కడప కోటిరెడ్డి సర్కిల్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో భాగంగా ఎంప్లాయిమెంట్ జనరేషన్ మిషన్ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రైవేటు కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌టీసీ కోర్సుకు 10వ తరగతి పాసై 18, 25 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. వేతనం రూ 8,500 ఉంటుందని వివరించారు. సెక్యూరిటీ గార్డుకు (పురుషులు మాత్రమే) 10వ తరగతి పాసై , ఎత్తు 166 సెం.మీ. 1830 మధ్య వయసు కలిగి వేతనం రూ 8,500 ఉంటుందన్నారు. ఈ నెల 19న సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీసీ, రాజంపేట రోడ్, కడపలో తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో పాటు ఉపాధి హామీ కార్డు జిరాక్స్ కాపీలతో ఆరు ఫొటోలు తీసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి
Published Fri, Dec 16 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
Advertisement