అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా సరుకులు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఐసీడీఎస్, డీఆర్‌డీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా సరుకులు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఐసీడీఎస్, డీఆర్‌డీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పేద గర్భిణు లు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ఐసీడీఎస్ అధికారులదేని స్పష్టం చేశారు. ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతినెల తనిఖీచేసి వాస్తవ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. తనిఖీలు సరిగా లేకనే అంగన్‌వాడీ కేంద్రాల నుంచి లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందడం లేదన్నారు.
సరుకుల రవాణాలో ఇబ్బందులు అధిగమిస్తామని కలెక్టర్ చెప్పారు. పేరు నమోదు చేసుకున్నవారు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. వాస్తవంగా ఉపయోగించిన వాటికన్నా బియ్యం ఎక్కువ చూపితే రికవరీకి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అధికారి నెలకు 30 కేంద్రాలు తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీ నివేదికలు ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించా రు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్, ఐసీడీఎస్ పీడీ కృష్ణజ్యోతి పాల్గొన్నారు.