దుభారం
గ్రామీణాభివృద్ధి శాఖకు అద్దె వాహనాలే ముద్దట
తిరిగేది ఏడు మండలాల్లోనే... పరిధి తగ్గినా మారని అధికారుల తీరు
వాహనం ఖర్చు నెలకు రూ.50 వేలు
ఇద్దరు అధికారుల ఖర్చు ఒక్కరికే... వాహనం కోసం ప్రత్యేక అనుమతులు
డీఆర్‌డీఏకు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా సుమో వాహనాలను ఇచ్చింది. టాటా సుమో అవసరం ఉన్నా ఇతర శాఖకు అప్పగించారు. మరో వాహనాన్ని మరమ్మతుల పేరిట షెడ్డుకు పరిమితం చేశారు. కేటారుుంచిన రెండు వాహనాలను ఇలా చేసి భారీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీనికి నెలకు రూ.50 వేలు వెచ్చిస్తున్నారు.
వరంగల్ : పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. అన్ని శాఖల కార్యాలయాల పరిధి భారీగా తగ్గింది. అధికారుల పని భారం కూడా తగ్గింది. జిల్లా స్థారుు అధికారుల పరిధి తగ్గడంతో రవాణా ఖర్చులు తగ్గాలి. కానీ గ్రామీణాభివృద్ధి శాఖలో దీనికివిరుద్ధమైన పరిస్థితి నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధి చాలా తక్కువ. తగ్గిన పరిధి మేరకు రవాణా ఖర్చులు తగ్గాల్సి ఉండగా అలా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇద్దరు జిల్లా అధికారుల రవాణా ఖర్చులు ఒక్క అధికారే చేస్తుండటం ఈ శాఖ ఉద్యోగుల్లోనూ చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ వాహనాలు ఉన్నా అద్దె వాహనాల కోసం నిధులు వెచ్చిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు పెరుగుతున్నారుు.
‘అద్దె’ కోసం అడ్డదారులు..!
గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్‌డీఏ)కు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా సుమో వాహనాలను ఇచ్చింది. టాటా సుమో వాహనం అవసరం ఉన్నా ఇతర శాఖకు అప్పగించారు. మరో వాహనాన్ని మరమ్మతుల పేరిట షెడ్డుకు పరిమితం చేశారు. కేటారుుంచిన రెండు వాహనాలను ఇలా చేసి భారీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం డీఆర్‌డీఏ వినియోగిస్తున్న అధికారి వాహనం అద్దె నెలకు రూ.24 వేలు. డీజిల్ ఖర్చులకు మరో రూ.20 వేలు, డ్రైవరు వేతనం రూ.6 వేలు... అన్ని కలిపి నెలకు రూ.50 వేలు ఉంటోంది. జిల్లా స్థారుు అధికారి వాహన నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.24 కేటారుుస్తోంది. వాహనం అద్దెకు ఇచ్చిన వారే 2,500 కిలో మీటర్లు ప్రయాణించే వరకు డీజిల్ భారాన్ని భరించాల్సి ఉంటుంది. డీఆర్‌డీఏ పీడీ వినియోగిస్తున్న వాహనం నిర్వహణ కోసం ప్రతి నెల ఏకంగా రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
పరిధి తగ్గినా...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధి 50 మండలాలు ఉండేది. మహిళా సంఘాల పనితీరు, సంక్షేమం వంటి ఎన్నో అంశాలు ఉండేవి. వరంగల్ అర్బన్ జిల్లాల్లోని ఏడు మండలాల్లో మాత్రమే గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలు ఉంటారుు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ధర్మసారగ్, వేలేరు, ఐనవోలు మండలాల్లో పూర్తిగా, హసన్‌పర్తిలో కొంత భాగం మాత్రమే డీఆర్‌డీఏ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతారుు. ఈ శాఖ ఉన్నతాధికారులు మాత్రం 50 మండలాల స్థారుులోనే రవాణా ఖర్చుల కోసం కేటారుుస్తున్నారని విమర్శలు ఉన్నారుు. సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాలను వినియోగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు.