ఘాట్లను పరిశీలించిన మంత్రులు
ఘాట్లను పరిశీలించిన మంత్రులు
Published Tue, Aug 16 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
మట్టపల్లి (మఠంపల్లి) : మట్టపల్లిని పుష్కర ఘాట్లను మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ, విద్యుత్‌శాఖ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు పరిశీలించారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో కలిసి వారు హెలికాప్టర్‌లో మట్టపల్లిలోని ఎన్‌సీఎల్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగారు. ఈ సందర్భంగా వారికి ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్‌లో బయలుదేరి వెళ్లి ప్రహ్లాద ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తిరిగి వెళ్లారు. వారి వెంట స్పెషల్ ఆఫీసర్ అంజయ్య, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డీఎల్‌పీఓ రామ్మోహన్‌రాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, ఎంపీపీ అంజమ్మ బుచ్చయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, లక్ష్మీవెంకటనారాయణ, కొండానాయక్, పఠాన్‌హుస్సేన్, సర్పంచ్ కనగాల శ్రీనివాసరావు, కుంట సైదులు, యరగాని గురవయ్యగౌడ్, ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, బ్రహ్మాచార్యులు పాల్గొన్నారు.
మీడియా ప్రతినిధుల నిరసన
ఘాట్ల వద్దకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలోకి వెళ్తున్న మంత్రులను స్థానిక మీడియాసెంటర్ వద్ద పలువురు పాత్రికేయులు అడ్డుకున్నారు. ఘాట్ల వద్ద పోలీసులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. వెంటనే స్పందించిన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Advertisement