గేదెలే గుంపులుగా వస్తాయ్‌.. సింహం సింగిల్‌గానే అనుకుంది.. ఫైనల్‌గా.. | Viral Video: Lion Attack Herd Of Buffalo But Finally See What Happened | Sakshi
Sakshi News home page

Viral Video: సింగిల్‌గా ఉంటే సింహమైనా సైలెంట్‌గా ఉండాలి.. లేదంటే

Published Mon, Oct 4 2021 7:09 PM | Last Updated on Wed, Oct 6 2021 2:17 PM

Viral Video: Lion Attack Herd Of Buffalo But Finally See What Happened - Sakshi

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతోంది. అందులో కొన్ని వైరల్‌గా మారి దూసుకుపోతుంటాయి కూడా. ఇటీవల పెళ్లి, బరాత్‌, పిల్లలు, జంతువుల వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే కంటెంట్‌ ఉన్న వీడియోలు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటారు. సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం ప్రకృతి సహజమే. కానీ అలా ప్రతీ సారి కుదరదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఓ గేదెపై సింహం దాడి చేసింది. ఇంకేముంది ఆ గేదె పని అయిపోయింది అనుకున్నారా!  ఇక్కడ సీన్‌ మారింది లెండి. దాహం వేసి నీరుతాగడానికి వెళ్లిన ఓ గేదెను.. ఓ సింహం అదును చూసి ఒక్కసారిగా దానిపై దూకింది. ఊహించని ఘటనతో బెదిరిపోయిన గేదె.. కొద్ది సేపు తడబడ్డా, తర్వాత తిరగబడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా ఆ సింహంతో పోటా పోటీగా పోరాడుతోంది.

ప్రమాదంలో ఉన్న ఆ గేదెను చూసిన మిగతా గేదెలు ఒక్కసారిగా  సింహంపై ఎదురుదాడి చేస్తూ రంగంలోకి దిగాయి. ఇంకేముంది గేదెలు ఒకటో రెండో ఉంటే మన మృగరాజు మేనేజ్‌ చేసేదేమో గానీ  గుంపులు గుంపులుగా ఉండేసరికి దడుసుకంది. కానీ అప్పటికే పద్మవ్యూహంలో చిక్కినట్లు ఆ గేదెల గుంపుకు సింహం చిక్కేసింది.  అన్ని గేదెలూ కలిసి ఆ సింహాన్ని చెడుగుడు ఆడుకున్నాయి. గాల్లోకి బంతిలా ఎగరేస్తూ.. కొమ్ములతో కుమ్ముతూ, కాళ్లతో తొక్కి చంపేశాయి. కాగా ఆ పార్కులోకి వచ్చిన కొందరు సందర్శకులు ఈ దృ శ్యాన్ని రికార్డు చేసి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

చదవండి: లక్ష రూపాయల్ని టవల్‌లో చుట్టుకుంటే.. కోతి ఎత్తుకెళ్లిపాయె!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement