అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఓ హోటల్‌కు అనుకోని అతిథి వచ్చి వెళ్లిన దృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. సింహం అక్కడి ఓ హోటల్‌లో ప్రవేశించిన దృశ్యం అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియోను ఉదయ్ కచ్చి అనే ట్వీటర్ యూజర్ ఈ వీడియోను బుధవారం ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. జూనాఘడ్‌లోని రైల్యే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సరోవర్ పోర్టికో హోటల్‌లోకి సింహం గోడ దూకి వచ్చిన ఈ సంఘటన ఈరోజు ఉదయం 3 గంటల ఈ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి సింహం ఉదయం పూట రావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ‘ఈ మధ్య కాలంలో సింహాలు జునాఘడ్‌కు వచ్చిపోవడం సాధారణం అయిపోయింది’ అంటూ అతడు షేర్ చేసిన ఈ వీడియోలో సింహం హెటల్‌కు గోడపై నుంచి దూకి లోపలికి వెళ్లి మళ్లీ అదే గొడపై నుంచి తిరిగి వెళుతున్నట్లు కనిపించింది.
అలాగే ఆటవీ శాఖ అధికారి సుశాంత్ నందా కూడా ‘ఇది పెద్ద సమస్య కాదు.. లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ గేట్ తెరవాల్సిన అవసరం లేదు’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ఇది చూసిన నెటజన్లంతా షాక్ అవుతున్నారు. ‘ఈ ప్రాంతం గిర్నార్ కొండలకు సమీపంలో ఉన్నందున సింహాలు తరచూ జనవాసంలోకి వస్తున్నాయి. ఇది అక్కడి ప్రజలకు, సింహాలు మంచి కాదు’, ‘ఇక్కడి వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడం మంచిది’, ‘బాబోయ్.. ఆ సమయంలో హోటల్లో ఎవరూ లేరు అదృష్టం’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా జునాఘడ్ సింహల అభయారణ్యమైన గిర్ కొండలకు బార్డర్‌లో ఉంటుంది. ఇదివరకు కూడా ఇలా సింహాలు రాత్రి సమయంలో జూనాఘడ్ రోడ్లపై తరచూ తిరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
Lions in the city of Junagadh is a regular affair nowadays. @ParveenKaswan @susantananda3 @CentralIfs pic.twitter.com/o2PtLiXmui
— Udayan Kachchhi (@Udayan_UK) February 10, 2021
Comments
Please login to add a commentAdd a comment