విష పదార్థాలు తిని పాడిగేదెలు మృతి | Buffalos died with poision food | Sakshi
Sakshi News home page

విష పదార్థాలు తిని పాడిగేదెలు మృతి

Published Tue, Aug 16 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

Buffalos died with poision food

మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి అటవీ ప్రాంతంలో విష పదార్థాలను తిని రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మట్టపల్లికి చెందిన బచ్చలకూరి గురవయ్యకు చెందిన మూడు పాడిగేదెలు ఉదయం మేతకు వెళ్లాయి. సాయంత్రం ఒక గేదె మాత్రమే ఇంటికి వచ్చి నోటి వెంట నురగలు కక్కుతుండడంతో పశు వైద్య సిబ్బందితో చికిత్స నిర్వహించారు. మిగిలిన రెండు గేదెల కోసం అడవి వెతకగా మృతి చెంది ఉన్నాయి. అడవిలో విష పదార్థాలు తినడం వల్లే గేదెలు మృతి చెందాయని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరారు. కాగా గేదెలు మృతిచెందిన స్థలాన్ని పశువైద్య సిబ్బంది సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement