
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత అనిల్ కుమార్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారు. టీడీపీ నేతల పన్నిన హత్య కుట్ర నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం తాళ్ల పొద్దుటూరు నుంచి వీరాపురం వెళుతుండగా ఫాలో అయిన జేసీ వర్గీయులు.. ఆయన కారుని సుమోతో ఢీ కొట్టారు. అనంతరం వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నించారు. తృటిలో తప్పించుకున్న అనిల్ కుమార్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ నేత చింతా నాగేశ్వర్‌రెడ్డితో సహా మరో పదిమంది జేసీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరా తీశారు. అనిల్ కుమార్ రెడ్డిని పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment