ప్రపంచంలో ప్రేమకు వెలకట్టలేం. అందుకే ప్రేమకు చిహ్నంగా ఏర్పడ్డ తాజ్‌మహల్ చరిత్రలో చిరస్థాయిగా తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తల్లి ప్రేమ విషయానికొస్తే వర్ణించడానికి మాటలు రావు, అంతెందుకు కవులకు సైతం వారి కలంలో సిరా సరిపోదు. ఎందుకంటే తన బిడ్డ కోసం ఆ తల్లి పడే తపన, తాను చేసే త్యాగాలు అలాంటివి మరి. ప్రస్తుతం ఈ వీడియో చూస్తే ఈ మాటలకు సరిగ్గా సరిపోతాయని అనిపిస్తోంది. మనుషుల్లోనైనా, జంతువులైనా తల్లి చూపించే ప్రేమ మారదని ఈ వీడియో నిరూపిస్తుంది.
సుశాంత నందా అనే ఐపీఎస్ అధికారి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారి హల్ చేస్తోంది. ఆ వీడియాలో.. అడవిలో ఓ గేదే తన బిడ్డతో కలసి వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ సింహాల గుంపు వాటి పై దాడి చేసింది. ఆ దాడిలో ఓ సింహం గేదే పిల్లను నోటితో పట్టుకుని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లింది. సాధారణంగా సింహాలతో గేదేలు పోరాడిన ప్రాణాలతో బయట పడలేవు. కానీ ఇక్కడ అన్ని సింహాలున్న గేదే బెదరక తన బిడ్డ కోసం వాటితో పోరాడింది. చివరకు వాటి నోటి నుంచి తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ వీడియా చూసిన నెటిజన్లు తల్లి ప్రేమంటే ఇదే కదా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Mother’s courage👌
— Susanta Nanda IFS (@susantananda3) June 8, 2021
Shared by NIFL pic.twitter.com/V7kjvOLv5f
చదవండి: పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment