టాటా కారుకి ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చింది ? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే.. | Sakshi
Sakshi News home page

టాటా కారుకి ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చింది ? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే..

Published Mon, May 27 2024 8:56 PM

Do You Know The Tata Sumo Story

విలాసం కోసం కాకుండా కారు అవసరం అనే యుగంలో ఉన్నాం మనం. అందుకే కాబోలు ప్రతి నగరం, పట్టణం, గ్రాముల్లో కార్ల వినియోగం పెరిగిపోయింది. అయితే నైన్‌టీస్‌లో అలా కాదు.  

మారుతి 800, 1000 తర్వాత 1990లలో టాటా కంపెనీ ‘టాటా సుమో ఎంయూవీ’ని మార్కెటికి పరిచయం చేసింది. నాటి నుంచి టాటా కార్లలో టాటా సుమో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ఎంతలా అంటే కేవలం మూడేళ్లలో లక్షకుపైగా అమ్ముడు పోయింది. అదే సమయంలో టాలీవుడ్‌ వెండితెరపై సుమోలు ఎగిరించి.. కథానాయకులతో తొడలు కొట్టించి.. మాస్‌ ప్రేక్షకుల్ని మురిపించిన దర్శకులు వెలుగులోకి వచ్చారు.

అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన టాటా సుమో కారు వెనుక కథ ఏంటో తెలుసా? 
ఈ కారుకు సుమో అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి ? ఈ పేరు జపనీస్ రెజ్లర్ల నుండి ప్రేరణ పొందిందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది తప్పు. టాటాలో కష్టపడి పనిచేసి, టాటా సంస్థ విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగి పేరు మీద టాటా సుమో అని కారుకి పేరు పెట్టారు.

పుకార్లు షికార్లు
సాధారణంగా ప్రతి రోజు టాటా మోటార్స్‌ టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లు అందరూ కలిసి భోజనం  చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మూల్‌గావ్‌కర్‌ అలా కాదు రోజు ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత వచ్చేవారు. ఆ తర్వాత టాటా డీలర్లు మూల్‌గావకర్‌కు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో లంచ్‌ ట్రీట్‌ ఇచ్చారని, అందుకే తమతో భోజనానికి రావడం లేదనే పుకార్లు వ్యాపించాయి.

ట్రక్‌ డ్రైవర్లతో రోడ్‌ సైడ్‌ దాబాలో 
ఇంతకీ ఎండీ తమతో భోజనానికి ఎందుకు రావడం లేదా అనే ప్రశ్నే ఉన్నత ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రశ్నార్ధకంగా మారేది. అయితే దీన్ని చేదించేందుకు కొంతమంది ఉద్యోగులు మూల్‌గావ్‌కర్‌ మధ‍్యాహ్న దినచర్య గురించి తెలుసుకునేందుకు రహస్యంగా ఆయన్ను వెంబడించారు. వారు ఆశ్చర్యానికి గురి చేసేలా మూల్‌గావ్‌కర్‌ ట్రక్‌ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఆహారం తింటూ కనిపించారు. భోజన సమయంలో టాటా వాహనాలు వినియోగిస్తున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులు గురించి చర్చించేవారు.

లోపాల్ని సరిదిద్దే ప్రయత్నం
ఏ అంశాలు బాగున్నాయో, లోపాల్ని గుర్తించిన తర్వాత కార్యాలయానికి వచ్చేవారు. అందులో పనిచేస్తున్న రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బృందానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్‌ అభివృద్దికి మూల్‌గావ్‌కర్‌ కృషి చేశారు.

టాటా సుమో పేరు అలా వచ్చింది
కాబట్టే టాటా ఆయన పేరు మీద ఐకానిక్‌ ఎస్‌యూవీని లాంచ్‌ చేసింది. సు-మంత్ మో-ఓల్గాకర్ పేరు మొదటి అక్షరాలతో టాటా సుమో పేరును మార్కెట్‌కి పరిచయం చేసింది. చివరగా టాటా సుమో గోల్డ్‌ 10 సీట్ల ఎస్‌యూవీ ధరరూ.5.26లక్షల నుంచి రూ.8.93లక్షల మధ్య ఉంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement