
సాక్షి, హైదరాబాద్ : బర్రెల దొంగలు ఎట‍్టకేలకు పోలీసులకు చిక్కారు. హయాత్‌నగర్, ఇబ్రహీంపట‍్నం, కందుకూరు, పోచంపల్లి పోలీస్ స్టేషన‍్ల పరిధిలో ఎంతో కాలంగా బర్రెలు, బర్రె దూడలు చోరీకి గురవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వాటిని చోరీచేసుకు వెళుతున‍్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు.
వారి వద‍్ద నుంచి 63 బర్రెలు, 10 దూడలు, 1.74 లక్షల రూపాయన నగదు, ఒక కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. బర్రెల దొంగతనాలపై వస్తున‍్న ఫిర్యాదులపై దృష‍్టిపెట్టిన హయాత్‌నగర్, అబ్దుల్లామెట్టు పోలీసులు దొంగల ఆటకట్టించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త‍్వరలో మీడియాకు తెలియజేస్తామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment