Maruti van
-
ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!
మారుతి సుజుకి ఈకో గత కొన్ని సంవత్సరాలు మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో పరుగులు పెడుతోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని నివేదికల గణాంకాల ప్రకారం 'ఈకో' 10 లక్షల యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది. భారతదేశంలో మారుతి ఈకో కేవలం ప్రయాణ వాహనంగా మాత్రమే కాకుండా, వ్యాపార వినియోగాలకు కూడా ఉపయోగపడుతోంది. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలోనే దేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన వ్యాన్‌గా రికార్డ్ సృష్టించింది. ఇది 5 సీటర్, 7 సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి దాదాపు 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. మార్కెట్లో వ్యాన్ అమ్మకాలలో మారుతి ఈకో 94 శాతం వాటా కలిగి ఆ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. మొదటి 5 లక్షల యూనిట్లను విక్రయించడానికి 8 సంవత్సరాలు పడితే, మరో 5 లక్షల కార్లు విక్రయించడానికి ఐదేళ్ల కంటే తక్కువ సమయం పట్టింది. దీన్ని బట్టి చూస్తే ఈకో అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. (ఇదీ చదవండి: ముదురుతున్న ఎండలు: కారుని కాపాడుకోడం ఎలా? ఇవిగో సింపుల్ టిప్స్) మారుతి సుజుకి ఈకో 1.2-లీటర్, K12C, డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కలిగి 80 బిహెచ్పి పవర్ & 104.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. CNG వెర్షన్ 71 బిహెచ్పి, 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి. పెట్రోల్ మోడల్ 20.20 కిమీ/లీ మైలేజ్ అందిస్తే, CNG మోడల్ 27.05 కిమీ/కేజీ అందిస్తుంది. 'మారుతి ఈకో'లో రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ ఫోకస్డ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి 11 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. -
మంటల్లో దగ్ధమైన మారుతీ వ్యాను
-
అంబులెన్స్ చార్జీలు ఖరారు
సాక్షి, ముంబై: అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్న అంబులెన్స్ యజమానుల ఆగడాలకు కళ్లెం పడింది. ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రవాణా శాఖ కొత్తగా అంబులెన్స్ చార్జీలను నిర్ణయించింది. ఆ ప్రకారమే ప్రజల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఇవి ముంబై, నవీముంబై, ఠాణే, వసయి, విరార్, అలీబాగ్ తదితర ప్రాంత ప్రజలకు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో పేదలకు ఎంతో ఊరట లభించింది. కొత్త చార్జీల పట్టికను అన్ని అంబులెన్స్‌ల్లో ఏర్పాటు చేయాలని అంక్షలు విధించింది. అత్యవసర సమయంలో రోగిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలంటే అంబులెన్స్ అవసరముంటుంది. అదేవిధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని వివిధ పరీక్షల నిమిత్తం లేదా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలన్నా, చికిత్స పొందుతూ రోగి చనిపోతే మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు తరలించాలన్నా అంబులెన్స్‌లే గతి. దీన్ని అదనుగా చేసుకుని యజమానులు బాధితుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలుచేస్తూ దోచుకుంటున్నారు. దీంతో పేదలు చేసేది లేక వారు అడిగినంత చెల్లించక తప్పడం లేదు. అంబులెన్స్ యజమానుల ఆగడాలపై రవాణా శాఖకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రవాణా శాఖ అధికారులు ఓ ప్రణాళిక రూపొందించారు. అంబులెన్స్‌లో లభించే సౌకర్యాలను బట్టి ఎంత దూరానికి ఎంతమేర చార్జీలు వసూలు చేయాలనేది ఖరారు చేశారు. మొదటి గంటకు ఎలాంటి వెయిటింగ్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంబులెన్స్ మోడల్ 25 కి.మీ. 2 6 కి.మీ. తర్వాత లోపు {పతీ కి.మీ.కు మారుతి వ్యాన్ 500 10 టాటా సుమో, మెటాడోర్ 600 10 టాటా 407, స్వరాజ్ మజ్దా 700 14 ఐసీయూ, ఏసీ సౌకర్యాలుంటే 850 17 -
కుటుంబం సజీవ దహనం
= మారుతి వ్యాన్‌లో మంటలు... నలుగురి మృతి = మృతులు బెంగళూరువాసులు = తిరుమలేశుని దర్శనానంతరం తిరుగు ప్రయూణంలో దుర్ఘటన పలమనేరు (చిత్తూరు), న్యూస్‌లైన్ : బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం తిరుమలేశుని దర్శనానంతరం తిరుగుప్రయూణంలో కారు ప్రమాదానికి బలరుంది. నలుగురి ప్రాణాలు మంటలకు ఆహుతయ్యూయి. ఈ ఘోర సంఘటన పలమనేరుకు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్లో భూతలబండ మృత్యు మలుపు వద్ద బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. బెంగుళూరులోని సంపంగిరామ్ నగర్‌కు చెందిన సత్యనారాయణ కుటుంబం సోమవారం ఉదయం తిరుమలేశుని దర్శనార్థం కేఏ01 1531 అనే నంబర్ మారుతీ ఓమిని వ్యాన్‌లో వెళ్లింది. దేవున్ని దర్శించుకుని మంగళవారం అర్ధరాత్రి తిరుమల నుంచి బెంగుళూరుకు బయలుదేరింది. మొగిలి ఘాట్‌లోని భూతలబండ మలుపు వద్దకొచ్చేసరికి కారులోంచి మంటలు చెలరేగాయి. కారు నడుపుతున్న సత్యనారాయణ (51) ఆందోళనకు గురై రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్నాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్న అతని భార్య మహాలక్ష్మి (45), కుమార్తె దీపమాల (22) , కుమారుడు ప్రశాంత్ కుమార్ (26)లు మంటల్లో చిక్కుకున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లాక్ కావడంతో డోర్లు, అద్దాలు తెరుచుకోలేదు. తండ్రి పక్కన కూర్చున్న ప్రశాంత్ కుమార్ అద్దాలను పగులగొట్టి కాలుతున్న శరీరంతోనే బయటకు దూకేశాడు. కారులోనే అతని తండ్రి, తల్లి, చెల్లెలు గుర్తుపట్టనంత విధంగా మంటల్లో కాలి బూడిదయ్యారు. ఆ మార్గంలో వెళ్లే డ్రైవర్లు గమనించి పలమనేరులోని స్థానికులకు తెలిపారు. దీంతో 108, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌కుమార్ ఒంటిపై మంటలను 108 సిబ్బంది ఆర్పి స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్సలు చేశారు. అనంతరం వేలూరు సీఎంసీ ఆస్పత్రి తరలించారు. అతడు కూడా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. సీఐ సమయస్ఫూర్తి ప్రమాదస్థలానికి చేరుకున్న పలమనేరు సీఐ బాలయ్య మృతుల వివరాల సేకరణలో సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. కారు లోపల కాలిపోయి ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని అందులోని సిమ్‌కార్డు ఆధారంగా కొన్ని నంబర్లకు ఫోన్ చేశారు. దీంతో సత్యనారాయణ సోదరుడు శంకరనారాయణ లైన్లోకి రావడంతో మృతుల వివరాలు, వారి సంబంధీకుల గురించి తెలుసుకున్నారు. మృతదేహాలకు త్వరితగతిన శవపరీక్ష చేయించి బంధువులకు అప్పగించారు.