సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా విజయనగరం డీఆర్‌డీఎ, డ్వామా పీడీలుగా నియమితులైన ఢిల్లీరావు, ఆయన భార్య ప్రశాంతిలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. గుంటూరు జిల్లాలో ఇంతవరకూ పనిచేసిన వారిద్దరూ సోమవారం రిలీవ్ అయ్యారు. డ్వామా పీడీగా పనిచేస్తున్న ఢిల్లీరావు, డీఆర్‌డీఏ పీడీ పనిచేస్తున్న ప్రశాంతిలకు జిల్లాకు బదిలీ అయింది. కాకపోతే, వారిద్దరి పోస్టులూ అటు ఇటు మారాయి. మొత్తానికి తమ ఉద్యోగ ప్రయాణం ప్రారంభమైన విజయనగరం జిల్లాలోనే కీలక పోస్టుల్ని దక్కించుకున్నారు.
కాకపోతే, వారి జోరుకు అక్కడి కలెక్టర్ బ్రేకులు వేశారు. గుంటూరులో వారి స్థానంలో వేరొకర్ని నియమించకపోవడంతో రాజధాని భూసేకరణ, సీఎం పర్యటనలకోసమని వీరిద్దర్ని రిలీవ్ చేయకుండా కలెక్టర్ అడ్డుకున్నారు. కమిషనరేట్ అధికారులు వారిద్దరికీ రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ గుంటూరు కలెక్టర్ పక్కన పెట్టేశారు. దీంతో బదిలీలు జరిగి మూడు నెలలు కావస్తున్నా ఇక్కడికి చేరలేకపోయారు. దీంతో జిల్లాలోని డీఆర్‌డీఎ, డ్వామా పీడీ పోస్టులు ఇన్‌చార్జ్‌లతోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి పోస్టింగ్స్ రద్దయ్యాయన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ వారి పోస్టుల్లో వేరేవారిని నియమించడంతో వారిద్దరికీ ఎట్టకేలకు మోక్షం లభించింది. ఒకటిరెండు రోజుల్లో ఆ దంపతులిద్దరూ జిల్లాలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఢిల్లీరావు, ప్రశాంతిలకు లైన్ క్లియర్
Published Wed, Feb 4 2015 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement