మంత్రికి ఝలక్..! | TDP Minister Mrunalini do not satisfies her words | Sakshi
Sakshi News home page

మంత్రికి ఝలక్..!

Published Tue, Dec 2 2014 1:02 AM | Last Updated on Sat, Aug 11 2018 3:38 PM

మంత్రికి ఝలక్..! - Sakshi

మంత్రికి ఝలక్..!

రాష్ర్ట గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని మాట చెల్లుబా టు కావడం లేదా? తన శాఖలోనే ఆమె పట్టు సాధించలేకపోతున్నారా?  ఆమె ఇచ్చిన  ఆదేశాలే  అమలు కావడం లేదా? పరిస్థితులు చూస్తుంటే జిల్లాలో ఆమెను వ్యతిరేకిస్తున్న నేతల మాదిరిగానే  కొందరు ఉన్నతాధికారులు కూడా మంత్రి మాటలు  లెక్క చేయకుండా ఆమెకు షాక్ ఇస్తున్నారేమో అన్పిస్తోంది. గుంటూరులో డీఆర్‌డీఏ, డ్వామా పీడీలుగా పనిచేస్తున్న ఢిల్లీరావు, ప్రశాంతిలను మంత్రి  మృణాళిని ఎన్నో విమర్శల మధ్య జిల్లాకు బదిలీ  చేయించారు. కానీ ఆ  అధికారులిద్దరూ నేటికీ జిల్లాలో విధుల్లో చేరలేదు.  మంత్రి చొరవ తీసుకుని, ఏరికోరి నియమించుకున్న అధికారుల్ని  ఇక్కడ చేరనివ్వకుండా అడ్డుకుంటున్నారంటే తెరవెనుక శక్తులు ఎంత బలంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.   ఈ నేపథ్యంలోనే  మంత్రి మృణాళిని మాట చెల్లుబాటు కావడం లేదన్న  విమర్శలను మాటగట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని అసమ్మతి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: విశాఖపట్నంలో డీఆర్‌డీఏ పీడీగా పనిచేస్తున్న వెంకటరావును డీఆర్‌డీఏ పీడీగా జిల్లాలో నియమించేందుకు  పలువురు జిల్లా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కృషి చేశారు. మంత్రుల స్థాయిలో పైరవీలు కూడా చేశారు. కానీ ఆయన స్థానంలో గుంటూరు డ్వామా పీడీగా పనిచేస్తున్న ఢిల్లీరావును మంత్రి బదిలీ చేయించారు.   పని తీరు ఆధారంగా ఆ శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయం మేరకు ఢిల్లీరావుకు పోస్టింగ్ వేయించామని మంత్రి మృణాళిని  ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు. తెరవెనుక కారణమేదైనా ఢిల్లీరావు నియామకంపై జిల్లాలో విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అనుకూలమైన వ్యక్తిని తీసుకొచ్చారంటూ మంత్రిని వ్యతిరేకిస్తున్న నేతలంతా గళం విప్పారు. పెద్దఎత్తున చేతులు మారాయని  ఆరోపణలు గుప్పించారు.
 
 అయినా మంత్రి లెక్క చేయలేయకుండా బదిలీ నిర్ణయానికి కట్టుబడ్డారు. గుంటూరు డ్వామా పీడీగా రిలీవ్ అయ్యేలా గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. కానీ ఢిల్లీరావు రిలీవ్ కాకుండా గుంటూరులో కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. దీని వెనుక మంత్రిని వ్యతిరేకిస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు తెరవెనుక కుట్ర పన్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి. అటు డ్వామా, ఇటు డీఆర్‌డీఏ రెండు శాఖలూ మంత్రి మృణాళిని పరిధిలోనివే అయినప్పటికీ ఢిల్లీరావు రిలీవ్ విషయంలో ఆమె నెట్టుకు రాలేకపోయారు. అలాగే మాజీ ఎమ్మెల్యే తెంటు లకు్ష్మం నాయుడుకు వరసకు బావ అయిన విశాఖలో డ్వామాలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావును ఈ జిల్లాకు డ్వామా పీడీగా తీసుకురావాలని జిల్లాకు చెందిన పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.
 
 ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు కూడా ఇచ్చారు. కానీ ఆయన్ను కాదని తొలుత శ్రీకాకుళం డ్వామా పీడీగా పనిచేసిన కల్యాణ చక్రవర్తిని నియమించారు. ఆ తర్వాత ఆయనకిచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసి గుంటూరులో డీఆర్‌డీఏ పీడీగా పనిచేస్తున్న ప్రశాం తిని ఇక్కడ డ్వామా పీడీగా నియమించారు. దీంతో టీడీపీ నేతల నుంచి మంత్రి వ్యతిరేకతను ఎదు ర్కొన్నారు. తమకు కనీసం విలువ ఇవ్వ లేదని, మా విజ్ఞప్తిని లెక్క చేయలేదని ఆడిపోసుకున్నారు. ఇన్ని విమర్శల మధ్య ప్రశాంతిని నియమించినా ఇప్పటివరకు ఆమె కూడా విధుల్లో చేరలేదు. గుంటూరులో రిలీవ్ చేయకపోవడం వల్లనే ఇంకా చేరలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీని వెనుక మంత్రి మృణాళినితో విభేదిస్తున్న అధికార వర్గాలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి.
 
 జిల్లాలో మంత్రికి వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి నేతలంతా ఇవన్నీ గమనిస్తూ మంత్రిని అధికారులు ఏమాత్రం లెక్కచేయడం లేదన్న ప్రచారాన్ని విసృ్తతం చేస్తున్నారు. తాము ఎలాగైతే పట్టించు కోవడం లేదో సంబంధిత ఉన్నతాధికారులు కూడా మంత్రికి ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న సెటైర్లు విసు రుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement