రూ.825 కోట్లతో సకల సౌకర్యాలు
రూ.825 కోట్లతో సకల సౌకర్యాలు
Published Wed, Aug 17 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
హుజూర్‌నగర్/మఠంపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.825 కోట్లతో పుష్కరఘాట్లతో పాటు భక్తులకు సకల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన వారు అనంతరం మట్టపల్లికి చేరుకున్నారు. స్థానిక ప్రహ్లాద ఘాట్‌లో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కృష్ణానదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘాట్‌లో పుష్కర భక్తులతో మాట్లాడారు. వసతుల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కాగా మట్టపల్లి వద్ద కృష్ణానదిపై బల్లకట్టు నిలిపివేసినందున భక్తుల రాక తగ్గిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మంత్రుల దృష్టికి తీసుకురాగా, పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
పానగల్ ఆలయాలను అభివృద్ధి చేస్తాం
నల్లగొండ టూటౌన్ : పానగల్‌లో ఉన్న చారిత్రక ఆలయాలను రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖామంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డితో కలిసి మంగళవారం పానగల్ ఘాట్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఛాయాసోమేశ్వర ఆలయం ఎంతో విశిష్టత ఉందన్నారు.
నాగార్జునసాగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో పుష్కరఘాట్ల పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హెలికాప్టర్‌లో జిల్లాలోని పుష్కరఘాట్లను ఏరియల్ సర్వే చేస్తూ నాగార్జునసాగర్‌కు వచ్చారు. బుద్ధ వనంలో హెలికాప్టర్ దిగి శివాలయం, సురికి Sవీరాంజనేయస్వామి ఘాట్లను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు.
వాడపల్లిలో ఘాట్ల పర్యవేక్షణ
మిర్యాలగూడ : వాడపల్లి సంగమంలో ఉన్న ఘాట్‌లను రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పర్యవేక్షించారు. దామరచర్ల మండలం కొండ్రపోల్ వద్ద హెలిప్యాడ్‌లో దిగిన మంత్రులు రోడ్డు మార్గం మీదుగా వాడపల్లికి చేరుకున్నారు. శివాలయం ఘాట్‌లోకి నేరుగా వెళ్లిన మంత్రులు కృష్ణమ్మ నమస్కారం చేసి చేతులతో నీళ్లు తీసుకుని నెత్తిన చల్లుకున్నారు. అనంతరం భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డిలకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఏజేసీ వెంకట్రావు అడిషనల్ ఎస్పీ గంగారామ్, ట్రైనీ ఎస్పీ చందనాదీప్తి, డీఎస్పీ సునితామోహన్, డీఆర్‌డీఏ పీడీ అంజయ్య, డీఎస్‌ఓ అమృతారెడ్డి, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్, ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ కర్నాటì æలింగారెడ్డి, టీఆర్‌ఎస్ నల్లగొండ, సాగర్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సీఐ ఇ.రవీందర్, అధికారులు చంద్రవదన, సురేందర్, ఆలయ కమిటీ చైర్మన్ గుంట్ల అనంతరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు బాలాజీనాయక్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement