Buffalos
-
Shamshabad: వాట్సాప్‌లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి..
సాక్షి, రంగారెడ్డి: వాట్సాప్‌లో అమ్మకానికి పెట్టిన గేదెలను కొనడానికి యత్నించిన ఓ రైతు సైబర్ నేరగాళ్లకు రూ.1,31,500 సమర్పించుకున్నాడు. పోలీసుల చెప్పిన వివరాల మేరకు... కవ్వగూడకు చెందిన రైతు బొద్దం శ్రీకాంత్ యాదవ్ వాట్సాప్ నంబరుకు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి ఈ నెల 6న హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి గేదెల ఫొటోలు పోస్టు చేసి, రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయని వాటి ధర రూ.1,10,000గా చెప్పాడు. గేదెలు కొనేందుకు శ్రీకాంత్ ఆసక్తి చూపడంతో సదరు వ్యక్తి ముందుగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పాడు. అందుకు ఒప్పుకుని ఫోన్‌పే ద్వారా పలుసార్లు రూ.9వేలు పంపించాడు. గేదెలు పంపించడానికి బోర్డర్ చార్జీలు, జీఎస్టీ కలిపి అదనంగా రూ.11,500 అవుతుందని చెప్పగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు. గేదెలు ఇంటికి పంపించిన తర్వాత రూ.లక్ష ఇవ్వవచ్చని, మిగిలిన మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని షరతు పెట్టారు. దీంతో ఈ నెల 10న గేదెలు పంపిస్తున్నట్లు చెప్పడంతో తన చిరునామా వివరాలు అందజేశాడు. ఇలా శ్రీకాంత్‌ను నమ్మించి పలుసార్లు మొత్తంగా రూ.1,31,500 వసూలు చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆవు తల్లితో సమానం
వారణాసి: ఆవులు, గేదెలపై జోకులేస్తూ విపక్ష పార్టీలు.. పశుసంపదపై ఆధారపడ్డ ఎనిమిది కోట్ల మంది ప్రజానీకాన్ని అవమానపరుస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన వారణాసిలో పాడి పరిశ్రమ సహా రూ.2,095 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగించారు. ‘ గోమాత మనకు మాతృ సమానురాలు. దేశానికే గర్వకారణమైన పశుసంపద(ఆవులు, గేదెలు..)పై ఆధారపడి దాదాపు ఎనిమిది కోట్ల జనాభా జీవనం కొనసాగిస్తోందనే విషయాన్ని విపక్షాలు మరిచాయి. ఆవులు, గేదెలు, ఆవు పేడపై జోకులేస్తూ విపక్ష పార్టీలు పాపం మూటగట్టుకుంటున్నాయి. వారు ఆవులపై ఎగతాళిగా మాట్లాడతారు. కానీ, మనకు గోమాత పూజనీయం’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘సమాజ్‌వాదీ పార్టీ పదకోశంలో మాఫియావాదీ, పరివార్‌వాదీ అనే పదాలుంటాయి. కానీ, మా డిక్షనరీలో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ లాంటివే ఉంటాయి. కులం, మతం, వర్గం దృక్కోణంలోనే ఆలోచిస్తారు తప్ప ఉత్తరప్రదేశ్ అభివృద్ధి వారికి పట్టదు’ అని విమర్శించారు. ‘భావితరాల పరిరక్షణకు మళ్లీ సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంభించాల్సిందే’ అని మోదీ అన్నారు. గత పది రోజుల వ్యవధిలో మోదీ తన సొంత పార్లమెంట్ స్థానం వారణాసిలో పర్యటించడం ఇది రెండోసారి. కర్ఖియాన్‌లో నిర్మించే భారీ డైరీ ప్రాజెక్టు ‘బనాస్ డైరీ శంకుల్’కు మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.475 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఈ డైరీ ప్రాజెక్టు ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల పాల దిగుబడి సాధ్యంకానుంది. -
గేదెలే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గానే అనుకుంది.. ఫైనల్‌గా..
ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతోంది. అందులో కొన్ని వైరల్‌గా మారి దూసుకుపోతుంటాయి కూడా. ఇటీవల పెళ్లి, బరాత్, పిల్లలు, జంతువుల వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే కంటెంట్ ఉన్న వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం ప్రకృతి సహజమే. కానీ అలా ప్రతీ సారి కుదరదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఓ గేదెపై సింహం దాడి చేసింది. ఇంకేముంది ఆ గేదె పని అయిపోయింది అనుకున్నారా! ఇక్కడ సీన్ మారింది లెండి. దాహం వేసి నీరుతాగడానికి వెళ్లిన ఓ గేదెను.. ఓ సింహం అదును చూసి ఒక్కసారిగా దానిపై దూకింది. ఊహించని ఘటనతో బెదిరిపోయిన గేదె.. కొద్ది సేపు తడబడ్డా, తర్వాత తిరగబడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా ఆ సింహంతో పోటా పోటీగా పోరాడుతోంది. ప్రమాదంలో ఉన్న ఆ గేదెను చూసిన మిగతా గేదెలు ఒక్కసారిగా సింహంపై ఎదురుదాడి చేస్తూ రంగంలోకి దిగాయి. ఇంకేముంది గేదెలు ఒకటో రెండో ఉంటే మన మృగరాజు మేనేజ్ చేసేదేమో గానీ గుంపులు గుంపులుగా ఉండేసరికి దడుసుకంది. కానీ అప్పటికే పద్మవ్యూహంలో చిక్కినట్లు ఆ గేదెల గుంపుకు సింహం చిక్కేసింది. అన్ని గేదెలూ కలిసి ఆ సింహాన్ని చెడుగుడు ఆడుకున్నాయి. గాల్లోకి బంతిలా ఎగరేస్తూ.. కొమ్ములతో కుమ్ముతూ, కాళ్లతో తొక్కి చంపేశాయి. కాగా ఆ పార్కులోకి వచ్చిన కొందరు సందర్శకులు ఈ దృ శ్యాన్ని రికార్డు చేసి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. చదవండి: లక్ష రూపాయల్ని టవల్లో చుట్టుకుంటే.. కోతి ఎత్తుకెళ్లిపాయె! -
దళిత యువతకు మినీ డెయిరీలు!
సాక్షి, హైదరాబాద్: దళిత నిరుద్యోగ యువతకు మినీ డెయిరీల ద్వారా ఉపాధి కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో పాల ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండడం.. డిమాండ్‌కు తగిన విధంగా పాల దిగుబడి లేకపోవడంతో పాడిపరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పశుసంవర్థక శాఖ అధికారులతో సమాలోచనలు చేసిన ఎస్సీ కార్పొరేషన్.. ఔత్సాహికులతో మినీ డెయిరీలు ఏర్పాటు చేయించాలని భావిస్తోంది. వాస్తవానికి గత ఏడాదే ఈ అంశంపై దృష్టిసారించిన ఎస్సీ కార్పొరేషన్, కరోనా నేపథ్యంలో ఆ ప్రయత్నాలను వాయిదా వే సింది. తాజాగా పరిస్థితులు సద్దుమణుగుతుండ డంతో మళ్లీ మినీ డెయిరీల ఏర్పాటుపై దృష్టి సారించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పొందుపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గరిష్టంగా రూ.4 లక్షలతో.. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రెండు, మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఎస్సీ కార్పొరేషన్ యోచిస్తోంది. జిల్లాకు సగటున 100 యూనిట్లు మంజూరు చేయా లని భావిస్తోంది. ఒక్కో యూనిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య బ్యాంకు అనుసంధానంతో రుణం ఇచ్చి ఇందులో 60 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ప్రతి డెయిరీ యూనిట్‌కు 3 గేదెలు పంపిణీ చేస్తారు. అదేవిధంగా గేదెలకు షెల్టర్ కోసం ప్రత్యేక షెడ్ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాజెక్టు యూనిట్ కాస్ట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. దీంతోపాటు ఆరునెలలకు సరిపడా పశుగ్రాసం కోసం అవసరమైన నిధులకు కూడా ప్రత్యేక మొత్తాన్ని నిర్దేశిస్తారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు.. యూనిట్ విలువ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండేలా అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. త్వరలోనే సబ్సిడీ పాడిగేదెల పంపిణీ పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు త్వరలోనే సబ్సిడీపై పాడిగేదెలను అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలి పారు. గురువారం మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ సబ్సిడీ పాడిగేదెల కోసం 3,834 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించారని, గేదెల పంపిణీకి సంబం ధించి విజయ డెయిరీ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉం టుందని వెల్లడించారు. కాగా, గతంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాడిగేదెల్లో 2,691 గేదెలు చనిపోయాయని, వాటికి సంబంధించి పరిహారం కింద కొత్తగా పాడి గేదెలను కొనుగోలు చేసి వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక నుంచి లీటర్ పాలకు ప్రభుత్వం రూ.3, ఆయా డెయిరీ సంస్థలు రూ.1 చొప్పున కలిపి రైతులకు ప్రోత్సాహకం కింద చెల్లిస్తామ న్నారు. ఇందులో భాగంగా కరీంనగర్, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు పాలుపోసే రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకం బకాయిలలో రూ.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విజయ ఐస్క్రీంల విక్రయాలకు సైకిల్ రిక్షాలు.. విజయ ఐస్క్రీంల విక్రయాల కోసం ప్రత్యేక పుష్ కార్ట్ (సైకిల్ రిక్షా)లను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ముందుగా 250 పుష్‌కార్ట్‌ల ద్వారా ఐస్ క్రీంల విక్రయాలు ప్రారంభించాలన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, శిల్పారామం, గోల్కొండ కోట, దుర్గంచెరువు వంటి ప్రాంతాల్లో విక్రయాలు చేప ట్టాలన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో అనువైన ప్రాంతాలను గుర్తించి నూతన ఔట్లెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి మార్చిలో వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్ పాల్గొన్నారు. -
గేదెల సబ్సిడీ కొందరికే..
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రం (డెయిరీ)కి రోజూ పాలు సరఫరా చేస్తున్నప్పటికీ సబ్సిడీ గేదె పథకం జాబితాలో అర్హుల పేర్లు లేవు. పథకంలో వందలాది మందికి మొండి చెయ్యే ఎదురైంది. కేవలం 76 మంది పేర్లను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరి డెయిరీకి వీళ్లే పాలు సరఫరా చేశారా అంటే అదీకాదు.. మిగితా వారు సరఫరా చేసినప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు. అలా ఎందుకు జరిగిందంటే అధికారులు చెప్పే సమాధానం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది. ఎంపికలో గందరగోళం.. ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రంలో డీఆర్డీఏ ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ఈ పాలను పాల శీతలీకరణ కేంద్రం ద్వారా నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య అనుబంధ రంగ సంస్థ విజయ డెయిరీకి ఇక్కడి నుంచి పాలను పంపించడం జరుగుతుంది. కాగా పాడి రైతులకు సబ్సిడీ ద్వారా గేదెను అందజేసే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఆదిలాబాద్ జిల్లాలో లబ్ధిదారుల జాబితా ఎంపిక ప్రక్రియను విజయ డెయిరీకి అప్పగించడం జరిగింది. ఆన్లైన్ పద్ధతిన ఈ–ల్యాబ్‌లో అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాలో డెయిరీకి పాలు సరఫరా చేస్తూ లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ పొందుతున్న వారి పేర్లను ఈ–ల్యాబ్‌లో నమోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడే ఐకేపీ అధికారులు, విజయ డెయిరీ అధికారులు చెబుతున్న మాటలకు పొంతన కుదరడం లేదు. విజయ డెయిరీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గడిచిన ఏప్రిల్, మే నెలలో పాలు సరఫరా చేసిన వారి పేర్లు పంపించామని ఐకేపీ అధికారులు చెబుతున్నారు. వారు పంపిన పేర్లనే తామూ పరిగణనలోకి తీసుకున్నామని విజయ డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరి నిర్వాకంతో అర్హులైన పలువురు పాడి రైతులకు మొదటి దశలోనే సబ్సిడీ గేదె అందకుండా పోతోంది. కేవలం బరంపూర్, రుయ్యాడి, ఆదిలాబాద్ గ్రామాలకు చెందిన కొంతమంది పాడి రైతులను ఎంపిక చేశారు. దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఏళ్లుగా పాలు పోస్తున్నా మొండి చెయ్యే.. ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని తాంసీ, తలమడుగు, ఆదిలాబాద్‌తో పాటు పలు మండలాల్లోని గ్రామాల నుంచి ఎన్నో ఏళ్లుగా పలువురు పాడి రైతులు పాలశీతలీకరణ కేంద్రంలో పాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు సబ్సిడీ గేదె విషయంలో మాత్రం వీరికి మొండిచెయ్యి ఎదురైంది. లీటర్ పాలకు రూ.4 ఇన్సెంటివ్ కూడా పొందినవారిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. సాధారణంగా ఏడాదిలో ఒక వేసవిలో మినహాయించి మిగితా కాలంలో పాలశీతలీకరణ కేంద్రానికి భారీగా పాల సరఫరా జరుగుతుంది. నెలకు 6 వేల లీటర్ల నుంచి 10 వేల లీటర్ల వరకు, కొన్నిసార్లు 12 వేల లీటర్ల వరకు కూడా పాల సేకరణ జరుగుతుంది. అయితే వేసవిలో మాత్రం పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో పలువురు రైతులు పాలశీతలీకరణ కేంద్రానికి పాలు సరఫరా నిలిచిపోతుంది. అలాంటప్పుడు ఏప్రిల్, మే నెలల్లో పాలు సరఫరా చేసిన వారి పేర్లు మాత్రమే పంపాలని విజయ డెయిరీ ప్రతినిధులు కోరడంలో ఆంతర్యం ఏమిటో అంతు పట్టని విషయం. ఒకవేళ విజయ డెయిరీ ప్రతినిధులు కేవలం రెండు నెలల వివరాలు మాత్రమే అడిగిన పక్షంలో మిగితా ఏడాదిలో పాలు సరఫరా చేసిన రైతుల పరిస్థితిపై తెలియజేయకపోవడంతో ఇటు ఐకేపీ సంఘాల ప్రతినిధులతో పాటు పశుసంవర్థక శాఖ అధికారుల వైఫ ల్యం కనిపిస్తోంది. విజయ డెయిరీ ఎంపిక చేసిన జాబితాను పశుసంవర్థక శాఖకు పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి కలెక్టర్ అనుమతి పొంది లబ్ధిదారులకు గేదెల పంపిణీ జరుగుతుంది. నిర్వహణలో లోపభూయిష్టం.. ఆదిలాబాద్‌లో పాలశీతలీకరణ కేంద్రం నిర్వహణ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ప్రధానంగా జిల్లాలో కేవలం వడ్డాడి, రుయ్యాడి, బరంపూర్‌లో మాత్రమే మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. ఈ గ్రామాలకు సమీపంలో ఉన్న పాడి రైతులు ఉత్పత్తి అయిన పాలను పెద్ద మొత్తంలో ఆయా కలెక్షన్ సెంటర్లో అందజేయడం జరుగుతుంది. అక్కడ పెయిడ్ సెక్రెటరీ వారి వివరాలను నమోదు చేసి ఆ పాలను పాల శీతలీకరణ కేంద్రానికి పంపిస్తారు. ఇక్కడే లోపం ఎదురవుతుంది. ప్రధానంగా మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అన్ని గ్రా మాల రైతులకు అనువుగా లేకపోవడంతో వారు నేరుగా ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రానికి వెళ్లి విక్రయించడం జరుగుతోంది. నేరుగా వెళ్లే రైతులను వ్యక్తిగతంగా పాలు అమ్మే కోవలో పరిగణనలోకి తీసుకుని వారికి ప్రభుత్వం ద్వారా అందజేసే లీటరుకు రూ.4 ఇన్సెంటివ్ అందకుండా పోతోంది. మిల్క్ కలెక్షన్ సెంటర్లో పా లు పోసిన రైతుల వివరాలు మాత్రమే విజయ డె యిరీకి పంపించినట్లు ఐకేపీ అధికారులు చెబుతున్నారు. దీంతో కొంత మంది పాడి రైతులకే గేదె ప్రయోజనం దక్సాల్సి ఉండగా, మిగితా రైతుల కు మొండి చెయ్యి ఎదురవుతుంది. పాడి రైతుల ఆవేదన.. కేవలం 76 మంది రైతులను మాత్రమే సబ్సిడీ గేదెకు అర్హులుగా ఎంపిక చేయడంపై పలువురు పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోజూ డెయిరీ కేంద్రానికి వస్తున్నారు. దీంతో తమ లోపం ఎక్కడ బయటపడుతుందోనన్న అధికారులు మరో 122 మంది రైతులను గుర్తించి రెండో విడత కింద వారికి సరఫరా చేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక అనుమతితో వారికి సబ్సిడీ గేదెలను అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొం టున్నారు. మిగతా రైతులను సొసైటీల ద్వారా ఎంపిక చేసి వారికి న్యాయం చేస్తామని నమ్మబలుకుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సొసైటీలు లేకపోవడంతో ఇప్పట్లో పాడి రైతులకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ముందునుంచి సొసైటీల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఏప్రిల్, మే నెలలో సరఫరా చేసిన వారి పేర్లు అడిగారు పాల శీతలీకరణ కేంద్రానికి ఏప్రిల్, మే నెలలో పాలు సరఫరా చేసిన వారి పేర్లు మాత్రమే అడిగారు. అందుకు తగినట్లు వారి వివరాలను పంపించాం. కొన్నేళ్లుగా సరఫరా చేసిన వారి పేర్లు అడిగి ఉంటే అలాగే పంపించేవాళ్లం. పలువురు పాడి రైతులకు సంబంధించి ఆధార్‌కార్డు, పాస్‌బుక్, పాస్ ఫొటోలు, ప్రొఫార్మాలు సేకరించి విజయ డె యిరీకి పంపించినప్పటికీ వారు తిరిగి ఈ–ల్యాబ్‌లో ఆదిలాబాద్‌లోనే నమోదు చే యాలని పంపించారు. పైనుంచి వ చ్చిన ఆదేశాలకనుగుణంగా నడుచుకున్నాం. – వసంత్, మేనేజర్, పాలశీతలీకరణ కేంద్రం మరో 122 మంది జాబితా.. మొదట ఎంపిక చేసిన 76 మంది లబ్ధిదారుల జాబితాతో పాటు మళ్లీ ప్రత్యేక అనుమతితో మరో 122 మంది పాడి రైతులను ఎంపిక చేశాం. మొదట 76 మంది రైతులకు సబ్సిడీ గేదెలను అందజేయనున్నాం. ఇప్పటికే సుమారు 40 మంది డీడీలు కట్టారు. వారికి ఈ మూడునాలుగు రోజుల్లో గేదెలను పంపిణీ చేస్తాం. ఆ తర్వాత ఈ 122 మందిని పరిగణనలోకి తీసుకుంటాం. సొసైటీల ఏర్పాటు జరుగుతుంది. వారికి కూడా గేదెలను అందజేసే అవకాశం ఉంది. ఐకేపీ నుంచి వచ్చిన జాబితాను అనుగుణంగానే లబ్ధిదారులను ఎంపిక చేశాం. లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ పొందుతున్న రైతులను పరిగణనలోకి తీసుకున్నాం. – నాగేశ్వర్రావు, డీఎం, విజయ డెయిరీ -
చివరకు బర్రెలనూ వదల్లేదు...
సాక్షి, హైదరాబాద్ : బర్రెల దొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. హయాత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, పోచంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎంతో కాలంగా బర్రెలు, బర్రె దూడలు చోరీకి గురవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వాటిని చోరీచేసుకు వెళుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 63 బర్రెలు, 10 దూడలు, 1.74 లక్షల రూపాయన నగదు, ఒక కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. బర్రెల దొంగతనాలపై వస్తున్న ఫిర్యాదులపై దృష్టిపెట్టిన హయాత్‌నగర్, అబ్దుల్లామెట్టు పోలీసులు దొంగల ఆటకట్టించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో మీడియాకు తెలియజేస్తామని పోలీసులు చెప్పారు. -
సబ్సిడీ బర్రె రూ.80 వేలు
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలను రూ.80 వేల చొప్పున కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యూనిట్ ధరను పశుసంవర్థక శాఖ ఖరారు చేసింది. సబ్సిడీ బర్రెల కొనుగోలు కోసం రూ. 971 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. రెండ్రోజుల్లో ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచిగానీ, నాబార్డు నుంచిగానీ, ఏదో ఒక వాణిజ్య బ్యాంకు నుంచిగానీ రుణాల కోసం అధికారులు ప్రయత్నిస్తారు. వచ్చే నెల నుంచి బర్రెలను పంపిణీ చేస్తారు. 2.17 లక్షల మంది రైతులకు లబ్ధి విజయ డెయిరీ, రంగారెడ్డి–నల్లగొండ పాల ఉత్పత్తిదారుల సంఘం, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఒక్కో బర్రెను సబ్సిడీపై ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా సంఘాల పరిధిలో మొత్తం 2.17 లక్షల మంది రైతులున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీపై, బీసీలు, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేస్తారు. ఒక్కో బర్రె 8–10 లీటర్లు ఇచ్చేలా ఉండాలని నిర్ణయించారు. ధర ఎక్కువైతే లబ్ధిదారులపైనే భారం బర్రె యూనిట్ ధర రూ. 80 వేలుండగా, అంతకంటే ఎక్కువ ధర పలికితే లబ్ధిదారుడే భరించాలని మార్గదర్శకాల్లో పేర్కొంటామని అధికారులు చెబుతున్నారు. యూనిట్ ధరలోనే రవాణా ఖర్చు సహా అన్నీ కలిపి ఉంటాయి. బర్రెలను హరియాణాలో కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కో బర్రె ఎన్ని పాలు ఇస్తుందో మూడు రోజులపాటు గమనించి 8–10 లీటర్లు ఇస్తుందని నిర్ధారించుకున్నాక కొనుగోలు చేస్తారు. -
అమరావతి భూములు.. చింతమనేని గేదెలు
సాక్షి, అమరావతి : ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణం అన్నారు.. రైతులకు మాయమాటలు చెప్పి పంట భూములను లాక్కున్నారు. పచ్చని పైర్లతో కళకళలాడే భూములు.. ఏడాదికి మూడు పంటలను ఇచ్చిన భూములు... ఇప్పుడు పశువులను మేపుకునే పచ్చి గడ్డి మైదానాలుగా మారిపోయాయి. వెరసి ఇంతకాలం అన్నం పెట్టిన తమ భూములకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి చుట్టు పక్కల వేల ఎకరాల పంట భూముల ప్రస్తుత పరిస్థితి ఇది. ఇంతకీ ఇక్కడ ఠీవీగా మేస్తూ కనిపిస్తున్న గేదెలు ఎవరివో కాదు.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందినవి. అమరావతికి వెళ్లే క్రమంలో ఆయన పనిలో పనిగా ఏలూరులో తన పశువుల కొట్టంలోని 118 గేదెలను వెంటపెట్టేసుకొచ్చేశారు. రెండు నెలలుగా ఇక్కడ ఈ తంతు కొనసాగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పనివాళ్లను.. దొడ్డిని నిర్మించటం విశేషం. చింతమనేని ఆదేశాల మేరకే తాము దగ్గరుండి వాటిని చూసుకుంటామని పనివాళ్లు చెప్పటం గమనించదగ్గ అంశం. చంద్రబాబు ఆధునిక నగర నిర్మాణ గొప్పల సంగతి తెలియదు కానీ... ప్రస్తుతం పశుగ్రాసానికి మాత్రం అమరావతి భూములు కేరాఫ్ అడ్రస్‌గా మాత్రం మారాయి. అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే పనిలో పనిగా, రైతుల భూముల్లో నెమరు వేస్తున్న తన పశువులను చూసుకుని తెగ సంబరపడుతున్నారు. ఇది కూడా చంద్రబాబు ఘనతేనా? సాక్షి, విజయవాడ : రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను కూడా చంద్రబాబు ఘనతే అని టీడీపీ నేతలు చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు అంటున్నారు. సింగపూర్ ను తలదన్నెలా రాజధాని నిర్మాణమని ఘనంగా ప్రకటించుకుని.. ఇప్పుడు ఆ భూములను గడ్డి మైదానాలుగా మార్చేసిన ఘనత మాత్రం నిజంగా చంద్రబాబుదేనని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిలో గడ్డి పుష్కలంగా దొరుకుతుందని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని చెబుతున్నారని.. చివరకు త్యాగం చేసి రైతులు ఇచ్చిన భూములు పశువుల మేతకు నిలయంగా మారే దుస్థితి పట్టిందని సుధాకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
త్వరలో 450 చూడి పశువుల పంపిణీ
∙ 7 వేల పెరటికోâýæ్ల పెంపకం యూనిట్ల మంజూరు ∙ పశుశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ ఠాగూర్ అనంతపురం అగ్రికల్చర్ : డీఆర్డీఏ – ఐకేపీ సహకారంతో 450 చూడి పశువులు త్వరలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ ‘సాక్షి’కి తెలిపారు. అందుకు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల గుర్తింపు పూర్తయిందన్నారు. ఒక్కో చూడిపశువు లేదా గేదె విలువ రూ.60 వేలుగా నిర్ణయించామని, అందులో లబ్ధిదారుల వాటా రూ.15 వేలు కాగా మిగతాది పశుశాఖ రాయితీగా ఇస్తుందని తెలిపారు. మేలుజాతి పశువులు తమిâýæనాడు రాష్ట్రం కరూరు జిల్లా, కర్నాటక రాష్ట్రం కోలార్, అలాగే ముర్రా జాతి గేదెలు హర్యానా నుంచి తెప్పించడానికి ఇప్పటికే ఏడీ, డాక్టర్లతో కూడిన స్క్రీనింగ్ బృందం వెళ్లిందన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారన్నారు. ఆ తర్వాత లబ్ధిదారులను పిలుచుకెళ్లి వారు కోరుకున్న వాటిని అందజేస్తామన్నారు. దీంతో పాటు జిల్లాకు 7 వేల వరకు పెరటికోâýæ్ల పెంపకం యూనిట్లు (బ్యాక్‌యార్డ్ ఫౌల్ట్రీ) మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో పెరటి కోళ్ల యూనిట్ విలువ రూ.3,060 కాగా లబ్ధిదారులు తమ వాటాగా రూ.810 చెల్లించాలన్నారు. ఒక యూనిట్ కింద 45 కోడిపిల్లలు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తామని చెప్పారు. -
విష పదార్థాలు తిని పాడిగేదెలు మృతి
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి అటవీ ప్రాంతంలో విష పదార్థాలను తిని రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మట్టపల్లికి చెందిన బచ్చలకూరి గురవయ్యకు చెందిన మూడు పాడిగేదెలు ఉదయం మేతకు వెళ్లాయి. సాయంత్రం ఒక గేదె మాత్రమే ఇంటికి వచ్చి నోటి వెంట నురగలు కక్కుతుండడంతో పశు వైద్య సిబ్బందితో చికిత్స నిర్వహించారు. మిగిలిన రెండు గేదెల కోసం అడవి వెతకగా మృతి చెంది ఉన్నాయి. అడవిలో విష పదార్థాలు తినడం వల్లే గేదెలు మృతి చెందాయని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరారు. కాగా గేదెలు మృతిచెందిన స్థలాన్ని పశువైద్య సిబ్బంది సందర్శించారు. -
మంత్రి గేదెలు...మంచి పోలీసులు!
‘కనబడుట లేదు’ అనే మాట వినిపించగానే... ఉత్తరప్రదేశ్‌లో పోలీసు యంత్రాంగమంతా ఏకమై కదిలింది... శిక్షణ పొందిన శునకాలతో చె ట్టూపుట్టా గాలించి చివరికి ఆచూకీ కనిపెట్టింది...ఇంతకీ వాళ్లు కనిపెట్టింది ఏంటో తెలుసా... గేదెలను... కాకపోతే అవి వీఐపీ గేదెలు... అందునా ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్‌కు చెందిన గేదెలు... గత శుక్రవారం ఆజంఖాన్ ఫాంహౌజ్ నుంచి ఏడు గేదెలు చోరీకి గురయ్యాయి. దీంతో తన గేదెలను పట్టుకురావాలని మంత్రి స్థానిక పోలీసులను ఆదేశించారు. అమాత్యుల మాటను శిరసావహించిన పోలీసులు గాలించి, శోధించి చివరికి మంత్రిగారి గేదెల ఆచూకీ తెలుసుకున్నారు. కాకపోతే.. గేదెలను కనిపెట్టడానికి సంబంధించి విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి ప్రభుత్వం ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది.