Anil Kumar Reddy
-
కొండమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కుంభం శ్రీరామ్ రెడ్డి
-
అధికారమే లక్ష్యంగా కొట్లాడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా కొట్లాడాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ సహా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మేడ్చల్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్, భువనగిరి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. నేతలందరినీ రాహుల్‌కు రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి నేతలను ఆహ్వనించిన రాహుల్, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే పార్టీ విజయం తథ్యమన్నారు. కొత్త, పాత తారతమ్యాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. -
మళ్లీ కాంగ్రెస్ గూటికి కుంభం.. రెండు నెలలకే యూటర్న్
సాక్షి, యాదాద్రి: రెండు నెలల క్రితం బీఆర్ఎస్లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం రాత్రి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వనించారు. ఇందుకు కుంభం సానుకూలంగా స్పందించడంతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు.దీంతో అని ల్‌కుమార్‌రెడ్డి తిరిగి సొంత గూటికి చేరినట్లయింది. డీసీసీ అధ్యక్షుడి హోదాలో స్వయంగా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత తనకు సరైన గుర్తింపు, ప్రజల్లోకి వెళ్లడానికి ప్రొటోకాల్ లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీతో పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్తున్నాడన్న సమాచారంతో మంత్రులు సోమవారం ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. కాగా, రెండు నెలల క్రితం జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నానని కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఓటర్లకు ఆన్లైన్లో నగదు పంపిణీ
తాడిపత్రి అర్బన్: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి ఉపాధ్యాయుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమచేసేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ ఎస్ఐ ధరణీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో ఉన్న లార్డ్ ఆసుపత్రి అధినేత చామల వెంకట అనిల్‌కుమార్‌రెడ్డి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ఓటమి ఖాయమని భావించిన ఆయన కొత్త పద్ధతుల్లో డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం కోడిగుడ్లపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబశివారెడ్డి, యల్లనూరుకు చెందిన పోస్టుమన్ నగేష్ ద్వారా తాడిపత్రి పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)లో శుక్రవారం 28 మంది ఉపాధ్యాయ ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా రూ.49 వేల నగదు బదిలీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ, రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. సాంబశివారెడ్డి, నగేష్ ప్రోద్బలంతో నగదు బదిలీ చేసినట్లు అతను అంగీకరించాడు. అతని నుంచి రూ.1,36,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు హెచ్ఎం సాంబశివారెడ్డి, పోస్టుమన్ నగేష్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు.. అనిల్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా కొండేపల్లికి చెందిన ఉపాద్యాయులు వజ్రగిరి, వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురం మండలం బెంజి అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు బత్తల రాజు, పి. నరసింహులుతో పాటు మరికొందరు కూడా శుక్రవారం తాడిపత్రిలో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. -
వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం, పొట్టి రవి అరెస్ట్
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ కుమార్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న రవీంద్రా రెడ్డి అలియాస్ పొట్టి రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రవీంద్రారెడ్డిపై అనిల్‌కుమార్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా జేసీ వర్గీయులు పన్నిన హత్య కుట్ర నుంచి అనిల్ కుమార్ రెడ్డి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. గత నెలలో అనిల్ కుమార్ రెడ్డి తాళ్ల పొద్దుటూరు నుంచి వీరాపురం వెళుతుండగా ఫాలో అయిన జేసీ వర్గీయులు.. ఆయన కారుని సుమోతో ఢీ కొట్టారు. అనంతరం వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నించారు. ప్రాణాలతో బయటపడ్డ అనిల్ కుమార్ రెడ్డి టీడీపీ నేత చింతా నాగేశ్వర్రెడ్డితో సహా మరో పదిమంది జేసీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. -
వైఎస్ఆర్సీపీ నేత హత్యకు టీడీపీ నేతల కుట్ర
-
వైఎస్సార్ సీపీ నేత హత్యకు కుట్ర..
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత అనిల్ కుమార్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారు. టీడీపీ నేతల పన్నిన హత్య కుట్ర నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం తాళ్ల పొద్దుటూరు నుంచి వీరాపురం వెళుతుండగా ఫాలో అయిన జేసీ వర్గీయులు.. ఆయన కారుని సుమోతో ఢీ కొట్టారు. అనంతరం వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నించారు. తృటిలో తప్పించుకున్న అనిల్ కుమార్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ నేత చింతా నాగేశ్వర్రెడ్డితో సహా మరో పదిమంది జేసీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరా తీశారు. అనిల్ కుమార్ రెడ్డిని పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు
-
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి
కడప కోటిరెడ్డి సర్కిల్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో భాగంగా ఎంప్లాయిమెంట్ జనరేషన్ మిషన్ డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రైవేటు కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఎస్ఆర్టీసీ కోర్సుకు 10వ తరగతి పాసై 18, 25 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. వేతనం రూ 8,500 ఉంటుందని వివరించారు. సెక్యూరిటీ గార్డుకు (పురుషులు మాత్రమే) 10వ తరగతి పాసై , ఎత్తు 166 సెం.మీ. 1830 మధ్య వయసు కలిగి వేతనం రూ 8,500 ఉంటుందన్నారు. ఈ నెల 19న సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీసీ, రాజంపేట రోడ్, కడపలో తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో పాటు ఉపాధి హామీ కార్డు జిరాక్స్ కాపీలతో ఆరు ఫొటోలు తీసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొన్నారు. -
బంజారా హిల్స్‌లో రోడ్డు ప్రమాదం
బంజారాహిల్స్ లో ఆదివారంఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కొడుకును వృద్ధురాలైన కన్న తల్లికి దూరం చేసింది. హృదయవిదారకమైన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో ఉన్న జయప్రకాశ్‌నగర్ సాయి కేశవ్ హోమ్స్‌లో నివసించే పడాల అనిల్‌కుమార్‌రెడ్డి(70) ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో స్కూటీపై బంజారాహిల్స్ రోడ్ నెం.7 నుంచి సరూర్‌నగర్‌లోని ఎన్ఎస్ వృద్ధాశ్రమంలో వసతి పొందుతున్న తల్లి ప్రమీల(93) వద్దకు టిఫిన్ తీసుకొని వెళ్తున్నాడు. సరిగ్గా రోడ్ నెం. 7లోని ఓవర్సీస్ బ్యాంకు ముందు టర్నింగ్ తీసుకుంటుండగా గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్‌కుమార్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్‌కు చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి తన సోదరులు అశ్వినికుమార్రెడ్డి, అజయ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. వీరంతా ప్రతి ఆదివారం వృద్ధాశ్రమంలో ఉండే తల్లి వద్దకు వెళ్లి రెండు, మూడు గంటలు అక్కడే గడుపుతారు. ఇందులో భాగంగానే ఆయన ఆదివారం ఉదయం తల్లి వద్దకు వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చికాటేసింది. మృతుడు ప్రముఖ కెమెరామెన్ సమీర్‌రెడ్డి తండ్రి. ఆరుష్ బిల్డింగ్ మెటీరియల్స్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డి మృతి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భార్య జ్యోతికుమారి, కొడుకు, కూతురు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనకు కారణమైన వాహనం కోసం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే కారు మాత్రమే కనిపిస్తుండగా నంబర్‌ప్లేట్ కెమెరాలో చిక్కక పోవడంతో ముందున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
కోమటిరెడ్డి సోదరుడి ఇంట్లో ఐటీ సోదాలు
హైదరాబాద్ : సకాలంలో ఆదాయపన్ను చెల్లించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు అనిల్ కుమార్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేపట్టింది. గురువారం ఉదయం నుంచి అనిల్‌కుమార్ ఇళ్లు, కార్యాలయాలలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 6 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో.. హైదరాబాద్ లోని ప్రశాసన్‌నగర్, నల్లగొండ, కాకినాడలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలలో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డీసీసీబీ చైర్మన్‌గా అనిల్ కుమార్‌రెడ్డి
-
కడప డీసీసీబీ చైర్మన్‌గా అనిల్ కుమార్‌రెడ్డి
వైఎస్ఆర్ కడప: వైఎస్ఆర్ కడప జల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) అధ్యక్షుడి ఎన్నికలను వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లు బాయ్‌కాట్ చేశారు. దీంతో డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నాయకుడు అనిల్ కుమార్‌రెడ్డి ఎన్నిక ఎకగ్రీవం అయింది. టీడీపీ నేతలు అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని... ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి ఎన్నికలను బహిష్కరించినట్లు వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లు వెల్లడించారు. చైర్మన్ పదవి టీడీపీ దక్కించుకోవడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఎ. అమర్నాథ్రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి స్పందిస్తూ... బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తూ డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకోవడం అప్రజాస్వామికమని వారు ఆరోపించారు. ఇది ఎంత మాత్రం టీడీపీ నైతిక విజయం కాదన్నారు. వైఎస్ఆర్ సీపీ వైఫల్యం అంతకంటే కాదని వారు పేర్కొన్నారు. -
జై జవాన్
కదిరి : సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం కాపలా ఉంటూ పాక్ సైనికుల దాడిలో అసువులు బాసిన అనిల్‌కుమార్‌రెడ్డికి ఆదివారం అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన స్వగ్రామం తలుపుల మండలం తూపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్ఎఫ్ జవాన్ల బృందం అంత్యక్రియల సమయంలో గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి తోటి జవాన్‌కు నివాళులర్పించారు. మృతుడి భార్య అపర్ణ.. భర్త భౌతికకాయం మీద పడి కాసేపు అలాగే సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని ఖననం చేసేముందు కూడా తన రెండేళ్ల చిన్నారి త్రిపురను చంకనేసుకొని ఆమె ఁఇంగ మీ నాన్న తిరిగిరాడమ్మా.. మీ నాన్నకు దాహమేస్తోంది. నీ చేత్తో కొన్ని నీళ్లు తాపు తల్లీ* అంటూ భర్త నోట్లో ఆ చిన్నారి చేత నీళ్లు పోయించింది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఆమెతో పాటు మరింత బిగ్గరగా ఏడ్చారు. తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడన్న బాధ తమను వేదిస్తున్నప్పటికీ దేశం కోసం ప్రతి కుటుంబం నుండి ఒకరిని సైన్యంలోకి పంపితే మంచిదని మృతుడి తల్లిదండ్రులు ఇంద్రావతమ్మ, నాగేంద్రరెడ్డిలు దేశంపై వారికున్న అభిమానాన్ని చాటి చెప్పారు. వైఎస్సార్సీపీకి చెందిన కదిరి శాసనసభ్యుడు అత్తార్ చాంద్‌బాషా, ఆ పార్టీ సీఈసీ సభ్యుడు డా.సిద్దారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, వజ్రభాస్కర్‌రెడ్డి, కుర్లి శివారెడ్డి, బీజైవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ శంకర్, ఉత్తారెడ్డితో పాటు పలువురు మృతదేహంపై పూలమాలలు, జాతీయ పతాకాన్ని కప్పి నివాళులర్పించి ఁజై జవాన్* అన్న నినాదాలు చేశారు. ఎమ్మెల్యే.. జవాన్ మృతదేహాన్ని చూడగానే కంటతడి పెట్టారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ 10 లక్షలు ఆర్థిక సాయంతో పాటు మృతుడి భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న, పెద్ద, ఆడ, మగ, కులం, మతం అన్న తేడా లేకుండా ఊరు ఊరంతా అంతిమ యాత్రలో పాల్గొని ఁమా ఊరి జవాన్ ఇక లేడు* అని కన్నీరు కార్చారు. కాల్పులు జరిగిన సంఘటనా స్థలం నుండి మృతదేహాన్ని కోల్‌కతాకు తీసుకొచ్చి అక్కడ పోస్ట్‌మార్టం అనంతరం బెంగుళూరుకు బీఎస్ఎఫ్ జవాన్లు విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా శనివారం అర్దరాత్రికి అనిల్ భౌతికకాయాన్ని స్వగ్రామం చేర్చారు. ఆ సమయంలో తన భర్త మృతదేహాన్ని చూడగానే ఆయన సతీమణి అపర్ణతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. బీఎస్ఎఫ్ 119వ బెటాలియన్ జవాన్ ప్రతాప్కారే నేతృత్వంలో కదిరి ఆర్డీఓ రాజశేఖర్, డీఎస్పీ దేవదానం, సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
నేడు జవాన్ అనిల్ అంత్యక్రియలు
కదిరి : దేశ సరిహద్దులో పాక్ సైన్యాలు జరిపిన కాల్పుల్లో అమరుడైన బీఎస్ఎఫ్ జవాన్ అనిల్‌కుమార్‌రెడ్డి (31) అంత్య క్రియలు ఆదివారం జరగనున్నాయి. ఆయన స్వగ్రామం తలుపుల మండలం తూపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద అనిల్‌కుమార్‌రెడ్డి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కోల్కత్తా మీదుగా బెంగళూరుకు విమానంలో మృతదేహాన్ని తీసుకువచ్చి, రోడ్డు మార్గంగా స్వగ్రామానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అందిన సమాఆరం మేరకు శనివారం అర్ధరాత్రికి అనిల్ కుమార్‌రెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశముంది. కాగా, గ్రామంలో ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డి భార్య అపర్ణ అన్నపానీయాలు లేకుండా భర్త మృతదేహం కోసం నిరీక్షిస్తోంది. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా శనివారం పరామర్శించారు. -
మీ నాన్న లేడమ్మా...
దేశ సరిహద్దులో పాక్ దళాల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి స్వగ్రామం తూపల్లిలో విషాద చాయలు కన్నీరు మున్నీరైన భార్య అపర్ణ రెండేళ్ల కూతురును పట్టుకుని గుండెలవిసేలా రోదన కదిరి: ‘మా నాన్న వస్తాడు.. నాకు కొత్త బట్టలు తెస్తాడు.. టపాకాయలు తెస్తాడు.. ఊరందరికీ పంచుతానని చెప్పావే.. ఇంకెక్కడ మీ నాయన తల్లీ.. మీ నాన్న చచ్చిపోయాడంట.. ఇంగ మనకు దిక్కెవరు? నీకు నేను.. నాకు నువ్వు.. మనిద్దరమే మిగిలిపోతిమి.. మా నాన్న తుపాకీ పట్టుకుని దొంగోళ్లను తరిమేస్తాడని ముద్దు ముద్దుగా చెప్పితివి కదే.. ఇపుడు ఆ పాకిస్తాన్ దొంగేళ్లే దొంగచాటున కాల్చేశారే.. ఓరి దేవుడా.. మాకు ఇంత అన్యాయం చేశావేమిరా..’ అంటూ భారత్-పాక్ సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అనిల్‌కుమార్‌రెడ్డి(31) భార్య అపర్ణ తన రెండేళ్ల చిన్నారి త్రిపురను పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. తలుపుల మండలం తూపల్లికి చెందిన ఇంద్రావతమ్మ, నాగేంద్రరెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు ధనుంజయ్‌రెడ్డి, రెండో కొడుకు సుదర్శన్‌రెడ్డి వీరిద్దరూ స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. మూడో కొడుకు అనిల్‌కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుండి తాను సైన్యంలో చేరి దేశం కోసం పోరాటం చేయాలంటుండేవాడు. తాను అనుకున్నట్లు గానే 2003లో బీఎస్ఎఫ్ జవానుగా చేరారు. విధి నిర్వహణలో అందరికంటే ముందుండే వాడని సహచరులు చెప్పారు. గురువారం అర్ధరాత్రి పూంచ్ సెక్టార్లో ఉన్నట్లుండి పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు ప్రారంభం కావడం.. అనిల్ దేహంలో బుల్లెట్లు చొచ్చుకు పోవడం ఊహించని రీతిలో జరిగిపోయిందని తోటి జవాన్ల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. ‘జై భారత్.. జైజై భారత్’ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు వదిలాడని వారు చెప్పారు. ఇతను నాలుగేళ్ల క్రితం ధర్మవరం మండలం కనంపల్లికి చెందిన అపర్ణను వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల త్రిపుర అనే కుమార్తె ఉంది. ‘దీపావళి పండుగకు సెలవు దొరికింది. నేను ఊరికి వస్తాను. నిన్ను, నా కూతురును, మా అమ్మా, నాన్నను చూడాలని ఉంది’ అని రెండు రోజుల క్రితమే అతను భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారి బాధ వర్ణణాతీతం. మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు. మృతదేహం చేరుకునే సమయాన్ని బట్టి శనివారం లేదా ఆదివారం అంత్యక్రియలు ని ర్వహిస్తారని బంధువులు తెలిపారు. అనిల్ మృతిపై కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు డా.సిద్దారెడ్డి, తలుపుల సింగిల్ విండో అధ్యక్షుడు పూల శ్రీనివాసరెడ్డి, పలువురు స్థానిక ప్రముఖులు సంతాపం తెలిపారు.