Lion Stroll In Rain Battered Gujarat Junagadh, Video Viral - Sakshi
Sakshi News home page

వరదలతో రారాజు అగచాట్లు.. అడవిని విడిచి రోడ్డుపై.. వీడియో వైరల్..

Published Mon, Jul 24 2023 3:17 PM | Last Updated on Mon, Jul 24 2023 5:15 PM

Lion Stroll In Rain Battered Gujarat Junagadh - Sakshi

అహ్మదాబాద్: గుజరాత్‌ సహా ఉత్తర భారతదేశాన్ని వర్షాలు  కొద్ది రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. కాలనీలు జలమయమయ్యాయి. జనజీవనం స్థంభించింది. నగరాలకు సైతం వరద తాకిడి ఎదురవుతుంటే ఇక అడవుల్లో వరదల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో అడవికి రారాజు సైతం వరదలతో ఇబ్బంది పడి.. అడవిని విడిచి రహదారిపైకి వచ్చేశాడు. 

గుజరాత్‌లోని జునాగఢ్‌ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కుంభవృష్టి సంభవిస్తోంది. దీంతో జునాగఢ్‌ సహా పరిసర నగరాల‍్లోని ప్రజలతో సహా అడవుల్లోని జంతువులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అడవికి రారాజుగా ఉండే సింహాలు సైతం అడవుల్లో ఉండలేక రోడ్లపైకి వస్తున్నాయి. ఓవైపు వర్షం వస్తున్నా.. ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డుపైకి వచ్చి వరదల తాకిడిని తప్పించుకుంటున్నాయి. వర్షంలో రోడ్డుపై సంచరిస్తున్న ఓ సింహం వీడియోను స్థానికులు షేర్ చేశారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే 3000 వ్యూస్ వచ్చాయి. రాజుకు రాజ్యంలో స్థానం లేకుండా పోయిందని కొందరు కామెంట్ చేశారు. రాజ్యంలో బాధలను పర్యవేక్షించడానికి రాజు బయటకు వచ్చాడు అంటూ మరొకరు ఫన్నీగా స్పందించారు. గుజరాత్‌లో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.    

గుజరాత్‌ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు నగరాలను సైతం నీట ముంచుతున్నాయి. వరద నీటితో నదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. నవసారి, జునాగఢ్‌, ద్వారక, భావనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. కాలనీలు నదులను తలపిస్తున్నాయి.

ఇదీ చదవండి: బైక్‌ నడుపుతూ ఇంటి చిరునామా మరిచిన వృద్ధుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement