అడిగేవారేరి? | who is asking for drda | Sakshi
Sakshi News home page

అడిగేవారేరి?

Published Sat, Jun 21 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

అడిగేవారేరి?

అడిగేవారేరి?

అవినీతికి కేరాఫ్ ‘డీఆర్‌డీఏ’
వెలుగుచూసిన పలు కుంభకోణాలు
85 శాతం మంది ఉద్యోగులు ఏళ్లతరబడి ఒకే చోట విధులు
పట్టించుకోని అధికారగణం

 

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) అక్రమాలకు అడ్డాగా మారింది. అడిగేవారే లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇటీవల ఆ శాఖలో పలు కుంభకోణాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 39 మంది విద్యార్థుల స్కాలర్ షిప్‌లకు సంబంధించి రూ.28,600 సంఘ బంధం అధ్యక్షురాలు దుర్వినియోగం చేశారు. ఉదయగిరిలో ఆర్‌ఐడీఎఫ్‌కు సంబంధించి రూ.3.20 లక్షల నిధులను సంఘంబంధం అధ్యక్షురాలు, సిబ్బంది స్వాహా చేశారు. సీతారామపురంలో శ్రీనిధికి సంబంధించి దాదాపు రూ.2.8కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది.  భారీ స్థాయిలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నప్పటికీ వారిపై చర్యలు మాత్రం శూన్యం. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 ప్రశ్నార్థకంగా పలు పథకాలు

 డీఆర్‌డీఏ ద్వారా అమలవుతున్న పలు పథకాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ సంస్థలో మొత్తం 18 విభాగాలున్నాయి. వీటిలో బ్యాంక్ లింకేజ్ రుణాలు, శ్రీనిధి, ఎన్‌పీఎం (పురుగు మందురహిత వ్యవసాయం), హెల్త్ అండ్ న్యూట్రిషన్, బాలబడులు, యానాది అభివృద్ధి ప్రణాళిక (వైడీపీ), నిరుపేదల వ్యూహం (పీఓపీ), జెండర్, కృషి, జాబ్స్, ఇన్సూరెన్స్, భూమి, అభయహస్తం, మార్కెటింగ్, డెయిరీ, ఐవీ, ఫైనాన్స్, వికలాంగుల సంక్షేమం (పీడబ్ల్యూడీ) వంటివి ఉన్నాయి. అయితే ఈ విభాగాల్లో బ్యాంక్‌లింకేజీ రుణాలను, శ్రీనిధి, అభయహస్తం, జాబ్స్, భూమి వంటి పథకాలు మినహాయిస్తే మిగిలనవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది. ఆయా పథకాలపై క్షేత్రస్థాయిలో గ్రామీణులకు అవగాహన కల్పించకపోవడంతో లబ్ధిదారులకు ఉపయోగం  లేకుండా పోతోంది. ఇక అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రమే ఉండటం గమనార్హం.

 దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులు వీరే

 జిల్లా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ (డీపీఎంయూ)తో పాటు మండలాల్లో పనిచేసే ఏపీఎంలు దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్నారు. డీపీఎంయూలో జాబ్స్, హెచ్‌ఆర్, పీఓపీ, వైడీపీ, శ్రీనిధి విభాగాలకు చెందిన సబ్జెక్ట్ యాంకర్స్‌తో పాటు రాపూరు, వింజమూరు, ఇందుకూరుపేట, చిల్లకూరు, గూ డూరు, సూళ్లూరుపేట, ఓజిలి, కొండాపురం, బో గోలు, కొడవలూరు, దగదర్తి, ఆత్మకూరు, మర్రి పాడు, అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, దొరవారిసత్రం, కోట, కోవూరు, మనుబోలు, ముత్తుకూ రు, నాయుడుపేట, నెల్లూరు, సంగం, సీతారామపురం, తడ, తోటపల్లిగూడూరు, వెంకటాచలం, వెంకటగిరి, వరికుంటపాడు మండలాలకు చెం దిన ఏపీఎంలు ఉన్నారు.

 ఏళ్ల తరబడి ఒకే చోట విధులు

 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో 85 శాతం మంది ఏపీఎంలు నాలుగేళ్ల నుంచి ఏడేళ్లకుపైగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంత మంది అధికారులు మారినా వీరి కుర్చీకి మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. జిల్లాలోని ఈ శాఖ ఉద్యోగుల బదిలీకి 2012లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈప్రక్రియ ద్వారా ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంది. కాని ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కౌన్సెలింగ్‌లో ఎక్కువ మార్కు లు వచ్చిన వారికి అవకాశాలు కల్పించాలి. కానీ ఈ ప్రక్రియ సక్రమంగా నిర్వహించలేదని అప్పట్లో పలు విమర్శలు వెల్లువెత్తాయి. సొంత మండలా ల్లో విధులు నిర్వర్తించకూడదన్న నిబంధన ఉంది. కాని నిబంధనలకు విరుద్ధంగా ఆయా స్థానాల్లో స్థిరపడి తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement