త్వరలో 450 చూడి పశువుల పంపిణీ | 450 Buffalos will soon be distributed | Sakshi
Sakshi News home page

త్వరలో 450 చూడి పశువుల పంపిణీ

Published Tue, Feb 21 2017 1:24 AM | Last Updated on Sat, Jun 2 2018 8:44 PM

450 Buffalos will soon be distributed

∙ 7 వేల పెరటికోâýæ్ల పెంపకం యూనిట్ల మంజూరు 
∙  పశుశాఖ జేడీ డాక్టర్‌ వి.రవీంద్రనాథ ఠాగూర్‌ 
 
అనంతపురం అగ్రికల్చర్‌ : డీఆర్‌డీఏ – ఐకేపీ సహకారంతో 450 చూడి పశువులు త్వరలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ వి.రవీంద్రనాథఠాగూర్‌ ‘సాక్షి’కి తెలిపారు. అందుకు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల గుర్తింపు పూర్తయిందన్నారు. ఒక్కో చూడిపశువు లేదా గేదె విలువ రూ.60 వేలుగా నిర్ణయించామని, అందులో లబ్ధిదారుల వాటా రూ.15 వేలు కాగా మిగతాది పశుశాఖ రాయితీగా ఇస్తుందని తెలిపారు. మేలుజాతి పశువులు తమిâýæనాడు రాష్ట్రం కరూరు జిల్లా, కర్నాటక రాష్ట్రం కోలార్, అలాగే ముర్రా జాతి గేదెలు హర్యానా నుంచి తెప్పించడానికి ఇప్పటికే ఏడీ, డాక్టర్లతో కూడిన స్క్రీనింగ్‌ బృందం వెళ్లిందన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారన్నారు.

ఆ తర్వాత లబ్ధిదారులను పిలుచుకెళ్లి వారు కోరుకున్న వాటిని అందజేస్తామన్నారు. దీంతో పాటు జిల్లాకు 7 వేల వరకు పెరటికోâýæ్ల పెంపకం యూనిట్లు (బ్యాక్‌యార్డ్‌ ఫౌల్ట్రీ) మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో పెరటి కోళ్ల యూనిట్‌ విలువ రూ.3,060 కాగా లబ్ధిదారులు తమ వాటాగా రూ.810 చెల్లించాలన్నారు. ఒక యూనిట్‌ కింద 45 కోడిపిల్లలు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement