ఎవరూలేని ఓ నిర్మానుష్య రాత్రి.. వీధుల్లో ఓ సింహం ఒంటరిగా ఠీవీగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో సింహం ఒకటి జనావాసాల్లోకి ప్రవేశించింది. అయితే, రాత్రి సమయం కాకపోవడంతో జనాల కంట్లో అది పడలేదు. గాఢనిద్రలో అందరూ నిద్రిస్తున్న సమయంలో అది వీధుల్లో ఠీవీగా సంచరించింది. ఓ వ్యక్తి అత్యంత చాకచక్యంగా సింహం కంటపడకుండా అది సంచరిస్తున్న దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. అతను సోషల్ మీడియాలో పోస్టుచేసిన ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది.