వైరల్‌ వీడియో: గల్లీల్లో ఠీవీగా నడుస్తూ..! | Lion caught on camera in Junagadh in Gujarat | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: గల్లీల్లో ఠీవీగా నడుస్తూ..!

Published Sun, Oct 2 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

వైరల్‌ వీడియో: గల్లీల్లో ఠీవీగా నడుస్తూ..!

వైరల్‌ వీడియో: గల్లీల్లో ఠీవీగా నడుస్తూ..!

ఎవరూలేని ఓ నిర్మానుష్య రాత్రి.. వీధుల్లో ఓ సింహం ఒంటరిగా ఠీవీగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో సింహం ఒకటి జనావాసాల్లోకి ప్రవేశించింది. అయితే, రాత్రి సమయం కావడంతో జనాల కంట్లో అది పడలేదు. గాఢనిద్రలో అందరూ నిద్రిస్తున్న సమయంలో అది వీధుల్లో ఠీవీగా సంచరించింది. ఓ వ్యక్తి అత్యంత చాకచక్యంగా సింహం కంటపడకుండా అది సంచరిస్తున్న దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. అతను సోషల్‌ మీడియాలో పోస్టుచేసిన ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది.

జునాగఢ్‌ ప్రాంతం గిర్‌ అడవి జాతీయ పార్కుకు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చేరువలో ఉంటుంది. ఇక్కడ ఆసియా సింహాలు అధికంగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు జనావాసాల్లో ఇలా సంచరించడం కూడా ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే!  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement