tata sumo
-
గాల్లో ఎగిరిన ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..
తెలుగు ఫ్యాక్షన్ సినిమాలో కార్లు గాల్లో ఎగరడం చూసుంటాం కదా. హీరో ఒక విజిల్ వేసినా లేదా తొడ కొట్టినా అప్పటి సినిమాల్లో ‘టాటా సుమో’లు గాల్లో ఎగిరిన సన్నివేశాలు కోకొల్లలు. ఆ సీన్లతో మాస్ ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే అప్పట్లో టాటా అంటే వెంటనే గుర్తొచ్చేది టాటా సుమో.. అంతలా ప్రజాదరణ పొందిందీ కారు. అప్పట్లో కారంటే విలాసం. ఇప్పుడు అవసరం. అనతికాలంలోనే మూడేళ్లలో లక్షకుపైగా ఈ కార్లు అమ్ముడయ్యాయి. అసలు ఆ కారుకు సుమో అని ఎందుకు పేరు పెట్టారో తెలుసుకుందాం.‘సుమో’ అంటే ఇదేదో జపనీస్ రెజ్లర్ల పేరులా ఉందని చాలామంది భావిస్తారు. కానీ దీని పేరు వెనక పెద్ద కథే ఉంది. టాటా సుమో తయారీ యూనిట్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సాధారణంగా ప్రతి రోజు అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మోల్గావ్కర్ మాత్రం రోజూ ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత తిరిగి ఆఫీస్‌కు వచ్చేవారు. ఆ తర్వాత రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్‌తో సమావేశమయ్యేవారు.నిత్యం అలా ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్తున్న మోల్గావ్కర్ను ఒకరోజు టీమ్‌లోని ఎగ్జిక్యూటివ్ సిబ్బంది ఫాలో అయ్యారు. మోల్గావ్కర్ తమ ఆఫీస్ సమీపంలోని ట్రక్కు డ్రైవర్ల వద్దకు వెళ్లడం గమనించారు. వారితో కలిసి ఆయన భోజనం చేయడం చూశారు. టాటా వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకునేవారు. తిరిగి ఆఫీస్‌కు వచ్చాక ఈ సమస్యలను ఆర్ అండ్ డీ టీమ్‌తో కలిసి చర్చించి అందుకు పరిష్కారాన్ని కనిపెట్టేవారు. ఆ సమస్యలు టాటా సుమో తయారీలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడేవారు.ఇదీ చదవండి: టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!మోల్గావ్కర్ నిత్యం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందానికి అవసరమైన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్ అభివృద్దికి ఆయన ఎంతో కృషి చేశారు. దాంతో టాటా యాజమాన్యం ఆయన పేరు మీద ఐకానిక్ కారును లాంచ్ చేయాలని నిర్ణయించింది. మోల్గావ్వర్ అసలు పేరు..సు-మంత్ మో-ల్గావ్కర్. తన పేరు మొదటి అక్షరాలతో ‘టాటా సుమో’ను లాంచ్ చేశారు. టాటా సంస్థలో కష్టపడిన వారికి ఎలాంటి స్థానం కల్పించారో ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. -
టాటా కారుకి ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చింది ? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే..
విలాసం కోసం కాకుండా కారు అవసరం అనే యుగంలో ఉన్నాం మనం. అందుకే కాబోలు ప్రతి నగరం, పట్టణం, గ్రాముల్లో కార్ల వినియోగం పెరిగిపోయింది. అయితే నైన్టీస్లో అలా కాదు. మారుతి 800, 1000 తర్వాత 1990లలో టాటా కంపెనీ ‘టాటా సుమో ఎంయూవీ’ని మార్కెటికి పరిచయం చేసింది. నాటి నుంచి టాటా కార్లలో టాటా సుమో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ఎంతలా అంటే కేవలం మూడేళ్లలో లక్షకుపైగా అమ్ముడు పోయింది. అదే సమయంలో టాలీవుడ్ వెండితెరపై సుమోలు ఎగిరించి.. కథానాయకులతో తొడలు కొట్టించి.. మాస్ ప్రేక్షకుల్ని మురిపించిన దర్శకులు వెలుగులోకి వచ్చారు.అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన టాటా సుమో కారు వెనుక కథ ఏంటో తెలుసా? ఈ కారుకు సుమో అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి ? ఈ పేరు జపనీస్ రెజ్లర్ల నుండి ప్రేరణ పొందిందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది తప్పు. టాటాలో కష్టపడి పనిచేసి, టాటా సంస్థ విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగి పేరు మీద టాటా సుమో అని కారుకి పేరు పెట్టారు.పుకార్లు షికార్లుసాధారణంగా ప్రతి రోజు టాటా మోటార్స్ టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మూల్గావ్కర్ అలా కాదు రోజు ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత వచ్చేవారు. ఆ తర్వాత టాటా డీలర్లు మూల్గావకర్కు ఫైవ్‌స్టార్ హోటళ్లలో లంచ్ ట్రీట్ ఇచ్చారని, అందుకే తమతో భోజనానికి రావడం లేదనే పుకార్లు వ్యాపించాయి.ట్రక్ డ్రైవర్లతో రోడ్ సైడ్ దాబాలో ఇంతకీ ఎండీ తమతో భోజనానికి ఎందుకు రావడం లేదా అనే ప్రశ్నే ఉన్నత ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రశ్నార్ధకంగా మారేది. అయితే దీన్ని చేదించేందుకు కొంతమంది ఉద్యోగులు మూల్గావ్కర్ మధ్యాహ్న దినచర్య గురించి తెలుసుకునేందుకు రహస్యంగా ఆయన్ను వెంబడించారు. వారు ఆశ్చర్యానికి గురి చేసేలా మూల్గావ్కర్ ట్రక్ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఆహారం తింటూ కనిపించారు. భోజన సమయంలో టాటా వాహనాలు వినియోగిస్తున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులు గురించి చర్చించేవారు.లోపాల్ని సరిదిద్దే ప్రయత్నంఏ అంశాలు బాగున్నాయో, లోపాల్ని గుర్తించిన తర్వాత కార్యాలయానికి వచ్చేవారు. అందులో పనిచేస్తున్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్ అభివృద్దికి మూల్గావ్కర్ కృషి చేశారు.టాటా సుమో పేరు అలా వచ్చిందికాబట్టే టాటా ఆయన పేరు మీద ఐకానిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సు-మంత్ మో-ఓల్గాకర్ పేరు మొదటి అక్షరాలతో టాటా సుమో పేరును మార్కెట్‌కి పరిచయం చేసింది. చివరగా టాటా సుమో గోల్డ్ 10 సీట్ల ఎస్యూవీ ధరరూ.5.26లక్షల నుంచి రూ.8.93లక్షల మధ్య ఉంది. -
అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సుమో
పిచ్చాటూరు : అదుపుతప్పి టాటా సుమో ఇంట్లోకి దూసుకెళ్లి కల్లుగీత కార్మికుడు దుర్మరణం పాలైన సంఘటన మండలంలోని పులికుండ్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు.. ఆదివారం వేకువజామున 4.20 గంటల సమయంలో టీఎన్ 07బీసీ 6341 నంబరు టాటా సుమో మహిళలను ఎక్కించుకుని శ్రీపెరంబదూరులోని కంపెనీకి బయలుదేరింది. ఈ క్రమంలో వాహనం పులికుండ్రం చెక్‌పోస్టు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న వెంకటేశులు ఇంటిపైకి దూసుకెళ్లింది. ఇంటి బాత్రూమ్, ఇంటి వాకిలిని ఢీకొని ఆగింది. హఠాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వచ్చి చూడగా, కల్లుగీత పనికి సమాయత్తమవుతున్న వెంకటేశులు వాహనం కింద రక్తగాయాలతో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని, వెంకటేశులు(56) మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడు రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. -
దుభారం
గ్రామీణాభివృద్ధి శాఖకు అద్దె వాహనాలే ముద్దట తిరిగేది ఏడు మండలాల్లోనే... పరిధి తగ్గినా మారని అధికారుల తీరు వాహనం ఖర్చు నెలకు రూ.50 వేలు ఇద్దరు అధికారుల ఖర్చు ఒక్కరికే... వాహనం కోసం ప్రత్యేక అనుమతులు డీఆర్డీఏకు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా సుమో వాహనాలను ఇచ్చింది. టాటా సుమో అవసరం ఉన్నా ఇతర శాఖకు అప్పగించారు. మరో వాహనాన్ని మరమ్మతుల పేరిట షెడ్డుకు పరిమితం చేశారు. కేటారుుంచిన రెండు వాహనాలను ఇలా చేసి భారీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీనికి నెలకు రూ.50 వేలు వెచ్చిస్తున్నారు. వరంగల్ : పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. అన్ని శాఖల కార్యాలయాల పరిధి భారీగా తగ్గింది. అధికారుల పని భారం కూడా తగ్గింది. జిల్లా స్థారుు అధికారుల పరిధి తగ్గడంతో రవాణా ఖర్చులు తగ్గాలి. కానీ గ్రామీణాభివృద్ధి శాఖలో దీనికివిరుద్ధమైన పరిస్థితి నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధి చాలా తక్కువ. తగ్గిన పరిధి మేరకు రవాణా ఖర్చులు తగ్గాల్సి ఉండగా అలా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇద్దరు జిల్లా అధికారుల రవాణా ఖర్చులు ఒక్క అధికారే చేస్తుండటం ఈ శాఖ ఉద్యోగుల్లోనూ చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ వాహనాలు ఉన్నా అద్దె వాహనాల కోసం నిధులు వెచ్చిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు పెరుగుతున్నారుు. ‘అద్దె’ కోసం అడ్డదారులు..! గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ)కు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా సుమో వాహనాలను ఇచ్చింది. టాటా సుమో వాహనం అవసరం ఉన్నా ఇతర శాఖకు అప్పగించారు. మరో వాహనాన్ని మరమ్మతుల పేరిట షెడ్డుకు పరిమితం చేశారు. కేటారుుంచిన రెండు వాహనాలను ఇలా చేసి భారీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం డీఆర్డీఏ వినియోగిస్తున్న అధికారి వాహనం అద్దె నెలకు రూ.24 వేలు. డీజిల్ ఖర్చులకు మరో రూ.20 వేలు, డ్రైవరు వేతనం రూ.6 వేలు... అన్ని కలిపి నెలకు రూ.50 వేలు ఉంటోంది. జిల్లా స్థారుు అధికారి వాహన నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.24 కేటారుుస్తోంది. వాహనం అద్దెకు ఇచ్చిన వారే 2,500 కిలో మీటర్లు ప్రయాణించే వరకు డీజిల్ భారాన్ని భరించాల్సి ఉంటుంది. డీఆర్డీఏ పీడీ వినియోగిస్తున్న వాహనం నిర్వహణ కోసం ప్రతి నెల ఏకంగా రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పరిధి తగ్గినా... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధి 50 మండలాలు ఉండేది. మహిళా సంఘాల పనితీరు, సంక్షేమం వంటి ఎన్నో అంశాలు ఉండేవి. వరంగల్ అర్బన్ జిల్లాల్లోని ఏడు మండలాల్లో మాత్రమే గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలు ఉంటారుు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ధర్మసారగ్, వేలేరు, ఐనవోలు మండలాల్లో పూర్తిగా, హసన్‌పర్తిలో కొంత భాగం మాత్రమే డీఆర్డీఏ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతారుు. ఈ శాఖ ఉన్నతాధికారులు మాత్రం 50 మండలాల స్థారుులోనే రవాణా ఖర్చుల కోసం కేటారుుస్తున్నారని విమర్శలు ఉన్నారుు. సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాలను వినియోగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు. -
నలుగురు వ్యక్తుల కిడ్నాప్ కలకలం..
సికింద్రాబాద్: నగరంలోని చిలకడగూడలో నలుగురు కిడ్నాప్ అవ్వడం కలకలం సృష్టించింది. నిన్న జరిగిన కిడ్నాప్ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కిడ్నాప్ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గుర్తు తెలియని దుండగులు అంజలి, లక్ష్మీ, నరసింహారావు, శ్రవణ్ అనే వ్యక్తులను కిడ్నాప్ చేశారని సమాచారం. ఈ వ్యవహారానికి నిందితులు ఓ టాటా సుమోను ఉపయోగించినట్లు తెలుస్తోంది. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బావిలో పడ్డ సుమో
తిరుపతి: ఏర్పేడుమండలం సీతారామ పేట వద్ద అదుపు తప్పిన సుమో బావిలో పడింది. ఈ దుర్ఘటనలో పలువురు మరణించినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
దైవ దర్శనానికి వెళుతూ...
రఘునాథపల్లి /హన్మకొండ: దేవున్ని మనసారా దర్శించుకోవాలనుకున్న వారి కోరిక తీరకుండానే ఆ దైవం చెంతకు చేరిపోయారు. దైవ దర్శనానికి వెళుతున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం పాలైన విషాద ఘటన ఆది వారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కోమల్ల, రఘునాథపల్లి మధ్యనగల వెంకటాయపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. హన్మకొండ నక్కలగుట్టకు చెందిన ట్రాన్స్‌కోలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లుట్ల రవీందర్‌రెడ్డి (54), భార్య అనురాధ(46), కుమార్తె నితిక(24)తోపాటు సమీప బంధువు భువనేశ్వరి, డ్రైవర్ రాజుతో కలిసి తన టాటా సుమోలో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్‌లోని కొత్తబస్తీ చైతన్యపురికి చెందిన 12మంది ట్రావెల్ వ్యాన్‌లో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి మేడారం వెళ్తున్నారు. ఈ క్రమంలో వెంకటాయపాలెం వద్దకు చేరుకోగానే ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు వాహనాలు ఒక్కసారిగా ఢీకొన్నాయి. టాటాసుమో ట్రావెల్ వ్యాన్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టి అదే ఊపులో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రవీందర్‌రెడ్డి భార్య అనురాధ, కూతురు నితిక అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన రవీందర్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయాలపాలైన డ్రైవర్ రాజు, భువనేశ్వరిలను జనగామ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయికి వివాహమై హైద రాబాద్‌లో ఉంటున్నారు. సోమవారం అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు పేర్కొ న్నారు. స్వల్ప గాయాలతో.. ట్రావెల్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన చింతగట్ల అరుణ, దామోదర్‌రెడ్డి, అరుంధతి, జయపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డికి స్వల్పగాయాలు కాగా, మిగతావారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జనగామ రూరల్ సీఐ సతీష్, టౌన్ సీఐ నర్సింహ ఘటనా స్థలికి చేరుకుని బాధితులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
తిరుమలలో సుమో బోల్తా 18 మందికి గాయాలు
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివా రం ఉదయం పాపవినాశనం మార్గం లో ఓ సుమో బోల్తా పడడంతో 18 మంది గాయపడ్డారు. తిరుపతికి చెం దిన ఏపీ 03 డబ్ల్యూ 6399 టాటా సుమో ఉదయం 9.30 గంటలకు వరంగల్ జిల్లా తోరూరు మండలం హరిప్రాలకు చెందిన 18 మంది ప్ర యాణికులతో పాపవినాశనానికి బ యలుదేరింది. అక్కడికి అత్యంత సమీపంలోని మలుపు వద్ద బ్రేక్ ఫెయి ల్ కావడంతో వాహనం లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. సుమోలోని అందరూ గాయపడ్డారు. వీరంతా ఒకరికొకరు బంధువులు. వీరిలో సుజాత (25), జ్యోతి(23) పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిని తిరుమల అశ్వినీ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. వాహనం అతివేగం వల్లే బ్రేక్ ఫెయిలైందని భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కించడాన్ని ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న కాన్వాయిలోకి ఓ టాటా సుమో అకస్మాత్తుగా వచ్చి... కాన్వాయిలోని ఓ కారును ఢీ కొట్టింది. అయితే భగవత్‌కు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని పేరెడ్ రోడ్డులో ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే మోహన్ భగవత్ కాన్వాయిలోకి ప్రవేశించిన టాటా సుమో హర్యానా నెంబర్ కలిగి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
అంబులెన్స్ చార్జీలు ఖరారు
సాక్షి, ముంబై: అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్న అంబులెన్స్ యజమానుల ఆగడాలకు కళ్లెం పడింది. ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రవాణా శాఖ కొత్తగా అంబులెన్స్ చార్జీలను నిర్ణయించింది. ఆ ప్రకారమే ప్రజల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఇవి ముంబై, నవీముంబై, ఠాణే, వసయి, విరార్, అలీబాగ్ తదితర ప్రాంత ప్రజలకు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో పేదలకు ఎంతో ఊరట లభించింది. కొత్త చార్జీల పట్టికను అన్ని అంబులెన్స్‌ల్లో ఏర్పాటు చేయాలని అంక్షలు విధించింది. అత్యవసర సమయంలో రోగిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలంటే అంబులెన్స్ అవసరముంటుంది. అదేవిధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని వివిధ పరీక్షల నిమిత్తం లేదా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలన్నా, చికిత్స పొందుతూ రోగి చనిపోతే మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు తరలించాలన్నా అంబులెన్స్‌లే గతి. దీన్ని అదనుగా చేసుకుని యజమానులు బాధితుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలుచేస్తూ దోచుకుంటున్నారు. దీంతో పేదలు చేసేది లేక వారు అడిగినంత చెల్లించక తప్పడం లేదు. అంబులెన్స్ యజమానుల ఆగడాలపై రవాణా శాఖకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రవాణా శాఖ అధికారులు ఓ ప్రణాళిక రూపొందించారు. అంబులెన్స్‌లో లభించే సౌకర్యాలను బట్టి ఎంత దూరానికి ఎంతమేర చార్జీలు వసూలు చేయాలనేది ఖరారు చేశారు. మొదటి గంటకు ఎలాంటి వెయిటింగ్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంబులెన్స్ మోడల్ 25 కి.మీ. 2 6 కి.మీ. తర్వాత లోపు {పతీ కి.మీ.కు మారుతి వ్యాన్ 500 10 టాటా సుమో, మెటాడోర్ 600 10 టాటా 407, స్వరాజ్ మజ్దా 700 14 ఐసీయూ, ఏసీ సౌకర్యాలుంటే 850 17 -
గండికి వెళుతూ..బోల్తా పడ్డ సుమో,,ఇద్దరు మృతి
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్ : పోట్లదుర్తి-ఎర్రగుంట్ల గ్రామాల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవరు బాబా ఫకృద్ధీన్(50), రామపూజిత(6) మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రొద్దుటూరులోని అమృతానగర్, శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి, రామిరెడ్డి కుటుంబసభ్యులు శ్రావణ శనివారం కావడంతో గండిక్షేత్రానికి టాటా సుమోలో బయలుదేరారు. సుమోలో డ్రైవర్, యాజమాని బాబా ఫకృద్ధీన్ , చిన్నారులు రూప, రామపూజిత, రాజ్యలక్ష్మి, వెంకటకిశోర్రెడ్డితో పాటు భాగ్యలక్ష్మి(పూజిత తల్లి), రాజేశ్వరీ, వెంకటరామిరెడ్డి ఉన్నారు. వీరితోపాటు ఎర్రగుంట్లకు పోవడానికి రామాదేవి ప్రొద్దుటూరు బైపాస్‌లో ఎక్కింది. అయితే సుమో పోట్లదుర్తి దాటిన తరువాత వెనుక టైర్ పగిలింది. వేగాన్ని అదుపు చేసుకోకపోవడంతో సుమో రోడ్డుపైనే పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో రామపూజిత అక్కడికక్కడే మృతిచెందగా క్షతగాత్రులను రెండు 108 వాహనాల ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో భాగ్యలక్ష్మి, వెంకటకిశోర్రెడ్డి, రూప, రాజ్యలక్ష్మి, రాజేశ్వరీ, వెంకటరామిరెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. పూజిత మృతి చెందడంతో తల్లి బాగ్యలక్ష్మి బోరున విలపించింది. టెంకాయలు, అన్నం, కూరగాయలు చెల్లాచెదురుగా రోడ్డు పైన పడిపోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు.