
డెహ్రాడూన్: డంపర్ ట్రక్కు ఢీకొట్టడంతో ఓ కారు రూపు ఇలా మారిపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్–డెహ్రాడూన్ హైవేపైనున్న లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం 7.3 0గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి వేగంగా దూసుకువచ్చిన ఈ డంపర్ ట్రక్కు ప్లాజా వద్ద వరుసగా ఆగి ఉన్న మూడు కార్లను వెనుక నుంచి ఢీకొట్టింది.
ఒక కారు ఇలా ఇనుప స్తంభాన్ని గుద్దుకుని ఇలా నుజ్జవగా మరో రెండు కార్లలోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. తెహ్రిలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఉద్యోగులైన వీరిద్దరూ విధులకు వెళ్తూ ఇలా ప్రమాదం బారినపడ్డారు. అతివేగం, ట్రక్కు బ్రేకులు ఫెయిలవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment