Junagadh
-
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఉరి
జునాగఢ్: గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లా చార్వాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విమల్ చుదాసామా ఇంట్లో ఓ యువకుడు(28) అనుమాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ శవమై కనిపించాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే విమల్తోపాటు అతడి అత్త, మామ వేధింపులే కారణమంటూ ఆ లేఖలో ఉందని వివరించారు. బలవన్మరణానికి పాల్పడిన యువకుడిని నితిన్ పర్మర్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని చనిపోయినట్లు చెప్పారు. చనిపోయిన యువకుడు నితిన్ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువేనని తెలిసిందని అన్నారు. అయితే, ఎమ్మెల్యే విమల్ వాదన మరోలా ఉంది. నితిన్‌ను ఎవరో హత్య చేశారని, తనను అప్రతిష్టపాలు చేయడానికే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, నకిలీ సూసైడ్ నోట్‌ను సృష్టించారని ఆరోపించారు. నితిన్ చావుకు తానే కారణం అంటూ రాజకీయ ప్రత్యర్థులు నిందలు మోపుతున్నారని వాపోయారు. -
వరదలతో రారాజు అగచాట్లు.. అడవిని విడిచి రోడ్డుపై..
అహ్మదాబాద్: గుజరాత్ సహా ఉత్తర భారతదేశాన్ని వర్షాలు కొద్ది రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. కాలనీలు జలమయమయ్యాయి. జనజీవనం స్థంభించింది. నగరాలకు సైతం వరద తాకిడి ఎదురవుతుంటే ఇక అడవుల్లో వరదల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో అడవికి రారాజు సైతం వరదలతో ఇబ్బంది పడి.. అడవిని విడిచి రహదారిపైకి వచ్చేశాడు. గుజరాత్‌లోని జునాగఢ్‌ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కుంభవృష్టి సంభవిస్తోంది. దీంతో జునాగఢ్ సహా పరిసర నగరాల్లోని ప్రజలతో సహా అడవుల్లోని జంతువులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అడవికి రారాజుగా ఉండే సింహాలు సైతం అడవుల్లో ఉండలేక రోడ్లపైకి వస్తున్నాయి. ఓవైపు వర్షం వస్తున్నా.. ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డుపైకి వచ్చి వరదల తాకిడిని తప్పించుకుంటున్నాయి. వర్షంలో రోడ్డుపై సంచరిస్తున్న ఓ సింహం వీడియోను స్థానికులు షేర్ చేశారు. Gujarat is battered with incessant rains with flood like situation in many cities. Even, King of the Jungle is forced to relocate from it's habitat. Pray to God 🙏 for a speedy recovery and normalisation of the cities affected#GujaratRain #GujaratRains pic.twitter.com/5YORSAJnEN — Syed Saba Karim (@SyedSabaKarim5) July 23, 2023 ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే 3000 వ్యూస్ వచ్చాయి. రాజుకు రాజ్యంలో స్థానం లేకుండా పోయిందని కొందరు కామెంట్ చేశారు. రాజ్యంలో బాధలను పర్యవేక్షించడానికి రాజు బయటకు వచ్చాడు అంటూ మరొకరు ఫన్నీగా స్పందించారు. గుజరాత్లో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్‌ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు నగరాలను సైతం నీట ముంచుతున్నాయి. వరద నీటితో నదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. నవసారి, జునాగఢ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. కాలనీలు నదులను తలపిస్తున్నాయి. जूनागढ़ : मेघ तांडव… खिलौने की तरफ़ पानी में डूबती तैरती कारें, मुख्य सड़क पर पानी का ज़बरदस्त बहाव,#JunagadhRain pic.twitter.com/T7lesOoh86 — Janak Dave (@dave_janak) July 22, 2023 ఇదీ చదవండి: బైక్ నడుపుతూ ఇంటి చిరునామా మరిచిన వృద్ధుడు -
ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే..
గుజరాత్: ఒక రైతు సింహం బారి నుండి తన ఆవును రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. చివరకు ఎలాగోలా సింహాన్ని భయపెట్టి గంగిగోవును కాపాడుకున్నాడు. గుజరాత్ లోని గిర్ సోమ్ నాట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చగడ్డిని ఆదమరచి తింటోన్న ఆవుపై అక్కడే మాటు వేసి ఉన్న ఆడ సింహం ఒక్క ఉదుటున దూకి దాని గొంతు పట్టుకుంది. పాపం ఆ ఆవు నొప్పితో విలవిలలాడిపోయింది. పంటిబిగువున నొప్పిని భరిస్తూ తన యజమానికి వినిపించేలా పెద్దగా అరిచింది. తన గోవు అరుపులు విన్న ఆ రైతు వెంటనే అక్కడికి చేరుకొని ఎలాగైనా తనని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ధైర్యంగా సింహం వైపు నడుచుకుంటూ వచ్చాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సింహం పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నంలో ఆవు రోడ్డు పక్కకు జరిగింది. అంతలో తనవైపుగా వస్తోన్న రైతును చూసిన సింహం భయపడి వెంటనే అవును విడిచిపెట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయింది. ఈ వీడియోని జునాగఢ్ లోని కేశోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు సింహానికి ఎదురెళ్ళిన ఆ రైతు గుండె ధైర్యానికి ఫిదా అయ్యి కామెంట్లు పెడుతున్నారు. ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ. ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ — Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023 ఇది కూడా చదవండి: ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా.. -
ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు..
గుజరాత్:గుజరాత్‌లోని జునాగఢ్‌లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. దర్గా కూల్చివేత నోటీసులు జారీ చేయడానికి వెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులపై అందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా..పలువురు పోలీసులు గాయపడ్డారు. దర్గాను అక్రమంగా నిర్మించారని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఈ క్రమంలో అధికారులు దర్గాపై కూల్చివేతకు సంబంధించిన నోటీసులను జారీ చేయడానికి వెళ్లగా.. ఆందోళనకారులు అధికారులను అడ్డగించారు. అనంతరం అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసు పోస్టును కూల్చివేశారు. దాదాపు 300 మంది నిరసనకారులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ఉపయోగించారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురు పోలీసులతో సహా ఓ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 174 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:Cyclone Biparjoy: బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం -
జునాగఢ్ ఉత్సవాలు ఎందుకు నిర్వహించరు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు గుజరాత్‌లోని జునాగఢ్‌కు కూడా ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందని, మరి బీజేపీ నేతలు అక్కడ ఎందుకు వజ్రోత్సవాలు నిర్వహించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజ నాల కోసం సెప్టెంబర్ 17ను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చిల్లర వేషా లు వేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శనివారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ద్దేశించి ఆయన మాట్లాడుతూ గుజరాత్లో ఉత్సవా లు జరిపిన తర్వాతే హైదరాబాద్‌లో విమో చన ఉత్సవాలు జరపాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకు పోవాలనే కుట్రతోనే ఇక్కడ కొత్త వేషాలు కడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అమలు చేసే ప్రణాళికలేంటో వివరించాలని డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ మా వాడు... హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తమ వాడని, ఆయనది కాంగ్రెస్ కుటుంబమని, తమ నుంచి పటేల్‌ను ఎవరూ విడదీయలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. పటేల్ తన హయాంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ చరిత్రను దొంగిలించి తమ చరిత్రగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ చిచ్చుపెట్టే పరిస్థితులు టీఆర్ఎస్ వల్లే ఏర్పడ్డాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీ, టీఆర్ఎస్ల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సబ్బండ వర్గాలను ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని సన్మానించారు. కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్, అంజన్‌కుమార్ యాదవ్, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సిటీ కాంగ్రెస్ నాయకులు విజయారెడ్డి, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులుతోపాటు పలువురిని రేవంత్ శాలువాలతో సన్మానించి, వారికి పాదాభివందనం చేశారు. ఆపై ఇందిరా భవన్లో జరిగిన టీపీసీసీ ఎక్స్ సర్వీస్‌మెన్ సెల్ చైర్మన్ పి.రాజేంద్రన్ పదవీబాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ మాజీ సైనికులకు నెలలో బెనిఫిట్స్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఇదీ చూడండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
గుజరాత్లో వరుణ విలయం
అహ్మదాబాద్: దక్షిణ గుజరాత్లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్‌నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. వల్సాద్ జిల్లాలోని కాప్రాడా తాలూకాలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రికార్డు స్థాయిలో 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నవసారిలోని వన్స్‌దాలో 164 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతంలో కేవలం 3 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. చాకుడియా, విరాట్‌నగర్‌లోనూ భారీ వర్షం కురిసింది. దక్షిణ గుజరాత్లో రానున్న 4 రోజులపాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముంబైలో కొంత ఊరట నాలుగు రోజులుగా ముంబైని ముంచెత్తుతున్న వర్షం శుక్రవారం కొద్దిగా తెరపినిచ్చింది. బస్సులు, సబర్బన్ రైలు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాగల 24 గంటల్లో 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అలెర్ట్ చేశారు. థానె జిల్లా మిరాభయందర్ ప్రాంతంలో చెనా నది వరదలో చిక్కుకున్న ముగ్గురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. రాయ్‌గఢ్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాథేరన్‌లో అత్యధికంగా 210 మిల్లీమీటర్లు కురిసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు తెలంగాణ, రాజసాŠత్న్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
మేకను తప్పించి సింహానికి బలైన యువకుడు
అహ్మదాబాద్: మామిడి తోట కాడ కాపు కాస్తుండగా హఠాత్తుగా సింహం వచ్చింది. ఆ సింహ మేకను తినేద్దామని ప్రయత్నించగా ఆ మేకను కాపు కాస్తున్న వ్యక్తి తప్పించాడు. అయితే సింహం మేకను కాదని ఆ వ్యక్తిని తన ఆహారంగా చేసుకుని తినేసింది. సింహం చేతిలో మనిషి బలైన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది జూనాగఢ్ జిల్లా గిర్ అటవీ డివిజన్లోని తలాలా రేంజ్ పరిధిలో ఉన్న మధుపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మధుపూర్ గ్రామంలో మామిడి తోటకు బహదూర్భాయ్ జీవాభాయ్ (35) కావలి ఉంటున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి గ్రామ సమీపంలోని మామిడి తోటకు కాపలా ఉంటూ నిద్రించాడు. అయితే శనివారం తెల్లవారుజామున అడవిలో నుంచి సింహం బయటకు వచ్చింది. తోట సమీపంలోకి రాగా మేక కనిపించింది. మంచానికి కట్టేసిన మేకను తినేయాలని చూడగా మేక అరుపులకు బహదూర్భాయ్ జీవాభాయ్ మేల్కొన్నాడు. సింహం నుంచి మేకను తప్పించాడు. మేక తప్పించుకోగా జీవాభాయ్ సింహానికి చిక్కాడు. సింహం పంజా విసిరి జీవాభాయ్‌పైకి దాడి చేసి తినేసింది. అతడి అరుపులు విన్న గ్రామస్తులు వెంటనే తోట కాడికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సింహాన్ని బంధించారు. చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ చదవండి: వ్యాక్సిన్ కొరత తీవ్రం.. పిల్లలకు కూడా వేయించాలి -
భయానకం: గోడ దూకి హోటల్లోకి వచ్చిన సింహం..
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఓ హోటల్‌కు అనుకోని అతిథి వచ్చి వెళ్లిన దృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. సింహం అక్కడి ఓ హోటల్లో ప్రవేశించిన దృశ్యం అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియోను ఉదయ్ కచ్చి అనే ట్వీటర్ యూజర్ ఈ వీడియోను బుధవారం ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. జూనాఘడ్‌లోని రైల్యే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సరోవర్ పోర్టికో హోటల్లోకి సింహం గోడ దూకి వచ్చిన ఈ సంఘటన ఈరోజు ఉదయం 3 గంటల ఈ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి సింహం ఉదయం పూట రావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ‘ఈ మధ్య కాలంలో సింహాలు జునాఘడ్‌కు వచ్చిపోవడం సాధారణం అయిపోయింది’ అంటూ అతడు షేర్ చేసిన ఈ వీడియోలో సింహం హెటల్‌కు గోడపై నుంచి దూకి లోపలికి వెళ్లి మళ్లీ అదే గొడపై నుంచి తిరిగి వెళుతున్నట్లు కనిపించింది. అలాగే ఆటవీ శాఖ అధికారి సుశాంత్ నందా కూడా ‘ఇది పెద్ద సమస్య కాదు.. లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ గేట్ తెరవాల్సిన అవసరం లేదు’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ఇది చూసిన నెటజన్లంతా షాక్ అవుతున్నారు. ‘ఈ ప్రాంతం గిర్నార్ కొండలకు సమీపంలో ఉన్నందున సింహాలు తరచూ జనవాసంలోకి వస్తున్నాయి. ఇది అక్కడి ప్రజలకు, సింహాలు మంచి కాదు’, ‘ఇక్కడి వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడం మంచిది’, ‘బాబోయ్.. ఆ సమయంలో హోటల్లో ఎవరూ లేరు అదృష్టం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా జునాఘడ్ సింహల అభయారణ్యమైన గిర్ కొండలకు బార్డర్లో ఉంటుంది. ఇదివరకు కూడా ఇలా సింహాలు రాత్రి సమయంలో జూనాఘడ్ రోడ్లపై తరచూ తిరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. Lions in the city of Junagadh is a regular affair nowadays. @ParveenKaswan @susantananda3 @CentralIfs pic.twitter.com/o2PtLiXmui — Udayan Kachchhi (@Udayan_UK) February 10, 2021 -
జనావాసాల్లోకి ఏడు సింహాలు
గిరినగర్: గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జునాగఢ్‌లోని గిరినగర్ వీధుల్లో గత శుక్రవారం రాత్రి ఏడు సింహాలు చక్కర్లు కొట్టాయి. జనావాసాల మధ్య హాయిగా తిరిగాయి. దీన్ని ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మధ్యమాల్లో పోస్ట్‌చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, సింహాలను అడవిలోకి తోలారు. కాగా, ఈ విషయమై జునాగఢ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(డీసీఎఫ్) ఎస్కే బేర్వాల్ మాట్లాడుతూ.. గిర్ అభయారణ్యం సమీపంలోనే ఉండటంతో ఈ సింహాల గుంపు జనావాసాల మధ్యకు వచ్చిందని తెలిపారు. వర్షాలు పడినా, పడకున్నా సింహాలు అలా స్వేచ్ఛగా తిరుగుతాయనీ, అది వాటి స్వభావమని వివరణ ఇచ్చారు. ఈ సింహాలన్నీ క్షేమంగానే ఉన్నాయని తేల్చిచెప్పారు. 2015 నాటి లెక్కల ప్రకారం గిర్ అభయారణ్యంలో 523 ఆసియా సింహాలు ఉన్నాయి. -
రోడ్లమీద సంచరించిన సింహాల గుంపు
-
వైరల్ : రోడ్లమీదకు వచ్చేసిన సింహాల గుంపు
జునాగఢ్ : గుజరాత్‌లోని జునాఘడ్ ప్రాంతంలో రోడ్లపై సింహాల గుంపు నిర్భయంగా తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రి సమయంలో ఏడు సింహాలు జునాగఢ్ ప్రాంతంలో తిరుగుతున్న వీడియోనూ చూసి ఏ నిమిషం ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, జునాగఢ్‌కు సమీపంలో ఉన్న గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఈ సింహాల గుంపు వచ్చినట్లు తెలుస్తోంది. "గిర్నార్ అభయారణ్యం జునాగఢ్‌కు సమీపంలో ఉండడంతో సింహాలు తరచుగా బయటకు వస్తుంటాయి. ఇది ఇక్కడ సాధారణమైన విషయం. రాత్రి వేళలో ఇవి బయటకు వచ్చి రోడ్లమీద సంచరించి తిరిగి అడవికి వెళ్లిపోతాయి తప్ప ఎవరికి హాని కలిగించవు. అటవీశాఖ ప్రతీక్షణం సింహాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తుందని' డిప్యూటి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారి సునీల్ కుమార్ బెర్వాల్ వెల్లడించారు. గత నెలలో గిర్ అటవీ ప్రాంతంలో ఒక సింహం గడ్డి తింటున్న వీడియో సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. సహజంగానే మాంసాహారులు అయిన సింహాలు ఇలా గడ్డి తినడం ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఆ వీడియో చివర్లో అసలు విషయం బయటపడింది. సింహాలు ఎప్పుడైనా కడుపు నొప్పితో బాధ పడినప్పుడు గడ్డిని తిని అంతకుముందు తిన్న పదార్థాలను వ్యర్థ రూపంలో బయటకు పంపుతాయి. -
అందరికీ సొంతిళ్లు నా స్వప్నం
జుజ్వా (గుజరాత్): దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ప్రతి కుటుంబం సొంత ఇళ్లు కలిగి ఉండేలా చూడటమే తన స్వప్నమని ప్రధాని మోదీ అన్నారు. దళారుల పాత్ర లేకపోవడం వల్ల ప్రభుత్వం విడుదలచేస్తున్న ప్రతి పైసా లక్షిత లబ్ధిదారులకే చేరుతోందన్నారు. గుజరాత్ వల్సాద్ జిల్లాలోని జుజ్వాలో గురువారం నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సామూహిక ఆన్లైన్ గృహ ప్రవేశ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే లబ్ధిదారులకు వెళ్తోందన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం విడుదలచేస్తున్న ప్రతి పైసా లబ్ధిదారులకు చేరుతోందని అన్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందడానికి లబ్ధిదారులు లంచాలు చెల్లించనక్కర్లేదని నొక్కిచెప్పారు. వల్సాద్ జిల్లా కొండ ప్రాంతాల్లోని సుమారు 175 గ్రామాలకు తాగునీరు అందించే రూ.586 కోట్ల ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. కాంట్రాక్టర్లు కాదు.. లబ్ధిదారులపైనే నమ్మకం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని మోదీ అన్నారు. ‘ఇళ్లు పొందేందుకు లంచాలు ఇచ్చారా? అని దేశం మొత్తం చూస్తుండగా, మీడియా సమక్షంలోనే లబ్ధిదారులను ప్రశ్నించే ధైర్యం మా ప్రభుత్వానికి ఉంది. నిబంధనల ప్రకారమే ఇళ్లు వచ్చాయని, లంచం చెల్లించే అవసరం రాలేదని తల్లులు, సోదరీమణులు సంతృప్తికర సమాధానమిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నా. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నా, ఇంటిని ఎలా నిర్మించాలి? ఏయే సామగ్రి వినియోగించాలి? లాంటి వాటిని కుటుంబమే నిర్ణయిస్తుంది. కాంట్రాక్టర్లు కాకుండా లబ్ధిదారులపైనే నమ్మకం ఉంచుతాం’ అని మోదీ అన్నారు. సొంతిళ్లు పొందటంపై లబ్ధిదారుల అనుభవాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, బాలికల విద్య, నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ కనెక్షన్ తదితరాల గురించి వాకబు చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో దేశంలో విద్యుత్ సౌకర్యంలేని ఇళ్లు ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. ‘స్వచ్ఛ్భారత్’ అప్పుడే చేపట్టి ఉంటే.. స్వచ్ఛ్భారత్ లాంటి పారిశుధ్య కార్యక్రమాలను 70 ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టి ఉంటే దేశం ఇప్పటికే వ్యాధిరహితంగా మారేదన్నారు. పారిశుధ్యానికి చేపట్టిన చర్యల వల్లే 3 లక్షల మంది చిన్నా రులను కాపాడుకోగలిగామని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను ఉటంకించారు. జునాగఢ్‌లో గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ‘టాయిలెట్లు నిర్మించడం, చెత్త ఏరడం... ఇవి ప్రధాని పనులా? అని విపక్షాలు హేళనచేశాయి. ఈ పనులన్నీ 70 ఏళ్ల క్రితమే చేసి ఉంటే నేడు దేశంలో ఒక్క వ్యాధి కూడా ఉండేది కాదు’ అని అన్నారు. తర్వాత గాంధీ నగర్లో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. -
రాజావారి శునక వైభోగం
జీవితంలో గడ్డు దినాలు ఎదురైనప్పుడు కొందరు ‘బొత్తిగా కుక్క బతుకైపోయింది’ అని వాపోతుంటారు. కాలం కలసి రావాలే గానీ, కుక్కలకు కూడా మహారాజ యోగం పడుతుందనే సంగతి వాళ్లకు తెలియదు పాపం. రాజు తలచుకోవాలే గానీ, శునకాలకు రాచమర్యాదలు కరువవుతాయా? గుజరాత్‌లోని జునాగఢ్ సంస్థానం లో ఏకంగా ఎనిమిది వందల గ్రామసింహాలు అనుభవించిన వైభోగం బహుశా మృగరాజులు, గజరాజులు కూడా అనుభవించి ఉండవు. బ్రిటిష్ కాలంలో జునాగఢ్ సంస్థానాన్ని పరిపాలించిన మహమ్మద్ మహెబత్ఖాన్ రసూల్‌ఖాన్ నవాబుగారికి శునకాలంటే వల్లమాలిన ప్రీతి. నిజానికి ఆయన మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ప్రేమించేవారని కూడా చెప్పుకొనేవారు. మహెబత్ ఖాన్ రసూల్‌ఖాన్ వారి సంస్థానంలో ఏకంగా ఎనిమిదివందల జాగిలాలు ఉండేవి. ప్రతి జాగిలానికీ సకల సౌకర్యాలతో కూడిన ఒక ప్రత్యేకమైన గది ఉండేది. ప్రతి గదిలోనూ టెలిఫోన్ ఉండేది. అలాగే, ఒక్కో జాగిలానికి ఒక్కో సేవకుడు ఉండేవాడు. జాగిలాలకు ఏమాత్రం అస్వస్థత చేసినా అత్యున్నత స్థాయి బ్రిటిష్ పశువైద్యులను రప్పించి మరీ చికిత్సలు చేయించేవారు. సంస్థానంలో ఇన్ని శునకాలు ఉన్నా, నవాబుగారికి రోషనార అనే ఆడ జాగిలంపై ప్రత్యేకాభిమానం ఉండేది. నవాబుగారి అభిమాన జాగిలమైన రోషనార ఒకనాడు బాబీ అనే మగ శునకంతో జతకట్టింది. ఇక నవాబుగారి ఆనందానికి హద్దే లేకుండాపోయింది. రోషనారకు, బాబీకి ఘనంగా రాజలాంఛనాలతో వివాహం జరిపించారు. దర్బారు హాలులో వెండి వేదికను ఏర్పాటు చేశారు. వధువు జాగిలానికీ, వరుడు జాగిలానికీ స్వర్ణాభరణాలను అలంకరించారు. మేళతాళాలను మోగించారు. అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఆ వివాహానికి దేశంలోని సమస్త సంస్థానాధీశులకు మాత్రమే కాదు, అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ దొరవారిని కూడా ఆహ్వానించారు. పాపం... ఈ మహత్తర ఘట్టాన్ని తిలకించే ప్రాప్తం లేకపోవడం వల్ల ఇర్విన్ దొరవారు ‘అనివార్య’ కారణాల వల్ల ఈ వివాహానికి హాజరు కాలేకపోతున్నట్లు వర్తమానం పంపారు. ఘనత వహించిన మహెబత్ఖాన్ రసూల్‌ఖాన్ నవాబుగారు ఈ శునక కళ్యాణ మహోత్సవానికి ఆ రోజుల్లోనే రూ.20 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంతచేసిన ఈ వీర శునక ప్రేమికుడు తర్వాతి కాలంలో ర్యాబిస్‌తో కన్నుమూయడమే విషాదం. -
వైరల్ వీడియో: గల్లీల్లో ఠీవీగా నడుస్తూ..!
ఎవరూలేని ఓ నిర్మానుష్య రాత్రి.. వీధుల్లో ఓ సింహం ఒంటరిగా ఠీవీగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో సింహం ఒకటి జనావాసాల్లోకి ప్రవేశించింది. అయితే, రాత్రి సమయం కావడంతో జనాల కంట్లో అది పడలేదు. గాఢనిద్రలో అందరూ నిద్రిస్తున్న సమయంలో అది వీధుల్లో ఠీవీగా సంచరించింది. ఓ వ్యక్తి అత్యంత చాకచక్యంగా సింహం కంటపడకుండా అది సంచరిస్తున్న దృశ్యాన్ని తన సెల్ఫోన్లో బంధించాడు. అతను సోషల్ మీడియాలో పోస్టుచేసిన ఈ వీడియో హల్చల్ చేస్తోంది. జునాగఢ్ ప్రాంతం గిర్ అడవి జాతీయ పార్కుకు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చేరువలో ఉంటుంది. ఇక్కడ ఆసియా సింహాలు అధికంగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు జనావాసాల్లో ఇలా సంచరించడం కూడా ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే! -
గల్లీల్లో ఠీవీగా నడుస్తూ..!
-
సీబీఐ కస్టడీకి బీజేపీ ఎంపీ సోలంకి
న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన ఆర్టీఐ(సమాచార హక్కు) ఉద్యమ నేత అమిత్ జెత్వా దారుణ హత్య కేసులో అరెస్టయిన బీజేపీ ఎంపీ దిను బొఘా సోలంకిని ఈనెల 11 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కోసం ఆయనను 14 రోజుల కస్టోడియల్ రిమాండ్‌కు అనుతించాలని న్యాయస్థానాన్ని సీబీఐ తరపు న్యాయవాది కుమార్ రజత్ కోరారు. నాలుగు రోజుల పాటు రిమాండ్‌కు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్ జీ పాండ్య అనుమతించారు. రిమాండ్ సమయంలో ప్రతిరోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దిను బొఘా సోలంకిని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఎంపీ ఇచ్చిన సమాధానం తమను సంతృప్తి పరచలేదని అందుకే అరెస్టు చేశామని సీబీఐ అధికారి కాంచన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. గుజరాత్‌లోని గిర్ అడవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అమిత్ జెత్వా అనే ఆర్టీఐ ఉద్యమ నేత పోరాటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2010, జులై 20న గుజరాత్ హైకోర్టు వెలుపల జెత్వాను కొందరు తుపాకీతో కాల్చి చంపారు. రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమచారంతో ఎంపీ సోలంకికి సమీప బంధువు శివ సోలంకి, షార్ప్ షూటర్‌గా పేరొందిన శైలేష్ పాండేలు సహా ఆరుగురిని అరెస్టు చేశారు.