అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్న అంబులెన్స్ యజమానుల ఆగడాలకు కళ్లెం పడింది.
సాక్షి, ముంబై: అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్న అంబులెన్స్ యజమానుల ఆగడాలకు కళ్లెం పడింది. ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రవాణా శాఖ కొత్తగా అంబులెన్స్ చార్జీలను నిర్ణయించింది. ఆ ప్రకారమే ప్రజల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఇవి ముంబై, నవీముంబై, ఠాణే, వసయి, విరార్, అలీబాగ్ తదితర ప్రాంత ప్రజలకు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో పేదలకు ఎంతో ఊరట లభించింది.
కొత్త చార్జీల పట్టికను అన్ని అంబులెన్స్‌ల్లో ఏర్పాటు చేయాలని అంక్షలు విధించింది. అత్యవసర సమయంలో రోగిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలంటే అంబులెన్స్ అవసరముంటుంది. అదేవిధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని వివిధ పరీక్షల నిమిత్తం లేదా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలన్నా, చికిత్స పొందుతూ రోగి చనిపోతే మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు తరలించాలన్నా అంబులెన్స్‌లే గతి. దీన్ని అదనుగా చేసుకుని యజమానులు బాధితుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలుచేస్తూ దోచుకుంటున్నారు.
దీంతో పేదలు చేసేది లేక వారు అడిగినంత చెల్లించక తప్పడం లేదు. అంబులెన్స్ యజమానుల ఆగడాలపై రవాణా శాఖకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రవాణా శాఖ అధికారులు ఓ ప్రణాళిక రూపొందించారు. అంబులెన్స్‌లో లభించే సౌకర్యాలను బట్టి ఎంత దూరానికి ఎంతమేర చార్జీలు వసూలు చేయాలనేది ఖరారు చేశారు. మొదటి గంటకు ఎలాంటి వెయిటింగ్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
అంబులెన్స్ మోడల్ 25 కి.మీ. 2 6 కి.మీ. తర్వాత
లోపు {పతీ కి.మీ.కు
మారుతి వ్యాన్ 500 10
టాటా సుమో, మెటాడోర్ 600 10
టాటా 407, స్వరాజ్ మజ్దా 700 14
ఐసీయూ, ఏసీ సౌకర్యాలుంటే 850 17