిషస్, నైజీరియా, దక్షిణ సూడాన్, తజికిస్థాన్, టాంజానియా, ఉజ్బెకిస్థాన్, జాంబియా తదితర దేశస్తులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పాలన వ్యవస్థ, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలు, గ్రామీణాభివృద్ధిపై వీరు అధ్యయనం చేశారు. 11 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది సేవలందించేందుకు ప్రజలకు చేరువగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు. సచివాలయ కార్యాలయం ఏర్పాటు, ఉద్యోగుల నియామకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థ గురించి తమ దేశాల ప్రభుత్వాలకు సూచిస్తామని చెప్పారు. చోడవరం ఎమ్మెల్యే తరఫున స్పెషలాఫీసర్ వెంకటేశ్వర్లు, ఈవోపీఆర్డీ చైతన్య, పంచాయతీ ఈవో లోవరాజు, వైఎస్సార్సీపీ నేతలు విదేశీ బృందాన్ని ఘనంగా సత్కరించారు. పాలనా వ్యవస్థ బాగుంది భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పాలనా వ్యవస్థ బాగున్నాయి. గ్రామీణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ప్రజలకు ప్రభుత్వం చాలా మేలు చేస్తుండటం అభినందనీయం. ప్రజలు చూపించే ప్రేమాభిమానాలకు చాలా సంతోషిస్తున్నాం. –అగిసన్యంగ్కౌప, బోట్సువానా ప్రతినిధి గ్రామీణ వ్యవస్థ బలంగా ఉంది ప్రభుత్వ ఆధీనంలో గ్రామీణ పరిపాలనను సాగిస్తుండటం బాగుంది. అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు చాలా పథకాలు అందించడం వల్ల గ్రామీణ వ్యవస్థ బలంగా ఉంది. –ఎన్చుఫర్ క్రిస్టోఫర్, కెమెరూన్ ప్రతినిధి ప్రజలకు దగ్గరగా గ్రామీణ వ్యవస్థ ప్రజల అవసరాలకు దగ్గరగా గ్రామీణ వ్యవస్థ ఉంది. ప్రభుత్వం వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవడం మంచి విధానం. దారి్రద్యరేఖకు దిగువన ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవడం అభినందనీయం. – ఒజయ్కుమార్ హల్డార్, బంగ్లాదేశ్ ప్రతినిధి -
‘నాలుగు విడతలుగా డ్వాక్రా రుణాలు రద్దు’
సాక్షి, కడప: డీఆర్డీఏ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సక్రమంగా అమలుచేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి డీఆర్డీఏ పథకాల సమీక్షలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల గ్రేడింగ్, వైఎస్ఆర్ ఆసరా, స్త్రీ నిధి, ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ పెళ్లికానుక తదితర పథకాలపై నియోజకవర్గ పరిధిలోని మండలాల వారీగా ఆయన సమీక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 4363 స్వయం సహాయక సంఘాలలో 96 శాతం సంఘాలు మంచి గ్రేడ్లును సాధించడం అభినందనీయమన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకుని పథకాల లక్ష్యాలును అధిగమించాలన్నారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అత్యంత చేరువ కావాలన్నారు. 4 విడతలుగా డ్వాక్రా రుణాలను రద్దు.. నవరత్న పథకాలులో భాగంగా హామీ ఇచ్చిన డ్వాక్రా ఋణాలును 4 విడతలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాపీ చేయనున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటి నియోజక వర్గ వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో రూ.22 కోట్లు, 6 మండలాలకు గాను రూ. 81.8 కోట్లు ఋణాలను మాపీ చేయడం జరుగుతుందన్నారు. వెలుగు గ్రామ సమాఖ్యలకు గత ప్రభుత్వంలో రూ.25 లక్షలు ఋణాలుగా ఇచ్చేవారని, జగన్ ప్రభుత్వంలో రూ. 50 లక్షలు వరకు గ్రామ సమాఖ్యలకు ఋణాలును ఇవ్వడం జరుగుతోందన్నారు. బ్యాంకు ఋణాలుతో పాటు స్త్రీ నిధి ఋణాలును రూ.1 లక్ష వరకు ఇవ్వడం జరుగుతోందన్నారు. జగన్ ఐదు నెలల పాలనలోనే ఏ రాష్ట్రంలో అమలుచేయని ప్రజా సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన,మహిళా సంక్షేమానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం చిట్టచివరి నిరుపేద వరకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చీఫ్ విప్ కు సన్మానం.. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి డీఆర్డీఏ ఉద్యోగ సిబ్బంది సోమవారం జరిగిన సమావేశం లో భాగంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని అభ్యర్ధించారు. సిబ్బంది విన్నపాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళతానని ఆయన హామీ ఇచ్చారు. -
నిరుద్యోగులకు వరం
సాక్షి,కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలో ఇంజినీరింగ్, పీజీ, బీ టెక్, ఎం టెక్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి వరం లాంటిది నవ గురుకుల్ సంస్థ. ప్రతిభగల కొంతమంది ఐటీ తదితర సంస్థల్లో స్థిరపడ్డారు. మిగిలిన వారు ఇలాంటి సంస్థల్లో ఉపాధి పొందాలంటే ఉన్నత చదువులు ఉంటేనే కొలువులు వస్తాయి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సీ డ్యాప్ సంస్థ ద్వారా నవ గురుకుల్ అనే సంస్థను ప్రవేశ పెట్టింది. ఈ సంస్థ రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. ఈ సంస్థ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి ఆంగ్లంపై పట్టు ఉన్న వారికి సాఫ్ట్వేర్ సంస్థలో ఉన్నత కొలువులు రానున్నాయి. జిల్లాలో ప్రతిభ ఉన్న నిరుద్యోగ యువత ఉన్నత కొలువులు లేక చాలీచాలని జీతాలతో ఇబ్బందులుపడుతున్నారు. ఎన్నాళ్లు పని చేసినా జీతం తక్కువ రావడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 18–23 సంవత్సరాల మధ్య ఉన్న యువతకు బంగారు భవిష్యత్ కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు నవ గురుకుల్ అనే సంస్థను ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. సీ డ్యాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఏజెన్సీ) ద్వారా జిల్లాలో ఎంపికలు నిర్వహించి నైపుణ్యం, క్రమశిక్షణ ఉన్న వారిని ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది దేశంలో 150 మంది యువతకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 50 మందికి అవకాశం కల్పించారు. తొలి దశలోనే జిల్లాకు 10 సీట్లు కేటాయించడంతో నిరుద్యోగులు స్వాగతిస్తున్నారు. నిరుద్యోగులకు సువర్ణావకాశం సీ డ్యాప్ సంస్థ ద్వారా నిర్వహించే ఎంపికల్లో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తోంది. 18–23 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులై ఇంటర్, డిగ్రీ చదివిన వారికి అవకాశం. ముందుగా అభ్యర్థుల విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఆన్లైన్ ద్వారా నాలుగు విభాగాల్లో పరీక్షలు ఉంటాయి. వీటిలో ఎంపికైన వారికి నేరుగా సంస్థ నుంచి స్క్రైప్ ద్వారా ఆన్లైన్లో చివరి పరీక్ష, వీడియో కాలింగ్ ద్వారా మౌఖిక పరీక్షలు ఉంటాయి. వీటిలో ఎంపికైన మహిళా అభ్యర్థులకు బెంగళూరులో, పురుషులకు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణలో.. సీ డ్యాప్ సంస్థ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఆయా సంస్థ సిబ్బంది బెంగళూరు, ధర్మశాల ప్రాంతాలకు తీసుకెతారు. వీరికి ఏడాదిపాటు శిక్షణనిస్తారు. శిక్షణలో ప్రముఖ సంస్థలైన గుగూల్, టెక్ మహేంద్ర, ఆపిల్, ఐ ఫోన్ వంటి సంస్థలలో ట్రైనర్స్‌గా పనిచేస్తున్న వారు శిక్షణ ఇస్తారు. శిక్షణలో అభ్యర్థులకు సాఫ్ట్వేర్ సంస్థలో ఎలాంటి కోర్సులు ఉంటాయి.. వాటిని ఎలా నేర్చుకోవాల అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ప్రధానంగా ఆంగ్లం, హిందీ భాషల్లో శిక్షణ ఉంటుంది. ఏడాదిపాటు కొనసాగే శిక్షణలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. ఎంపికలు ఈనెల 15న జిల్లా కేంద్రమైన కడప నగర శివార్లలోని టీటీడీసీలో ఉదయం 10 గంటలకు నవ గురుకుల్ సంస్థలో కొలువుల కోసం ఎంపికలు జరుగుతాయి. ఎంపికకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు ఆధార్‌కార్డుతో హాజరు కావాలి. తుది ఎంపికలనంతరం 16న ఫైనల్ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల పాలిట వరం సీ డ్యాప్ సంస్థ ద్వారా నిరుద్యోగ అభ్యర్థికి సీటు లభిస్తే తన జీవితం బంగారు మయమే. శిక్షణానంతరం వారికి వివిధ రకాల సంస్థల్లో దేశంలో ఎక్కడైనా ఉపాధి లభిస్తుంది. కనీసం రూ.30 వేలకుపైగా జీతభత్యాలు ఉంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారికి సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉపాధి కల్పించడం శుభ పరిణామం. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శివారెడ్డి, డీఏఆర్‌డీఏ ఇన్చార్జి పీడీ, కడప -
300 మీటర్ల జాతీయ జెండాతో ‘స్వచ్ఛ ర్యాలీ’
సంగారెడ్డి జోన్ : వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని డీఆర్డీఏ వెంకటేశ్వర్లు సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా జిల్లా యంత్రాంగం గురువారం స్వచ్ఛగణతంత్ర వారోత్సవాలను నిర్వహించింది. ఇందులో భాగంగా స్థానిక ఐబీ అతిథిగృహం నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 మంది కళాశాల విద్యార్థులతో కలిసి 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందగా సహకరించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకున్న అనంతరం జేసీ వాసం వెంకటేశ్వర్లు చేతులమీదుగా కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ సిద్ధారెడ్డి, ఏఓ మధులత, వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్చభారత్ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు టీటీడీసీలో ఉద్యోగ మేళా
అనంతపురం అగ్రికల్చర్: డీఆర్డీఏ– వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు రేపు స్థానిక ఫంగల్రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో శనివారం ఉద్యోగ మేళా ఉంటుందని పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు ఫ్లిఫ్కార్డు వేర్‌హౌస్‌లో స్కానింగ్, డేటాఎంట్రీ ఉద్యోగాలకు అర్హులన్నారు. 18 నుంచి 30 ఏళ్ల యవస్సున్న యువకులు పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఉండాలన్నారు. బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జెరాక్స్‌తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల 16న ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. -
వెలుగులో..చీకటి కోణం..!
♦ అక్రమాలు నిర్ధారణ అయినా చర్యలు శూన్యం ♦ సెర్ఫ్ సీఈఓ వరకు వెళ్లిన కొందరి వ్యవహరం ♦ డీఆర్డీఏ ‘వెలుగు’నుశాసిస్తున్న ఆ తొమ్మిది మంది జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ) సంస్థ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుంది. అందులో వెలుగు విభాగం ఎంతో కీలకం. ఇక్కడదాదాపు 14 పథకాలు అమలవుతాన్నాయి.వీటి రథాలను నడిపే సిబ్బంది కూడాఎక్కువే. చాలా మంది సిబ్బంది నిజాయితీగా పనిచేస్తున్నారు. నిరుపేదలను ఆదుకుంటున్నారు. అయితే డీఆర్డీఏనుతొమ్మిది మంది సిబ్బంది తమ గుప్పిట్లోపెట్టుకున్నారు. తమ తెలివితేటలతో బాగానే వెనకేసుకున్నారు. వారు జిల్లాలోఏ ప్రాంతంలో ఉన్నా చక్రం తిప్పుతున్నారని సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే ఎన్నోవాస్తవాలు ‘వెలుగు’ చూస్తాయని ఆశాఖలోని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. కడప రూరల్: జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థలోని వెలుగు విభాగంలో ఇన్సూరెన్స్, మార్కెటింగ్, హార్టికల్చర్, జెండర్, లైÐŒ వుడ్, బ్యాంకింగ్, యానాది డెవలప్మెంట్, సామాజిక పింఛన్లు. మహిళా స్వయం సహాయక సంఘాలు, జిల్లా సమాఖ్య తదితర 14 విభాగాలు అమలవుతున్నాయి.వీటిని అమలు చేయడంలో డీఆర్డీఏ పీడీ, ఏపీడీ, తదితర సిబ్బంది తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఆరుగురు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు, 58 మంది అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, 170 మంది కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు కీలకంగా పనిచేసేవారు ఉన్నారు. వారి కింద మరి కొందరు పనిచేస్తున్నారు. కీలకమైన సిబ్బందిలో తొమ్మిది మంది ఆ శాఖను శాసిస్తున్నారని సిబ్బంది అనుకుంటున్నారు. సమాచారం మేరకు... వారికి అనుకూలంగా...! గడిచిన నాలుగు నెలల క్రితం ఫసల్ బీమా యోజనకు సంబంధించి కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడ్డారు. వీరిపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. దీంతో వారు రెండుమూడు నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. తర్వాత వారిని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అమరావతికి పిలిపించి వివరాలు తీసుకున్నారు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు గాని, వారు ప్రస్తుతం జిల్లాలోనే పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌కు గురైన వారిని వేరే జిల్లాలకు బదిలీ చేయాలి. ఇక్కడ అలా జరగలేదు. అలాగే గడిచిన నెలలో 21వ తేదీన బదిలీలు జరిగాయి.ఇవి కూడా ఆ తొమ్మిది మందికి అనుకూలంగా జరిగాయి. అంతకుముందు కొన్ని జిల్లాల నుంచి అవినీతి సిబ్బందిని అమరావతికి పిలిపించారు. అందులో భాగంగా ఇక్కడి నుంచి ఒకరు అక్కడికి వెళ్లారు.ఇతని పని తీరు, వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ ఉన్నతాధికారి మండిపడ్డారు. ఇక నీ సేవలు అక్కడ చాలు. వేరే జిల్లాకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అతను ప్రస్తుతం జిల్లాలోని ఒక నియోజక వర్గంలో పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఒక విభాగాన్ని తీసేశారు. ఒకరి కోసం పట్టు పట్టి ఆ విభాగం ఎంతో అవసరమని అనుమతి తీసుకొని మళ్లీ ప్రారంభించారు. తొమ్మిది మందిలో ముగ్గురు కీలకం... ఆ తొమ్మిది మందిలో ముగ్గురు సిబ్బంది డీఆర్‌డీఏను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారు జిల్లాలో ఎక్కడ ఉన్నా చక్రం తిప్పేస్తారు. ఒకవేళ తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయితే, ఆ స్థానంలో తమ అనుచరులను నియమించుకునే స్థాయికి ఎదిగారు.అవకాశం ఉంటే అక్కడే మరో చోట పనిచేసే సిబ్బందిని నియమిస్తారు. ఇక అక్రమార్జనకు కొదవలేదనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. నిబంధనల ముసుగులోనే అంతా పద్ధతిలా సాగుతుందని అంటున్నారు. ఈ విషయాలపై ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ వస్తున్న ఆరోపణలుపై స్పందించి ‘వెలుగు’లో చీకట్లు ఉంటే పారదోలాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయం గురించి డీఆర్డీఏ ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)శివారెడ్డిని వివరణ కోసం సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
సర్టిఫికేటుగాళ్లు
♦ గుత్తి కేంద్రంగా సదరం సర్టిఫికెట్ల మాఫియా ♦ వైకల్యం లేకున్నా ధ్రువీకరణపత్రాలకు దరఖాస్తు ♦ దివ్యాంగులను పంపి సర్టిఫికెట్లు పొందుతున్న వైనం అనంతపురం మెడికల్ : దివ్యాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిపొందాలంటే ‘సదరం’ సర్టిఫికెట్ తప్పనిసరి. వీరికోసమే డీఆర్డీఏ ఆధ్వర్యంలో అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో ప్రతి గురువారం ఆర్థో, బుద్ధిమాంద్యత ఉన్న వారికి వైద్య పరీక్షలు చేస్తారు. కొత్త పింఛన్లు మంజూరు కావాలన్నా, రైలు పాసులు పొందాలన్నా, ఉద్యోగాలకోసమైనా సరదం సర్టిఫికెట్ కీలకంగా మారడంతో కొందరు దళారులు రంగ ప్రవేశం చేసి డబ్బులిస్తే తాము సర్టిఫికెట్లు అందిస్తామంటూ దందా సాగిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం సదరంలో జరుగుతున్న సడేమియాపై ‘సాక్షి’ వరుస కథనాలిచ్చింది. కొంత వరకు ప్రక్షాళన జరిగినా.. ఇప్పుడు మళ్లీ నకిలీ మాఫియా తెరపైకి వచ్చింది. గుత్తి కేంద్రంగా ఇద్దరు వ్యక్తులు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. పామిడి మండలం రామదాసుపల్లికి చెందిన ఓ వ్యక్తితో పాటు గుత్తి మండలం కొత్తపేటకు చెందిన మరో వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వైకల్యం ఉన్న వారే టార్గెట్ ధ్రువీకరణ పత్రాలు పొందడానికి మాయగాళ్లు వైలక్యం ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఇంతకుముందే వారికి సర్టిఫికెట్ ఉన్నా ఇతరుల ఆధార్‌ను ఇచ్చి సదరం శిబిరాలకు పంపుతున్నారు. ఆధార్ జిరాక్స్ ప్రతిలో ముఖం సరిగా కనిపించకపోవడం.. వైద్యులు కూడా వచ్చిన వ్యక్తిని మాత్రమే చూస్తుండడంతో అక్రమార్కుల పని సులువుగా సాగిపోతోంది. ఇందుకోసం శిబిరాలకు వచ్చే వ్యక్తికి రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. దీంతో సకలాంగులకు కూడా సదరం సర్టిఫికెట్లు దక్కుతున్నాయి. ఇలా ఇప్పటికే పెద్ద సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ అయినట్లు తెలుస్తోంది. ఓ సంఘం ఫిర్యాదులో బట్టబయలు కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందా గురువారం బట్టబయలైంది. అనంత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు గంగాధర్, ఈసీ సభ్యుడు బయపరెడ్డిలు సర్వజనాస్పత్రికి వచ్చి ఇతరుల ఆధార్ కార్డులు తీసుకొచ్చిన ఆరుగురిని గుర్తించారు. ఈ విషయాన్ని వైద్యులు ఆత్మారాం, సతీశ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే సదరం ఇన్చార్జ్ లలితకు తెలియజేశారు. ఆమె డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మలు అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పట్టుబడిన ఎర్రిస్వామి (దర్గాహొన్నూరు), వెంకటరాముడు (పామిడి), పక్కీరప్ప (ఈరేపల్లి, పెద్దవడుగూరు మండలం), లక్ష్మన్న (గుత్తి), ఖాజా హుస్సేన్ (గుత్తి), శివ (పెద్దవడుగూరు)లను విచారించారు. డబ్బుకు ఆశపడి తాము వచ్చినట్లు కొందరు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై డీఆర్డీఏ అధికారులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్యాంగుడైన ఇతడి పేరు ఖాజాహుస్సేన్. స్వగ్రామం గుత్తి. పెద్దవడుగూరు మండలం చిత్రచేడుకు చెందిన చిన్న మదార్(818145845688) తరఫున సదరం శిబిరానికి వచ్చి అధికారులకు దొరికిపోయాడు. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండడంతో రూ.300 కోసం ఆశపడి ఇలా చేశానని అతడు చెప్పుకొచ్చాడు. ఇలాంటి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న సర్టిఫి‘కేటుగాళ్లు’ సకలాంగులకూ సదరం పత్రాలిప్పించేస్తున్నారు. -
పాల ఉత్పత్తులు పెంచేందుకు కృషి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో పాల ఉత్పత్తులను పెంపొందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ పాల దినోత్సవం సందర్భంగా డీఆర్డీఏ కార్యాలయంలో పాలమిత్రలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాల ఉత్పత్తిలో దేశం ప్రథమ స్థానంలో ఉందన్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు విజయ డెయిరీలో పాలు విక్రయించే వారికి లీటరుకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ పెంచామని తెలిపారు. జిల్లాలో 10 పాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాల సేకరణలో జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో దూడల పెంపకం చేపడుతున్నామని అన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో విజయ డెయిరీకి 300 నుంచి 400 లీటర్లు మాత్రమే పాల సేకరణ జరుగుతుందని, ఆగస్టు మాసం వరకు వెయ్యి లీటర్ల పాల సేకరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతీ రైతు రెండు గేదెలు పెంచుకుంటే ఉపయోగకరంగా, ఆర్థికంగా లబ్ధిపొందవచ్చని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పాల సేకరణకు పాలమిత్రలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రాజేశ్వర్‌రాథోడ్, లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రసాద్, విజయ డెయిరీ డీడీ మధుసూదన్, టీఆర్ఎస్ నాయకుడు గోవర్థన్‌రెడ్డి, పాలమిత్రలు పాల్గొన్నారు. -
విషాహారం తిని 35 మందికి అస్వస్థత
వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో అపశ్రుతి కర్నూలు(హాస్పిటల్): విషాహారం తిని 35 మంది యువతీయువకులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన శనివారం కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం యువతీయువకులకు వృత్తివిద్యల్లో శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి చూపుతోంది. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ) ఆధ్వర్యంలో కర్నూలు నగర పరిసరాల్లో ఆరు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో నాగిరెడ్డి రెవిన్యూకాలనీలో స్టీప్ కెరియర్ బిల్డర్స్ అనే సంస్థ యువతీయువకులకు సీసీఈ రిటైలర్‌లో శిక్షణ ఇస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ భోజన, వసతితో సహా మూడు నెలల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం ఇందులో 150 మందికి పైగా యువతీయువకులకు జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతున్న వారు గత రెండురోజులుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గురువారం పలువురు విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందగా, శుక్రవారం సైతం మరికొందరు ఆసుపత్రిలో చేరారు. మొత్తంగా 35 మంది యువతీ యువకులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికితోడు రెగ్యులర్‌గా వచ్చే తాగునీరు గాకుండా ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి ఇవ్వడం కూడా సమస్యగా మారినట్లు చెబుతున్నారు. అస్వస్థకు గురైన వారిలో కర్నూలు మండలం ఆర్కె దుద్యాల గ్రామానికి చెందిన ఎం. రాజ్‌కుమార్, కె. అశోక్, ప్రసాద్, ప్రసాద్, రవికుమార్, మధు, సుంకన్న, ప్రవీణ్, పత్తికొండ మండలం చందోళి గ్రామానికి చెందిన శేఖర్, ఎం. శేఖర్, నంద్యాల మండలం కరిమద్దుల గ్రామానికి చెందిన కె. రాజేష్, ధనలక్ష్మి, కె.జయంతి, హెబ్సిబా, కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఎం. గిడ్డయ్య, బనగానపల్లికి చెందిన అనంతయ్య, ఓర్వకల్లుకు చెందిన అశోక్, బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన రమేష్ ఉన్నారు. వీరిలో 11 మందికి తీవ్ర అస్వస్థతగా ఉంటే అంటు వ్యాధుల విభాగంలో చేర్పించారు. -
28న డీఆర్డీఏ మెగా జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ఈ నెల 28వ తేదీన ఉదయం 10గంటలకు బి.తాండ్రపాడు టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ,ఐటీఐ, బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 19 నుంచి 30 ఏళ్లలోపు వయసు కల్గిన అభ్యర్థులు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ-ఈజీఎం కార్యాలయంలో ప్రత్యక్షంగా కానీ, ఫోన్(8099855969, 9177016174) ద్వారా కానీ సంప్రదించాలన్నారు. -
27 నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): గ్రామీణ నిరుద్యోగ యువతకు ఈ నెల 27వ తేదీ నుంచి ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణ శనివారం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా యువతకు మూడు నెలల పాటు ఇంగ్లిష్, పని సంసిద్ధత, కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు చూపిస్తామన్నారు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండి, ఎస్ఎస్సీ/ఇంటర్ పాస్,ఫెయిలైన యువతీయువకులు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో ఈ నెల 27, 28వ తేదీల్లో టీటీడీసీలో అడ్మిషన్ పొందాలన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ–ఈజీఎం కార్యాలయం, ఫోన్ నెం.9866179471, 9885127745, 9966723684, 08518277499 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
సాధారణ బీమా ప్రీమియం వసూళ్లలో 33% వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమాయేతర ప్రీమియం వసూళ్లు మంచి జోరుమీదున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సాధారణ బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 33 శాతం అధికంగా రూ. 10,287 కోట్లు వసూలు అయింది. గతేడాది ఇదే నెలలో వసూలైన స్థూల ప్రీమియం రూ.7,710 కోట్లే. ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం... ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం రూ.5,289 కోట్లుగా ఉండగా, ప్రైవేటు కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ.4,998 కోట్లు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ప్రభుత్వ కంపెనీల ప్రీమియంలో వృద్ధి 35 శాతం, ప్రైవేటు కంపెనీల వసూళ్లలో 32 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జీవిత బీమాయేతర కంపెనీల ప్రీమియం వసూళ్లు 31.7 శాతం వృద్ధితో రూ.1,13,942 కోట్లుగా ఉన్నాయి. ఇది అంతకుముందు ఇదే కాలంలో రూ.86,526 కోట్లుగా ఉంది. 11 నెలల కాలంలో ప్రభుత్వరంగ కంపెనీల ప్రీమియం ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.61,096 కోట్లుగా ఉండగా, ప్రైవేటు కంపెనీల ప్రీమియం వసూళ్లు 34.1 శాతం వృద్ధితో రూ.39,401 కోట్లుగా ఉన్నాయి. -
ఏప్రిల్ 1 నుంచి వాహన బీమా ప్రియం
-
ఏప్రిల్ 1 నుంచి వాహన బీమా ప్రియం
50 శాతం వరకూ ప్రీమియం పెంచేందుకు ఐఆర్డీఏ ప్రతిపాదన న్యూఢిల్లీ: వాహన యజమానులపై బీమా బాదుడుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి వాహన బీమా ప్రీమియంను 50 శాతం వరకూ పెంచాలని నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ ప్రతిపాదించింది. ప్రీమియం కార్లు, మోటారు సైకిళ్లు, వాణిజ్య వాహనాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. అయితే, చిన్న కార్లకు (ఇంజిన్ సామర్థ్యం 1,000 సీసీ వరకూ) మాత్రం థర్డ్‌పార్టీ బీమా ప్రీమియం విషయంలో పెంపు నుంచి మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ప్రీమియం రేటు 2,055 కొనసాగుతుంది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐఆర్డీఏ ఈ ప్రతిపాదనల ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై వివిధ పక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఈ నెల 18 వరకూ గడువు ఇచ్చింది. వివరాలు ఇవీ... మధ్య స్థాయి కార్లు(1,000 సీసీ నుంచి 1,500 సీసీ), పెద్ద కార్లతో పాటు ఎస్‌యూవీలకు సంబంధించి బీమా ప్రీమియం 50 శాతం పెరుగుతుంది. 1,000 సీసీ వరకూ ఉన్న కార్లకు ప్రీమియం రూ.3,345కు చేరుతుంది. పెద్ద కార్లకైతే రూ.9,246 కట్టాల్సి ఉంటుంది. 75 సీసీ వరకూ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాల బీమా ప్రీమియంలో ఎలాంటి మార్పులు లేవు. 77 –150 సీసీ బైక్‌లు, స్కూటర్లు, 150–350 సీసీ కేటగిరీలోని పెద్ద బైక్‌ల ప్రీమియం పెరుగుతుంది. ఇక స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్ బైక్స్(350 సీసీపైన) ప్రీమియం 50 శాతం వరకూ(రూ.796 నుంచి రూ.1,194కు) పెరుగుతుంది. ఇక సరుకు రవాణా వాహనాల విషయంలో కూడా వివిధ కేటగిరీల్లో బీమా ప్రీమియం 50 శాతం వరకూ ప్రియం అవుతుంది. ప్రీమియం ట్రాక్టర్లకు (6 హెచ్‌పీ వరకూ) బీమా ప్రీమియం ఇప్పుడున్న రూ.510 నుంచి రూ.765కు చేరుతుంది. అదేవిధంగా ఈ–రిక్షాలకు కూడా ప్రీమియం రేట్లను పెంచాలని ప్రతిపాదించింది. -
పింఛన్లకు పీఠముడి
- టీడీపీ నేతల్లో విభేదాలు - రాష్ట్రంలోనే అరుదైన సమస్య కోడుమూరు : రాజకీయ విభేదాల కారణంగా అభాగ్యులకు ప్రభుత్వం మంజూరు చేసే కొత్త పింఛన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో 174 నియోజకవర్గాల్లో ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. కోడుమూరు నియోజకవర్గన్ని ఇందలో మినహాయించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి ప్రభుత్వం 2వేల పింఛన్లను మంజూరు చేసింది. జనాభా ప్రతిపాదికన గ్రామాల వారిగా లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి ప్రభుత్వానికి ఎంపీడీఓల ద్వారా నివేదికను పంపారు. ప్రొటోకాల్ పాటించకుండా తనకు కనీస సమాచారమివ్వకుండా ఏకపక్షంగా పింఛన్లను ఎంపిక చేయడమేగాకా, అనర్హులకు మంజూరు చేశారన్న కారణాలు చూపుతూ ఎమ్మెల్యే మణిగాంధీ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో డీఆర్డీఏ అధికారులు నియోజకవర్గమంతా పర్యటిస్తూ విచారణ చేశారు. ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా పింఛన్ల జాబితాను విడుదల చేసేందుకు అధికారులు భయపడుతున్నారు. ఫిబ్రవరి నెలకు కొత్త పింఛన్ల జాబితా విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయినట్లేనని అధికారులు తెలియజేస్తున్నారు. కోడుమూరు మండలానికి 494, గూడూరు మండలానికి 496మందికి పింఛన్లు. సి.బెళగల్ మండలానికి 411పింఛన్లు, కర్నూలు మండలానికి 597మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు ఎంపీడీఓలు ప్రభుత్వానికి లబ్ధిదారుల జాబితాను పంపారు. అయితే ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో పాతపింఛన్ల జాబితాను, పింఛన్ల డబ్బును బ్యాంకుల నుంచి డ్రా చేసుకొని పంపిణీ చేసేందుకు అన్ని విధాల రంగం సిద్ధం చేసుకున్నారు. విభేదాలే కారణం.. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం నియోజకవర్గానికి 2000వేల చొప్పున పింఛన్లు కేటాయించింది. ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు ప్రాంతాల్లో ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలకు చెరి సగం పింఛన్లు విభజించుకొని ఎవరికి వారు జాబితాను తయారు చేసుకొని అధికారులకు పంపారు. అయితే కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. తన అనుమతి లేకుండా జాబితా తయారైందని విభేదిస్తూ మణిగాంధీ కొత్త పింఛన్ల మంజూరును నిలుపుదల చేయించినట్లు సమాచారం. ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా పేదవాళ్లకందాల్సిన పింఛన్ల సొమ్ము దూరమైంది. ఎన్నో రోజులుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అభాగ్యుల ఆశలు ఆవిరైపోయాయి. కొత్త పింఛన్లు మంజూరు కాలేదు : సిద్ధలింగమూర్తి, ఎంపీడీఓ, సి.బెళగల్ జాబితా పంపినప్పటికీ కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. మంజూరైన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తాం. -
గ్రూప్ -2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్–2లో ప్రత్యక్ష ప్రసార మాధ్యం ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ–డీఆర్డీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ప్రముఖ అధ్యాపకులచే ప్రత్యక్ష ప్రసార మాధ్యం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఆసక్తి, అర్హత గల ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీయువకులు 21, 22వ తేదీల్లో ఉదయం 10 గంటలకు నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులతో ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయం, 08518–277499, 8522083879, 8341581022, 91770016174ను సంప్రదించాలన్నారు. -
డీఆర్డీఏ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
–డీడీయుజిఎస్వై శిక్షణ కార్యక్రమం రద్దు కర్నూలు(హాస్పిటల్): జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు కోపం వచ్చింది. ఒక కార్యక్రమంలో మరో కార్యక్రమానికి సంబంధించిన వారు సైతం ఉండటంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన కోపంతో కార్యక్రమాన్ని ప్రారంభించకుండా వెళ్లిపోయారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకుల కోసం 'దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన–సీడ్యాప్' ఉచిత శిక్షణ కేంద్రాల ప్రారంభ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఇదే ఆడిటోరియంలో 4 గంటలకు విద్యాసంస్థల యాజమాన్యాలు, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపల్‌లతో నగదు రహిత లావాదేవీలపై సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆలస్యం అయ్యింది. ఈలోపు రెండో కార్యక్రమానికి అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ ఆడిటోరియం చేరుకుని కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ 4.15 గంటలకు ఆడిటోరియంలోకి వచ్చారు. రాగానే రెండు కార్యక్రమాలకు సంబంధించిన అందరూ ఒకేచోట కూర్చుని ఉండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన వేదిక ఎక్కకుండానే కోపంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. డీడీయుజిఎస్వై కార్యక్రమాన్ని మీరే నిర్వహించుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ఛాంబర్‌కు వెళ్లారు. డీఆర్డీఏ పీడీ రామకృష్ణ వెళ్లి పరిస్థితిని విన్నవించినా ఆయన శాంతించలేదు. దీంతో శిక్షణ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ డీఆర్డీఏ పీడీ రామకృష్ణ ప్రకటించారు. ఈ కారణంగా ఆడిటోరియంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ముందుగా అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు బయటకు వెళ్లారు. ఆ తర్వాత డీఆర్డీఏ కార్యక్రమానికి వచ్చిన వారు వెనుదిగారు. 5 గంటల తర్వాత జిల్లా కలెక్టర్ రెండో కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి
కడప కోటిరెడ్డి సర్కిల్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో భాగంగా ఎంప్లాయిమెంట్ జనరేషన్ మిషన్ డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రైవేటు కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఎస్ఆర్టీసీ కోర్సుకు 10వ తరగతి పాసై 18, 25 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. వేతనం రూ 8,500 ఉంటుందని వివరించారు. సెక్యూరిటీ గార్డుకు (పురుషులు మాత్రమే) 10వ తరగతి పాసై , ఎత్తు 166 సెం.మీ. 1830 మధ్య వయసు కలిగి వేతనం రూ 8,500 ఉంటుందన్నారు. ఈ నెల 19న సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీసీ, రాజంపేట రోడ్, కడపలో తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో పాటు ఉపాధి హామీ కార్డు జిరాక్స్ కాపీలతో ఆరు ఫొటోలు తీసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం
రేపల్లె రూరల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్, వైజాగ్‌లలో ఉద్యోగులుగా పనిచేసేందుకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ ఎల్.వాల్మికి చెప్పారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ 2015, 2016 సంవత్సరాలలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసి కనీసం 60శాతం మార్కుల ఉత్తీర్ణత కలిగి ఉండటంగానీ, ప్రస్తుతం బీఎస్సీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 20 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. సంవత్సరానికి రూ.1,45,000 వేతనం అందిస్తామని పేర్కొన్నారు, ఆసక్తి కలిగిన యువతీ యువకులు సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్ల నకలు, రేషన్‌కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో గుంటూరు పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో డిసెంబర్ 2వతేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 0863 2210757 నంబరును సంప్రదించాలని సూచించారు. -
బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు?
కర్నూలు(హాస్పిటల్): ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ ఒకటి నుంచే ఈ ప్రక్రియ చేపట్టేందుకు డీఆర్డీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలో ప్రస్తుతం 3,07,821 మంది లబ్ధిదారులు వివిధ కేటగిరీల్లో సామాజిక భద్రతా పింఛన్లు అందుకుంటున్నారు. వీరందరికీ రూపే కార్డులను బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. పింఛన్ పొందుతున్న వారిలో ఇంకా 67,400 మందికి బ్యాంకు ఖాతాలు లేనట్లు గుర్తించారు. వీరితో పాటు 91వేల మందికి బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు గ్రామీణ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బ్యాంకు ఖాతా లేని వారి నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, దరఖాస్తు, డిక్లరేషన్‌పై లబ్ధిదారులతో సంతకాలు తీసుకుని నేరుగా పింఛన్ పంపిణీ చేసే అధికారులే బ్యాంకు అధికారులకు వాటిని అందజేసి, ఖాతాలు తెరిపించాలని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ ప్రక్రియ పూర్తి చేసి సోమవారంలోగా ఖాతాలు లేని వారందరికీ తెరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర నోట్ల సమస్య ఏర్పడటంతో ఎలాగైనా డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అమలైతే ఇప్పటిలాగా పింఛన్ కోసం పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. నేరుగా వారి ఖాతాలోనే పింఛన్ సొమ్ము పడుతుంది కాబట్టి లబ్ధిదారులు రూపేకార్డు/ఏటీఎం కార్డులతో ఎప్పుడైనా సొమ్మును డ్రా చేసుకునే వీలుంటుంది. కాగా చాలా మంది లబ్ధిదారులకు ఇప్పటికీ ఏటీఎంల వినియోగంపై సరైన అవగాహన లేదు. దీనికితోడు మార్కెట్లో రూపేకార్డులను ఉపయోగించి వస్తువులను ఎలా కొనుగోలు చేయాలో తెలియదు. ఈ కారణంగా చాలా వరకు మోసపోయే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం
కర్నూలు (టౌన్): అంతర్జాతీయ విభిన్న ప్రతిభ వంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, వయోజన విద్య డిప్యూటీ డైరక్టర్, వికలాంగుల సంక్షేమ శాఖ అడిషనల్ డైరక్టర్ భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ మాట్లాడుతూ ఈ ఆటల పోటీలలో మొదటి స్థానం గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వారు శారీరక విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకి ల్ పోటీలను జెండాఊపి ప్రారంభించారు. -
దుభారం
గ్రామీణాభివృద్ధి శాఖకు అద్దె వాహనాలే ముద్దట తిరిగేది ఏడు మండలాల్లోనే... పరిధి తగ్గినా మారని అధికారుల తీరు వాహనం ఖర్చు నెలకు రూ.50 వేలు ఇద్దరు అధికారుల ఖర్చు ఒక్కరికే... వాహనం కోసం ప్రత్యేక అనుమతులు డీఆర్డీఏకు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా సుమో వాహనాలను ఇచ్చింది. టాటా సుమో అవసరం ఉన్నా ఇతర శాఖకు అప్పగించారు. మరో వాహనాన్ని మరమ్మతుల పేరిట షెడ్డుకు పరిమితం చేశారు. కేటారుుంచిన రెండు వాహనాలను ఇలా చేసి భారీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీనికి నెలకు రూ.50 వేలు వెచ్చిస్తున్నారు. వరంగల్ : పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. అన్ని శాఖల కార్యాలయాల పరిధి భారీగా తగ్గింది. అధికారుల పని భారం కూడా తగ్గింది. జిల్లా స్థారుు అధికారుల పరిధి తగ్గడంతో రవాణా ఖర్చులు తగ్గాలి. కానీ గ్రామీణాభివృద్ధి శాఖలో దీనికివిరుద్ధమైన పరిస్థితి నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధి చాలా తక్కువ. తగ్గిన పరిధి మేరకు రవాణా ఖర్చులు తగ్గాల్సి ఉండగా అలా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇద్దరు జిల్లా అధికారుల రవాణా ఖర్చులు ఒక్క అధికారే చేస్తుండటం ఈ శాఖ ఉద్యోగుల్లోనూ చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ వాహనాలు ఉన్నా అద్దె వాహనాల కోసం నిధులు వెచ్చిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు పెరుగుతున్నారుు. ‘అద్దె’ కోసం అడ్డదారులు..! గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ)కు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా సుమో వాహనాలను ఇచ్చింది. టాటా సుమో వాహనం అవసరం ఉన్నా ఇతర శాఖకు అప్పగించారు. మరో వాహనాన్ని మరమ్మతుల పేరిట షెడ్డుకు పరిమితం చేశారు. కేటారుుంచిన రెండు వాహనాలను ఇలా చేసి భారీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం డీఆర్డీఏ వినియోగిస్తున్న అధికారి వాహనం అద్దె నెలకు రూ.24 వేలు. డీజిల్ ఖర్చులకు మరో రూ.20 వేలు, డ్రైవరు వేతనం రూ.6 వేలు... అన్ని కలిపి నెలకు రూ.50 వేలు ఉంటోంది. జిల్లా స్థారుు అధికారి వాహన నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.24 కేటారుుస్తోంది. వాహనం అద్దెకు ఇచ్చిన వారే 2,500 కిలో మీటర్లు ప్రయాణించే వరకు డీజిల్ భారాన్ని భరించాల్సి ఉంటుంది. డీఆర్డీఏ పీడీ వినియోగిస్తున్న వాహనం నిర్వహణ కోసం ప్రతి నెల ఏకంగా రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పరిధి తగ్గినా... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధి 50 మండలాలు ఉండేది. మహిళా సంఘాల పనితీరు, సంక్షేమం వంటి ఎన్నో అంశాలు ఉండేవి. వరంగల్ అర్బన్ జిల్లాల్లోని ఏడు మండలాల్లో మాత్రమే గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలు ఉంటారుు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ధర్మసారగ్, వేలేరు, ఐనవోలు మండలాల్లో పూర్తిగా, హసన్‌పర్తిలో కొంత భాగం మాత్రమే డీఆర్డీఏ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతారుు. ఈ శాఖ ఉన్నతాధికారులు మాత్రం 50 మండలాల స్థారుులోనే రవాణా ఖర్చుల కోసం కేటారుుస్తున్నారని విమర్శలు ఉన్నారుు. సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాలను వినియోగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు. -
11న డీఆర్డీఏ జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): డీఆర్డీఏ–ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. రాక్సా అకాడమీలో సెక్యూరిటీ గార్డు పోస్టుకు ఎంపిక నిర్వహిస్తామన్నారు. వీరికి మూడు నెలల పాటు అనంతపురంలో శిక్షణ ఇస్తారని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 08518–277499, 8522083879, 8341581022, 9177016174 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఇంటి బాట
డీఆర్డీఏలో 151 మంది ఉద్యోగుల తొలగింపు బడ్జెట్ ఉన్నా 8 నెలల వేతనాలు ఇవ్వని వైనం అడిగితే వర్మీకంపోస్ట్‌తో ముడి లబోదిబోమంటున్న ఉద్యోగులు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ ఇది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు ఊరూరా చేసిన నినాదం. బాబొచ్చారు.. మరి జాబులొచ్చాయా అంటే అలాంటిదేమీ లేదు. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ)లో తొమ్మిదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడంతో వారు లబోదిబోమంటున్నారు. అనంతపురం టౌన్ : గ్రామీణాభివృద్ధి శాఖలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో సుస్థిర వ్యవసాయం (సీఎంఎస్ఏ) కార్యక్రమం నడుస్తోంది. రైతులందరినీ ఒకటి చేసి విత్తనశుద్ధి, చీడపీడల నివారణ, కషాయాల తయారీ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్ యాక్టివిస్ట్ (సీఏ), విలేజ్ యాక్టివిస్ట్ (వీఏ)లను నియమించారు. గతంలో మొత్తం 191 క్లస్టర్లు ఉండేవి. పది క్లస్టర్లు వ్యవసాయశాఖ ఆధీనంలోకి వెళ్లాయి. మిగిలిన వాటిలో ప్రస్తుతం 151 క్లస్టర్లలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో సీఏ చొప్పున 2007 నుంచి పని చేస్తుండేవారు. వీరికి గౌరవ వేతనం కింద రూ.4 వేల చొప్పున ఇస్తుండేవారు. పథకం ఎత్తివేత ఇన్నాళ్లూ సాఫీగా సాగిన సీఎంఎస్ఏ కార్యక్రమాన్ని టీడీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. వ్యవసాయ శాఖ కూడా ఇవే కార్యకలాపాలను కొనసాగిస్తోందన్న కారణాన్ని చూపుతూ గత ఏడాదే సీఏల తొలగింపునకు రంగం సిద్ధం చేసినా.. నిర్ణయాన్ని చివరి క్షణంలో విరమించుకుంది. అయితే.. గత నెలాఖరులో అందరినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 1050 మంది వీఏలు ఉండేవారు. వీరిని మూడేళ్ల క్రితమే ఇంటికి పంపారు. సీఎంఎస్ఏ కార్యక్రమానికి నిధులు రావాలంటే సెర్ప్ అధికారులు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం)కు ప్రతిపాదనలు పంపాలి. గతేడాది పంపగా అక్కడి నుంచి బడ్జెట్ రావడంతో ఉద్యోగులను కొనసాగించారు. ఈ ఏడాది మాత్రం సెర్ప్ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయంటూ చేతులెత్తేసింది. అక్టోబర్‌కు ప్రోగ్రాంను ఎత్తివేసింది. వేతనాలకు, 'వర్మీ'కి ముడి ఉద్యోగులకు ఎనిమిది నెలల నుంచి వేతనాలు రావడం లేదు. డీఆర్డీఏ అధికారులను అడిగితే వర్మీకంపోస్ట్‌తో ముడిపెడుతున్నారు. ఒక్కో సీఏ 25 వర్మీకంపోస్ట్ యూనిట్ల నిర్మాణం పూర్తి చేసినట్లు సంబంధించి ఏపీఎంలు నివేదికలు ఇస్తేనే వేతనాలు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి వర్మీకంపోస్ట్ యూనిట్లను డ్వామా, డీఆర్డీఏ అధికారులు సమన్వయంతో చేపట్టాలి. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి. వాటిని పట్టించుకోని అధికారులు ఇలా వేధించడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని డీఆర్డీఏ పీడీ దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం కొందరు సీఏలు కార్యాలయానికి రాగా..ఆయన అందుబాటులో లేరు. దీంతో వారు సాయంత్రం వరకు నిరీక్షించి వెనుదిరిగారు. ఉద్యోగాలంటే ఇప్పుడు సాధ్యమా? 2007లో ఉద్యోగంలో చేరా. ఇప్పుడు ఉన్నట్టుండి ఉద్యోగాల్లోంచి తీసేస్తే ఎలా? ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందన్నారు. ఇలా తీసేయడం భావ్యం కాదు. – చెన్నమ్మ, సీఏ, కరుట్లపల్లి క్లస్టర్, కూడేరు మండలం మాకు న్యాయం చేయాలి ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని ఉన్నాం. ప్రోగ్రాంను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల్లోంచి తొలగించడం సరికాదు. వేతనాలు కూడా ఎనిమిది నెలలవి రావాలి. ఇంత అన్యాయంగా చేస్తే ఎలా? – లక్ష్మినారాయణ, సీఏ, జిల్లిపల్లి, కూడేరు మండలం బడ్జెట్ ఉన్నా వేతనాలు ఇవ్వడం లేదు మాకు ఏప్రిల్ నుంచి వేతనాలు రావాలి. బడ్జెట్ కూడా ఉంది. అడిగితే వర్మీకంపోస్ట్ యూనిట్లు పూర్తి చేయాలని అంటున్నారు. దానికి బిల్లులు డ్వామా అధికారులు చేస్తారు. మేం రైతులకు అవగాహన కల్పించాం. పూర్తి చేయాలని కోరుతున్నా బిల్లులు రావని వాళ్లే ముందుకురావడం లేదు. దీనికి మేం బాధ్యులమా? మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – యువరాజు, సీఏ, ముట్టాల, ఆత్మకూరు మండలం -
జాబ్‌మేళాలో 20 మంది ఎంపిక
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు జనరేషన్ మిషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాలో 20 మంది ఎంపికయ్యారని డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మెడ్‌ప్లస్ కంపెనీలో కస్టమర్ సేల్ అసోసియేట్, ఫార్మసిస్టు తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. ఈ ఎంపికలకు 50 మంది హాజరు కాగా వారిలో ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎంపిక చేశారని వివరించారు. ఎంపికైన వారు ఈనెల 8న బెంగుళూరులోని మెడ్‌ప్లస్ కంపెనీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతిని«ధులు, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ రెండు శాఖలకు ఒక్కరే..
డీఆర్డీఏ, డ్వామా విలీనం డీఆర్డీఓగా నామకరణం సహాయకులుగా ఇద్దరు డీఆర్డీఓలు దసరా నుంచి అమల్లోకి.. నల్లగొండ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఈ రెండు శాఖలు విలీనం చేశారు. ఒకే స్వరూపం కలిగిన శాఖలను విలీనం చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా తొలుత ఈ రెండు శాఖల్లో విలీన ప్రక్రియ ప్రార ంభించారు. డీఆర్డీఏ, డ్వామాను కలిపి కొత్తగా ‘డీఆర్డీఓ’ (జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం)గా నామకరణం చేశారు. కార్యాలయం చివరన ఉండే ‘సంస్థ’ అనే పదాన్ని తొలగించి ‘ఆఫీస్’ అనే పదం చేర్చారు. కొత్తగా ఏర్పాటయ్యే డీఆర్డీఓ కార్యాలయ సేవలు దసరా నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్యాలయాన్ని ఇప్పుడున్న డ్వామా ¿¶ వనం నుంచే కొనసాగిస్తారు. ఇప్పటి వరకు రెండు శాఖలకు కలిపి ఇద్దరు పీడీలు ఉండగా ఇక నుంచి ఒక్కరే డీఆర్డీఓగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న అధికారిని డీఆర్డీఓగా నియమిస్తారు. డ్వామా పీడీని కొత్త జిల్లాకు పంపిస్తారు. డీఆర్డీఓకు సహాయకులుగా ఇద్దరు అదనపు డీఆర్డీఓలు ఉంటారు. వీరిలో ఒకరు ఉపాధి హామీ పథకానికి, మరొకరు ఐకేపీ పథకాలకు సమన్వయ కర్తలుగా పనిచేస్తారు. ఐకేపీ, ఉపాధి ఉద్యోగులు ఒకే దగ్గర కలిసి పనిచేసినప్పటికీ ఉద్యోగుల పని విషయాల్లో కానీ, వారి సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. -
జిల్లాలో వెయ్యి మినీడెయిరీల ఏర్పాటుకు చర్యలు
చిప్పగిరి : జిల్లాలో రూ.35 కోట్లతో వెయ్యి మినీ డెయిరీలను ఏర్పాటు చేసేందుకు ప్రాణాళికలు సిద్ధం చేసినట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ చెప్పారు. శనివారం ఆయన చిప్పగిరిలోని వెలుగు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ S జిల్లాలో 9.80 లక్షల మందిని చంద్రన్నబీమా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో లక్ష మంది మహిళలకు జీవనోపాధుల నిమిత్తం (బర్రెలు, పొట్టేళ్లు తదితర వాటిపై) రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీరో ఖాతాను మండలంలోని ఎంతమంది పొదుపుమహిళలు ఓపెన్ చేశారని పీడీ ఆరాతీశారు. రూ.100తో అకౌంట్ తెరుస్తున్నట్లు మహిళా మండల అధ్యక్షురాలు అనంతమ్మ పీడీకి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్లి బ్యాంకర్లు జీరో అకౌంట్లు తెరిచేలా చూస్తానన్నారు. జీరో ఖాతాలు ఉంటే చంద్రన్న బీమా డబ్బులు రావన్నది అపోహ మాత్రమేనని చెప్పారు. పీడీ వెంట స్త్రీనిధి ఏజీఎం మురళీకష్ణ, పత్తికొండ ఏరియా కో–ఆర్డినేటర్ సురేష్, ఏపీఎం నాగార్జున, సీసీ ఉమాపతి ఉన్నారు. -
జిల్లాలో వెయ్యి మినీ డెయిరీల ఏర్పాటు
– పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ బనగానపల్లె రూరల్: జిల్లాలో వెయ్యి మినీ డెయిరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని పాతపాడు గ్రామంలో డ్వాక్రా మహిళతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలదిగుబడిని పెంచేందుకు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో మినీ డెయిరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్క మహిళా రైతుకు ఐదు గేదెల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం కింద పశువుల హాస్టల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గేదెల కొనుగోలుకు ఆసక్తి ఉన్న మహిళలు 25 శాతం వాటా చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డీఆర్డీఎ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. మాదసుపల్లె, పాతపాడు గ్రామాల్లో పశువుల హాస్టల్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను వారు పరిశీలించారు. డీఆర్డీఏ ఏపీవో డాక్టర్ అచ్చన్న, తహసీల్దార్ అనురాధ, ఈవోఆర్డీ నాగేశ్వరరెడ్డి, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రీను, గ్రామ సర్పంచ్ పాపారాయుడు తదితర వెలుగు సీసీలు పాల్గొన్నారు. -
అక్రమాల ‘వెలుగు’
► ఎక్కడికక్కడ నిధులు స్వాహా ► విచారణ పేరుతో నామమాత్రపు చర్యలు ► రికవరీ చేయకుండానే ‘బేరం’పెట్టి పోస్టింగ్ ► కొత్త స్థానంలోనూ మారని అక్రమార్కుల పంథా అనంతపురం టౌన్ : ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’.. ఈ ఫార్ములాని అక్షరాలా పాటిస్తున్నారు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ–వెలుగు అధికారులు. మహిళా సంఘాల సొమ్మును కింది స్థాయి ఉద్యోగులు అప్పనంగా దిగమింగుతుంటే ఉన్నతాధికారులు ‘చేతివాటం’ ప్రదర్శించి వత్తాసు పలుకుతున్నారు. ఈ క్రమంలో స్వాహా చేసిన సొమ్ము పూర్తిస్థాయిలో రికవరీ కాకపోగా రాజకీయ అండతో మళ్లీ విధుల్లో చేరుతున్న అవినీతిపరులు తమ దోపిడీనే యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కమ్యూనిటీ కో ఆర్డినేటర్ల (సీసీ)ల అవినీతికి అడ్డే లేకుండాపోతోంది. ఈ సమయంలో డీఆర్డీఏలోని ఓ అధికారి అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం కోసం ‘బేరాలు’ పెడుతున్నట్లు సమాచారం. అక్రమార్కులకే అందలం : ఏ శాఖలోనైనా ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కొత్తచెరువు మండలం లోచర్ల పంచాయతీ పరిధిలో వెలుగు సీసీ రామాంజులు 278 మంది పింఛన్‌దారుల నుంచి రూ.100 చొప్పున రూ.27,800 వసూలు చేశారు. విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. ఇతను బుక్కపట్నం మండలంలో పని చేసే సమయంలో బినామీ పేర్లతో గ్రామైక్య సంఘం ఏర్పాటు చేసి రూ.23 లక్షలు స్వాహా చేసిన వైనం అప్పట్లో విచారణలో కూడా తేలింది. అయినా కఠిన చర్యలు తీసుకోని అధికారులు నెల రోజులకే రొద్దం మండలానికి పోస్టింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి నెల రోజుల్లోనే మళ్లీ కొత్తచెరువుకు బదిలీ చేయించుకున్న అతను పింఛన్ల సొమ్మును దిగమింగి సస్పెన్షన్‌కు గురయ్యాడు. కూడేరులో స్త్రీ నిధి రుణాల మంజూరులో చేతివాటం ప్రదర్శించినట్లు ఫిర్యాదులు రావడంతో సీసీ నారాయణస్వామిపై విచారణ చేసి సస్పెండ్ చేశారు. ఈయన బుక్కరాయసముద్రంలో పని చేస్తుండగా అవినీతికి పాల్పడ్డాడని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే కనగానపల్లి మండలానికి పోస్టింగ్ ఇచ్చారు. అయితే అక్కడా ఇమడలేక ముడుపులు ఇచ్చుకుని కూడేరుకు వేయించుకున్నాడు. తాజాగా ఇక్కడ కూడా నిధులు స్వాహా చేయడంతో సస్పెండ్ చేయగా మళ్లీ పోస్టింగ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. డీఆర్డీఏ కార్యాలయంలోని ఓ అధికారి సాయంతో ఇప్పటికే పోస్టింగ్ ఆర్డర్ కూడా సిద్ధం చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే మండలం జయపురం గ్రామంలో స్త్రీ నిధి డబ్బులు కాజేశారని ఓ సీసీపై పీడీకి ఫిర్యాదు అందింది. మూడేళ్ల క్రితం రూ.30 వేలు తీసుకుని అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై డీపీఎంలు నరసయ్య, రవీంద్రబాబు విచారణ చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో ఇదే మండలంలో సీసీగా పని చేస్తున్న వ్యక్తి ఇప్పుడు బ్రహ్మసముద్రం మండలంలో పని చేస్తున్నాడు. అప్పట్లో మహిళా సంఘానికి వచ్చిన రుణాలను సంఘం ఖాతాలోకి వేయకుండా సభ్యుల ఖాతాలోకి వేయడంలో సదరు సీసీ కీలకపాత్ర వహించాడు. ఈ క్రమంలో నిధులు స్వాహా చేశాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చినా రికవరీ మాత్రం చేయలేదు. ఇటీవల జరిగిన మండల సమాఖ్య సమావేశంలో సభ్యులు ‘రికవరీ’ విషయాన్ని ప్రస్తావించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇక తాడిమర్రి మండలంలోని ఓ సీసీ బ్యాంక్ లింకేజ్‌కు సంబంధించి నిధులు స్వాహా చేశాడు. అయినా కఠిన చర్యల్లేవ్. పెనుకొండ మండలం గుట్లూరుకు చెందిన సీసీ అనిత రూ.40 లక్షల వరకు స్వాహా చేశారని తేలడంతో సస్పెండ్‌కు గురయ్యారు. అయితే రికవరీ మాత్రం నామమాత్రంగానే ఉంది. వీరు మాత్రమే కాదు.. ఉరవకొండ, కళ్యాణదుర్గం, శెట్టూరు, ధర్మవరం, వజ్రకరూరు, బుక్కరాయసముద్రం, గుత్తి, బుక్కపట్నం మండలాల్లో స్త్రీనిధికి సంబంధించి మోసాలు అనేకం ‘వెలుగు’లోకి వచ్చినా విచారణ పేరుతో పక్కదారి పట్టించారే గానీ కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం సస్సెన్షన్‌లో ఉన్న సిబ్బంది ఎలాగైనా పోస్టింగ్‌లు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తుండగా మరికొందరు ‘ముడుపులు’ అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డీఆర్డీఏ, ఏపీఎంఐపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదు. కొందరు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేశాం. కొందరిని వారి పనితీరు ఆధారంగా దూరప్రాంతాలకు బదిలీ చేశాం. డబ్బులు స్వాహా చేస్తున్న వారి విషయంలో రాజీ పడేది లేదు. – వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ–వెలుగు పీడీ -
కొండపల్లి బొమ్మల పరిశ్రమకు రూ.1.75 కోట్లు
ఇబ్రహీంపట్నం : కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమ కళాకారుల అభ్యున్నతి కోసం కేంద్రం ప్రభుత్వం రూ.1.75కోట్లు విడుదల చేసిందని డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖర్‌రాజు తెలిపారు. కొండపల్లి గ్రామంలో బొమ్మలు తయారు చేసే కళాకారులతో డీఆర్డీఏ ఆధ్వర్యాన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల తయారీదారులను ఒక సొసైటీగా ఏర్పాటు చేసి డీఆర్డీఏ, లేపాక్షి, టాటా ట్రస్ట్ ద్వారా ముడిసరుకు అందజేస్తామన్నారు. బొమ్మల నాణ్యత, ఆన్లైన్ మార్కెటింగ్‌లో అమ్మకాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్ ప్రతినిధి సోహిని, మండల ఏపీఎం కృష్ణంరాజు, క్లస్టర్ కో–ఆర్డినేటర్ రుక్మిణి పాల్గొన్నారు. -
మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వాలి
మోత్కూరు : సంఘం బంధం తీర్మానాలతోనే స్వయం సహాయక పొదుపు మహిళా గ్రూపులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.అంజయ్య అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మోత్కూరు, ఆత్మకూరు, గుండాల మండలాల స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేజ్ బుక్‌కీపర్సు రుణా మంజూరులో చేతివాటం ప్రదర్శించడం , అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో మహిళా సంఘాలకు సంఘబంధం చేసిన తీర్మానాలతోనే రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. అనాజిపురంసంఘం బంధంలో అవకతవకలు జరిగాయని.. మూడు నెలలుగా సుమారు రూ.70 లక్షలు రుణ బకాయిలు చెల్లించడంలేదని గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రమేష్‌కుమార్, పీడీ దృష్టికి తీసుకెళ్లారు. వారంలోగా మూడోవిడత పంట రుణాలు.. మూడోవిడత పంట రుణాలను వారంలోగా రైతులకు పంపిణీ చేస్తామని లీడ్‌బ్యాంక్ మేనేజర్ సూర్యం లె లిపారు. 12.5 శాతం నిధులను ప్రభుత్వం విడుదలచేసిందని చెప్పారు. కౌలు రైతులకు పంట రుణాలను మంజూరుచేసే విషయంంలో బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జి.దశరథ, ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, స్వయం ఉపాధికల్పన శిక్షణ సంస్థ జిల్లా అధికారి రాజశేఖర్ ఐకేపీ బ్యాంక్ లేకేజీ డీపీఎం రామకృష్ణ, ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్, క్లస్టర్ ఏపీఎం సుధారాణి, ఏపీఎంలు వెంకటేశ్వర్లు, పక్కీరయ్య, ఆనంద్, మండల వ్యవసాయాధికారి కె.స్వప్న, మండల పశువైద్యాధికారి పి.అశోక్‌కుమార్, ఈఓఆర్డీ జి.సుజాత, బ్యాంక్ మేనేజర్లు రాజు, రమేష్‌కుమార్ వివిధ శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. -
మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వాలి
మోత్కూరు : సంఘం బంధం తీర్మానాలతోనే స్వయం సహాయక పొదుపు మహిళా గ్రూపులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.అంజయ్య అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మోత్కూరు, ఆత్మకూరు, గుండాల మండలాల స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేజ్ బుక్‌కీపర్సు రుణా మంజూరులో చేతివాటం ప్రదర్శించడం , అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో మహిళా సంఘాలకు సంఘబంధం చేసిన తీర్మానాలతోనే రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. అనాజిపురంసంఘం బంధంలో అవకతవకలు జరిగాయని.. మూడు నెలలుగా సుమారు రూ.70 లక్షలు రుణ బకాయిలు చెల్లించడంలేదని గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రమేష్‌కుమార్, పీడీ దృష్టికి తీసుకెళ్లారు. వారంలోగా మూడోవిడత పంట రుణాలు.. మూడోవిడత పంట రుణాలను వారంలోగా రైతులకు పంపిణీ చేస్తామని లీడ్‌బ్యాంక్ మేనేజర్ సూర్యం లె లిపారు. 12.5 శాతం నిధులను ప్రభుత్వం విడుదలచేసిందని చెప్పారు. కౌలు రైతులకు పంట రుణాలను మంజూరుచేసే విషయంంలో బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జి.దశరథ, ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, స్వయం ఉపాధికల్పన శిక్షణ సంస్థ జిల్లా అధికారి రాజశేఖర్ ఐకేపీ బ్యాంక్ లేకేజీ డీపీఎం రామకృష్ణ, ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్, క్లస్టర్ ఏపీఎం సుధారాణి, ఏపీఎంలు వెంకటేశ్వర్లు, పక్కీరయ్య, ఆనంద్, మండల వ్యవసాయాధికారి కె.స్వప్న, మండల పశువైద్యాధికారి పి.అశోక్‌కుమార్, ఈఓఆర్డీ జి.సుజాత, బ్యాంక్ మేనేజర్లు రాజు, రమేష్‌కుమార్ వివిధ శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. -
10న డీఆర్డీఏ జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): డీఆర్డీఏ–వెలుగు ఆధ్వర్యంలో ట్రై నీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉద్యోగాల భర్తీకోసం ఈ నెల 10వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు రాయలసీమ యూనివర్సిటీలో ఎంపికలు జరుగుతాయి. వివిలెక్స్ టెక్నాలజీస్, బెంగళూరు వారు ఎస్‌ఎల్‌కే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తారు. బీఎస్సీ(మ్యాథ్స్), బీసీఏ, బీకాం అభ్యర్థులు అర్హులు. ఆన్లైన్ ఆప్టిట్యూట్ టెస్ట్, హెచ్ఆర్, టెక్నికల్ రౌండ్ ద్వారా ఎంపిక ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అంశాల్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ నుంచి http://goo.gl/forms/FJEROjflpz లో తమ జీమెయిల్ అకౌంట్ ద్వారా పూర్తి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలపాటు సాఫ్ట్వేర్ టెస్టింగ్‌లో శిక్షణ ఇస్తారు. మూడేళ్ల కాలానికి గ్యారంటీ బాండ్ రాసివ్వాల్సి ఉంటుంది. వార్షిక వేతనం రూ.2.1 లక్షలుగా నిర్ణయించారు. వివరాలకు ఫోన్(08105005202, 076775926666)లో సంప్రదించవచ్చు. -
గుట్టు చప్పుడు కాకుండా లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష
కర్నూలు (అగ్రికల్చర్): భూమి రికార్డులు, సర్వే విభాగ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష నిర్వహించారు. ఆదివారం కర్నూలు సమీపంలోని డీఆర్డీఏ శిక్షణా కేంద్రంలో 53 మంది లైసెన్స్‌డే సర్వేయర్లకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు, అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున మామూళ్లు వసూలు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా బయటికి పొక్కకుండా గోప్యంగా పరీక్షలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కూడా ఓసారి గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
రేపు జాబ్ మేళా
అనంతపురం: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని రాప్తాడు రోడ్డులో ఉన్న టీటీడీసీలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, అర్హులు బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని పేర్కొన్నారు. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేయడానికి ఏఎన్ఎం, జీఎన్ఎంలకు ఇంటర్ విద్యార్హత ఉండాలన్నారు. యువతులను మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. చిత్తూరులోని మొబైల్ కంపెనీలో ఉద్యోగాల కోసం 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువతులు అర్హులన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి ఉండాలన్నారు. ఇదే జిల్లాలో వినూత్న ఫర్టిలైజర్స్ సేల్స్‌మన్ కోసం ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. బెంగళూరులోని మెడ్‌ప్లస్ కంపెనీలో పనిచేయడానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు అర్హులన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలన్నారు. ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభమవుతుందన్నారు. -
20న జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈజీఎంఎం కౌన్సెలింగ్ సెంటర్లో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌నాయక్ గురువారం ప్రకటనలో తెలిపారు. దివ్యశ్రీ రియల్టార్స్ కంపనీలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్, టీం లీడర్స్ ఉద్యోగాల కోసం మేళ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తివివరాల కోసం 9533856394 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. -
పుష్కర ఘాట్లను పరిశీలించిన డీఆర్డీఏ పీడీ
మట్టపల్లి (మఠంపల్లి) : ఈనెల 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని పుష్కరాల స్పెషల్ ఆఫీసర్, డీఆర్డీఏ పీడీ అంజయ్య పేర్కొన్నారు. మండలంలోని మట్టపల్లి వద్ద నిర్మించిన పుష్కరఘాట్లను ఆయన సోమవారం సందర్శించారు. అనంతరం స్థానిక ఎన్సీఎల్ పరిశ్రమ అతిథిగృహంలో పుష్కర ఘాట్ల ఇన్చార్జి, అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సౌకర్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులకు ఏ ఒక్క ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డీఎస్ఓ అమృతారెడ్డి, టీసీఓ సాయప్ప, జిల్లా రిజిష్ట్రార్ వాసుదేవరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజశేఖర్, డీఎల్పీఓ రామ్మోహన్‌రాజు, తహసీల్దార్ యాదగిరి, ఈఓపీఆర్డీ జానకిరాములు, పంచాయతీ కార్యదర్శులు గురవయ్య, గిరిజాకుమారి, శ్రీవిద్య, సుధాకర్, నాగేశ్వరరావునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు డీఆర్డీఏ జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను డీఆర్డీఏ–ఈజీఎం జాబ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో జాబ్‌మేళా ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ నుంచి పీజీ వరకు చదివి ఉండి, 19 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. వివిధ కంపెనీలు, సంస్థల్లో వివిధ కేడర్లలో ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. అభ్యర్థులు వారి విద్యార్హత సర్టిఫికెట్, జిరాక్స్ కాపీలు, ఆధార్‌కార్డులతో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. వివరాలకు కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని డీఆర్డీఏ–ఈజీఎం కార్యాలయంలో సంప్రదించాలని, లేదా 08518–277499, 9014296452, 9705171923 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
డీఆర్డీఏ డీలా
= గాడితప్పిన పాలన = ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు = 21 నెలలుగా డీఆర్డీఏకు ఇన్చార్జ్ పీడీలే దిక్కు = నేడు సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్ రాక అనంతపురం టౌన్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగులో క్షేత్రస్థాయి నుంచి పరిపాలన గాడితప్పింది. సుమారు రెండేళ్లుగా ఇక్కడ ఇన్‌చార్‌్జల పాలనే కొనసాగుతోంది. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం.. వచ్చిన వాళ్లు తమ స్వలాభం కోసం పని చేసుకుంటూ వెళ్లిపోతుండటంతో వ్యవస్థలో మార్పు రావడం లేదు. 2014 నవంబర్ 22 నుంచి డీఆర్డీఏ–వెలుగుకు పూర్తి స్థాయి పీడీ అందుబాటులో లేరు. గత ఏడాది మే నుంచి వెంకటేశ్వర్లు ఇన్‌చార్‌్జగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు పౌరసరఫరాల శాఖ డీఎంగా ఉన్న వెంకటేశం, డీఆర్డీఏలో ఏపీడీగా ఉన్న మల్లీశ్వరి ఇన్‌చార్‌్జగా ఉన్నారు. పైగా రెండు ఏపీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరికి ఇష్టం వచ్చినట్లు విధి నిర్వహణ సాగిస్తున్నారు. ప్రస్తుతం పీడీగా ఉన్న వెంకటేశ్వర్లు ఏపీఎంఐపీగా పూర్తిస్థాయి పీడీగా ఉన్నారు. ఫలితంగా డీఆర్‌డీఐపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు. దీన్ని సాకుగా చేసుకుని కొందరు అధికారులు గ్రూపు రాజకీయాలు నడుపుతూ జిల్లా కేంద్రంలో పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. ఉన్నతాధికారుల పాత్ర కూడా ఇందులో ఉండటంతోనే పత్రికల్లో వచ్చినా ఎవరూ స్పందించలేదన్న విమర్శలొచ్చాయి. ఇక గ్రూపు రాజకీయాలకూ ఇక్కడ కొదవలేదు. సాక్షాత్తూ ఉన్నతాధికారులే కొంత మందిని పెంచి పోషిస్తుండటంతో కొందరు ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల జీతాలకు సంబంధించి కూడా విమర్శలు వచ్చాయి. బడ్జెట్ విడుదలైనా ట్రెజరీలో బిల్లులు చెల్లించడానికి ఓ అధికారి నిర్లక్ష్యం చేయడంతో మూడు నెలల పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉన్నతాధికారి కూడా పూర్థి స్థాయిలో కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంతో సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఎప్పుడు విధులకు వస్తారో.. ఎప్పుడు లేదో కూడా తెలీని పరిస్థితి. ఈ నేపథ్యంలో సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్ సోమవారం జిల్లాకు రానున్నారు. సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటి సారిగా ఇక్కడకు వస్తుండటంతో కొందరు ఉద్యోగులు సైతం తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా సీఈఓ ప్రత్యేక దృష్టి పెడితేనే ఇక్కడ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. -
అనంతలో రేపు జాబ్‌మేళా
అనంతపురం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 30 జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరులోని మొబైల్ కంపెనీలో పని చేయడానికి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. వేతనం రూ.9,500 ఉంటుందని, 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న యువతులు మేళాకు హాజరు కావాలన్నారు. బెంగళూరులోని ఐటీసీ, స్నయిడర్, బిగ్ బాస్కెట్ సంస్థల్లో పని చేయడానికి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న పురుషులకు నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం శివారులోని టీటీడీసీలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామని, ఇతర వివరాలకు 08554–271122 నంబర్లో సంప్రదించాలన్నారు. అభ్యర్థులు బయోడేటా ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. -
జీతాల గోల
– డీఆర్డీఏలో మూడు నెలలుగా అందని వేతనాలు – ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు – పట్టించుకోని ఉన్నతాధికారులు అనంతపురం టౌన్ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లోని ఉద్యోగుల పరిస్థితి. జీతాల కోసం బడ్జెట్ విడుదలైనా ఖాతాల్లో జమ కాకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి Ðð ళ్తే.. డీఆర్డీఏలో ఈఓఆర్డీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఓ, సూపరింటెండెంట్, డ్రైవర్లు, అటెండర్లు, స్వీపర్లు ఇలా అన్ని క్యాడర్లు కలిపి సుమారు 27 మంది వరకు ఉన్నారు. వీరందరూ మూడు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. స్కూళ్లు ప్రారంభమైన వేళ కొందరు అప్పులు చేసి పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకున్న దయనీయ స్థితి. రెండు నెలల కిందట జీతాల కోసం సెర్ప్ నుంచి బడ్జెట్ విడుదలైంది. ఓ దఫా రూ.22 లక్షలు, మరో దఫా రూ.15.50 లక్షల వరకు వచ్చింది. అయితే జీతాలకు సంబంధించి ట్రెజరీకి బిల్లు పెట్టే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ట్రెజరీకి వెళ్లాల్సిన సంబంధిత అధికారి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్రూపు తగాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కీలక అధికారికి సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగి ట్రెజరీకి వెళ్లే విషయంలో అనాసక్తి చూపుతున్నట్లు తెలిసింది. గతంలో కలెక్టర్ కోన శశిధర్ చొరవ తీసుకోవడంతోనే జీతాల సమస్య పరిష్కారమైనట్లు సమాచారం. గాడితప్పిన ఈ వ్యవహారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. –––––– రెండు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.. ఉద్యోగులకు మే, జూన్ నెల జీతం పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ట్రెజరీకి బిల్లు పెట్టాం. అక్కడి అధికారులతో నేనే స్వయంగా మాట్లాడాను. రూ.22 లక్షలకు ఒకే అయింది. మిగతాది కూడా అవుతుంది. రెండు, మూడ్రోజుల్లో జీతాలు అందుతాయి. – వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ–వెలుగు పీడీ -
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి, వెలుగు, కడప ఎంప్లాయ్మెంట్ జనరేషన్మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు శిక్షణతో నిమిత్తం లేకుండా నేరుగా ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కడపలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనిడీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిట్టర్ ఉద్యోగానికి సంబంధించి 50 ఖాళీలు ఉన్నాయని, ఇందుకు ఐటీఐ/ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 18–34 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలని, వేతనం నెలకు రూ. 5 వేలు ఉంటుందన్నారు. అలాగే ఫీల్డ్ కో–ఆర్డినేటర్స్ 50 ఖాళీలు ఉన్నాయన్నారు. దీనికి ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ ఉద్యోగానికి 18–34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. నెలకు రూ. 7 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అర్హతలు గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్‌కార్డులు జిరాక్స్ కాపీలను తీసుకుని కడప నగర శివార్లలోని టీటీడీసీలో ఈనెల 23వ తేది ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 96420 72966, 88858 65038 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. -
విభజించు.. పాలించు !
డీఆర్డీఏ వెలుగులో ఓ అధికారి తీరిది రెండు వర్గాలుగా ఉద్యోగులు గాడితప్పుతున్న పాలన అనంతపురం టౌన్ : ఏ శాఖలో అయినా అధికారంటే కింది స్థాయి ఉద్యోగులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సరిచేసుకోవాలని సుతిమెత్తగా చెప్పడం.. ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్‌కు తోడ్పడం పరిపాటే. కానీ అనంతపురం జిల్లా గ్రామీణాభివృద్ధి వెలుగులో ఉన్న ఓ అధికారి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తుండటంతో ఉద్యోగులు రెండు వర్గాలయ్యారు. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో కొందరు అమాయకులు బలవుతుండగా..మరికొందరు మాత్రం మానసిక వ్యథను అనుభవిస్తున్నారు. పైకి చెప్పుకోవడానికి కూడా జంకుతున్న పరిస్థితి. కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు నిత్యం తమ పబ్బం గడుపుకోవడం కోసం లేనిపోని సమస్యలను సృష్టిస్తుంటార న్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారి వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టి తన పరిధిలోని పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన అధికారి మొక్కుబడిగా కార్యాలయానికి వస్తుండటం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఇదే అదునుగా కొందరు ఉద్యోగులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కార్యాలయంలో ఎవరితో ఎవరు మాట్లాడుతుంటారు.. ఎవరు ఎక్కడికెళ్తుంటారన్న సమాచారం ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలంటూ సదరు అధికారి తన ‘గ్యాంగ్’కు పురమాయిస్తుండటంతో వాళ్లు అదే ‘పని’గా భావిస్తూ తమ ప్రాభవాన్ని చాటుకుంటున్నారు. సహజంగా అధికారికి సన్నిహితంగా ఉండే ఉద్యోగుల పట్ల కింది స్థాయి ఉద్యోగులకు కాసింత అసహనం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఇది తారస్థాయికి చేరింది. జిల్లా ఉన్నతాధికారిగా కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేక దృష్టి పెడితే వ్యవస్థలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. లేకుంటే పరువు కాస్తా బజారుపాలు కావాల్సిందేనని అంటున్నారు. డీఆర్డీఏలో హైడ్రామా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగులో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. గత నెలలో కలెక్టర్ సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా చేపట్టిన బదిలీలు కాదని తాజాగా డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు చేపట్టిన బదిలీల ప్రక్రియ వివాదాస్పదమైంది. కొందరు ఏపీఎంలు, సీసీల పనితీరును పక్కకుపెట్టి అయిన వారికి కట్టబెట్టడంలో డీఆర్డీఏ అధికారులు చక్రం తిప్పిన వైనంపై ‘బదిలీల మాయ’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అధికారులు ఉపశమన చర్యలకు దిగారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడి సైతం మొదలైనట్లు తెలిసింది. అనంతపురం రూరల్ పోస్టును తమ వాళ్లకే కట్టబెట్టాలని ఓ మంత్రి అనుచరులు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ అయింది. మొదట అనుకున్నట్టుగానే ఎనిమిదేళ్లపాటు కార్యాలయంలోనే పని చేసిన హరిప్రసాద్‌ను ఇక్కడకు నియమించినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈయన్ను పుట్టపర్తికి బదిలీ చేయగా డీఆర్డీఏలోని ఓ కీలక అధికారి అండదండతో మళ్లీ ఇక్కడికే వచ్చారు. ఇక టీటీడీసీ మేనేజర్ పోస్టుకు సంబంధించి సెర్ప్ సీఈఓకు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. పెనుకొండ నియోజకవర్గంలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని హిందూపురం నియోజకవర్గంలోని ఓ మండలానికి మార్పు చేసినట్లు తెలిసింది. -
వేధింపులు మానుకోవాలి
లేదంటే సామూహిక సెలవులో వెళ్తాం డీఆర్డీఏ పీడీకి ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం హెచ్చరిక హన్మకొండ అర్బన్: డీఆర్డీఏ ఐకేపీలో కొద్ది నెలలుగా పీడీ- ఉద్యోగుల మధ్య చాపకింద నీరుగా సాగుతున్న వేధింపులు ఆరోపణల వ్యవహారం రచ్చకెక్కింది. జిల్లా కార్యాలయంలో ఒకరిద్దరు అధికారుల పెత్తనంతో ఉన్నతాధికారులు సిబ్బందిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఉద్యోగులు పీడీపై అసమ్మతి ప్రకటించారు. తమపై వేధింపులు మానుకోవాలని కోరుతూ ఆయనకు లేఖ ఇచ్చారు. ఈ విషయూన్ని కలెక్టర్, సెర్ప్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని సెర్ప్ ఉద్యోగుల సంఘక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఒకరిద్దరి పెత్తనంపై ఆరోపణలు... కొద్ది నెలల క్రితం ఐకేపీకి ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్లపై వచ్చిన ఉద్యోగులను ఆయా శాఖలకు తిప్పి పంపించారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ఒక మహిళా ఉద్యోగిని మాత్రం మాతృశాఖకు పంపకుండా ఐకేపీలో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. అనుభవజ్ఞులు ఉన్నా సదరు అధికారిణికి ఆ విభాగం ఆప్పగించడం ఏంటనే చర్చ కొనసాగింది. డిప్యూటేషన్‌పై వచ్చిన వారందరినీ తిరిగి పంపించి, ఒకరిద్దరికి మాత్రం మినహారుుంపు ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక పీడీ వద్ద తమ మాటే చెల్లుబాటవుతందని భావించిన కొందరు అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగులను పలుమార్లు వేధించారనే ఆరోపణలు సైతం ఉన్నారుు. దీన్ని పలుమార్లు పీడీ దృష్టి తీసుకొచ్చినా ఆయన స్పందించలేదని ఉద్యోగులు అంటున్నారు. వేధింపులు ఆపకుంటే ఆందోళనే.. ఉద్యోగులపై వేధింపులు మానుకోవాని, వారితో స్నేహపూర్వకంగా పని చేయించుకోవాలని కోరుతూ మంగళవారం ఉద్యోగ సంఘం నాయకులు పీడీకి వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లు అమలు చేయూలని, లేదంటే మూకుమ్మడిగా సెలవు పెట్టి వెళ్తామని స్పష్టం చేశారు. చిన్నచిన్న కారణాలతో క్రమశిక్షణా చర్యలకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి నెల ఉద్యోగులతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు ఇచ్చిన షోకాజు నోటీసులు ఉపసంహరించుకోవాలని, తనిఖీలకు వెళ్లే ముందు మహిళా సంఘాలకు సమాచారం ఇవ్వాలని, ఉద్యోగులకు సాయంత్రం 5 గంటల తర్వాత పని చెప్పకూడదని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, ప్రధాన కార్యదర్శి రాజీర్, మాదారపు రవి, నాయకులు కందుల అనిల్ కుమార్, దయాకర్, సుధాకర్ ఉన్నారు. తప్పు చేసినవారిపైనే చర్యలు : డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి సెర్ప్ ఉద్యోగుల ఫిర్యాదు విషయంపై డీఆర్డీఏ పీడీ వెంటేశ్వర్రెడ్డిని వివరణ కోరగా శాఖలో అధికారులు, ఉద్యోగులు అందరం కలిసి పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని, ఈ క్రమంలో తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకరిద్దరు ఉద్యోగుల వల్ల శాఖకు చెడు పేరు రావడం మంచిది కాదని, అందుకే అలాంటి వారి విషయంలో ఉపేక్షించబోమని తెలిపారు. ఉద్యోగులు చేసిన ఫిర్యాదు విషయం పరిశీలిస్తామని, దీనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. -
జనరిక్.. జాప్యం
ప్రజలకు తక్కువ ధరకు మందులను అందించటం కోసం జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. పెట్టుబడి భారం మాత్రం మండల, పట్టణ సమాఖ్యలపై మోపుతోంది. షాపుల ఏర్పాటులో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సమాఖ్యలు ముందుకు రావటం లేదు. లాభనష్టాలు తామే భరించాల్సి ఉండటంతో వెనకడుగేస్తున్నాయి. మచిలీపట్నం : జిల్లాలో జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా 200 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. జిల్లాలో 15 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఏడు, మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘాల్లో ఎనిమిది ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండల కేంద్రాలైన అవనిగడ్డ, కైకలూరు, బంటుమిల్లి, గన్నవరం, పామర్రు, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు మెప్మా పీడీ హిమబిందు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.100 ఖరీదు చేసే మందుబిళ్లలు జనరిక్ మెడికల్ షాపుల్లో రూ.30కే అందుబాటులోకి వస్తాయి. రాయల్టీ చెల్లించని మందులను ఈ షాపుల్లో అందుబాటులో ఉంచుతారు. పెట్టుబడి భారం సమాఖ్యలపైనే... ఈ షాపుల ఏర్పాటుకు మండల, పట్టణ సమాఖ్యల ఖాతాలో ఉన్న నగదును పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క షాపు ఏర్పాటుకు ఫర్నిచర్, మందుల కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ షాపుల్లో ఫార్మాసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటుచేసి ఒక్కొక్కరికి నెలకు రూ.7 వేలు వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు. ముందుకు రాని సమాఖ్యలు... మండల, పట్టణ సమాఖ్య ద్వారా రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి షాపు తెరిస్తే సిబ్బంది జీతభత్యాలు, షాపు అద్దె, విద్యుత్ బిల్లులు తదితర అంశాల నేపథ్యంలో లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆయా సమాఖ్యలే భరించాలనే షరతు విధించారు. దీంతో జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసేందుకు సమాఖ్యలు ముందుకురావటం లేదు. ఒక్క ఉయ్యూరు పురపాలక సంఘంలోనే మందులు, ఫర్నిచర్ కొనుగోలు చేసి జనరిక్ మెడికల్ షాపును తెరిచేందుకు రంగం సిద్ధం చేశారు. మిగిలిన చోట్ల మండల, పట్టణ సమాఖ్యలతో సంప్రదింపులు జరిపే పనిలో అధికారులు ఉన్నారు. డీఆర్డీఏ ద్వారా ఏడు షాపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆరు షాపులను త్వరలో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్డీఏ చెబుతున్నారు. మెప్మా ద్వారా ఎనిమిది షాపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఉయ్యూరులోనే అంతా సిద్ధమైందని, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ సమాఖ్యల నుంచి దరఖాస్తులు వచ్చాయని మెప్మా పీడీ తెలిపారు. మిగిలిన నాలుగు పురపాలక సంఘాల్లో పట్టణ సమాఖ్యలు, జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించే పనిలో ఉన్నామని ఆమె చెబుతున్నారు. మండల కేంద్రాలు, పురపాలక సంఘాల్లో జనరిక్ మెడికల్ షాపుల కోసం గది అద్దెకు తీసుకోవాలంటే ప్రస్తుతం కనీసం నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు కొంతమేర అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల మధ్య మండల, పట్టణ సమాఖ్యలు ఎంతవరకు ఈ మెడికల్ షాపుల ఏర్పాటుకు ముందుకు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలందరికీ ఉపయోగపడే జనరిక్ మెడికల్ షాపులను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయకుండా ఆ బాధ్యతను మండల, పట్టణ సమాఖ్యలకు అప్పగించటం ద్వారా ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇటీవల ఇసుక రేవుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించి అనంతరం ఈ విధానం బాగోలేదని ప్రభుత్వమే ప్రచారం చేస్తోంది. సమాఖ్యలకు షాపుల నిర్వహణను అప్పగిస్తే ఎంతకాలం పాటు వారు ఈ షాపులను నడుపుతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. -
సారూ.. పింఛన్ మంజూరు చేయరూ..!
డయల్ యువర్ డీఆర్డీఏ పీడీలో వినతి సంగారెడ్డి మున్సిపాలిటీ: సదరెమ్ క్యాంపునకు హాజరైనా తనకు ఇంతవరకు సర్టిఫికెట్ ఇవ్వలేదని కొండపాక మండలం దుద్డెడ గ్రామానికి చెందిన నర్సింగ్ రావు డీఆర్డీఏ పీడీకి విన్నవించుకున్నారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ డీఆర్డీఏ పీడీ కార్యమ్రంలో పీడీ సత్యనారాయణరెడ్డి హాజరుకాకపోవడంతో అసిస్టెంట్ పీడీ వెంకటేశ్వర్లు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మెదక్ మండలం కాజిపల్లికి చెందిన పెంటయ్య మాట్లాడుతూ తమ కుటుంబంలో ఉన్న బీడీ కార్మికులకు జీవనభృతి పింఛన్ అంద డం లేదన్నారు. వితంతు పింఛన్ మంజూరు చేయడంతో పంచాయతీ కార్యదర్శి పక్షపాతం చూపుతున్నాడని కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన సాయిలు ఫిర్యాదు చేశారు. జీవనభృతి పింఛన్ కోసం పీఎఫ్ కార్డుతో దరఖాస్తు చేసినా మంజూరు చేయడం లేదని నంగునూర్ మండలం ఖానాపూర్‌కి చెందిన మల్లయ్య, కొడిపాక మండలం కమ్మంపల్లికి చెందిన నర్సింలు ఫిర్యాదు చేశారు. సదరెమ్ క్యాంపునకు హాజరై సర్టిఫికెట్తో వికలాంగ ఫించన్‌కు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ మంజూరు కాలేదని కొండపాక మండలం ఎర్రపల్లికి చెందిన మల్లయ్య ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో 23 మందికి వితంతు, వృద్ధాప్య పింఛన్లు రాలేదని మెదక్ మండలం సర్థనకు చెందిన రామ్‌చందర్ పేర్కొన్నారు. అభయాస్తం పింఛన్ అందడంలేదని పెద్దశంకరంపేట మండలం వీరోజ్పల్లికి చెందిన రమేష్ ఫిర్యాదు చేశారు. -
‘ఆసరా’పై విజి‘లెన్స్’!
ఆసరా పింఛన్ల గోల్మాల్ వ్యవహారాలపై బాధ్యుల మెడకు ఉచ్చు బిగిసుకుంటోంది. అక్రమాల డొంక కదులుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకం పింఛన్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వస్తుండటంతో విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. బోగస్ పింఛన్లతో రూ.లక్షలు పక్కదారి పట్టాయని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. తాండూరు: తాండూరు మున్సిపాలిటీలో పింఛన్ల గోల్మాల్ వ్యవహారాలపై విజిలెన్స్‌తోపాటు డీఆర్డీఏ కూడా విచారణకు సిద్ధమైంది. గత జూన్‌లో కౌన్సిల్ సాధారణ సమావేశంలో రూ.9 లక్షల పింఛన్లు పక్కదారి పట్టాయని, ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని పదో వార్డు కౌన్సిలర్ సుమిత్‌కుమార్ గౌడ్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మిని కోరారు. గత ఏడాది నవంబర్ నుంచి ఆసరా పథకం ప్రారంభమైంది. సుమారు 6,493మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు మంజూరయ్యాయి. ఈ పింఛన్ల పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డులు, పూర్తి చిరునామా తదితర వివరాలు అందజేయాలని డీఆర్డీఏ అధికారులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం పింఛన్‌దారుల్లో సుమారు 1,564 మందికి బ్యాంకు అకౌంట్లు, ఆధారు కార్డులు, చిరునామా ఇతర వివరాలు లేవని డీఆర్డీఏ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పింఛన్లలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు డీఆర్డీఏకు వస్తున్న ఫిర్యాదులకు బలం చేకూరినట్లయ్యింది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు అధికారులు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇన్ని నెలలు పింఛన్లు ఎలా పంపిణీ చేశారు. ఎవరికి ఇచ్చారనే కోణంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని జిల్లా అధికారి ఒకరు చెప్పారు. బ్యాంకు, ఆధారు కార్డులేని వారిని బోగస్‌గానే పరిగణిస్తామని సదరు అధికారి స్పష్టం చేశారు. చిరునామాలేని వారు 300మంది.. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగలేదు. ఒకవేళ పాల్పడితే బాధ్యులపై చర్యలు ఉంటాయి. 6,493మందిలో అకౌంట్లు ఉన్న వారికి బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ అవుతున్నాయి. కొందరికి బ్యాంకు అకౌంట్లు తీస్తున్నాం. కొంత మంది మృతి చెందారు. సుమారు 300మంది చిరునామా లేని వారు ఉన్నారు. 28 మంది మృతి చెందగా, మరో 27మందికి డబుల్ పింఛన్లు వచ్చాయి. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం. - గోపయ్య, మున్సిపల్ కమిషనర్, తాండూరు -
బాబు వచ్చారు.. జాబు ఊడింది
డీఆర్డీఏలోని ఎన్‌పీఎం సిబ్బంది తొలగింపు * ఎలాంటి ఉత్తర్వుల్లేకుండా కేవలం సెల్ మెసేజ్ ద్వారా వేటు * రోడ్డున పడిన 10,268 మంది సిబ్బంది * బకాయిలు కూడా చెల్లించని ప్రభుత్వం * న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధితుల ఆవేదన సాక్షి ప్రతినిధి, కడప: బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఆర్భాటంగా ప్రచారం చేసింది. అలా ప్రచారం చేసి.. నిరుద్యోగుల ఓట్లు వేయించుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దీంతో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. అయితే కొత్తగా జాబులొచ్చే సంగతి అటుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇంటికి పంపడం మొదలైంది. గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)లో ఎన్‌పీఎం(నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్-పురుగుమందులు లేని వ్యవసాయం) విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని ముందస్తు సమాచారం లేకుండా తొలగించారు. 2006 నుంచి విధులు నిర్వర్తిస్తున్న వారిని తొలగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 22న ‘మీ సేవలు ఇకచాలు.. మిమ్మల్ని తొలగిస్తున్నాం’ అంటూ సెల్ మెసేజ్ వచ్చింది. ఊహించని పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా 10,268 మంది ఎన్‌పీఎం సిబ్బంది వీధిపాలయ్యారు. పనిచేసిన కాలానికి జీత భత్యాలిచ్చారా.. అంటే అదీ లేదు. సుమారు రూ.18 కోట్లకుపైగా బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఒక్క సెల్ మెసేజ్‌తో తొలగింపు.. రాష్ట్రవ్యాప్తంగా 392 మండలాల్లో 14,93,824 మంది రైతులు పురుగుమందులు లేని వ్యవసాయం చేస్తున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో 7,250 మంది వీఏలు(గ్రామ కార్యకర్త), 1,450 మంది సీఏలు(క్లస్టర్ కార్యకర్త), 1,450 మంది గ్రామ కమిటీ మెంబర్లు, 59 మంది జిల్లా కమిటీ మెంబర్లు, 59 మంది కంప్యూటర్ ఆపరేటర్లు 2006 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని జీవో నంబర్ 360 కింద కాంట్రాక్టు సిబ్బంది కింద తీసుకున్నారు. వీఏలకు రూ.2 వేలు, సీఏలకు రూ.6 వేలు, ఆపరేటర్లకు సుమారు రూ.7వేలు చొప్పున వేతనం నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, పొలం బడుల ద్వారా సూచనలు, సలహాలివ్వడం, అంతరపంట సాగుపై మెళకువలు అందించడం, వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసి చైతన్యపరచడం వంటి కీలక బాధ్యతలను వారి పరిధిలో నిర్వర్తించారు. అలాంటి ఎన్‌పీఎం సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా ఒక్క సెల్‌ఫోన్ మెసేజ్‌తో తొలగించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనూహ్యంగా గత ఏప్రిల్‌లో సెర్ప్ సీఎంఎస్ డెరైక్టర్ సుధాకర్ సెల్ నుంచి ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్లు వారికి మెసేజ్ అందింది. బకాయిలు రూ.18 కోట్లు ఎన్‌పీఎం సిబ్బందికి 2014 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. చిరుద్యోగాలతో కాలం వెళ్లదీస్తూ వచ్చిన ఈ సిబ్బంది ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉన్నపళంగా తొలగించడంతో వారి పరిస్థితి గందరగోళంగా మారింది. వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఆ మేరకు వైఎస్సార్ జిల్లా ఉద్యోగులకు రూ.1.20 కోట్లు బకాయిలు రావాలి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.18 కోట్ల బకాయిలు అందాల్సివుంది. జిల్లా స్థాయిలో డీఆర్డీఏ పీడీకి వినతిపత్రాలు సమర్పించినా, రాష్ట్రప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన కనిపించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయండి * జగన్‌కు బాధితుల విన్నపం * అసెంబ్లీలో పోరాడతానని ప్రతిపక్ష నేత భరోసా ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు బుధవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యామ్నాయం చూపకపోగా.. ఉన్నపళంగా ప్రభుత్వం తమను తొలగించడం ఎంతవరకు సబబంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మీరే ఆదుకోవాలంటూ విన్నవించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే 820 మంది రోడ్డు పాలైనట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్‌పీఎం సిబ్బందిని కొనసాగిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమపై వేటు వేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఎన్‌పీఎం సిబ్బందికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని, అసెంబ్లీలో పోరాడతామని జగన్ భరోసానిచ్చారు.స్థైర్యం కోల్పోవద్దన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు కృషి చేస్తామని ధైర్యం చెప్పారు. -
ఇష్టారాజ్యం
అనంతపురం సెంట్రల్ : స్వయం సహాయక సంఘాల మహిళలకు చెందిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రూ. లక్షల్లో దుర్వినియోగం చేస్తున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. డీఆర్డీఏ- వెలుగుకు కొన్ని నెలలుగా రెగ్యులర్ ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) లేకపోవడంతో కొంతమంది అధికారులకు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. పొదుపు మహిళల సొమ్మును భద్రంగా ఉంచాల్సిన జిల్లా సమాఖ్య కార్యాలయంలోనే ఇష్టారాజ్యం తయారైంది. ఎంతకు పడితే అంతకు బిల్లు పెట్టుకోవడం, జిల్లా సమాఖ్య నుంచి డ్రా చేసుకోవడం పరిపాటిగా మారింది. డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో పాటు మహిళల పొదుపు సొమ్ముపై వచ్చే వడ్డీని కూడా ఖర్చు చేస్తున్నారు. కొంతమంది అధికారులు, జిల్లా సమాఖ్య లీడర్లు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షురాలు, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీలు ఏ సమావేశానికి వచ్చినా టీఏ, డీఏలు జిల్లా సమాఖ్యే భరిస్తుంది. బస్సు టికెట్‌తో పాటు రోజుకు రూ.150 భోజన నిమిత్తం చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. అయితే.. గతంలో ఎప్పుడూ రూ. 8 వేల నుంచి రూ.10 వేలకు మించని ఈ ఖర్చు ప్రస్తుతం ప్రతినెలా రూ.18 వేల నుంచి రూ.20 వేలు అవుతోంది. ఏ పని మీద వచ్చినా జిల్లాసమాఖ్యలో టీఏ,డీఏలు డ్రా చేస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలో జిల్లా కేంద్రానికి రావడానికి ఓ ప్రైవేటు వాహనాన్ని తీసుకున్నారు. దీని కోసం రూ.వేలల్లో బిల్లు చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం వాహనాలు తీసుకునేందుకు అవకాశం లేదు. ఇక ఎనిమిది నెలల వ్యవధిలోనే రూ.1.50 లక్షకు పైగా టీఏ, డీఏలకు చెల్లించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జిల్లా సమాఖ్యలో సమావేశముందంటే అక్కడ పనిచేస్తున్న అధికారులు, కొంతమంది లీడర్లకు పండగే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిన్నపాటి సమావేశానికి రూ.60 వేలకు పైగా డ్రా చేశారు. ఒక షామియానా, 30-40 కుర్చీలు తప్పా ఏవీ తెప్పించిన దాఖలాలు లేవు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే ‘స్పెషల్ భోజనం తెప్పించామ’ని అంటున్నారు. సమావేశాలు, లీడర్లు రానుపోను చార్జీలు, వారికి భోజనాలు కలిపి నెలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ ఖర్చు చేస్తున్నారు. ఈ భారమంతా డ్వాక్రా మహిళలపై మోపుతున్నారు. పేద మహిళలు కష్టార్జితంతో దాచుకున్న సొమ్ముకు ప్రతిఫలంగా వచ్చే నిధులను ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఖర్చు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌లు అధికమయ్యాయి : చంద్రమౌళి, మేనేజర్, జిల్లా సమాఖ్య గతంలో 15 రోజులకు మించి ఎక్కువ టూర్ ఉండకూడదని నిబంధనలున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో ఇసుకరీచ్‌లు, ఇతర కార్యక్రమాలపై ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. దీనికితోడు రీసోర్సు ఫీజును పెంచారు. దీనివల్ల ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. టూర్లు తగ్గించాలని ప్రాజెక్టు డెరైక్టర్‌కు లేఖ రాశాం. జిల్లా సమాఖ్యకు పెద్దగా నిధులు వస్తున్న దాఖలాలు లేవు. దీనివల్ల ఖర్చులు కూడా పెద్దగా పెట్టడం లేదు. తప్పనిసరి అయితేనే ఖర్చు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆడిట్ ఉంటుంది. అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి. -
20 కొత్త ఇసుక రీచులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కొత్తగా 20 ఇసుక రీచుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఇసుక నిల్వలు తరిగిపోవడంతో ఇప్పుడున్న దాదాపు అన్ని రీచ్‌లు నిలిచిపోయాయి. ఇసుక కొరత ఏర్పడటంతో ప్రభుత్వం కొత్త రీచ్‌లపై దృష్టి పెట్టింది, ఈ మేరకు జిల్లా ఇసుక కమిటీ, డీఆర్డీఏ ఆధికారులు నాగావళి, వంశధార పరీవాహక ప్రాంతాల్లో 9 మండలాల పరిధిలో కొత్త రీచులకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మంగళవారం ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో కొత్త రీచుల ప్రారంభానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రీచుల ద్వారా 12,89,850 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి వస్తుందని అంచనా. పరిశీలనలో మరికొన్ని కొత్తగా మంజూరైన 20 రీచులతోపాటు మరికొన్ని రీచుల ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళ ం నియోజకవర్గంలో మరిన్ని రీచ్‌ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గార మండలంలో రీచ్‌లు అసరమని, ఆ ప్రాంతంవారు దూరప్రాంతాల నుంచి ఇసుక తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందన్న ఫిర్యాదులు అందాయి. ఆ మండలంలో రీచ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆధికారులు గుర్తించారు. కళింగపట్నం, గార, ఆరంగిపేట, బూరవల్లి, పూసర్లపాడు, శాలిహుండం, వమరవల్లిలతోపాటు శ్రీకాకుళం మండలంలో కిల్లిపాలెం, కళ్లేపల్లి ప్రాంతాలు, ఎల్.ఎన్.పేట మండలంలో సొంటిపేట, దబ్బపాడు ప్రాంతాల్లో రీచుల ఏర్పాటుకు ప్రభుత్వానికి అనుమతి కోరనున్నట్లు తెలిసింది. ఇసుక బళ్ల వారికి ఊరట! టైరు బళ్లతో ఇసుక రవాణాను నిషేధించడం, అదే వృత్తిగా చేసుకున్నవారికి ఇబ్బందిగా పరిణమించింది. ఆ మేరకు టైరు బళ్లకు అనుమతి ఇవ్వాలన్న ప్రజాప్రతినిధుల విన్నపాలతో ఆ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆంక్షలతో తాము ఉపాధి కోల్పోయామని బళ్ల కార్మికులు పలుమార్లు అధికారులకు విన్నవించుకోగా, వారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాకుళంతోపాటు మరికొన్ని జిల్లాల్లో ఇదే సమస్య ఉంది. దీంతో ఇసుక రవాణాకు సంబంధించిన 94, 95 జీవోలను పరిశీలించి నాటుబళ్లతో ఇసుక రవాణాకు వెసులుబాటు కల్పించే అవకాశముందని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 250 నాటుబళ్లు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిని మూడు నాలుగు గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇసుక రవాణాకు అనుమతించాలని భావిస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. కొత్త రీచులు ఇవే.. మండలం రీచులు ఆమదాలవలస ముద్దాడపేట, అక్కివరం, దూసి, తోటాడ జలుమూరు శ్రీముఖలింగం, పర్లాం, దుంపాక నరసన్నపేట మడపాం, గోపాలపెంట, పోతయ్యవలస, చిన్నాలవలస, బచ్చిపేట పోలాకి మబగాం రేగిడి కందిస పాలకొండ అన్నవరం ఎచ్చెర్ల బొంతలకోడూరు, ముద్దాడపేట పొందూరు బొడ్డేపల్లి, సింగూరు శ్రీకాకుళం హయాతీనగరం, బట్టేరు -
బేఖాతర్
ఏలూరు (టూటౌన్) :‘మమ్మల్ని ఎన్నికలు జరపమనే హక్కు డీఆర్డీఏ పీడీకి లేదు. మండల సమాఖ్యల ఎన్నికలను సహకార శాఖ ద్వారా జరపాలి. మా పదవీ కాలాన్ని పొడిగించేలా అదేశించాల’ని ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో జిల్లా సమాఖ్య ఉపాధ్యక్షురాలు కె.ధనలక్ష్మి, మరో 30 మంది మండల సమాఖ్య అధ్యక్షులు గత ఏడాది ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మిహ ళా సమాఖ్యలతోపాటు డీఆర్డీఏ అధికారుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి 2014 అక్టోబర్ 13న ఆదేశాలు జారీ చేస్తూ జిల్లా సహకార అధికారులకు సూచనలు ఇచ్చారు. సహకార శాఖ ఆధ్వర్యంలో గ్రామ సంఘాలకు, మండల సమాఖ్యలకు, జిల్లా సమాఖ్యకు ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఇంతవరకూ స్పందించటం లేదని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 48 మండలాల్లో 62వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వీటికి సంబంధించి 2వేల 29 గ్రామ సంఘాలున్న్డాయి. అధికారులు ముందుగా గ్రామ సంఘాలకు ఎన్నికలు జరిపి, వాటిద్వారా మండల సమాఖ్యలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. మండల సమాఖ్యలన్నీ కలిసి జిల్లా సమాఖ్యను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీటి పదవీ కాలం సంవత్సరమే కాగా, ఒక సభ్యురాలు రెండు పర్యాయాలకు మించి పదవిలో ఉండకూడదన్న నిబంధన ఉంది. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య పదవీ కాలం 3 నుండి 4 సంవత్సరాలు పూర్తి చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవటం ఆరోపణలు వినవస్తున్నాయి. కాగా, గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసి దీర్ఘకాలం సెలవులో ఉన్న పులి శ్రీనివాసులు నెల రోజలు గడువు ఇచ్చి ఎన్నికలు జరుపుకోవాలని జిల్లా, మండల సమాఖ్యలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో సమాఖ్య ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇటు సహకార అధికారులు గాని, అటు డీఆర్డీఏ అధికారులు గానీ తమకు పట్టనట్టు వ్యవహ రిస్తున్నారు. అంతేకాకుండా జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు వాటి కార్యకలాపాలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులు ఎప్పటికప్పుడు జిల్లా సహకార అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉండగా, దీనిని కూడా సజావుగా అమలు చేయటం లేదు. జిల్లాలోని 62వేల గ్రామ సంఘాల్లో చాలా సంఘాలు డిఫాల్ట్ జాబితాలో ఉన్నాయి. జిల్లా సమాఖ్యకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సభ్యురాలికి సంబంధించి డ్వాక్రా గ్రూపు, గ్రామ సంఘం, మండల సమాఖ్య కూడా ఇదే కోవలో ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే చాలా సంఘాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలోని మండల, గ్రామ, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా సహకార అధికారుల నేతృత్వంలో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఇప్పటివరకూ 9 మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 19న సెర్ప్ అదికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఆ సందర్భంలో స్పష్టమైన అదేశాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని చాలావరకూ మండల సమాఖ్యల ఆడిట్ పూర్తయింది. - ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డీపీఎం ఆదేశాలు ఇచ్చాం హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని మండల, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరపుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. అలాగే వీటిని పర్యవేక్షించాలని సంబంధిత డీఆర్‌లకు ఆదేశాలు ఇచ్చాం. దీంతోపాటు డీఆర్డీఏ అధికారులు సమాచారం ఇచ్చారు. సకాలంలో ఎన్నికలు జరపకపోతే ఆయా సమాఖ్యలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఆడిట్ రిపోర్టులను సక్రమంగా సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. - డి.వెంకటస్వామి, డీసీవో -
ఢిల్లీరావు, ప్రశాంతిలకు లైన్ క్లియర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా విజయనగరం డీఆర్డీఎ, డ్వామా పీడీలుగా నియమితులైన ఢిల్లీరావు, ఆయన భార్య ప్రశాంతిలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. గుంటూరు జిల్లాలో ఇంతవరకూ పనిచేసిన వారిద్దరూ సోమవారం రిలీవ్ అయ్యారు. డ్వామా పీడీగా పనిచేస్తున్న ఢిల్లీరావు, డీఆర్డీఏ పీడీ పనిచేస్తున్న ప్రశాంతిలకు జిల్లాకు బదిలీ అయింది. కాకపోతే, వారిద్దరి పోస్టులూ అటు ఇటు మారాయి. మొత్తానికి తమ ఉద్యోగ ప్రయాణం ప్రారంభమైన విజయనగరం జిల్లాలోనే కీలక పోస్టుల్ని దక్కించుకున్నారు. కాకపోతే, వారి జోరుకు అక్కడి కలెక్టర్ బ్రేకులు వేశారు. గుంటూరులో వారి స్థానంలో వేరొకర్ని నియమించకపోవడంతో రాజధాని భూసేకరణ, సీఎం పర్యటనలకోసమని వీరిద్దర్ని రిలీవ్ చేయకుండా కలెక్టర్ అడ్డుకున్నారు. కమిషనరేట్ అధికారులు వారిద్దరికీ రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ గుంటూరు కలెక్టర్ పక్కన పెట్టేశారు. దీంతో బదిలీలు జరిగి మూడు నెలలు కావస్తున్నా ఇక్కడికి చేరలేకపోయారు. దీంతో జిల్లాలోని డీఆర్డీఎ, డ్వామా పీడీ పోస్టులు ఇన్‌చార్జ్‌లతోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి పోస్టింగ్స్ రద్దయ్యాయన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ వారి పోస్టుల్లో వేరేవారిని నియమించడంతో వారిద్దరికీ ఎట్టకేలకు మోక్షం లభించింది. ఒకటిరెండు రోజుల్లో ఆ దంపతులిద్దరూ జిల్లాలో బాధ్యతలు స్వీకరించనున్నారు. -
పింఛన్ల అవినీతిపై సోషల్ ఆడిట్
నారాయణఖేడ్: ఆసరా పింఛన్ల పంపిణీపై త్వరలో సోషల్ ఆడిట్ జరుగుతుందని డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయన ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగిన గ్రీవెన్స్ సెల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు రాని అర్హుల కోసం ప్రభుత్వం 16, 17 తేదీల్లో మరోసారి దరఖాస్తు చేసుకునేలా గ్రీవెన్స్ సెల్లో అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆసరా పింఛన్ల కోసం నాలుగుసార్లు నిధులను ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ద్వారా విడుదల చేసిందన్నారు. ఒకటి, రెండుసార్లు చేసిన నిధుల విడుదలలో మూడు నెలల పింఛన్లను, తర్వాత నిధుల విడుదలలో ఒక నెల పింఛన్‌ను విడుదల చేయడం జరిగిందన్నారు. కంగ్టిలో జరిగిన పింఛన్ల ప్రక్రియపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదించామన్నారు. బ్యాంకు రికార్డులు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, ఆక్విటెన్సీ రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు మూఢ రాంచెందర రాజగిరి శ్రీనివాస్, సీపీఎం నాయకులు చిరంజీవిలు అనర్హులకు వచ్చే పింఛన్లను తొలగించి, అర్హులకు త్వరగా పింఛన్లను అందించాలని కోరారు. కొన్ని గ్రామాల్లో ఒకే నెల పింఛన్లను అందిస్తున్నారని మూడు నెలల పింఛన్లను అందించాలని పీడీని కోరారు. పీడీ వెంట డీఆర్డీఏ ఏపీఓ సిధారెడ్డి, తహశీల్దార్ రాణాప్రతాప్‌సింగ్, ఇన్చార్జి ఎంపీడీఓ జాన్, ఖేడ్ ఈఓ వాసంతి తదితరులు ఉన్నారు. -
నమ్మించి..నిండా ముంచారు
మండపేట :రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తానేనని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు నాయుడే.. వాటిని ముప్పుతిప్పల పాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలి సంఘాలను నిండా ముంచారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తామన్న వాగ్దానంతో వారి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక మాట మార్చారు. ఫలితంగా.. సంఘాలకు పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు రాని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.1,316 కోట్ల రుణాలు అందజేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.135 కోట్లు మాత్రమే. జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు సంబంధించి మెప్మా పరిధిలో 18 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా, డీఆర్డీఏ పరిధిలో గ్రామాల్లో 77,819 సంఘాలు ఉన్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా తిరిగి కొత్త రుణాలను తీసుకోవడం సంఘాలకు పరిపాటి. ఈ మేరకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రుణాలు నూరుశాతం లక్ష్యానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 5,581 గ్రూపులకు రూ.143 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా 5,284 గ్రూపులకు రూ.148.37 కోట్లు రుణాలుగా అందజేశారు. అలాగే గ్రామాల్లోని 28,247 గ్రూపులకు రూ.715.11 కోట్ల రుణ లక్ష్యానికి 25,178 గ్రూపులకు రూ.808.61 కోట్లను రుణాలుగా అందజేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. చిన్నబోయిన లక్ష్యాలు.. ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తాం, రుణాలు ఎవరూ చెల్లించనవసరంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం ఈ ఏడాది లక్ష్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు హామీని నమ్మిన డ్వాక్రా మహిళలు ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచే రుణాలు చెల్లించడం మానేశారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు.. ‘రుణాలన్నీ రద్దు కాదు.. ఒక్కో సంఘానికి రూ.లక్ష వరకు భారం మాత్రమే తగ్గిస్తా’మంటూ మాట మార్చారు. బాబు హామీని నమ్మి పాత రుణాలు చెల్లించనందున సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త రుణాలు అందని దుస్థితి దాపురించింది. పట్టణ ప్రాంతాల్లో 7,432 గ్రూపులకు రూ.150 కోట్లు రుణాలుగా అందజేయాలన్నది ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 1,519 గ్రూపులకు రూ.45.63 కోట్లు మాత్రమే రుణాలుగా అందజేశారు. గ్రామాల్లో 36,855 గ్రూపులకు రూ.1,166 కోట్లు రుణాలు అందజేయాల్సి ఉండగా కేవలం 2,882 గ్రూపులకు రూ.90.96 కోట్లు మాత్రమే ఇచ్చారు. నెలల తరబడి రుణాలు చెల్లించక వడ్డీలతో రుణాలు తడిసి మోపెడయ్యాయని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిండా మునిగి పోయామని, అలా కాక గతంలో లాగే ముందు నుంచీ క్రమం తప్పకుండా రుణాలు చెల్లించి ఉంటే కొత్త రుణాలు రావడంతో పాటు వడ్డీ భారం ఉండేది కాదని ఆక్రోశిస్తున్నారు. అంతవరకూ అభివృద్ధిపథంలో పయనిస్తున్న సంఘాల పరిస్థితి.. చంద్రబాబు నమ్మకద్రోహం వల్ల అగాధంలో పడినట్టయిందని నిట్టూరుస్తున్నారు. కొత్త రుణం దూరం.. నేను పడమర ఖండ్రిక విఘ్నేశ్వర మహిళా సంఘంలో సభ్యురాలిని. మా సంఘం తరఫున తీసుకున్న రూ.మూడు లక్షల రుణాన్ని తీర్చేసి, కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకూ మంజూరు చేయలేదు. గెలిపిస్తే ఆదుకుంటానన్న చంద్రబాబు గెలిచాన ఒరిగింది లేదు. - ఆలపాటి చక్రమ్మ, డ్రాక్రా సంఘం సభ్యురాలు, పడమర ఖండ్రిక సమయమొచ్చినపుడు సత్తా చూపుతాం చంద్రబాబు చేసిన రుణమాఫీ వాగ్దానాన్ని నమ్మి మోసపోయాం. ఇప్పుడు వడ్డీతో సహా రుణాలు చెల్లించాల్సి వస్తోంది. టీడీపీ అధినేత మాట నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. అయితే.. మేమూ సమయం వచ్చినప్పుడు, సత్తా చూపి తగిన రీతిలో బదులిస్తాం. - సీహెచ్ సౌభాగ్యవతి, రామచంద్రపురం -
గాడి తప్పిన డీఆర్డీఏ
ఏలూరు (టూటౌన్):జిల్లాలోని కీలక ప్రభుత్వ శాఖల్లో ఒకటైన జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్డీఏ)లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ శాఖ పనితీరు దిక్కూ మొక్కూ లేని విధంగా తయారైంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్టో శని అన్నట్టు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ఈ శాఖలో అజమాయిషీ కరువు అవటంతో కిందిస్థాయి అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి సరైన మార్గ దర్శకత్వం లేక కొన్ని కార్యక్రమాలు గాడి తప్పుతున్నాయి. వివరాల్లోకి వెళితే డీఆర్డీఏ ఆధ్వర్యంలోనూ, దానికి అనుబంధంగా ఉన్న ఇందిరా క్రాంతిపథంలోనూ ఎన్నో పథకాలను నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రధానంగా పింఛన్ల పంపిణీ, ఇసుక ర్యాంపుల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, డ్వాక్రా గ్రూపుల నిర్వహణ తదితర ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ సక్రమంగా జరిగేందుకు జిల్లా స్థాయి పీడీ, ముగ్గురు ఏపీడీలు, ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారి, ఒక అకౌంట్స్ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ పోస్టులన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన అధికారులు సైతం రావడానికి సిద్ధపడటం లేదు. ఆగస్టు నెలలో రెగ్యులర్ పీడీగా విధులు నిర్వర్తించిన పులి శ్రీనివాసులు వ్యక్తిగత సెలవు పెట్టి అప్పటి నుంచి విధులకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో డ్వామా పీడీ ఇన్చార్జి పనిచేస్తున్నారు. కాగా ఈ శాఖలో మూడు ఏపీడీ పోస్టులకు గానూ ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. వీరిలో డీఆర్డీఏ ఏపీడీ, ఇందిరాక్రాంతిపథం ఏపీడీ పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉండగా నిన్నటి వరకూ ఉన్న ఏపీడీ లాండ్ అధికారి కెఇ సాధనను క్యాపిటల్ రెవెన్యూ డెవలప్మెంట్ అథారిటీకి (సీఆర్డీఏ) బదిలీ చేశారు. అకౌంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్.నాగేశ్వరరావు విశాఖపట్నం బదీలీపై వెళ్లిపోవటంతో ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. అడ్మినిస్ట్రేషన్ అధికారి పోస్టులో కూడా కొంతకాలంగా ఎవరినీ నియమించక పోవటంతో ఖాళీగా ఉంది. డీపీఎం ఐబీ, డీపీఎం ఎన్ పీయం, డీపీఎం మార్కెటింగ్ పోస్టులు కూడా ఖాళీగా ఉండటంతో డీఆర్డీఏ పనితీరు చుక్కాని లేని నావలా తయారైంది. ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయి అధికారులను నియమించి ఆ శాఖకు పూర్వ వైభవం తీసుకురావలసిన అవసరం ఉంది. కాగా డీఆర్డీఏ పీడీగా ఎస్.రామచంద్రారెడ్డిని ప్రభుత్వం నియమించి ఐదు రోజులయినా ఇంతవరకూ జాయిన్ కాలేదు. అయితే కావాలని అడిగిన వారిని కాదని వేరే వారిని నియమించటంతో వారు పీడీ బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడుతున్నట్టు సమాచారం. -
డ్వాక్రా మహిళలపై ‘బకాయి’బండ
ఆత్మకూరు: రుణమాఫీ హామీ డ్వాక్రా మహిళలకు అలవిగాని కష్టాలను తెచ్చిపెట్టింది. జిల్లాలో డ్వాక్రా మహిళలకు రుణబకాయిల చెల్లింపు గుదిబండగా మారింది. ఆరు నెలల క్రితం వరకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి కష్టపడి మరీ వాయిదాలను సక్రమంగానే జమ చేస్తూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చేందుకు డ్వాక్రా రుణాలను రద్దుచేస్తామని ఏ మహిళ సొమ్ము జమ చేయవద్దని గట్టిగా చెప్పిన విషయం తెలిసిందే. దీంతో గత ఆరు నెలలుగా డ్వాక్రా మహిళలు బ్యాంకులకు సొమ్ము జమ చేయకుండా ఆగిపోయారు. దీంతో జిల్లాలో బకాయిల సొమ్ము కొండలా పేరుకుపోయింది. జిల్లాలోని 46 మండలాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు 36 వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 3.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్, ఆత్మకూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు పదివేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో లక్ష మంది దాకా సభ్యులున్నారు. మొత్తం మీద జిల్లాలో 46 వేల సంఘాలు ఉండగా 4.7 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలన్నింటిలో కలిపి సుమారుగా రూ.90 కోట్ల మేర రుణబకాయిలు ఉన్నాయి. వడ్డీ అదనం. గత ఆరు నెలలుగా డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో మహిళలున్నారు. అయితే ఇటీవల డీఆర్డీఏ, మెప్మా అధికారులు రుణాలు సొమ్మును బ్యాంకులకు జమ చేయాలని అలా చేస్తేనే ఒక్కొక్క సభ్యురాలికి రూ.10వేలు వంతున రుణమాఫీ సొమ్ముగా ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు కొద్దిరోజులనుంచి నచ్చజెబుతున్నారు. దీంతో రుణాలు సొమ్ము జమ చేసేందుకు డ్వాక్రా మహిళలు ప్రైవేటు అప్పులు చేస్తున్నారు. ఆరు నెలలవి ఒక్కసారిగా అంటే కష్టమే.. గతంలో మాదిరిగానే తీసుకున్న రుణాన్ని బ్యాంకుల్లో జమ చేసి ఉంటే ఈ రోజు ఈ బాధలు తప్పేవని డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామని చెప్పటంతోనే తాము లావాదేవీలు ఆపివేశామని, మళ్లీ అధికారులు జమచేయాలని చెబుతున్నారని వాపోతున్నారు. ఆరు నెలల సొమ్ము ఒక్కసారిగా ఎలా జమ చేయగలమంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి అని ఇలా అయితే తమకెందుకు హామీలు ఇచ్చారని మహిళలు మండిపడుతున్నారు. మొత్తం మీద డ్వాక్రా మహిళలకు రుణబకాయిల జమలు ఓ గుదిబండగానే మారాయి. రికవరీలు ప్రారంభించాం: చంద్రమౌళి, పీడీ, డీఆర్డీఏ ప్రస్తుతం బ్యాంకర్ల నుంచి రుణాలు పొందిన స్వయం సహాయక సభ్యులు తిరిగి సొమ్ము చెల్లించే ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో డీఆర్డీఏ పరిధిలో సుమారు రూ.70 నుంచి 60 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల కాలంలో కొందరు బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం వారికి అవగాహన కల్పించడంతో మళ్లీ ప్రారంభించార. -
ఖాళీలే.. ఖాళీలు..!
కీలకమైన విభాగాలకు సారథులు కరువు పడకే సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇన్చార్జిల పాలనలో డ్వామా, డీఆర్డీఏ పలు శాఖల్లో అధికారులు లేక అస్తవ్యస్తం కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం కర్నూలు(అగ్రికల్చర్) : కీలక ప్రభుత్వ విభాగాలకు సారథులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇవన్నీ సక్రమంగా అమలు కావడానికి, ఆశించిన ఫలితాలు రావడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అధిపతులు ఉండాలి. అప్పుడే పర్యవేక్షణ పెరుగుతుంది. పథకాలు సక్రమంగా అమలు అవుతాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు అధిపతులు లేకపోవడంతో వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు పడకేసినట్లు అయింది. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందువల్ల వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. లోతుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు 100 శాతం విజయవంతం కావాలని, ఆ దిశగా జిల్లా అధికారులు కృషి చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇది అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అబ్బో! కలెక్టర్ చండశాసనుడట..ఆయన దగ్గర పని చేయలేము.. అంటూ ఇక్కడికి రావడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు జిల్లాకు రావడానికి ప్రయత్నించి మానుకున్నట్లు తెలుస్తోంది. సారథులు లేని డ్వామా డీఆర్‌డీపీ.. ఒకవైపు వ్యవసాయ కూలీలు సంక్షేమానికి, గ్రామాభివృద్ధికి, మహిళా సంక్షేమానికి పేదరిక నిర్మూలనలో డ్వామా, డీఆర్డీఏ-వెలుగు కీలకమైనవి. డ్వామాలో ఎన్ఆర్ఈజీఎస్, వాటర్‌షెడ్, ఇందిర జలప్రభ కింద వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. డీఆర్డీఏ-వెలుగు ద్వారా మహిళా సంక్షేమం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఈ రెండింటికీ సారథులు లేకపోవడం గమనార్హం. డ్వామా పీడీ పోస్టు దాదాపు 3 నెలలుగా ఖాళీగా ఉంది. మొదట ఇన్చార్జి పీడీగా జేడీఏ ఠాగూర్‌నాయక్ కొద్ది రోజులు పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి ఇన్చార్జి పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ-వెలుగు పీడీగా పనిచేస్తున్న నజీర్ సాహెబ్‌ను మాతృ సంస్థకు బదిలీ చేసినా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో కలెక్టర్.. పీడీ బాధ్యతలను జేసీకి అప్పగించారు. జేసీ నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్నందున డీఆర్డీఏ-వెలుగు కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మ గతి.. అథోగతి... వ్యవసాయ శాఖలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అందిస్తుంది. ఆత్మను పట్టించుకునే దిక్కు లేదు. జేడీఏ స్థాయిలో పీడీ, డీడీఏ స్థాయిలో ఇద్దరు డిప్యుటీ పీడీ పోస్టులు ఉన్నాయి. ఆత్మ ద్వారా రూ.2 కోట్లకు పైగా నిధులతో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ పీడీ, డీపీడీ పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఇన్చార్జి అధికారులు ఆత్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కీలక శాఖలకు అధికారులు లేరు.. పౌర సరఫరాల శాఖ ఎంతో కీలకమైంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ఈ శాఖ ద్వారానే నడుస్తుంది. ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయించే బాధ్యత ఈ శాఖదే. కీలకమైన శాఖకు జిల్లా అధికారి(డీఎస్ఓ) లేరు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్ఓను బదిలీ చేసిన ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డీఎస్‌ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో ముఖ్యమైన సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. రెగ్యులర్ డీడీ ఉంటేనే హాస్టళ్ల పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒకవైపు హాస్టళ్లు అస్తవ్యస్థంగా మారాయి. మరోవైపు స్కాలర్షిప్ సమస్యను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ పీడీ అవసరం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ రెండు విభాగాలకు ఎస్ఈలు లేరు.. కీలకమైన పంచాయతీరాజ్ ఆర్‌డబ్ల్యూస్‌లకు ఎస్ఈలు లేరు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయి అధికారులే ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్‌లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌లో మంచినీటి పథకాలు, సీపీడబ్ల్యూ స్కీమ్ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రెగ్యులర్ ఎస్ఈలు లేక అభివృద్ధి కార్యక్రమాల అమలులో పురోగతి కొరవడింది. దిక్కులేని పెద్దాసుపత్రి... నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే కర్నూలు పెద్దాసుపత్రికి సారధి లేరు. సూపరింటెండెంట్‌గా పనిచేసే డాక్టర్ ఉమామహేశ్వర్ సెలవుల్లో పోవడంతో ఇన్చార్జి సూపరింటెండెంటు విధులు నిర్వహిస్తున్నారు. రాయలసీమ యూనివర్శిటీకి వైస్ ఛాన్స్లర్ పోస్టు ఖాళీగా ఉంది.వయోజిన విద్యాశాఖకు నెలల తరబడి డీడీ పోస్టు ఖాళీగా ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దాదాపు రెండేళ్లుగా సెక్రటరీ ఖాళీగా ఉంది. కీలకమైన వాటికి సారధులు లేకపోవడంతో రోగులకు, విద్యార్థులకు, రైతులకు సరైన సేవలు అందే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని రెగ్యులర్ అధికారులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వితంతు పింఛన్లు పునరుద్ధరించండి
కాకినాడ సిటీ : జిల్లాలో ఎక్కడైనా వితంతు పింఛన్లు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయి ఉంటే వాటిని వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ డ్వామా హాలులో ఆమె ప్రజావాణి క్యాక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది ప్రజలు పాల్గొని తమ సమస్యలపై వినతులు అందజేశారు. తమ పింఛన్లు ఆగిపోయాయని కొంత మంది వితంతువులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిపై స్పందించారు. ఒక మహిళ తమ చిన్నారికి గుండె ఆపరేషన్ అవసరం ఉందని చెప్పగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ను చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణిలో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు, పింఛన్లు, రుణమాఫీ సమస్యలపై అర్జీలు ఎక్కువగా వచ్చాయి. డయల్ యువర్ కలెక్టర్‌కు 26 ఫోన్‌కాల్స్ కలెక్టరేట్ కోర్టుహాలు నుంచి ఉదయం కలెక్టర్ నీతూ ప్రసాద్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించగా సుమారు 26 మంది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి సమస్యలు వివరించారు. కిర్లంపూడి మండలం నుంచి ఒక వ్యక్తి కలెక్టర్‌కు ఫోన్ చేసి మండలంలో గడచిన 10 రోజుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మెట్ట ప్రాంతంలోని 10 మండలాల్లో ఇసుక లభ్యం అవుతున్నందున ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులతో ప్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తాను గతంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నానని దానికి పట్టా ఇవ్వాలని డయల్ యువర్ కలెక్టర్‌లో కలెక్టర్‌ను కోరాడు. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే అల్లవరం తహశీల్దార్‌కు ఫోన్ చేసి ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని, తక్షణం ఆక్రమణను తొలగించి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, అదనపు జాయింట్ కలెక్టర్ మార్కెండేయులు, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి జన్‌ధన్‌పై డివిజన్‌స్థాయిలో క్యాంపులు కాకినాడ సిటీ : బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద అన్ని కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్లు తెరిచేలా డివిజన్ స్థాయిలో మెగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ పథకంలో ప్రతి కుటుంబానికి రెండు బ్యాంక్ అకౌంట్లు ఉండాలన్నారు. జిల్లాలో 44 లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారని, ఇంకా లక్ష కుటుంబాలకు అకౌంట్లు లేవన్నారు. మంగళవారం నుంచి మెగా క్యాంపులు డివిజన్ స్థాయిలో చేపడుతున్నామని, రంపచోడవరం ఆంధ్రా బ్యాంక్ ప్రాంగణంలోను, అమలాపురంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం నిర్వహిస్తారన్నారు. 24న పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం, రామచంద్రపురంలోని వీఎస్ఎం కళాశాల ఆడిటోరియం, 26న కాకినాడ అంబేద్కర్ భవన్, రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో క్యాంపులు జరుగుతాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఆంధ్రాబ్యాంక్డీజీఎం శేషగిరిరావు, ఎల్డీఎం జగన్నాథస్వామి, వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నందారావు పాల్గొన్నారు. -
ఇసుక లెక్క..ఇక పక్కా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ర్యాంపుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను కొల్లగొడుతున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని ఇసుక ర్యాంపుల్లో ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు.. వాటి పర్యవేక్షణ బాధ్యతలను డీఆర్డీఏ, రెవెన్యూ, పోలీస్ అధికారులకు ప్రభుత్వం అప్పగించిన విషయం విదితమే. గడచిన నెల రోజుల్లో జిల్లావ్యాప్తంగా 22 ఇసుక రీచ్‌లు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకే డ్వాక్రా సంఘాల నిర్వహణలో ఉంటున్న రీచ్‌లు రాత్రివేళ మాత్రం పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యే అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వారంతా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలించేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు సాగిస్తున్న దౌర్జన్యకాండకు అటు పోలీసు, రెవెన్యూ అధికారులు సైతం ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఇటీవల నబీపేట ఇసుక ర్యాంపు వద్ద తలెత్తిన వివాదంలో డ్వాక్రా మహిళలను బెదిరించిన ఘటన ఇసుక మాఫియాకు టీడీపీ నేతల అండ ఏస్థాయిలో ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యమో.. మరో కారణమో తెలీదు కానీ జిల్లాలోని 22 ఇసుక ర్యాంపుల లావాదేవీలపై ఆడిటింగ్ చేపట్టాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. రీచ్‌లు ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిపారు, ఎంత సరఫరా చేశారు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరిందనే అంశాలను అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు. వాస్తవానికి ఆయా అంశాలతో ఆడిటింగ్ విభాగానికి ఎటువంటి సంబంధం లేదు. మునుపెన్నడూ ఇసుక రీచ్‌ల నిర్వహణ, ఆదాయంపై ఆడిటింగ్ చేసిన దాఖలాలే లేవు. అయితే ఇసుక రీచ్‌ల నిర్వహణ అధ్వానంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆడిటింగ్ చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్, జేసీ టి.బాబూరావునాయుడు నిర్ణయించారని తెలుస్తోంది. ఆడిటింగ్ పక్కాగా జరిగితే రీచ్‌లలో అనుమతుల్లేకుండా ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వారో తేలుతుందని అంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఏయే ర్యాంపుల నుంచి ఎంత ఇసుక అక్రమంగా బయటకు వెళ్లిందనే లెక్క కూడా తేలుతుందని చెబుతున్నారు. ఇదిలావుండగా, అధికారం దన్నుతో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా తాజా ఆడిటింగ్తోనైనా అక్రమాలకు ఫుల్స్టాప్ పెడుతుందా లేక ఆడిటింగ్ అధికారులను కూడా తమదారిలోకి తెచ్చుకుని దందాను కొనసాగిస్తుందా అనేది వేచిచూడాలి. -
మంత్రికి ఝలక్..!
రాష్ర్ట గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని మాట చెల్లుబా టు కావడం లేదా? తన శాఖలోనే ఆమె పట్టు సాధించలేకపోతున్నారా? ఆమె ఇచ్చిన ఆదేశాలే అమలు కావడం లేదా? పరిస్థితులు చూస్తుంటే జిల్లాలో ఆమెను వ్యతిరేకిస్తున్న నేతల మాదిరిగానే కొందరు ఉన్నతాధికారులు కూడా మంత్రి మాటలు లెక్క చేయకుండా ఆమెకు షాక్ ఇస్తున్నారేమో అన్పిస్తోంది. గుంటూరులో డీఆర్డీఏ, డ్వామా పీడీలుగా పనిచేస్తున్న ఢిల్లీరావు, ప్రశాంతిలను మంత్రి మృణాళిని ఎన్నో విమర్శల మధ్య జిల్లాకు బదిలీ చేయించారు. కానీ ఆ అధికారులిద్దరూ నేటికీ జిల్లాలో విధుల్లో చేరలేదు. మంత్రి చొరవ తీసుకుని, ఏరికోరి నియమించుకున్న అధికారుల్ని ఇక్కడ చేరనివ్వకుండా అడ్డుకుంటున్నారంటే తెరవెనుక శక్తులు ఎంత బలంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మంత్రి మృణాళిని మాట చెల్లుబాటు కావడం లేదన్న విమర్శలను మాటగట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని అసమ్మతి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విశాఖపట్నంలో డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న వెంకటరావును డీఆర్డీఏ పీడీగా జిల్లాలో నియమించేందుకు పలువురు జిల్లా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కృషి చేశారు. మంత్రుల స్థాయిలో పైరవీలు కూడా చేశారు. కానీ ఆయన స్థానంలో గుంటూరు డ్వామా పీడీగా పనిచేస్తున్న ఢిల్లీరావును మంత్రి బదిలీ చేయించారు. పని తీరు ఆధారంగా ఆ శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయం మేరకు ఢిల్లీరావుకు పోస్టింగ్ వేయించామని మంత్రి మృణాళిని ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు. తెరవెనుక కారణమేదైనా ఢిల్లీరావు నియామకంపై జిల్లాలో విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అనుకూలమైన వ్యక్తిని తీసుకొచ్చారంటూ మంత్రిని వ్యతిరేకిస్తున్న నేతలంతా గళం విప్పారు. పెద్దఎత్తున చేతులు మారాయని ఆరోపణలు గుప్పించారు. అయినా మంత్రి లెక్క చేయలేయకుండా బదిలీ నిర్ణయానికి కట్టుబడ్డారు. గుంటూరు డ్వామా పీడీగా రిలీవ్ అయ్యేలా గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. కానీ ఢిల్లీరావు రిలీవ్ కాకుండా గుంటూరులో కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. దీని వెనుక మంత్రిని వ్యతిరేకిస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు తెరవెనుక కుట్ర పన్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి. అటు డ్వామా, ఇటు డీఆర్డీఏ రెండు శాఖలూ మంత్రి మృణాళిని పరిధిలోనివే అయినప్పటికీ ఢిల్లీరావు రిలీవ్ విషయంలో ఆమె నెట్టుకు రాలేకపోయారు. అలాగే మాజీ ఎమ్మెల్యే తెంటు లకు్ష్మం నాయుడుకు వరసకు బావ అయిన విశాఖలో డ్వామాలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావును ఈ జిల్లాకు డ్వామా పీడీగా తీసుకురావాలని జిల్లాకు చెందిన పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు కూడా ఇచ్చారు. కానీ ఆయన్ను కాదని తొలుత శ్రీకాకుళం డ్వామా పీడీగా పనిచేసిన కల్యాణ చక్రవర్తిని నియమించారు. ఆ తర్వాత ఆయనకిచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసి గుంటూరులో డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న ప్రశాం తిని ఇక్కడ డ్వామా పీడీగా నియమించారు. దీంతో టీడీపీ నేతల నుంచి మంత్రి వ్యతిరేకతను ఎదు ర్కొన్నారు. తమకు కనీసం విలువ ఇవ్వ లేదని, మా విజ్ఞప్తిని లెక్క చేయలేదని ఆడిపోసుకున్నారు. ఇన్ని విమర్శల మధ్య ప్రశాంతిని నియమించినా ఇప్పటివరకు ఆమె కూడా విధుల్లో చేరలేదు. గుంటూరులో రిలీవ్ చేయకపోవడం వల్లనే ఇంకా చేరలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీని వెనుక మంత్రి మృణాళినితో విభేదిస్తున్న అధికార వర్గాలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి. జిల్లాలో మంత్రికి వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి నేతలంతా ఇవన్నీ గమనిస్తూ మంత్రిని అధికారులు ఏమాత్రం లెక్కచేయడం లేదన్న ప్రచారాన్ని విసృ్తతం చేస్తున్నారు. తాము ఎలాగైతే పట్టించు కోవడం లేదో సంబంధిత ఉన్నతాధికారులు కూడా మంత్రికి ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న సెటైర్లు విసు రుతున్నారు. -
తూచ్...
ఈ ప్రభుత్వంలో ఎప్పుడేం జరుగుతుందో... ఎప్పుడు ఎవర్ని మార్చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా ఉత్తర్వులిచ్చి...ఇలా రద్దు చేసేస్తున్నారు. ఉత్తర్వులకు విలువ లేకుండా తూచ్ అనేస్తున్నారు. వారం రోజుల క్రితం డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్‌గా శ్రీకాకుళం పీడీగా పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తిని నియమించారు. ఇంతలో ఏమైందో తెలియదు గాని ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఆ పోస్టులో ప్రస్తుతం గుంటూరులో డీఆర్డీఎ పీడీగా పనిచేస్తున్న ప్రశాంతిని నియమించారు. ఇలా రోజుల వ్యవధిలోనే నియామకాలు మార్చేయడం ప్రస్తుత సర్కార్‌కు కొత్తేమీ కాదు. ఆ మధ్య డీఆర్డీఏ అడిషనల్ పీడీగా పనిచేస్తున్న సుధాకర్‌ను ఇన్చార్జ్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతలోనే తెరవెనుక ఒత్తిళ్లు రావడంతో హుటాహుటీన ఆ పోస్టులో అడిషనల్ పీడీగా పనిచేస్తున్న పెద్దిరాజును నియమించారు. అంతకుముందు వివాదాస్పదంగా నిలిచిన పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్‌కు పీఎ టూ ఎస్ఈగా నియమించారు. ఆ ఉత్తర్వులిచ్చిన నాలుగురోజుల్లోనే రద్దు చేస్తూ మరో ఉత్తర్వులిచ్చారు. దీన్నిబట్టి సర్కార్ ఇస్తున్న ఉత్వర్వులకు విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే నవ్వులాటగా మారిపోయింది. దంపతులిద్దరికీ కీలక పోస్టింగ్‌లు డీఆర్డీఎ పీడీగా ఢిల్లీరావు నియమితులైన రోజునే ఆయన భార్య ప్రశాంతి కోసం ఏదొక పోస్టు ఖాళీ చేయాల్సిందేనని ‘సాక్షి’ ముందే చెప్పింది. ఇప్పుడదే జరిగింది. ప్రస్తుతం ఢిల్లీరావు దంపతులిద్దరూ గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారు. అక్కడ డ్వామా పీడీగా ఢిల్లీరావు, డీఆర్డీఎ పీడీగా ప్రశాంతి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అనూహ్యంగా ఢిల్లీరావు ఇక్కడ డీఆర్డీఏ పీడీగా నియమితులయ్యారు. అదే సందర్భంలో డ్వామా పీడీగా శ్రీకాకుళంలో అదే పోస్టులో పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తి నియమితులయ్యారు. దీంతో స్పౌజ్ కోటాలో జిల్లాకొస్తున్న ప్రశాంతికి ఆ స్థాయి పోస్టు జిల్లాలో కనిపించలేదు. తొలుత ఆర్డీఓగా రావాలని భావించా రు. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వెంకటరావు తన రాజకీయ సన్నిహితుల ద్వారా గట్టిగా ప్రయత్నించి బదిలీని ఆపుకొన్నారు. దీంతో అప్పటికే ఖాళీగా ఉన్న డీఆర్ఓ పోస్టుపై దృష్టి సారించారు. ఇంతలోనే విశాఖపట్నం ఏజేసీగా పనిచేసిన వై.నర్సింహారావు యుద్ధ ప్రాతిపదికన డీఆర్ఓ పోస్టింగ్ వేయించుకున్నారు. ఇక హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు తప్ప మరేది ఖాళీగా లేని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో ఆమెను హౌసింగ్ పీడీగా నియమించారన్న ప్రచారం జరిగింది. అంతా అదే భావించారు. కానీ అనూహ్యంగా ప్రశాం తికి డ్వామా పీడీ పోస్టు వరించింది. పైరవీలు, ప్రయత్నాలు ఏ స్థాయిలో ఫలించాయో తెలియదు గాని కళ్యాణ చక్రవర్తికిచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి ఆ స్థానంలో ప్రశాంతిని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మొత్తానికి భార్యాభర్తలిద్దరికీ కీలక పోస్టులు దక్కినట్టయింది. గుంటూరులో ఢిల్లీరావు డ్వామా పీడీగా పనిచేస్తే ఇక్కడ డీఆర్డీఎ పీడీగా నియమితులు కాగా, ప్రశాంతి అక్కడ డీఆర్డీఎ పీడీగా పనిచేస్తే ఇక్కడ డ్వామా పీడీగా నియమితులయ్యారు. జిల్లా మారడంతో వారిద్దరి పోస్టులు తారుమారైనట్టు అయింది. గతంలో జిల్లాలో పనిచేసినప్పుడు ఢిల్లీరావు విజయనగరం ఆర్డీఓగా పనిచేయగా, ప్రశాంతి పార్వతీపురం ఆర్డీఓగా పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ప్రశాంతి కేఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, హౌసింగ్ స్పెషలాఫీసర్ పోస్టులో కూడా పనిచేశారు. కొంపముంచిన ఆలస్యం ఈ ప్రభుత్వంలో ఉత్తర్వులకున్న విలువ ఏంటో తెలియక ఇటీవల డ్వామా పీడీగా నియమితులైన కళ్యాణ చక్రవర్తికి అనూహ్య షాక్ తగిలింది. ఉత్తర్వులిచ్చిన వెంటనే జాయిన్ అవ్వకపోవడంతో కొంపమునిగినట్టయింది. ఎప్పుడెలా ఉంటుందో తెలియకే ఇలా చేసి ఉంటారన్న వాదనలు వినిపించాయి. బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులైనా చేరకపోవడంతో ఇదే అవకాశంగా తీసుకుని ప్రశాంతిని అదే పోస్టులో నియమించారని అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో జెడ్పీ సీఈఓగా నియమితులైన గనియా రాజకుమారి, డీఆర్ఓగా నియమితులైన వై.నర్సింహారావు ముందు జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు జెడ్పీ సీఈఓగా పనిచేసిన మోహనరావు ప్రయత్నాలు ముమ్మురం చేసి, మళ్లీ రిటెన్షన్ ఉత్తర్వులు తెచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హుటాహుటీన వచ్చి గనియా రాజకుమారి ఇక్కడి బాధ్యతల్ని స్వీకరించారు. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేసినా మోహనరావుకు రిటైన్షన్ వచ్చేదని, తిరిగి సీఈఓగా కొనసాగేవారని జెడ్పీలో ఇప్పటికీ చర్చ సాగుతోంది. డీఆర్ఓ వై.నర్సింహరావు విషయంలో కూడా అదే జరిగింది. వాస్తవానికి నర్సింహరావు అంతకుముందు విశాఖ అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అదే పోస్టులో కొనసాగేందుకు రిటెన్షన్ వస్తుందని ఆశించారు. ఆ దృష్ట్యా మరో పోస్టు కోసం ప్రయత్నించలేదు. కానీ అకస్మాత్తుగా ఆయన కొనసాగుతున్న ఏజేసీ పోస్టులో వేరొకర్ని నియమించేశారు. దీంతో ఆయనకు పోస్టు లేని పరిస్థితి నెలకొంది. తీవ్రంగా ప్రయత్నించి అప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న డీఆర్ఓ పోస్టింగ్‌ను వేయించుకున్నారు. ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఇంకొకరు వేయించుకుంటారేమోనన్న భయంతో బదిలీ ఉత్తర్వు వచ్చిన మరుసటి రోజునే విధుల్లో చేరిపోయారు. లేదంటే ఆ పోస్టులో ప్రశాంతి నియమతులయ్యే వారనే ప్రచారం జరిగిం ది. -
మధ్యతరగతి నుంచి.. ఉన్నతస్థాయికి
కష్టం వస్తే.. ముందుకు సాగకుండా.. ఉన్నంతలో సర్దుకోవాలని భావించేవారు చాలామంది ఉంటారు.. ఇబ్బందులు అధిగమించి.. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగేది కొందరే.. అటువంటి వ్యక్తుల్లో డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి ఒకరు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ఈ జిల్లాలోనే పుట్టిపెరిగి.. సర్కారు బడుల్లో చదివి జిల్లాస్థాయి ఉన్నతాధి కారిగా ఎదిగారు. పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఉప్పునుంతలకు చెందిన తనకు ఈ జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం కలగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన లక్ష్యాన్ని చేరుకున్న విధానం ఆయన మాటల్లోనే...! ‘మా నాన్న జంగిరెడ్డి, అమ్మ రామచంద్రమ్మ.. మాది వ్యవసాయ కుటుంబం. మాది పాలమూరు జిల్లాలోని ఉప్పునుంతల. మా కుటుంబం వ్యవసాయ కుటుంబం కావడంతో ఉప్పునుంతలలోనే ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు సర్కారు బడిలో చదువుకున్నాను. ఉప్పునుంతలలోని మా పాఠశాలలో పదో తరగతి మొదటి బ్యాచ్ (1983లో) మాదే. అక్కడ పదో తరగతి పూర్తయ్యాక జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. ఆ తర్వాత ప్రభుత్వ ఎంవీఎస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివ ర్సిటీకి వెళ్లాల్సి వచ్చింది’. ఊహించని సందర్భాలు ‘రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించి, పీజీ లో చేరిన తర్వాత ఎంవీఎస్ కళాశాల అధ్యాపకులు డిగ్రీలో చేరినవిద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే విధంగా నాతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం నేను ఊహించలేదు. రెండుసార్లు మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యాను. ఉద్యోగాల వేటలో భాగంగా ఎస్ఐగా ఎంపికై కొద్దిరోజులు శిక్షణలో పాల్గొని తిరిగి వచ్చాను. గిరిజన కార్పొరేషన్ కన్సల్టెంట్‌గా కూడా ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ.. సంతృప్తి కలగక అదీ మానేశాను. 1996 ఏపీపీఎస్సీ ఎంపికల్లో పాల్గొని జిల్లాస్థాయి అధికారిగా ఉద్యోగావకాశం పొందగలిగాను. ఏదో ఒక ఉద్యోగం వస్తేచాలని అనుకున్నప్పటికీ.. వాటిలో తృప్తి చెందని కారణంగానే జిల్లాస్థాయి అధికారిగా అవకాశాన్ని దక్కించుకోగలిగాను. డీఆర్డీఏ పీడీగా మెదక్ జిల్లాలో పనిచేశాను. ఆ తర్వా సొంత జిల్లాకు రావడం.. వచ్చిన తర్వాత అధికారిక హోదాలో ఉప్పునుంతల మండలంలో పర్యటించే రోజు వస్తుందని ముందుగా ఎన్నడూ ఊహించలేదు’. ఆనంద క్షణాలు డీఆర్డీఏ, ఐకేపీ ద్వారా పేద కు టుంబాలకు చెందిన మహిళల పురోగతికి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి, అవి విజయవంతమయ్యేలా మా బృం దంతో కలిసి పనిచేసే ప్రతి క్షణం ఆనందంగా ఉంది. ఐకేపీ ద్వారా జరిపిన సర్వేలో భాగంగా జిల్లాలో 76వేలమంది కిశోర బాలికలు ఉన్నట్లు గుర్తించాం. అందులో 16వేల మంది బాలికలు బడి ముఖం చూడని వారున్నట్లు తేలింది. వారిలో దాదాపు 1200 మందిని ఎంపిక చేసి ఓపెన్ స్కూల్ విధానం ద్వారా పదో తరగతి పరీక్షలు రాయించాం. అందులో ఆసక్తి ఉన్న బాలికలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించగలగడం ఎంతో ఆనందం కలిగించింది. గ్రామాల్లో ఆకలితో అలమటించే పేదలకు పట్టెడన్నం పెట్టించాలన్న సంకల్పంతో ‘పిరికెడు బియ్యం’ అనే కాన్సెప్ట్‌తో మహిళా సంఘాల సభ్యు లు రోజూ పిరికెడు బియ్యం వాళ్ల ఇళ్లల్లోనే పక్కన తీసిపెట్టి వారి నెలవారి సమావేశం నాడు మహిళలందరూ ఒక్కచోట చేరినపుడు ఆ బియ్యం మొత్తాన్ని పేదవారికి అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాం. టర్నింగ్ పాయింట్ ‘మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ లో డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నపుడే ఎం ఎస్సీ బాటనీలో చేరేందుకు ఎంట్రె న్స్ రాసి అర్హత పొందాను. డిగ్రీ పూర్తయ్యాక ఎంట్రె న్స్ రాస్తే తప్పకుండా సీటు వస్తుందని అప్పు డు నాతోటి విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు నన్ను ఎంతో ప్రోత్సహించడంతో డిగ్రీ చివరి సంవత్సరంలో ఎంట్రెన్స్ రాస్తే పీజీ ఎంట్రెన్స్‌లో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు దక్కింది. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. ఉద్యోగం వచ్చే వరకు యూనివర్సిటీని వీడలేదు’. సాధించాల్సినవి.. జిల్లా నుంచి వలసలు తగ్గిం చేందుకు మా శాఖ తరఫున ఆయా పథకాలు పూర్తిస్థాయిలో పేదలకు అందించాలన్నది నా లక్ష్యం. నిరుద్యోగులకు అధికసంఖ్యలో ఉపాధి,ఉద్యోగాలుకల్పించాలని ఉంది. సామాజిక రుగ్మతలను రూపుమాపి అక్షరాస్యతలో ముందుకు నడిచేలా నా వంతు కృషి చేస్తాను. -
‘తెలంగాణ పల్లె ప్రగతి’
నల్లగొండ : నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన టీఆర్ఐజీపీ (తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం)కి ఇటీవల ‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చేశారు. ప్రపం చ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను జిల్లాకు తొలి విడతలో రూ.50 కోట్లు వెచ్చించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా చేపట్టనున్న ఈ కార్యక్రమాల ప్రణాళిక పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథ కం అమలుకు తొలి దశలో జిల్లా నుంచి 13 మండలాలు ఎంపిక చేశారు. డీఆర్డీఏ నిర్వహించిన బేస్‌లైన్ సర్వే ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబ డిన మండలాలుగా వీటిని గుర్తిం చారు. దేవరకొండ ఏరియాలో శిశు విక్రయా లు, మాతా శిశు మరణాలను అరికట్టేం దుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నా రు. ఈ పథకంలో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకుగాను డీఆర్డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్, వైద్యశాఖల సమన్వయంతో ఆయా మండలాల్లో ప్రజలను, మహిళల ను, రైతులను చైతన్య పర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తారు. రైతులను బృం దాలుగా ఏర్పర్చి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తారు. ఏ ఎన్ఎంల ద్వారా ఆరోగ్య సేవలు, ఐసీడీఎస్ ద్వారా మాతా, శిశు సంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలను ఐటీకి అనుసంధానం చేసి పర్యవేక్షిస్తారు. గ్రామపంచాయతీల్లో పౌరసేవ కేంద్రాలు ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పం చాయతీల్లో ‘మీ సేవ’ తరహాలో పౌర సేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నా రు. ప్రస్తుతం ఈమండలాల్లో 44 మీసేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు మండల కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయి. చందంపేట, డిండి, దేవరకొండ, పీఏపల్లి వంటి మండలాల్లో పలు చోట్ల మీ సేవ కేం ద్రాలు గ్రామాలకు మంజూరైనప్పటికీ సరైన వసతుల్లేక, విద్యుత్ సమస్య కారణంగా మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేశారు. అలా కాకుండా పౌర సేవా కేంద్రాలను పక్కాగా పంచాయతీల్లోనే ఏర్పాటు చేస్తారు. మీ సేవ కేంద్రాలు అందించే సేవలకు అదనంగా ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ వంటి సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఎంపిక చేసిన మండలాల్లో విజయవంతమైనట్లయితే రెండో దశలో మరిన్ని మండలాలకు విస్తరించే అవకాశం ఉంది. -
గొడవ.. గొడవ !
* ఉండవల్లి ఇసుక క్వారీ ప్రారంభోత్సవంలో అధికారులు, ట్రాక్టర్ యజమానుల మధ్య వాగ్వాదం * చలానాల చెల్లింపుపై వివరణ కోరిన కుంచనపల్లి సర్పంచ్ * దురుసుగా ప్రవర్తించిన అధికారులు * పోలీస్ కేసు పెట్టిస్తానని డీఆర్డీఏ ఏపీడీ బెదిరింపు తాడేపల్లి రూరల్ : ఇసుక తరలింపు విషయమై అధికారులు, ట్రాక్టర్ యజమానులు, ఓ సర్పంచ్ మధ్య జరిగిన వాగ్వాదం చివరకు గొడవకు దారితీసిన సంఘటన గురువారం ఉండవల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఉండవల్లి ఇసుక క్వారీని ప్రభుత్వం డ్వాక్రా గ్రూపు మహిళల కు అప్పగించింది. దీనిలో భాగంగా గురువారం క్వారీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా డీఆర్డీఏ ఏపీడీ పొట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు విచ్చేశారు. అంతకు ముందే కొందరు ట్రాక్టర్ యజమాను లు చలానాలు చెల్లించి, ఇసుక తరలించుకున్నారు. ఆ తరువా త గొడవ చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రాక్ట ర్ యజమానులు చలానాలు ఎక్కడ చెల్లించాలి, విధానమేమిటని ఈ సందర్భంగా అధికారులను అడిగారు. దీని గురించి స్థానిక ఎంపీడీవో, తహశీల్దార్లను అడిగి తెలుసుకోవాలని అధికారులు బదులిచ్చారు. * దీనిపై అసహనానికి గురైన ట్రాక్టర్ యజమానులు.. కొద్ది రోజులుగా చలానాల గురించి అడుగుతుంటే డీఆర్డీఏ ఏపీడీ, డ్వాక్రా మహిళలకే తెలుసంటూ స్థానిక అధికారులు సమాధానం ఇచ్చారని, తీరా ఇక్కడకు వస్తే, తెలియదంటున్నా రేంటని ఏపీడీని ప్రశ్నించారు. * దీంతో సదరు అధికారి ట్రాక్టర్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ట్రాక్టర్ యజమానులు గట్టిగా నిలదీయడంతో ఇసుక క్వారీ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. * ఈ సమయంలో కుంచనపల్లి సర్పంచ్ బడుగు శ్రీనివాసరావు క్వారీ వద్దకు చేరుకుని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా చలానాలు ఎలా చెల్లించాలో తెలియజేయకుండా క్వారీని ఎలా ప్రారంభిస్తున్నారని అధికారులను నిలదీశారు. * దీనిపై ఏపీడీ దురుసుగా వ్యవహరిస్తూ, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, క్వారీ నుంచి బయటకు వెళ్లండి, లేదా పోలీసు కేసు పెడతామని కేకలేశారు. * దీంతో బడుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందు వచ్చిన వారికి మాత్రమే చలానాలు ఎక్కడ కట్టాలో ముందస్తు సమాచారం ఎందుకు ఇచ్చారు? దీని వెనుక ఆంతర్యం ఏమి టి, అధికార పార్టీ నేతలకు అమ్ముడుపోయారా అంటూ ప్రశ్నించారు. కనీసం పత్రికా ప్రకటన ఇవ్వకుండా అధికారులు ఇలా సమాధానం చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తుందంటూ ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు. -
మహిళా సంఘాలకు టోపీ
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన టార్పాలిన్లు, కాంటాలు, తేమయంత్రాల కొనుగోలు బాధ్యతను స్వయంసహాయక సంఘాలకు కేటాయించడం ఐకేపీ(ఇందిరాక్రాంతి పథం) ఉద్యోగులకు వరంగా మారింది. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. డీఆర్డీఏ మార్గదర్శకాలకు విరుద్ధంగా నాసిరకం వస్తు సామగ్రిని సీజన్ దాటిన తరువాత కొనుగోలు చేసి సంఘాలకు అంటగట్టి సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నీలగిరి :గత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 250 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ప్రారంభానికి ముందు కొనుగోలు చేయాల్సిన టార్పాలిన్లు, ఇతర వస్తుసామగ్రిని సీజన్ ముగింపు దశకు చేరినప్పుడు కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకమైన వాటిని కొనుగోలు చేసి సంఘాలకు అంటగట్టారు. వాస్తవానికి మహిళా సంఘాలు స్వయంగా బహిరంగ మార్కెట్లో వాటిని కొనుగోలు చేయాలి. కానీ పలు మండలాల్లో ఏపీఎంలు, ఏసీలు జోక్యం చేసుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి కొన్నట్లు తెలిసింది. క మీషన్ దుర్వినియోగం... ధాన్యం కొనుగోలు తర్వాత మహిళా సంఘాలకు ఇచ్చే కమీషన్లోనుంచి కొంతడబ్బు వెచ్చించి టార్పాలిన్లు కొనుగోలు చేయాలి. ఇలా నాన్ ఆయకట్టు పరిధిలో ఏర్పాటు చేసిన 15 కేంద్రాలుఎక్కువ మొత్తంలో టార్పాలిన్లు కొనుగోలు చేశాయి. వీటిలో ఎక్కువ భాగం వలిగొండ, పోచంపల్లి, తిప్పర్తి, రామన్నపేట, ఆలేరు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 1656 టార్పాలిన్లు కొన్నారు. వీటితో పాటు కాంటాలు12, స్కేళ్లు 35 కొన్నారు. ఒక్కో టార్పాలిన్కు డీఆర్డీఏ నిర్ధారించిన ధర రూ.2,450. ఈ లెక్కన టార్పాలిన్ల కొనుగోలుకు సుమారు రూ.40,57,200 కేటాయించారు. కానీ పలు మండలాల్లో నిర్ధారించిన ధరకు అదనంగా రూ.130 వెచ్చించి కొన్నారు. ని ర్ధారించిన ధరల ప్రకారం నిర్ణీత ప్రమాణాలు కలిగిన సామగ్రి మాత్రమే కొనుగోలు చేయాలని డీఆర్డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఏ ఒక్క మార్గదర్శకాన్ని పాటించలేదు. టార్పాలిన్ల విషయానికొస్తే.. ఐదు లేయర్లు మందం కలిగి, నలుపు రంగులో ఉండాలి. పొడవు 8 మీటర్లు, అడ్డం 6 మీటర్లు ఉండాలి. కానీ పోచంపల్లి మండలానికి వచ్చిన టార్పాలిన్లు పరిశీలిస్తే మాత్రం 6 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల పొడవు ఉన్నాయి. ధర కూడా అధికమే. పట్టాలు నాసిరకంగా ఉన్నాయి. పట్టింపులేని యంత్రాంగం.. ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన టార్పాలిన్లు, ఇతర సామగ్రి వైపు అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించారా..?లేదా? అనేది కూడా పరిశీలన చేయలేదు. గతంలో మార్కెటింగ్ శాఖ నుంచే ఐకేపీ కేంద్రాలకు టార్పాలిన్లు, తేమ యంత్రాలు పంపిణీ చేసేవారు. కానీ ఈసారి కొనుగోలు బాధ్యతను సంఘాలకు అప్పగిండచం వల్ల ఐకేపీ ఉద్యోగులకు ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికైన అధికారులు స్పందించిన నాణ్యతా ప్రమాణాలపై పూర్తి విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగు వస్తాయని సంఘాలు కోరుతున్నాయి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే మౌలిక వసతులప్పుడైనా కనీసం జాగ్రత్తలు పాటించేందుకు వీలుంటుంది. మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 250 టార్పాలిన్లు కొన్న కేంద్రాలు : 15 మొత్తం టార్పాలిన్లు : 1656 కేటాయించింది : రూ.40,57,200 ఒక్కో టార్పాలిన్కు నిర్ధారించిన ధర : రూ.2450 సిబ్బంది కొనుగోలు చేసింది : రూ.2580 అదనంగా చెల్లించింది : రూ.130 మొత్తంగా ఖర్చు చేసింది : 42,72,480 (మహిళా సంఘాల కమీషన్లోనుంచే టార్పాలిన్లకు డబ్బు కేటాయించారు) -
‘అభయహస్తం’పై రాజకీయ క్రీనీడ
పలమనేరు: అధికార పార్టీ పింఛన్ల పరిశీలన కమిటీ తీరు అభయహస్తం లబ్ధిదారులకు భస్మాసుర హస్తంగా మారింది. కమిటీ పరిధిలో లేని ఈ పథకంలోనూ రాజకీయం ప్రదర్శించారు. ఒక సంతకంతో అన్ని పింఛన్లనూ రద్దు చేసేశారు. జన్మభూమి గ్రామసభల్లో అధికారులను మహిళలు నిలదీస్తుండడంతో పొరపాటు జరిగిందని తిరిగి ఆ పింఛన్లు ఇస్తామంటూ మభ్యపెట్టేందుకు నానా యాతన పడుతున్నారు. ఇదిగో సాక్ష్యం పలమనేరు పురపాలకసంఘ పరిధి లో 151 మందికి వైఎస్ఆర్ అభయహస్తం ద్వారా ప్రతినెలా రూ.500 పింఛన్ ఇచ్చేవారు. డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు బీమా చేసుకుని, 60 ఏళ్లు నిండాక అభయహస్తం పింఛన్ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా గ్రూ పుల నిర్వహణలో సభ్యుల డబ్బుతో జరిగే కార్యక్రమం. ఇదేమీ పట్టించుకోని పింఛన్ల పరిశీలన కమిటీ సభ్యు లు మున్సిపాలిటీలోని అభయహస్తం లబ్ధిదారులందరినీ జాబితా నుంచి తొలగించేశారు. ఈ పథకం ద్వారా పలమనేరులో 151 మంది రూ. 3,650 ప్రీమియంగా చెల్లించారు. వీరి కి అప్పటి ప్రభుత్వం అంతే మొత్తం జమ చేసింది. దీంతో వీరు ప్రతి నెలా రూ.500 పింఛన్ తీసుకుంటున్నారు. ఇప్పుడేం జరిగిందంటే అభయహస్తం పింఛన్లపై అవగాహన లేని ఈ కమిటీ సభ్యులు ఏకపక్షంగా లబ్ధిదారులకు 65 ఏళ్లు నిండలేదనే సాకుతో జాబితా నుంచి తొలగించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1,600 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆయా ప్రదేశాల్లో కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. మండలాల్లో దాదాపు 9 వేల మంది అభయహస్తం పింఛన్దార్లలో ఏడు వేల మందిని తొలగించినట్టు సమాచారం. పొరపాటు జరిగిందంటున్న అధికారులు అభయహస్తం పింఛన్ల జోలికి వెళ్లొద్ద ని సాక్షాత్తు సీఎం ఆదేశించినా కమిటీ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరించా రు. వైఎస్ఆర్ అభయహస్తం పథకం లో ఎంపికైన వారంతా వైఎస్ఆర్సీపీ కి చెందిన వారని తొలగించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలమనేరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావ్ను వివరణ కోరగా మాకు కూడా తెలియకుం డానే జాబితాలో అభయహస్తం పింఛన్లన్నీ తొలగించారన్నారు. ఈ విషయమై డీఆర్డీఏ పీడీతో సంప్రదించామని తెలిపారు. వారందరికీ తిరిగి పింఛన్లు వచ్చేలా చూస్తామన్నారు. -
కర్నూలులో ఈ-టాయ్‌లెట్స్
కర్నూలు(జిల్లా పరిషత్): నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఎలక్ట్రానిక్ బయో టాయ్‌లెట్స్(ఈ-టాయ్‌లెట్స్) ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు స్థానిక రాజవిహార్ సెంటర్ వద్ద ఉన్న బస్టాప్, రైల్వేస్టేషన్‌కు సమీపంలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. అక్టోబర్ మొదటి వారంలో రాజవిహార్ సెంటర్లో ఈ-టాయ్‌లెట్ ప్రారంభించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రం సైంటిఫిక్ సొల్యూషన్స్(తివేండ్రం) వారు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టాయ్‌లెట్ ఖరీదు రూ.6లక్షలు. వీటిని ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, వైజాగ్ సిటీల్లో ఏర్పాటు చేశారు. ఈ విధానాన్ని కర్నూలులో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నారు. ఈ విధానం విజయవంతమైతే మరిన్ని ఈ టాయ్లెట్లు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ పీవీవీ సత్యనారాయణమూర్తి చెప్పారు. ఈ-టాయ్‌లెట్స్ పనిచేసే విధానం ఈ-టాయ్లెట్లలో వెళ్లాలంటే రూ.5ల నాణేన్ని వేయాలి. నాణెం వేసిన వెంటనే డోర్ తెరుచుకుంటుంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బటన్‌ను నొక్కితే ఆటోమేటిక్‌గా శుభ్రం అవుతుంది. ఒకవేళ శుభ్రం చేయకపోయినా బయటకు వచ్చి డోర్ వేసిన వెంటనే ఆటోమేటిక్‌గా టాయ్‌లెట్ శుభ్రపడుతుంది. టాయ్లెట్లో నీరు అయిపోయినా, ఒకేసారి ఇద్దరు టాయ్లెట్లోకి వెళ్లినా వెంటనే సంబంధిత సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది. వెంటనే సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఈ-టాయ్‌లెట్‌కు ఏర్పా టు చేసిన సెప్టిక్ ట్యాంకులో డీఆర్డీఏ వారి సహకారంతో ఇనాకులం అనే పురుగులను వదులుతారు. ఆ పురుగులు సెప్టిక్ ట్యాంకులోని మలినాలను తిని శుభ్రం చేస్తాయి. -
మహిళా సంఘాల పనితీరు భేష్
- విదేశీ ప్రతినిధుల కితాబు - జిల్లా అధికారులతో కలిసి వెల్టూర్ గ్రామ సందర్శన సదాశివపేట: వివిధ దేశాల ప్రతినిధులతో పాటు సెర్ప్, డీఆర్డీఏ, ఐకేపీ జిల్లా అధికారులు గురువారం మండల పరిధిలోని వెల్టూర్ గ్రామాన్ని సందర్శించారు. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు సంఘాల సభ్యులతో మాట్లాడి సంఘం రికార్డులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో 54 సంఘాలు ఉన్నాయని, ప్రతి సంఘం ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లింపుల వివరాలను స్థానిక సిబ్బంది, సమాఖ్య లీడర్లు వీరికి వివరించారు. బ్యాంకుల ద్వార 47 సంఘాలకుగాను రూ.1,78,5500 బ్యాంకు రుణాలతోపాటు, శ్రీనిధి బ్యాంకు ద్వారా 29 స్వయం సంఘాల గ్రూపుల్లోని 135 మందికి రూ.15,65,440 బ్యాంకు రుణాలు ఇచ్చారని తెలిపారు. వీటితో తాము పాడిగేదెలు, మేకలు, గొర్రెల పెంపకం, కూరగాయలను పండించడం, అమ్మడం, కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం తదితరాలకు వినియోగించామన్నారు. అనంతరం ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఐకేపీ మండల సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అస్ట్రేలియా నుంచి స్నేహాల్‌సోహేల్, ఇరాన్ ప్రతినిధి ఫతేమహ అబ్కారి, కేన్యా నుంచి వెన్నా మొకారి ఓంవారి, మాడగాస్కర్ నుంచి రకోటమాలాల మిరియా రబియారిసో, షేశేల్లీస్ నుంచి బెట్టి మరియాసోపా, టంజానియా నుంచి ప్రోన్సికో ఎలాయాస్, తైలాండ్ నుంచి డమరోగో జయంతోలతో పాటు రాషఫకేశ్వర్‌లతో మండల ఐకేపీ ఎపీఎం వెంకట్ పాల్గొన్నారు. -
అక్రమాల గుట్టు రట్టు
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చేసి గృహ నిర్మాణశాఖ అధికారులు రూ.2.29 కోట్లను సిమెంటు సరఫరా సంస్థలకు దోచిపెట్టడాన్ని కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక తప్పుపట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు పెన్షన్ల పంపిణీలో స్మార్ట్ కార్డు విధానం ఘోరంగా విఫలమైనా దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోయారని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ(డీఆర్డీఏ) అధికారులకు అక్షింతలు వేసింది. రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతిని కడిగేసింది. ఆ శాఖలో కొంద రు అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.5.31 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేల్చింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్ ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టింది. జిల్లాలో గృహనిర్మాణశాఖ, డీఆర్డీఏ, రెవెన్యూ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని, అలసత్వాన్ని కడిగిపారేసింది. జూన్ 2011 నుంచి జూలై 2011 మధ్య జిల్లాకు 1,79,197 బస్తాల సిమెంటు సరఫరా చేయకనే చేసినట్లు చూపి రూ.2.29 కోట్ల బిల్లులను ఆశాఖ అధికారులు కాంట్రాక్టర్‌కు చె ల్లించేశారు. ఉత్తినే దోచిపెట్టిన ఆ నిధులను వసూలు చే యాలని 2011-12 నివేదికలో గృహనిర్మాణశాఖ అధికారులను కాగ్ ఆదేశించింది. కానీ.. కాగ్ ఆదేశాలను అ ధికారులు బుట్టదాఖలు చేశారు. ఇదే అంశాన్ని 2012-13 నివేదికలోనూ కాగ్ ఎత్తిచూపింది. డీఆర్డీఏ అధికారులపై అక్షింతలు.. జిల్లాలో 66 మండలాలకుగానూ 56 మండలాల్లోనూ ఎనిమిది నగర, పురపాలక సంస్థల్లోనూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా పెన్షన్‌ను స్మార్ట్‌కార్డుల ద్వారా జారీ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకు ఆరు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ.. స్మార్ట్ కార్డుల ద్వారా బ్యాంకులు పెన్షన్లను పంపిణీ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టలేని డీఆర్డీఏ అధికారులు.. చివరకు స్మార్ట్ కార్డుల ద్వారా పెన్షన్ల పంపిణీని ఆరు మండలాలకే పరిమితం చేశారు. కానీ.. ఇప్పటికీ సకాలంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయలేకపోతున్నారు. లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీలో కనిష్టంగా నాలుగు రోజులు.. గరిష్టంగా 34 రోజులు ఆలస్యమవుతోందంటూ డీఆర్డీఏ అధికారులకు కాగ్ అక్షింతలు వేసింది. రెవెన్యూశాఖ అధికారుల తీరునూ తూర్పారబట్టింది. రెవె‘న్యూ’ మాయాజాలం.. చిత్తూరు, గుడిపాల మండలాల్లోని మాపాక్షి, 190 రామాపురం గ్రామాల్లో ఓ సంస్థకు వైద్య కళాశాల ఏర్పాటుకు 640.17 ఎకరాల భూమిని కేటాయిస్తూ మార్చి, 2010న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏ విద్యా సంస్థకైనా మార్కెట్ ధరకే భూములు కేటాయించాలని ప్రభుత్వం ఫిబ్రవరి 2005లో చేసిన నిబంధనకు నీళ్లొదిలారు. మార్కెట్ ధర ప్రకారం రూ.1.50 లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకూ పలుకుతోన్న భూమిని అప్పటి కలెక్టర్ రూ.లక్షకే కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రూ.లక్ష ప్రకారం తీసుకున్నా క్రమబద్ధీకరణ, స్టాంప్ డ్యూటీ కలుపుకుని ఆ వైద్య కళాశాల ప్రభుత్వానికి రూ.18.96 కోట్లు చెల్లించాలి. కానీ.. ఏప్రిల్, 2010న ఆ సంస్థ రూ.16.14 కోట్లే చెల్లించింది. తక్కిన రూ.2.82 కోట్లు చెల్లించలేదు. ఆ సొమ్మును రాబట్టాల్సిన రెవెన్యూ అధికారులు మరో అడుగు ముందుకేసి.. ఆ భూమిలో వాగులు, వంకలు, పోరంబోకు భూమికి కూడా పరిహారం చెల్లించారనే సాకు చూపి ఆ సంస్థకు రూ.1.19 కోట్లను వాపసు ఇచ్చారని కాగ్ తేల్చింది. ఇందులో ఆంతర్యమేమిటని రెవెన్యూ అధికారులను నిలదీసింది. పూతలపట్టు మండలం ముత్తరేవులలో మరో విద్యా సంస్థకు భూకేటాయింపులపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ముత్తరేవులలో విద్యా సంస్థ ఏర్పాటుకు జూన్ 1999లో 17.84 ఎకరాల భూమి కేటాయించాలని ఓ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును పరిశీలించిన అప్పటి కలెక్టర్ 14.39 ఎకరాల భూమి ఆ సంస్థకు కేటాయిస్తే సరిపోతుందని తేల్చారు. కానీ.. ఆ నివేదికను పట్టించుకోని జిల్లా అధికారయంత్రాగం డిసెంబర్, 2009లో ఆ సంస్థకు 48.73 ఎకరాలను కేటాయించాలని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం 34.34 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించింది. ఎకరా రూ.నాలుగు లక్షల చొప్పున ఆ సంస్థ నుంచి వసూలు చేయాలని సూచించింది. కానీ.. భూమిని క్రమబద్ధీకరించడంలో రూ.57.56 లక్షలు ప్రభుత్వానికి నష్టం చేకూరేలా రెవెన్యూ అధికారులు చేశారని కాగ్ తప్పుబట్టింది. -
‘ఉత్తర్వుల’ రాజకీయం
- దొంగోడి ఆస్తులకు కాపలాకాస్తారా అంటూ అధికారులు, పోలీసులపై మండిపాటు - గేటెక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించిన రైతులు - సీతానగరం తహశీల్దార్ నిర్బంధం - చెరుకు బకాయిల కోసం ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్న రైతు నేతలు - నేడు నాటుబళ్లతో రహదారుల దిగ్బంధానికి పిలుపు సాక్షి ప్రతినిధి, విజయనగరం : డీఆర్డీఎ పీడీగా పనిచేసిన జ్యోతిని వెనక్కి పంపించేయాలని జూలై 31న అటవీ శాఖాధికారులు రీపేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆఉత్వర్వులు అమలు కాలేదు. దీంతో రీపేట్రియేట్ ఉత్తర్వులు నిలి చిపోయాయని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న జ్యోతి ని రిలీవ్ చేయాలని సెర్ఫ్ అధికారులు వేరేగా ఉత్తర్వులు జారీ చేశారు. అదే ఉత్తర్వుల్లో ఇక్కడ అడిషనల్ పీడీగా పనిచేస్తున్న బి.సుధాకర్‌కు ఎఫ్ఏసీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 24న బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే ఆయన నియామక ఉత్తర్వులను రద్దు చేసి అదే శాఖలో మరో అడిషనల్ పీడీగా పనిచేస్తున్న పెద్దిరాజుకు అప్పగిస్తూ సెర్ఫ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో వ్యవహారం మరింత రసవత్తరంగా సాగింది. పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాస్‌కుమార్‌ను గతనెల 12న ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ సీవీఎస్ రామ్మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే శ్రీనివాస్ ఈఈ హోదాలో అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అయితే, ఆ ఉత్తర్వులు చెల్లవని, ఈఈ బాధ్యతల్ని విడిచిపెట్టాక వచ్చి పాత తేదీతో సంతకాలు పెట్టారని పేర్కొంటూ ఆయనపై విచారణ చేయడమే కాకుండా టెక్నికల్ అసిస్టెంట్ల పొడిగింపు ఉత్తర్వులను రద్దు చేశారు. ఇదేదో అయ్యిందనుకుంటే తాజాగా అదే డీఈఈ శ్రీనివాస్‌కుమార్‌కు పీఏ టూ ఎస్ఈ పోస్టింగ్ ఇస్తూ ఇంజనీరింగ్ చీఫ్ ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులొచ్చిన నాలుగు రోజుల్లోనే వాటిని రద్దు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. దీన్ని బట్టి ఆ రెండు శాఖల్లో ఎంత గందరగోళం నెలకుందో అర్థం చేసుకోవచ్చు. దేన్ని అనుసరించాలో తెలి యక ఆ శాఖల్లోని ఉద్యోగులు తికమకకు గురయ్యారు. దీనికంతటికీ సంబంధిత అధికారులో, ఆ శాఖ ఉన్నతాధికారులో కారణమనుకుంటే పప్పులో కాలేసినట్టే. అభిప్రాయ బేధాలతో కత్తులునూరుకుంటున్న టీడీపీ నాయకులే ప్రధాన కారణమని పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కావల్సిన అధికారులను కొనసాగించాలనో, నచ్చని అధికారులను పంపించాలనో, కాసులకు కక్కుర్తిపడో తెలియదు గాని ఒకరు అవునంటే మరొకరు కాదని లోపాయికారీగా చేస్తున్న యత్నాలతో ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి. డీఆర్డీఏ పరిణామాలను తీసుకుంటే పీడీగా పనిచేసిన జ్యోతి... తనకు విలువ ఇవ్వలేదని, తాను నమ్మిన వ్యక్తి సన్నిహిత ఉద్యోగులను ఇబ్బంది పెట్టారన్న ఏకైక కారణంతో సా గనంపేందుకు ఓనేత విశ్వప్రయత్నాలు చేశా రు. జ్యోతి మాతృశాఖలోని ఉన్నతాధికారుల తో ఉన్న సంబంధాలను వినియోగించుకుని రీ పేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ నేపథ్యంలో జ్యోతికి ఓ టీడీపీ ఎమ్మెల్యే అండ గా నిలిచారని తెలిసింది. ఆఉత్తర్వులను ఆపేం దుకు ఆ ఎమ్మెల్యే తెగ ప్రయత్నించారు. కానీ ఆమాజీ మంత్రి...తనకే సవాల్ విసురుతారా అని మరింతగా పట్టుబిగించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దల సాయంతో సెర్ఫ్ అధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎందుకొచ్చిన తల నొప్పి జ్యోతిని రిలీవ్ చేయాలంటూ సెర్ఫ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మాజీ మంత్రి లక్ష్యం మేరకు జ్యోతిని సాగనంపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పీడీ ఇన్ఛార్జ్ బాధ్యతల విషయంలో కూడా రాజకీయం చోటు చేసుకుంది. జ్యోతిని రిలీవ్ చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లోనే అడిషనల్ పీడీగా పని చేసిన బి.సుధాకర్‌కు ఎఫ్ఎసీ బాధ్యతలను అ ప్పగించాలని సెర్ఫ్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆయన కన్నా మరో సీనియర్ అడిషనల్ పీడీగా ఉన్న పెద్దిరాజును కాదని సుధాకర్ కు ఎలా బాధ్యతలు అప్పగిస్తారని ఓ వర్గం ఫి ర్యాదులకు దిగింది. ఆ వర్గానికి అండగా టీడీపీకి చెందిన కొందరు నేతలు నిలిచారు. తప్పో ఒప్పో పక్కనపెడితే సెర్ఫ్ అధికారులు తన ని ర్ణయాన్ని మార్చుకుని పెద్దిరాజుకు ఎఫ్ఏసీ ఇ వ్వాలని ఉత్తర్వులిచ్చారు. ఏ నిర్ణయమైనా ఆ లోచించి తీసుకోవల్సిన ఉన్నతాధికారులు జి ల్లా నుంచి వచ్చిన ఒత్తిళ్లతో రోజుల వ్యవధిలో నే పాత వాటిని రద్దుచేసి కొత్త ఉత్తర్వులిస్తున్నా రు. దీంతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిస్థితి కూడా అంతే. పలువురు టీడీపీ ఎమ్మెల్యేల భరోసాతో డీఈఈ శ్రీనివాస్‌కుమార్ జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణికి సవాల్ విసిరారు. అప్పటికే డీఈఈైపై కన్నెర్రతో ఉన్న కేంద్రమం త్రి అశోక్ గజపతిరాజును ఆశ్రయించి చైర్పర్స న్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. తొలుత ఈ ఈ బాధ్యతల్ని తొలగించేలా తెరవెనుక పావు లు కదిపిన చైర్పర్సన్ ఆనక శ్రీనివాస్‌కుమార్ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులను వెలుగులోకి తెచ్చి కఠిన చర్యలు తీసుకునేలా పథక రచన చేశారు. ఎమ్మెల్యేల అండతోనే డీఈఈ ఇష్టారీతిన వ్యవహరిస్తారని చివరికీ అశోక్ దృష్టికి తీసుకెళ్లకలిగారు. దీంతో టెక్నికల్ అసిస్టెంట్ల ఉత్తర్వులను రద్దు చేయించారు. అయితే, అందుకు ప్రతి సవాల్‌గా డీఈ ఈ శ్రీనివాస్‌కుమార్ ఏకంగా పీఏ టూ ఎస్ఈ పోస్టింగ్ ఉత్తర్వులను తెప్పించుకోగలిగారు. ఆయనకున్న ఎమ్మెల్యే అండదండలే పై స్థాయి లో సహకరించాయనే వాదనలు విన్పించాయి. దీంతో చిర్రెత్తిపోయిన చైర్పర్సన్ తనను ఓవర్ టేక్ చేసి, తనను చిన్నబోయేలా చేసిన డీఈఈ శ్రీనివాస్‌కు వేసిన పీఎ టూ ఎస్ఈ ఉత్తర్వులను రద్దు చేయించేలా కేంద్రమంత్రి ద్వారా ఉన్నత స్థాయిలో పావులు కదిపారు. ఆమేరకు రద్దు ఉత్తర్వులొచ్చాయి. ఇదంతా నవ్వులాటగా మారిపోయింది. -
మహిళలకే ఇసుక రీచ్‌లు
విజయనగరం కంటోన్మెంట్: ఎట్టకేలకు ఇసుక విధానం ఖరారయింది. రీచ్‌లను మహిళల కు కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. మైనింగ్ శాఖ కార్యాలయానికి శనివారం ఉత్తర్వులు చేరాయి. ఇసుక తవ్వకా లు, విక్రయాల బాధ్యతను ఇసుక రీచ్‌లు పొందే మహిళలకే అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్‌లోని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి పేరున విడుదలయిన ఉత్తర్వులు, రాష్ట్ర ఖనిజ తవ్వకాల నిబంధనల ప్రకారం ఈ ఇసుక రీచ్‌లను నిర్వహించాలి. ఇసుక రీచ్‌లను ఎంపిక చేసేందుకు, వేలం వేసేందుకు జిల్లాలోని డీఆర్డీఏ పీడీ మెంబర్ కన్వీనర్‌గా ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ అధ్యక్షతన సమావేశమయ్యే ఈ కమిటీ జిల్లాలోని ఎక్కడెక్కడ ఇసుక రీచ్‌లున్నాయి, తవ్వకాలకు సరిపడా ఇసుక నిల్వలెక్కడున్నాయో పరిశీలించి, వాటిని వేలం వేయవచ్చునో లేదో నిర్ణయం తీసుకుంటుంది. భూ గర్భజల శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ వంటి శాఖల సమన్వయంతో ఇసుక రీచ్‌లను ఎంపిక చేస్తారు. మహిళా సంఘాల దరఖాస్తులననుసరించి అర్హత గల సంఘాలకు అప్పగిస్తారు. తవ్వకాలు జరిపే ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా ఎంత మేర ఇసుక తవ్వకాలు అనుమతులిచ్చినది, ఎంత మేర తవ్వుతున్నదీ పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. ఇసుక రీచ్‌లు పొందిన సంఘాలు చెల్లింపులను ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఇసుకను తరలించే లారీలు జిల్లా సరిహద్దులు దాటడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి, సొమ్ము చేసుకునేందుకు వీలు లేకుండా, విచ్చలవిడి వ్యాపారానికి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేశారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఇసుక రీచ్‌లను ఎంపిక చేసిన తరువాత మహిళా సంఘాల నుంచి దరఖాస్తులు కోరతారు. దరఖాస్తులు చేసుకున్న మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు కేటాయిస్తారు. వారికి అవసరమైన పెట్టుబడులు కూడా జిల్లా స్థాయిలోని కమిటీ సమకూరుస్తుంది. ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు అవసరమైన యంత్రాల సమీకరణ కూడా చేస్తారు. కలెక్టర్, ఎస్పీల సహాయంతో ఈ ఏర్పాట్లు చేస్తారు. కమిటీ సభ్యులు వీరే... డీఆర్డీఏ పీడీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో జేసీ, ఎస్పీలు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. జెడ్పీ సీఈఓ, ఇరిగేషన్ ఎస్ఈ, డ్వామా పీడీ, డీపీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, గనుల శాఖ ఏడీ, భూగర్భజల వనరుల శాఖ ఈఈ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు తదితరులు సభ్యులుగా ఉంటారు. మహిళా సంఘాలకు 25 శాతం ఇందులో వచ్చే లాభాల్లో 25 శాతం మాత్రమే మహిళలకు కేటాయిస్తారు. మిగతా లాభాలు జెడ్పీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఖజానాకు చేరతాయి. భూగర్భ జలాలకు విఘాతం కలిగించే ఇసుక రీచ్‌లను నిషేధించడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అధికారం అప్పగించారు. ఇసుక రీచ్‌లను తవ్వేందుకు 500 మీటర్లకు పరిమితి విధించారు. ఈ పరిమితి మించి తవ్వకాలను చేపట్టకూడదు. పట్టాదారులకూ తవ్వకాలకు అనుమతి జిల్లాలోని జిరాయితీ భూముల్లో ఇసుక నిల్వలుంటే తవ్వుకోవడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో అనుమతులను ఇస్తారు. ఈ అనుమతులకోసం పట్టాదారు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. జిరాయితీ భూముల్లోని ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే లాభంలో 25 శాతం మాత్రమే పట్టాదారుకు చెందుతుంది. మిగతా లాభం జెడ్పీలకే వెళ్తుంది. వాటిలో మండలాలకు కూడా కొంతవాటా ఉంటుంది. ఈ వాటాలను కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. మండల, గ్రామాల పరిధిలో నాటుబళ్లు, ట్రాక్టర్ల ద్వారానే ఇసుక తరలింపు చేపట్టాలి. రెండు సార్లు జరిమానాలు విధించిన తరువాత మూడో సారి అదే వాహనం తనిఖీల్లో పట్టుబడితే సీజ్ చేస్తారు. ప్రతీ నెలా జిల్లాలోని కమిటీ సమావేశమై ఇసుక తవ్వకాలు, రవాణాలను పరిశీలించి సమీక్షిస్తుంది. ఐదేళ్లుగా అనుమతులు లేవు జిల్లాలో గతంలో 51 ఇసుక రీచ్లుండేవి. ప్రస్తుతం ఒక్కదానికి కూడా అనుమతులు లేవు. జిల్లాలో భూగర్భ జలాలు ఇంకిపోతున్న కారణంగా ఇసుక తవ్వకాలను నిషేధించారు. దీంతో జిల్లాలో ఇసుక రీచ్‌లకు గడచిన ఐదేళ్లుగా మంజూరు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడంతో జిల్లా ఇసుక కమిటీ సమావేశమై ఇసుక రేవులను గుర్తిస్తేనే ఎక్కడెక్కడ ఇసుక ఉందన్న విషయం తెలుస్తుంది. తద్వారా ఇసుక రీచ్‌లను వేలం వేయడానికి ఆస్కారం ఉంటుంది. -
నెలాఖరులోగా వాయిదా కట్టిస్తాం
ఒంగోలు టౌన్: జిల్లాలోని పొదుపు గ్రూపుల్లో ఇప్పటివరకు వాయిదాలు కట్టకుండా ఉన్న గ్రూపుల నుంచి నెలాఖరుకు ఒక వాయిదా కచ్చితంగా కట్టిస్తామని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఎ.పద్మజ బ్యాంకర్లకు హామీ ఇచ్చారు. శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఐకేపీ, బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పొదుపు గ్రూపులకు సంబంధించి ప్రతి గ్రూపునకు లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తూ ప్రభుత్వం జీఓ నెం.164 జారీ చేయడంతో ఎక్కువ మంది గ్రూపులు తాము తీసుకున్న రుణాలను బ్యాంకులకు చెల్లించలేదన్నారు. బ్యాంకులకు రుణాలు చెల్లించకున్నా, ఖాతాలు నిలిపివేసినా, వడ్డీలేని రుణాన్ని కోల్పోవడంతోపాటు భవిష్యత్‌లో రుణాలను కోల్పోతారని స్పష్టం చేయడంతో 50శాతం గ్రూపులు తిరిగి రుణాలు చెల్లించాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 30,131పొదుపు గ్రూపులున్నాయని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 934 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ప్రాజెక్టు డెరైక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు రుణాలు చెల్లించని పొదుపు గ్రూపుల వివరాలను బ్యాంకుల వారీగా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 50 శాతం గ్రూపులు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదని తేలడంతో, నెలాఖరులోగా కనీసం ఒక వాయిదా చెల్లించేలా చూడాలని ఐకేపీ సిబ్బందిని పద్మజ ఆదేశించారు. ప్రతి ఇంటిలో రెండు బ్యాంకు ఖాతాలు తెరవాలి ప్రధానమంత్రి జన ధన యోజన పథకం కింద ప్రతి ఇంటిలో ఇద్దరు కుటుంబ సభ్యులు విధిగా రెండు ఖాతాలు తెరవాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ పద్మజ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్నిరకాల రాయితీలు పొందాలంటే ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. గ్యాస్ రాయితీ, రేషన్ రాయితీ, హౌసింగ్ రాయితీ తదితరాలు పొందాలంటే ఆధార్ కార్డులు తప్పనిసరి చేశారన్నారు. ఆధార్ కార్డులు కలిగినవారికి వారి ఖాతాల్లో రాయితీ నగదు జమ కావాలంటే విధిగా బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. పొదుపు గ్రూపుల్లో దాదాపు ఐదు లక్షల మంది మహిళలున్నారని, వారిలో లక్ష నుంచి రెండు లక్షల మందికి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేవన్నారు. సెప్టెంబర్ 9 నాటికి వారందరూ బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు మేనేజర్, ఐకేపీ సీసీ లేదా ఏపీఎంలు రోజుకో గ్రామానికి వెళ్లి అక్కడికక్కడే బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారన్నారు. అయితే ఏ రోజు ఏ గ్రామానికి ఈ బృందం వస్తుందో ముందుగానే గ్రామంలో ‘టాంటాం’ వేయిస్తామన్నారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు అవసరమైన డాక్యుమెంట్లు తీసుకువస్తే అక్కడికక్కడే ‘జీరో’ అకౌంట్‌తో సంబంధిత వ్యక్తులకు ఓపెన్ చేయిస్తామని పద్మజ వివరించారు. ఈ సమావేశంలో సిండికేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సీబీఎల్ నరసింహారావు, ఎల్డీఎం ఎం.నరసింహారావు, నాబార్డు ఏజీఎం జ్యోతిశ్రీనివాస్, డీపీఎం(బ్యాంకు లింకేజి) బి.సుబ్బారావు, ఏపీడీలు రాజేంద్ర, రవిలతోపాటు బ్యాంకుల కో ఆర్డినేటర్లు, ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు. -
డీఆర్డీఏ పీడీ జ్యోతిని రిలీవ్ చేయాలని ఉత్తర్వులు
అడిషనల్ పీడీ సుధాకర్‌కు తాత్కాలిక బాధ్యతలు సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్ జ్యోతిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు సెర్ఫ్ సీఈఓ రాజశేఖర్ నుంచి ఉత్తర్వులొచ్చాయి. పీడీ బాధ్యతలను తాత్కాలికంగా అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా కొనసాగుతున్న సుధాకర్‌కు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యాంపులో ఉన్న జ్యోతి రాగానే రిలీవ్ చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు. డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న డీఆర్డీఎ ప్రాజెక్టు డెరైక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, మాతృశాఖకు పం పించేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులు గత నెల 31వ తేదీనే రీ పేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేశారు. రిలీవైన తర్వాత ఎన్విరాన్మెంట్, ఫారెస్టు స్టేట్ హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేయాలని జ్యోతికి సూచిస్తూ కలెక్టర్‌కు ఉత్తర్వులు పం పించారు. కాకపోతే సెర్ఫ్ కంట్రోల్లో ప్రస్తుతం పని చేస్తున్నందున అక్కడి నుంచి ఉత్తర్వులొచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని కలెక్టర్ వేచి చూశారు. ఈ విధంగా దాదాపు 22 రోజులు గడిచిపోయాయి. దీంతో ఆమె రీపేట్రియేట్ ఉత్తర్వులు ఆగిపోయి ఉంటాయని అంతా భావించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సెర్ఫ్ నుంచి కూడా రిలీవ్ చేయాలంటూ కలెక్టర్ ఉత్తర్వులొచ్చాయి. దీంతో ఆమెను రిలీవ్ చేసేందుకు సిద్ధమయ్యారు. జ్యోతి డీఆర్డీఎ పీడీగా 2012 డిసెంబర్ 27వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సామాజిక అటవీశాఖ డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్‌గా పనిచేశారు. -
పింఛన్ల బట్వాడాలో ‘ఆధార్’ సేకరణ తప్పనిసరి
అనంతపురం సప్తగిరిసర్కిల్: ‘ఆధార్’ ఇవ్వని లబ్ధిదారుల నుంచి ప్రస్తుతం చేపట్టిన పింఛన్ల బట్వాడాలో తప్పనిసరిగా నంబరును సేకరించాలని డీఆర్డీఏ పీడీ కే.నీలకంఠరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం తన చాంబర్ నుంచి మండల స్థాయి అధికారులు, ఫినో, మణిపాల్ కంపెనీ ప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలైకి సంబంధించి శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు 4,10,388 మందికి పింఛన్ల పంపిణీ కొనసాగుతోందన్నారు. ఆధార్ కార్డు నంబర్ ఇవ్వని వారి జాబితా అన్ని మండలాలకు పంపించామని తెలిపారు. ఎన్రోల్ చేయని వారిని ఆధార్ కేంద్రాలకు పంపి, వారి నుంచి ఈ నాలుగు రోజుల్లో ఐడీ నంబర్ తీసుకోవాలని, అలసత్వం వహించరాదని సూచించారు. ఆధార్ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆషామాషీగా తీసుకోరాదని ఆదేశించారు. కొందరు అధికారులు, బట్వాడా చేసే సిబ్బంది పనితీరుపై ఈ సందర్భంగా పీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 25 వేలు, గ్రామీణ ప్రాంతాల నుంచి 35 వేల మంది నుంచి ఆధార్ రావాల్సి ఉందన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఏపీడీ స్వరూప్, పింఛను విభాగం అధికారి నజీర్, తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
రాంనగర్ :తెలంగాణ ఉత్సవాలు నిర్వహించిన తరహాలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతి సాహిత్యం ప్రతిబింబించేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలైన మన ఊరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే, హరితహారం కార్యక్రమాలపై స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పొందుపర్చాలని చెప్పారు. వివిధ అభివృద్ధి సంక్షేమ శాఖలు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. ఏజేసీ, జెడ్పీ సీఈఓలు సభ్యులుగా స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఉత్తమ అధికారులను, సిబ్బందిని అవార్డులకు ఎంపిక చేయాలన్నారు. పరేడ్ గ్రౌండ్లో 30 నిమిషాలపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించేలా డీఈఓ, డీపీఆర్ఓ, వ్యవసాయశాఖ జేడీ కమిటీలో ఎంపిక చేసిన ప్రదర్శనలు మాత్రమే ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఏర్పడక ముందే మరణించిన ప్రొఫెసర్ జయశంకర్ పుట్టినరోజు వేడుకలను ఈ నెల 6వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో, పాఠశాలలో ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలతో పాటు మండలస్థాయి కార్యాలయాలలోనూ, అదే విధంగా 11గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజు వేడుకలకు అధికారులు హాజరుకావాలనిఆదేశించారు. ఈ నెల 19న తేదీన జరుగనున్న సమగ్ర కుటుంబ సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామి పథకం క్షేత్ర సహాయకులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వయోజన విద్య కోఆర్డినేటర్లు, వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది జాబితాలను ఈ నెల 7వ తేదీ వరకు సిద్ధం చేసి 11వ తేదీన మండలస్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలన్నారు. పర్యవేక్షక అధికారులందరూ తమకు కేటాయించిన మండలాలకు వెళ్లి వార్డులు, గ్రామాలలో ఇంటింటికి వేసిన నోషనల్ నంబర్లను పరిశీలించాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే కోసం ప్రతి గ్రామ పంచాయతీకి 1176 నోడల్ అధికారులను, 210 వార్డులకు మరో 210 నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో కుటుంబ యజయాని రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, గ్యాస్ నంబరు, పింఛను, వయస్సు ధ్రువీకరణ, వికలాంగ ధ్రువీకరణ, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్, కరెంట్ మీటర్, ఇతర వివరాలతో 19వ తేదీన సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారులు అనుమతి లేకుండా కార్యస్థానం వదిలి హైదరాబాద్ వెళుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ విషయంలో ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, ఇతర అధికారులు పాల్గొన్నారు.