పంజగుట్ట (హైదరాబాద్): కరోనా కారణంగా మూడేళ్ల నుంచి వాయిదాపడిన చేప ప్రసాదం జూన్ 9న నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవ్వనున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని అమర్‌నాథ్ గౌడ్, బత్తిని గౌరీశంకర్ గౌడ్ మాట్లాడుతూ..జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొన్ని లక్షల మంది తమ చేప ప్రసాదం తీసుకుని వారి సమస్యలను శాశ్వతంగా తగ్గించుకున్నారన్నారు.
ప్రభుత్వం తరఫున కొర్రమీను లైవ్ చేపలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రసాదం తీసుకునే నాలుగు గంటల ముందు, తీసుకున్న రెండు గంటలు ఏమీ తినకూడదని, 45 రోజులు పత్యం ఉండాలని చెప్పారు. ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment