గుజరాత్: ఒక రైతు సింహం బారి నుండి తన ఆవును రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. చివరకు ఎలాగోలా సింహాన్ని భయపెట్టి గంగిగోవును కాపాడుకున్నాడు.
గుజరాత్ లోని గిర్ సోమ్ నాట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చగడ్డిని ఆదమరచి తింటోన్న ఆవుపై అక్కడే మాటు వేసి ఉన్న ఆడ సింహం ఒక్క ఉదుటున దూకి దాని గొంతు పట్టుకుంది. పాపం ఆ ఆవు నొప్పితో విలవిలలాడిపోయింది. పంటిబిగువున నొప్పిని భరిస్తూ తన యజమానికి వినిపించేలా పెద్దగా అరిచింది.
తన గోవు అరుపులు విన్న ఆ రైతు వెంటనే అక్కడికి చేరుకొని ఎలాగైనా తనని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ధైర్యంగా సింహం వైపు నడుచుకుంటూ వచ్చాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సింహం పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నంలో ఆవు రోడ్డు పక్కకు జరిగింది. అంతలో తనవైపుగా వస్తోన్న రైతును చూసిన సింహం భయపడి వెంటనే అవును విడిచిపెట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయింది.
ఈ వీడియోని జునాగఢ్ లోని కేశోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు సింహానికి ఎదురెళ్ళిన ఆ రైతు గుండె ధైర్యానికి ఫిదా అయ్యి కామెంట్లు పెడుతున్నారు.
ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ
— Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023
ఇది కూడా చదవండి: ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా..
Comments
Please login to add a commentAdd a comment