distributed
-
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
Zubeda Ali: నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్స్ పంచిన కమెడియన్ అలీ భార్య జుబేదా (ఫోటోలు)
-
హైదరాబాద్ లో 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందజేత
-
పబ్లిక్ కి లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్స్ పంచిన పోలీసులు
-
జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ
పంజగుట్ట (హైదరాబాద్): కరోనా కారణంగా మూడేళ్ల నుంచి వాయిదాపడిన చేప ప్రసాదం జూన్ 9న నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవ్వనున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని అమర్నాథ్ గౌడ్, బత్తిని గౌరీశంకర్ గౌడ్ మాట్లాడుతూ..జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొన్ని లక్షల మంది తమ చేప ప్రసాదం తీసుకుని వారి సమస్యలను శాశ్వతంగా తగ్గించుకున్నారన్నారు. ప్రభుత్వం తరఫున కొర్రమీను లైవ్ చేపలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రసాదం తీసుకునే నాలుగు గంటల ముందు, తీసుకున్న రెండు గంటలు ఏమీ తినకూడదని, 45 రోజులు పత్యం ఉండాలని చెప్పారు. ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అయ్యప్ప భక్తుల కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం
-
101 మంది పేద కళాకారులకు ఉచితంగా రూ. 6 కోట్ల భూమి..
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్‌లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్‌లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్‌కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు. -
ఆకలిపై పోరులో డ్రీమ్ కేర్
వాషింగ్టన్ : అమెరికా లోని వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాకి చెందిన కుషాల్ దొండేటి నిర్వహిస్తోన్న డ్రీం కేర్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది. ఫండ్ రైజింగ్ ద్వారా సుమారు రూ. 2.62 లక్షలను డ్రీం కేర్ ఫౌండేషన్ సమీకరించింది. ఈ నిధులతో పది వేల మీల్ ప్యాకెట్లను తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్లో ఆరుగురికి సరిపడా ఆహారం ఉంటుంది. దీన్ని అమెరికా, ఇండియాతో పాటు పలు దేశాల్లోని అవసరం ఉన్న చోటుకి పంపారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఎగైనెస్ట్హంగర్ అనే స్వచ్చంధ సంస్థ సైతం సహాయ సహకారాలు అందించింది. హై స్కూల్ స్థాయిలోనే ఫండ్ రైజింగ్ ద్వారా అమెరికా, ఇండియాలతో పాటు ఆకలితో ఉన్న వారికి సాయపడే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న కుషాల్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో 60 మంది స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. -
డిసెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యం పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైస్ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన సోర్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. బియ్యం సరఫరాకు గాను ప్రభుత్వం రీయూజబుల్ సంచులను పంపిణీ చేయనుంది. -
మానవత్వం చాటుకుంటున్న నేతలు
-
ఖాతాల్లోకి ‘సాయం’
సాక్షి, వరంగల్ రూరల్: ఉత్కంఠకు తెరపడింది.. రైతుబంధు పెట్టుబడి పంపిణీకి ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో రబీలో అందించే రెండో విడత రైతు పెట్టుబడి సాయం అందజేసేందుకు మార్గం సుగమమైంది. మొదటి విడతలో అందించిన విధంగానే రైతులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వచ్చిన కోడ్ ప్రభావంతో హడావిడి లేకుండానే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని నిర్ణయించా రు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఖరీఫ్‌లో రూ.4 వేలు, రబీలో రూ.4 వేలు ఇలా ఏడాదికి రూ.8 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఖరీఫ్ సాయం అందించారు. ఈ నెల 5 నుంచి రబీ సాయం చెక్కులు పంపిణీ జరగాల్సిండగా శాససభ రద్దుతో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలుకు ఎన్నికల సంఘం పలు షరతుల విధించింది. తొలి విడతలో అందుకున్న వారికే.. జిల్లాలో ఖరీఫ్‌కు 1,69,731 మంది పట్టాదారులుండగా రూ.130,02,09,000 విలువ చేసే 1,70,292 చెక్కులు వచ్చాయి. అందులో రూ.119,79,62,250 విలువ చేసే 1,50,224 చెక్కులు రైతులు అందుకున్నారు. రూ.10,09,98,410 విలువ చేసే 20,068 చెక్కులు రైతులు తీసుకోలేదు. మొదటి విడతలో చెక్కులు అందుకున్న వారికే రబీలో సాయం అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న వారిలో పలువురు రైతులు మరణించారు. దీంతో రబీలో 1,48,581 మంది పట్టాదారులకు రూ.118,99,94,630 విలువ చేసే 1,49,095 చెక్కులు మంజూరయ్యాయి. ఆరు బ్యాంకులు.. జిల్లాలో ఆరు నోటిఫైడ్ బ్యాంకులను ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఐఓబీ, ఏపీజీవీబీ, సిండికేట్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను గుర్తించారు. ఆయా బ్యాంకుల చెక్కులు జిల్లాకు రానున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు సంబంధించిన నెక్కొండ, నర్సంపేట, పర్వతగిరి, ఆత్మకూరు మండలాలకు చెందిన రైతుల 50,573 చెక్కులు జిల్లాకు శనివారం హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు తీసుకొచ్చారు. వీటిని ఆయా మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో భద్రపరచనున్నారు. ఆంధ్రాబ్యాంకుకు నల్లబెల్లి, పరకాల, గీసుకొండ, సంగెం, శాయంపేట మండలాలు, ఎస్బీఐకి దామెర, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాలు కేటాయించగా సిండికేట్ బ్యాంక్‌కు రాయపర్తి, కార్పొరేషన్ బ్యాంక్‌కు ఆత్మకూరు, ఏపీజీవీబీకి ఖానాపూర్ మండలాలకు ఆయా బ్యాంకుల చెక్కులు త్వరలో తీసుకురానున్నారు. మార్గదర్శకాల కోసం.. పెట్టుబడి సాయాన్ని రైతులకు నేరుగా చెక్కులు రూపంలో అందించకుండా ఖాతాలో జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో చెక్కుల పంపిణీని వ్యవసాయ అధికారులు నిలిపివేశారు. రైతుల బ్యాంక్ అకౌంట్ నంబర్లు సేకరించి ప్రభుత్వం అందించిన చెక్కులను వారి ఖాతాల్లో జమ చేస్తారా, చెక్కులు బ్యాంకులో వేయకుండా నేరుగా రైతు ఖాతాలోకి ఆర్టీజీఎస్ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో స్పష్టత రాగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆదేశాలు రాలేదు రైతుబంధు సాయం అందించేందుకు రైతుల నుంచి బ్యాంకు అకౌంట్ నంబర్లు సేకరించాలని ఆదేశాలు రాలేదు. చెక్కుల పంపిణీ మాత్రం నిలిపివేయాలని చెప్పారు. ఉన్నతాధికారులు ఎలా చెప్పితే అలా పాటిస్తాం. కొన్ని చెక్కులు జిల్లాకు చేరుకున్నాయి. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి -
‘రెండో’ చెక్కు రెడీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వ్యవసాయాధికారులు మండలాలవారీగా రైతులకు చెక్కులు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. మొదటి విడతగా రైతులకు చెక్కులు పంపిణీ చేసిన విషయం విదితమే. అందులో కొన్ని లోటుపాట్లు జరగగా.. ఈసారి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు.. కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు చెక్కుల పంపిణీపై వివరించారు. పాలనాపరమైన అనుమతుల కోసం సంబంధిత అధికారులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆయా బ్యాంకులకు రైతులకు సంబంధించిన చెక్కులు అందుతుండగా.. వీటిని వ్యవసాయాధికారులు పరిశీలించే పనిని ప్రారంభించారు. జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 2,85,348 మంది రైతులు ఉన్నారు. వారికున్న భూముల ఆధారంగా ఖరీఫ్‌లో రూ.275.01కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రబీలో కూడా ఇదే మొత్తంలో చెక్కుల రూపంలో రైతులకు అందించనుంది. దీనికి సంబంధించి గ్రామాల్లో ముందస్తుగా టమకా వేయించాల్సి ఉంటుంది. ఏఓలు, ఏఈఓల ద్వారా రైతులకు తెలియజేసి.. నిర్ణయించిన తేదీల్లో చెక్కులు అందజేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. బ్యాంకులకు చేరుతున్న చెక్కులు రబీ సీజన్ ప్రారంభమవుతుండడంతో రైతుబంధు చెక్కులను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఐదు మం డలాలకు చెందిన చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. ఖమ్మం రూరల్ మండలానికి రూ.12.99కోట్ల విలువైన 13,436 చెక్కులు, నేలకొండపల్లికి సంబంధించి రూ.13.26కోట్ల విలువైన 16,203 చెక్కులు, తల్లాడకు సంబంధించిన రూ.12.31కోట్ల విలువైన 12,688 చెక్కులు, వేంసూరుకు సంబంధించి రూ.15.09కోట్ల విలువైన 15,227 చెక్కులు, ఎర్రుపాలెంకు సంబంధించి రూ.13.51కోట్ల విలువైన 13,439 చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు కూడా చెక్కులు చేరుతున్నాయి. మధిరకు సంబంధించి 16,407, ముదిగొండ 15,404, సత్తుపల్లి 11,004, తిరుమలాయపాలెం 16,774, ఖమ్మంకు సంబంధించి 10,975 చెక్కులు ఐఓబీకి చేరాయి. ఆయా చెక్కులను వ్యవ సా య శాఖ శుక్రవారం నుంచి పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయి లో చెక్కులు మంజూరైన రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఖరీఫ్‌లో పంపిణీ కాని 20,274 చెక్కులు గత ఖరీఫ్‌లో 379 రెవెన్యూ గ్రామాల్లోని రూ.15.63కోట్ల విలువైన 20,274 చెక్కులు పంపిణీ కాలేదు. మొత్తం 2,83,756 చెక్కులను పంపిణీకి సిద్ధం చేయగా.. వాటిలో 674 చెక్కులలో తప్పులు దొర్లాయి. 2,68,499 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. అలాగే అటవీ భూములకు సంబంధించి 5,691 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఇక పంపిణీ కాని 20,274 చెక్కులలో మరణించిన రైతులు.. రెండు ఖాతాలున్నవి.. తమకు సాయం అవసరం లేదని వెనుకకు ఇచ్చినవి.. ప్రభుత్వ భూమికి సంబంధించినవి.. భూ వివాదాలు నెలకొన్నవి.. భూమి లేకపోయినా చెక్కులు జారీ అయినవి.. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లినవి.. చెక్కులలో తప్పులు ఉన్నవి.. ఉన్న భూమి కంటే ఎక్కువ నిధులతో ఉన్న చెక్కులు.. సాగులో లేని భూమికి వచ్చిన చెక్కులు.. ఆధార్ లేని చెక్కులు.. గ్రామాల్లో లేని రైతుల చెక్కులు.. విదేశాల్లో ఉంటున్న రైతులకు సంబంధించినవి.. అమ్మిన భూములకు సంబంధించిన చెక్కులు.. ఆర్ఓఎఫ్ఆర్ పెండింగ్ ఉన్న చెక్కులను పంపిణీ చేయలేదు. విదేశాల్లోని రైతులకూ.. గత ఖరీఫ్‌లో విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయలేదు. అయితే ప్రభుత్వం వీరికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయా రైతులకు కూడా చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పంపిణీ కూడా కొనసాగనున్నది. జిల్లాలో మొత్తం 744 చెక్కులకు సంబంధించి రూ.60లక్షలు రైతులకు అందజేయాల్సి ఉంది. చాలా సంతోషం.. తెలంగాణ ప్రభుత్వం అందించే వ్యవసాయ పెట్టుబడి రెండో విడత చెక్కులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. మొదటి విడతలో నాకు రూ.14వేలు వచ్చాయి. రెండో విడత కూడా రూ.14వేలు వస్తాయి. ప్రస్తుతం వ్యవసాయం పనులకు చాలా ఉపయోగపడతాయి. – ఎనికె జానకిరామయ్య, రైతు, అప్పలనర్సింహాపురం రైతుకు భరోసా.. ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు పెట్టుబడి పథకం ఇవ్వడం భరోసా కల్పించింది. నాకు మూడున్నర ఎకరాలకు పెట్టుబడి అందింది. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా సాగు చేశాను. ఇప్పుడు వ్యవసాయ పనులకు సరైన సమయంలో రైతుబంధు ఇస్తుండడం మంచి పరిణామం. – అమరగాని వెంకయ్య, రైతు, చెరువుమాదారం పంపిణీకి చర్యలు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతుబంధు చెక్కుల పంపిణీకి సంబంధించి చర్యలు చేపట్టాం. గతంలో ఖరీఫ్‌లో నిర్వహించిన విధంగానే చెక్కుల పంపిణీ చేపడతాం. ఇప్పటికే చెక్కులు బ్యాంకులకు చేరుతున్నాయి. వచ్చిన చెక్కులను సంబంధిత మండలాల అధికారులతో పరిశీలించే పనిని చేపట్టాం. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారిణి -
ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
సాక్షి, బెంగళూరు: పీయూసీ, ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 31వేల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేసే కార్యక్రమాన్ని సీఎం సిద్ధరామయ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు పరిమితమైన ఈ పథకాన్ని వెనకబడినవర్గాలకు చెందిన వారితో పాటు ఇతర అన్ని వర్గాల్లోని పేద ప్రతిభావంత విద్యార్థులకు త్వరలోనే విస్తరించనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 1.5లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. విధానసౌధలోని బాంక్వెట్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బెంగళూరు, బెంగళూరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీఎం సిద్ధరామయ్య ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సంపన్నులు తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లను కొని ఇవ్వగలరు. అయితే నిరుపేదలు ల్యాప్‌టాప్‌లను పిల్లలకు కొనివ్వాలంటే అది వారికి శక్తికి మించిన పని. ఈ నేపథ్యంలోనే నిరుపేద కుటుంబాల్లోని ప్రతిభావంత విద్యార్థులకు సైతం ఉత్తమ శిక్షణ లభించే దిశగా ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. -
ముస్లిం మహిళలకు చీరల పంపిణీ
హిందూపురం అర్బన్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఆల్‌హిలాల్ స్కూల్‌మైదానంలో వైఎస్సార్సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పేదముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ ‘ఎ’ బ్లాక్ కన్వీనర్ ఈర్షద్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఎన్నికల్లో నిలిచిన ప్రతిసారి ముస్లింలు తనపై ప్రేమానురాగాలు చూపిస్తురన్నారు. అందుకు వారిపై అభిమానపాత్రుడుగా ఉంటానన్నారు. ఇదే రీతిలో ఇతర మతాల వారు కూడా ఎంతో ఆదరిస్తున్నారని, కష్టంలో సహాయపడిన వారిని మరిచిపోతే మానవత్వం అనిపించుకోదన్నారు. అనంతరం మతపెద్దలు జమియామసీదు మాజీ ముత్తవల్లిలు కరీం, బాషా మాట్లాడుతూ నవీన్‌నిశ్చల్ ముస్లింలపై ఎంతో ప్రేమానురాగాలు చూపుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధానకార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ శివ, మహిళ కన్వీనర్ నాగమణి ప్రసంగించారు. అనంతరం ముస్లిం మహిళలంకు చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ముస్లిం మతపెద్దలు, మైనార్టీలు నవీన్‌నిశ్చల్‌ను ఘనంగా సన్మానించారు. -
త్వరలో 450 చూడి పశువుల పంపిణీ
∙ 7 వేల పెరటికోâýæ్ల పెంపకం యూనిట్ల మంజూరు ∙ పశుశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ ఠాగూర్ అనంతపురం అగ్రికల్చర్ : డీఆర్డీఏ – ఐకేపీ సహకారంతో 450 చూడి పశువులు త్వరలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ ‘సాక్షి’కి తెలిపారు. అందుకు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల గుర్తింపు పూర్తయిందన్నారు. ఒక్కో చూడిపశువు లేదా గేదె విలువ రూ.60 వేలుగా నిర్ణయించామని, అందులో లబ్ధిదారుల వాటా రూ.15 వేలు కాగా మిగతాది పశుశాఖ రాయితీగా ఇస్తుందని తెలిపారు. మేలుజాతి పశువులు తమిâýæనాడు రాష్ట్రం కరూరు జిల్లా, కర్నాటక రాష్ట్రం కోలార్, అలాగే ముర్రా జాతి గేదెలు హర్యానా నుంచి తెప్పించడానికి ఇప్పటికే ఏడీ, డాక్టర్లతో కూడిన స్క్రీనింగ్ బృందం వెళ్లిందన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారన్నారు. ఆ తర్వాత లబ్ధిదారులను పిలుచుకెళ్లి వారు కోరుకున్న వాటిని అందజేస్తామన్నారు. దీంతో పాటు జిల్లాకు 7 వేల వరకు పెరటికోâýæ్ల పెంపకం యూనిట్లు (బ్యాక్‌యార్డ్ ఫౌల్ట్రీ) మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో పెరటి కోళ్ల యూనిట్ విలువ రూ.3,060 కాగా లబ్ధిదారులు తమ వాటాగా రూ.810 చెల్లించాలన్నారు. ఒక యూనిట్ కింద 45 కోడిపిల్లలు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తామని చెప్పారు. -
క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ
కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బొడ్డుపల్లి శంకర్ – విజయలక్ష్మి దంపతుల ఆర్థికసాయంతో పట్టణంలోని ఉన్నత పాఠశాల క్రీడాకారులకు శుక్రవారం రూ.10 వేల విలువ చేసే క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్రా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ దాతలు క్రీడాకారులకు సహకారం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పీడీ భావన, ఉపాధ్యాయులు లోక్యానాయక్, పెద్దన్న, గంగాధర్, నర్సింహ, శ్రీను, విద్యార్థులు ఉన్నారు. -
నట్టల నివారణ మందుల పంపిణీ
ఆత్మకూర్ : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద చేపట్టారు. క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, హెల్త్ ఎడుకేటర్ శ్రీరామ్‌సుధాకర్ మాటాడుతూ క్లస్టర్ పరిధిలో 72వేలమంది విద్యార్థులకు, ఆత్మకూర్ మండలంలో 32వేలమంది విద్యార్థులకు ఆల్బెండోజోల్ మాత్రలు 1నుంచి 19సంవత్సరాల వయస్సు ఉన్నవారికి పంపిణీ చేశామని అన్నారు. రక్తహీనత, పోషకాహార లోపం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం వ్యాధి లక్షణాలుగా తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంఓ హన్మంత్‌రావు, వైద్య సిబ్బంది రామునాయక్, సామ్రాజ్యలక్ష్మి, శైలజదేవి, సురేందర్‌గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– వాసునగర్ ఘాట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే చిట్టెం మాగనూర్ (గుడెబల్లూర్) : కృష్ణా పుష్కరాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. పుష్కరాల్లో భాగంగా శుక్రవారం వాసునగర్ ఘాట్‌ను ఆయన సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్నానపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతిని పరిశీలించారు. వికలాంగులు, చిన్నపిల్లలకు, వృద్ధులకు నది ఒడ్డున ప్రత్యేకంగా స్నానాల కోసం నీటివసతిని ఏర్పాటు చేయాలని ప్రత్యేక అధికారి వెంకటయ్యగౌడ్‌ను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉందని, గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్నానాల ఘట్లో ఏర్పాటు చేసిన ఇనుపజాలిపై కర్రలతో కట్టాలని, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాగనూర్ జెడ్పీటీసీ సరితా మధుసూదన్‌రెడ్డి, ఊట్కూర్ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ గోవిందప్ప, విజయ్‌గౌడ్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ నాయకులు పాల్గొన్నారు. -
భద్రాచలం ఆలయ భూములు పేదలకు పంచాలి
ఖమ్మం : భద్రాచలంలో కొలువైన శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ భూములను పేద ప్రజలకు పంపాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా వెంకటాపురంలో శనివారం అర్థరాత్రి మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. అలాగే భూస్వాముల భూములు ఆక్రమించేందుకు ఉద్యమనించాలని ప్రజలకు మావోయిస్టులు సూచించారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను తిప్పికోట్టాలని మావోయిస్టులు ప్రజలను కోరారు. -
దిల్సుఖ్నగర్ పేలుడు భాదితులకి చెల్లని చెక్కులా?
-
తాండూరులో 221 ఎకరాల భూ పంపిణీ
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: ఏడో విడత భూపంపిణీలో భాగంగా తాండూరు నియోజకవర్గ్గంలో 221 ఎకరాల ప్రభుత్వ భూమిని 172 మంది రైతులకు పంపిణీ చేశామని సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. గురువారం సాయంత్రం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాలుగు మండలాల రెవెన్యూ అధికారులతో సబ్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ పంపిణీలో భాగంగా గ్రామాల్లో ఉన్న నిరుపేద రైతులకు అసైన్డ్ భూమిని పంపిణీ చేశామని చెప్పారు. తాండూరు మండలంలోని 9 గ్రామాల్లో 9 మంది లబ్ధిదారులకు 14 ఎకరాల 4 గుంటలు పంపిణీ చేసినట్లు తెలిపారు. యాలాల మండలంలోని 4 గ్రామాల్లో 21 మంది లబ్దిదారులకు 13 ఎకరాల 19 గుంటలు, పెద్దేముల్ మండలంలోని 10 గ్రామాల్లో 69 మంది లబ్ధిదారులకు 104 ఎకరాల 12 గుంటలు, బషీరాబాద్ మండలంలోని 10 గ్రామాల్లో 73 మంది లబ్ధిదారులకు 90 ఎకరాల 4 గుంటల ప్రభుత్వ భూమిని పంపిణీ చేసినట్లు చెప్పారు. త్వరలో దీనికి సంబంధించి రైతులకు పట్టాలు ఇస్తామని సబ్ క లెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు త్వరలో ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిద్వారా రైతులు బ్యాంక్‌లో రుణాలు తీసుకునేందుకు వీలుందని చెప్పారు. అడవుల్లో రైతులు సాగు చేసిన భూమికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చేవిధంగా తాను అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. ఈవిషయమై త్వరలో కలెక్టర్‌తో మాట్లాడనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మహేష్‌గౌడ్, సత్యనారాయణ, స్థానిక నాయకులు కరణం పురుషోత్తంరావు, సురేందర్‌రెడ్డి, రాందాస్, అజయ్‌ప్రసాద్, సంజీవరెడ్డిలు ఉన్నారు. -
అనంతపురంలో తెలంగాణకు పాస్‌పోర్ట్ కేంద్ర కార్యాలయం