అనంతపురం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 30 జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరులోని మొబైల్ కంపెనీలో పని చేయడానికి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. వేతనం రూ.9,500 ఉంటుందని, 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న యువతులు మేళాకు హాజరు కావాలన్నారు.
బెంగళూరులోని ఐటీసీ, స్నయిడర్, బిగ్ బాస్కెట్ సంస్థల్లో పని చేయడానికి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న పురుషులకు నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం శివారులోని టీటీడీసీలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామని, ఇతర వివరాలకు 08554–271122 నంబర్లో సంప్రదించాలన్నారు. అభ్యర్థులు బయోడేటా ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు.
అనంతలో రేపు జాబ్‌మేళా
Published Thu, Jul 28 2016 6:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
Advertisement
Advertisement