పుష్కర ఘాట్లను పరిశీలించిన డీఆర్‌డీఏ పీడీ
పుష్కర ఘాట్లను పరిశీలించిన డీఆర్‌డీఏ పీడీ
Published Tue, Aug 9 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
మట్టపల్లి (మఠంపల్లి) : ఈనెల 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని పుష్కరాల స్పెషల్ ఆఫీసర్, డీఆర్‌డీఏ పీడీ అంజయ్య పేర్కొన్నారు. మండలంలోని మట్టపల్లి వద్ద నిర్మించిన పుష్కరఘాట్లను ఆయన సోమవారం సందర్శించారు. అనంతరం స్థానిక ఎన్‌సీఎల్ పరిశ్రమ అతిథిగృహంలో పుష్కర ఘాట్ల ఇన్‌చార్జి, అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సౌకర్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులకు ఏ ఒక్క ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డీఎస్‌ఓ అమృతారెడ్డి, టీసీఓ సాయప్ప, జిల్లా రిజిష్ట్రార్ వాసుదేవరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజశేఖర్, డీఎల్‌పీఓ రామ్మోహన్‌రాజు, తహసీల్దార్ యాదగిరి, ఈఓపీఆర్‌డీ జానకిరాములు, పంచాయతీ కార్యదర్శులు గురవయ్య, గిరిజాకుమారి, శ్రీవిద్య, సుధాకర్, నాగేశ్వరరావునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement