న్యూఢిల్లీ: జీవిత బీమాయేతర ప్రీమియం వసూళ్లు మంచి జోరుమీదున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సాధారణ బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 33 శాతం అధికంగా రూ. 10,287 కోట్లు వసూలు అయింది. గతేడాది ఇదే నెలలో వసూలైన స్థూల ప్రీమియం రూ.7,710 కోట్లే. ఐఆర్‌డీఏ గణాంకాల ప్రకారం... ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం రూ.5,289 కోట్లుగా ఉండగా, ప్రైవేటు కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ.4,998 కోట్లు.
గతేడాది ఇదే నెలతో పోలిస్తే ప్రభుత్వ కంపెనీల ప్రీమియంలో వృద్ధి 35 శాతం, ప్రైవేటు కంపెనీల వసూళ్లలో 32 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జీవిత బీమాయేతర కంపెనీల ప్రీమియం వసూళ్లు 31.7 శాతం వృద్ధితో రూ.1,13,942 కోట్లుగా ఉన్నాయి. ఇది అంతకుముందు ఇదే కాలంలో రూ.86,526 కోట్లుగా ఉంది. 11 నెలల కాలంలో ప్రభుత్వరంగ కంపెనీల ప్రీమియం ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.61,096 కోట్లుగా ఉండగా, ప్రైవేటు కంపెనీల ప్రీమియం వసూళ్లు 34.1 శాతం వృద్ధితో రూ.39,401 కోట్లుగా ఉన్నాయి.
సాధారణ బీమా ప్రీమియం వసూళ్లలో 33% వృద్ధి
Published Mon, Mar 13 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
Advertisement
Advertisement