tomorrow jobmela
-
రేపు టీటీడీసీలో ఉద్యోగ మేళా
అనంతపురం అగ్రికల్చర్: డీఆర్డీఏ– వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు రేపు స్థానిక ఫంగల్రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో శనివారం ఉద్యోగ మేళా ఉంటుందని పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు ఫ్లిఫ్కార్డు వేర్‌హౌస్‌లో స్కానింగ్, డేటాఎంట్రీ ఉద్యోగాలకు అర్హులన్నారు. 18 నుంచి 30 ఏళ్ల యవస్సున్న యువకులు పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఉండాలన్నారు. బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జెరాక్స్‌తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల 16న ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. -
రేపు జాబ్ మేళా
అనంతపురం రూరల్: ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలో ఉద్యోగాల కోసం శుక్రవారం అర్హుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. రాప్తాడు సమీపంలో ధర్మవరం పంగల్ రోడ్డులో ఉన్న టీటీడీసీలో ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఐటీఐ చేసి, 24 సంవత్సరాల లోపు వయసున్న వారు ఇందుకు అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, రేషన్, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లతోపాటు విద్యా అర్హత పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. -
అనంతలో రేపు జాబ్‌మేళా
అనంతపురం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 30 జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరులోని మొబైల్ కంపెనీలో పని చేయడానికి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. వేతనం రూ.9,500 ఉంటుందని, 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న యువతులు మేళాకు హాజరు కావాలన్నారు. బెంగళూరులోని ఐటీసీ, స్నయిడర్, బిగ్ బాస్కెట్ సంస్థల్లో పని చేయడానికి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న పురుషులకు నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం శివారులోని టీటీడీసీలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామని, ఇతర వివరాలకు 08554–271122 నంబర్లో సంప్రదించాలన్నారు. అభ్యర్థులు బయోడేటా ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు.