సాక్షి, తిరుమల: తిరుమలలో శనివా రం ఉదయం పాపవినాశనం మార్గం లో ఓ సుమో బోల్తా పడడంతో 18 మంది గాయపడ్డారు. తిరుపతికి చెం దిన ఏపీ 03 డబ్ల్యూ 6399 టాటా సుమో ఉదయం 9.30 గంటలకు వరంగల్ జిల్లా తోరూరు మండలం హరిప్రాలకు చెందిన 18 మంది ప్ర యాణికులతో పాపవినాశనానికి బ యలుదేరింది. అక్కడికి అత్యంత సమీపంలోని మలుపు వద్ద బ్రేక్ ఫెయి ల్ కావడంతో వాహనం లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది.
సుమోలోని అందరూ గాయపడ్డారు. వీరంతా ఒకరికొకరు బంధువులు. వీరిలో సుజాత (25), జ్యోతి(23) పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిని తిరుమల అశ్వినీ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. వాహనం అతివేగం వల్లే బ్రేక్ ఫెయిలైందని భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కించడాన్ని ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమలలో సుమో బోల్తా 18 మందికి గాయాలు
Published Sun, Jun 15 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM
Advertisement
Advertisement